Technical experts
-
సైబర్ నిపుణులు కావాలి!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ నిపుణులను రంగంలోకి దించనుంది. ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు సైబర్ సాంకేతిక నిపుణులు కావాలంటూ కేంద్ర హోంశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు అంశాలకు సంబంధించి నిపుణులకు వారి అనుభవం ఆధారంగా నెలకు రూ.65 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనం ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నా రు. ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు https://tcil.net.in/ current &opening.php పై క్లిక్ చేసి అందు లోని వివరాలు చూడవచ్చని తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసే వీరికి కేంద్ర హోంశాఖకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. అర్హతలు, అనుభవం, వేతనం... సీనియర్ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్: ఉండాల్సిన స్కిల్స్..సైబర్ సెక్యూరిటీలో పనిచేసిన అనుభవం, సెక్యూరిటీ స్ట్రాటజీ, పాలసీ ఫార్ములేషన్, ప్లానింగ్. నెలకు వేతనం..రూ. 2,50,000 థ్రెట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్: ఉండాల్సిన స్కిల్స్..సెక్యూరింగ్ క్రిటికల్, సెన్సిటివ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెలకు వేతనం..రూ.1,60,000 డాటా ఎనలైటిక్స్ ప్రొఫెషనల్: నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్..యూపీఐ, ఐఎంపీఎస్, ఏఈపీఎస్ వంటి పేమెంట్స్ టెక్నాలజీపై అవగాహన, ఆర్బీఐ, ఇతర నిబంధనలపై అవగాహన..నెలకు వేతనం..రూ. 1,60,000. మాల్వేర్ రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్.. ఫిషింగ్ ఎటాక్స్, మాల్వేర్ ఎటాక్స్లపై పూర్తి అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్–టెలీకాం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఉండాల్సిన స్కిల్స్..4జీ, 5జీ వంటి టెలికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై, సిమ్‌బాక్స్, వీఓఐపీ వంటి అంశాల్లో అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 టెక్నికల్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. ఎంఎస్ ఎక్సెల్, ఫైనాన్స్ అంశాలపై అవగాహన ఉండాలి.. నెలకు వేతనం.. రూ.65,000 సైబర్ థ్రెట్ అనలిస్ట్: ఉండాల్సిన స్కిల్స్.. సోషల్ మీడియా అనాలసిస్, రిపోర్ట్ క్రియేషన్, క్రైం రీసెర్చ్‌లో అవగాహన..నెలకు వేతనం.. రూ.65,000 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. మోరాకో ప్రోగ్రామింగ్ ఎక్సెల్ ఆటోమైజేషన్లో అవగాహన.. నెలకు వేతనం..రూ.65,000 -
మిడ్, స్మాల్ క్యాప్స్‌లో దీపావళి: విశ్లేషణ
దీపావళికి ముందు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగితే.. మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ పెరగవచ్చని సీనియర్ సాంకేతిక నిపుణులు గౌరవ్ రత్నపార్ఖీ పేర్కొంటున్నారు. బీఎన్పీ పరిబాస్ ప్రమోట్ చేసిన షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్.. స్వల్ప కాలంలో మార్కెట్లను మించి మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు పరుగుతీసే వీలున్నట్లు భావిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సాంకేతిక అంశాల ఆధారంగా మార్కెట్లపై అంచనాలను వెల్లడించారు. అంతేకాకుండా మూడు బ్లూచిప్ స్టాక్స్‌ను కొనుగోలుకి సిఫారసు చేశారు. వివరాలు చూద్దాం.. మెచూరీటికి దగ్గరగా.. గత వారం మార్కెట్లు స్వల్ప శ్రేణిలో సంచరించినప్పటికీ ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 12,000 పాయింట్ల సమీపంలో స్థిరపడింది. గత నెల చివరి వారంలోనూ, ఈ నెల మొదట్లోనూ ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల కన్సాలిడేషన్ బాట పట్టాయి. వచ్చే వారం అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుండటం, యూఎస్‌లో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశముంది. చార్టుల ప్రకారం ప్రస్తుతం నిఫ్టీ ట్రయాంగులర్ ప్యాటర్న్‌లోనే కనిపిస్తోంది. అంటే మెచూరిటీకి దగ్గరగా ఉన్నట్లు. దీంతో 12,025 స్థాయిలో నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే.. తదుపరి 12,200 వద్ద, ఆపై 12,430 వద్ద తిరిగి అవరోధాలు ఏర్పడవచ్చు. ఇదే విధంగా మార్కెట్లు బలహీనపడితే.. నిఫ్టీకి తొలుత 11,800 వద్ద, తదుపరి 11,660 స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది. కన్సాలిడేషన్‌లో నిఫ్టీతో పోలిస్తే మిగిలిన ఇండెక్సులు దీర్ఘకాలిక కన్సాలిడేషన్‌లో ఉన్నాయి. ఆగస్ట్- సెప్టెంబర్‌లో నమోదైన గరిష్టం 11,794 పాయింట్లను నిఫ్టీ ఇప్పటికే అధిగమించింది. అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఇటీవల గరిష్టాలకంటే దిగువనే ట్రేడవుతున్నాయి. మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే ఇకపై ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీలను మించి మిడ్, స్మాల్ క్యాప్స్ పరుగుతీసే అవకాశముంది. వెరసి దీపావళి ర్యాలీలో మార్కెట్లకంటే ముందుండే వీలుంది. టెక్నికల్ స్టాక్స్.. చార్టుల ప్రకారం సాంకేతిక అంశాల ఆధారంగా ఈ వారం మూడు స్టాక్స్ కొనుగోలుకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. వీటిని మూడు లేదా నాలుగు వారాలకు పరిశీలించవచ్చు. జాబితాలో ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ, ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ డాబర్ ఇండియా, ఇండెక్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ చోటు సాధించాయి. అయితే పొజిషన్లు తీసుకునే ఇన్వెస్టర్లు తప్పనిసరిగా స్టాప్‌లాస్‌లను అమలు చేయవలసి ఉంటుంది. మారుతీ సుజుకీ: కొనుగోలు చేయవచ్చు గత కొద్ది సెషన్లుగా మారుతీ సుజుకీ కౌంటర్ స్వల్పకాలిక దిద్దుబాటు(కరెక్షన్)కు లోనయ్యింది. అయితే అత్యంత కీలకమైన రోజువారీ చలన సగటుల సమీపంలో మద్దతు లభించింది. తద్వారా గత సెషన్లో బౌన్స్‌బ్యాక్(ఫ్రెష్ మూవ్)ను సాధించింది. ఈ దశలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరగడం బుల్లిష్ ధోరణికి సంకేతంగా భావించవచ్చు. 23న ముగింపు: రూ. 7,108 టార్గెట్ ధర: రూ. 7,350- 7,600 స్టాప్‌లాస్: రూ. 6,830 డాబర్ ఇండియా: కొనుగోలు చేయవచ్చు మధ్యకాలిక రైజింగ్ చానల్లో భాగంగా డాబర్ ఇండియా షేరు తాజాగా బలపడింది. ఇటీవలి క్షీణతతో చానల్ దిగువ భాగాన మద్దతును కూడగట్టుకుంది. వెరసి మద్దతు స్థాయిల సమీపంలో కదులుతోంది. తద్వారా పరుగు తీసేందుకు సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. 23న ముగింపు: రూ. 519 టార్గెట్ ధర: రూ. 535- 564 స్టాప్‌లాస్: రూ. 500 ఏషియన్ పెయింట్స్: కొనుగోలు చేయవచ్చు గత కొన్ని సెషన్లలో స్వల్ప దిద్దుబాటు(కరెక్షన్) తదుపరి ఏషియన్ పెయింట్స్ స్పీడందుకుంది. ఈ జోరుతో ఇకపై మరింత ర్యాలీ చేసే అవకాశముంది. స్వల్ప, మధ్యకాలిక సంకేతాలు బుల్లిష్ ధోరణినే వ్యక్తం చేస్తున్నాయి. 23న ముగింపు: రూ. 2,119 టార్గెట్ ధర: రూ. 2,185- 2,270 స్టాప్‌లాస్: రూ. 2,040 -
నడి సంద్రంలో భయం భయంగా..
- విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్ వెళుతూ నిలిచిపోయిన నౌక - స్వల్ప మరమ్మతుల అనంతరం తిరిగి విశాఖకు నౌక సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్తున్న ప్రయాణికుల నౌక నడిసంద్రంలో దాదాపు 24 గంటల పాటు నిలిచిపోయింది. ఇందులో 506 మంది ప్రయాణికులు, సుమారు 50 మంది సిబ్బంది ఉన్నారు. ఒకరోజంతా సముద్రం లో నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాం దోళనలకు గురయ్యారు. నౌక నిలిచిన సమాచారంతో జిల్లా అధికారులు నేవీ, కోస్ట్‌గార్డ్‌లను అప్రమత్తమయ్యారు. స్వల్ప మరమ్మతుల అనంతరం తిరిగి విశాఖ తీరానికి రప్పించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేపట్టారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్‌కు వెళ్లేందుకు మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ నుంచి 506 మంది ప్రయాణికులతో ఎంవీ హర్షవర్ధన నౌక బయల్దేరింది. ఆరు గంటల ప్రయాణం తర్వాత నౌకలోని ఒక జనరేటర్ పాడైంది. కాసేపటికి అనూహ్యంగా మరో జనరేటర్ కూడా పాడవ్వడంతో ఇంజన్లు పనిచేయడం మానేశాయి. దీంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులకు నౌకలోని అధికారులు సమాచారం అందించారు. అక్కడ్నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో తీరం నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో నౌకను నిలిపివేశారు. మంగళవారం రాత్రి నుంచి సాంకేతిక నిపుణులు జనరేటర్లకు మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. బుధవారం రాత్రి వరకు మరమ్మతులు కొనసాగాయి. కాగా, ప్రయాణికుల్లో 150 మంది మహిళలు, 15 మంది పిల్లలున్నట్లు సమాచారం. వీరంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. -
వ్యక్తిగత స్వేచ్ఛా? దేశ భద్రతా?
♦ ఎఫ్‌బీఐ వర్సెస్ యాపిల్‌తో తెరపైకి ♦ భారత్‌లో ఆంక్షల ముసాయిదాపై వ్యతిరేకత ♦ సెల్‌ఫోన్ డేటా ఎన్‌క్రిప్షన్‌పై ఎడతెగని చర్చ ♦ దేశభద్రతే ముఖ్యమంటున్న ప్రభుత్వాలు,రక్షణ నిపుణులు సాంకేతిక పరిజ్ఞానంతో స్వేచ్ఛ, భద్రత మరింత పెరగాలి. కానీ.. టెక్నాలజీ పెరగటం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు.. దేశభద్రతే ముఖ్యమని మరికొందరు వాదిస్తున్నారు. ఉగ్రవాది సెల్‌ఫోన్ నుంచి సమాచార సేకరణ విషయంలో ఎఫ్‌బీఐ, యాపిల్ కంపెనీ మధ్య తలెత్తిన వివాదంతో ఎన్క్రిప్షన్ వివాదం తెరపైకి వచ్చింది. అటు వాట్సప్, ఫేస్‌బుక్‌లు కూడా వ్యక్తిగత స్వేచ్ఛకే (ఎన్క్రిప్షన్) ప్రాధాన్యమిస్తామని చెప్పటం... దీనిపై ఆంక్షలకు కేంద్రం ప్రయత్నించటం విమర్శలకు దారితీసింది. అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? దీనివల్ల దేశభద్రతకున్న ప్రమాదమేంటి? రక్షణ, సాంకేతిక నిపుణుల ఏమంటున్నారు? ఎన్క్రిప్షన్ అంటే? మనం పంపిన సమాచారాన్ని అవతలి వ్యక్తికి భద్రంగా చేర్చటమే ఎన్క్రిప్షన్. మనం పంపిన సమాచారంతో పాటు ఓ కోడ్‌నెంబర్ కూడా ఉత్పన్నమవుతుంది. అది గ్రహీతకు చేరిన తర్వాత ఆ పాస్వర్డ్ ఉంటేనే ఈ సమాచారం ఓపెన్ అవుతుంది. మధ్యలో ఎవరూ ఆ పాస్వర్డ్ లేకుండా సమాచారాన్ని తెలుసుకునే వీలుండదు. ఫేస్బుక్ అయినా వాట్సప్ అయినా.. గ్రహీతకు చేరేలోపే హ్యాకర్లు తమ నైపుణ్యంతో దీన్ని చదివేసే అవకాశం ఉంటుంది. అయితే మన సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేస్తే హ్యాకింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో సమాచారాన్ని పంపిన వ్యక్తి దీన్ని అందుకున్న వ్యక్తి మాత్రమే దీన్ని చదవగలిగేలా రహస్యంగా ఉంటుంది. దీని వల్ల సమాచార మార్పిడి చేసే కంపెనీలు (వాట్సప్, ఫేస్బుక్..) కూడా ఈ సమాచారాన్ని చదవటం అసాధ్యం. ఈ సందేశాన్ని చదవాలంటే డిక్రిప్ట్ చేయాలి.. ఇందుకు పాస్వర్డ్ తెలిసిఉండాలి. మధ్యలో ఎవరైనా దీన్ని బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తే మొత్తం సమాచారం నాశనం అవుతుంది. వివాదమేంటి? గతేడాది డిసెంబర్లో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో క్రిస్మస్ పార్టీపై ఓ జంట కాల్పులు జరిపి 14 మందిని పొట్టన పెట్టుకున్న ఘటనలో.. ఇద్దరు ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులను అమెరికా పోలీసులు మట్టుబెట్టారు. వీరి మృతదేహం వద్ద దొరికిన ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ).. తీవ్రంగా ప్రయత్నించింది. ఈ ఫోన్ డేటా పక్కా పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ కావటంతో అన్‌లాక్ చేయాలని ఈ మొబైల్ తయారీదారు యాపిల్ కంపెనీని కోరింది. దీనికి నిరాకరించిన యాపిల్ కంపెనీ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా బహిర్గతం చేయటం కుదదరని తేల్చిచెప్పింది. దేశభద్రతే ముఖ్యమని అమెరికా కోర్టు ఆదేశించినా యాపిల్ కంపెనీ ససేమిరా అని తేల్చేసింది. అయితే.. ఆ తర్వాత మెకఫీ సంస్థ, ఇతర సాంకేతిక నిపుణుల సాయంతో ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేయించుకుంది. యాపిల్‌కు అండ వినియోగదారుడి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలన్న యాపిల్ నిర్ణయానికి సామాజిక మాధ్యమ వేదికలన్నీ అండగా నిలిచాయి. ట్విటర్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వాట్సప్, యాహూ, లింక్డిన్, డ్రాప్ బాక్స్ వంటి వివిధ సంస్థలు తమ మద్దతు ప్రకటించాయి. అయితే.. అమెరికాతోపాటు వివిధ ప్రభుత్వాలు మాత్రం.. వ్యక్తిగత స్వేచ్ఛకన్నా.. దేశభద్రతే ముఖ్యమని భావించాయి. అమెరికా అధ్యక్షుడి నుంచి ఆ దేశ సెనేట్ వరకు అంతటా.. దేశభద్రతకే మద్దతు లభించిం ది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా దేశభద్రతే తొలి ప్రాధాన్యమన్నారు. భారత్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఇంటలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. వాట్సప్, ఫేస్బుక్లతోపాటు పలు సామాజిక మాధ్యమ వేదికలపైనా ఆంక్షలు విధిస్తూ ముసాయిదాను రూపొందించింది. ముసాయిదాలో ఏముంది?: సామాజిక మాధ్యమాలపై ఆంక్షలకోసం కేంద్రం రూపొందించిన ముసాయిదా ప్రకారం.. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పంపే సమాచారాన్ని ప్రతి పౌరుడూ కనీసం 90 రోజుల పాటు నిల్వ ఉంచాల్సిందే. దేశ భద్రతకు సంబంధించి ఏమాత్రం అనుమానం వచ్చినా.. దర్యాప్తు బృందాలే అడిగినప్పుడు ఈ సమాచారాన్ని చూపించాల్సిందేనని ఆంక్షలు విధించింది. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించటమేనని హక్కుల సంఘాలు దుయ్యబట్టాయి. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకోవాల్సింది పోయి.. ఉక్కుపాదం మోపాలనుకోవటం సరికాదని.. సాంకేతిక నిపుణులు అన్నారు. దీంతో ఈ ముసాయిదా నుంచి ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లను కేంద్రం మినహాయించింది. ఇదే దేశభద్రతకు ముప్పు ఇలా సమాచారం చాలా భద్రంగా అనుకున్న వ్యక్తికి చేరటం వల్ల కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల రహస్య సమాచార ప్రసారంపై నిఘా పెట్టలేమని భద్రతాసంస్థల వాదన. కానీ సాంకేతిక నిపుణులు మాత్రం ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందని.. అలాంటి పరిష్కారం కోసం యత్నించాల్సిన ప్రభుత్వం.. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదంటున్నారు.