telecom spectrum
-
టెల్కోల స్పెక్ట్రం షేరింగ్‌కు ఆమోదం
న్యూఢిల్లీ : కాల్ డ్రాప్ సమస్యను తగ్గించే దిశగా ఒకే బ్యాండ్‌విడ్త్‌లో టెలికం స్పెక్ట్రం షేరింగ్ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. టెలికం సంస్థలు స్పెక్ట్రంను పరస్పరం ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే స్పెక్ట్రం లీజింగ్‌కు మాత్రం అనుమతించలేదు. అటు టెలికం రంగంలో స్థిరీకరణకు కీలకమైన స్పెక్ట్రం ట్రేడింగ్ నిబంధనలపైనా నిర్ణయం తీసుకోలేదు. ఒకే తరహా బ్యాండ్‌లో స్పెక్ట్రం కలిగి ఉన్న రెండు టెలికం కంపెనీలు మాత్రమే షేరింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. మార్కెట్ రేటు చెల్లించి తీసుకున్న స్పెక్ట్రంను కూడా షేరింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మొబైల్ టవర్లు వంటి వాటిని మాత్రం టెలికం ఆపరేటర్లు షేర్ చేసుకోవడానికి వీలుంది. -
స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్
రిజర్వ్ ధరకు కేబినెట్ ఆమోదముద్ర ⇒ వేలం ద్వారా రూ. 64,840 కోట్ల ⇒ఆదాయం రావచ్చని కేంద్రం అంచనా న్యూఢిల్లీ: అత్యంత భారీ స్థాయిలో టెలికం స్పెక్ట్రం వేలానికి తెరతీస్తూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సోమవారం రిజర్వ్ ధరలకు ఆమోదముద్ర వేసింది. దీంతో ఏకంగా రూ. 64,840 కోట్లు రాగలవని అంచనా. ఇందుకు సంబంధించి 2జీ సేవలకు ఉపయోగపడే మూడు బ్యాండ్లలో 380.75 మెగాహెర్ట్జ్ మేర స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. దేశవ్యాప్తంగా ప్రతి మెగాహెర్ట్జ్కి 800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో రూ. 3,646 కోట్లు, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, జమ్మూ కశ్మీర్ మినహా) రూ. 3,980 కోట్లు, 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో (మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మినహా) రూ. 2,191 కోట్లుగాను రిజర్వ్ ధర ఉంటుందని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. 2,100 మెగాహెర్ట్జ్ ధరను గురించి మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కి నిర్ణయించిన ధర క్రితం వేలంలో ఆపరేటర్లు చెల్లించిన దానికన్నా 10 రెట్లు అధికం. ఇక, 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ రేటు.. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయించిన దానికన్నా 17% అధికం. దరఖాస్తులకు ఫిబ్రవరి 2 ఆఖరు తేది.. టెలికం విభాగం సూచనప్రాయంగా నిర్ణయించిన దాని ప్రకారం దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఆఖరు తేది ఫిబ్రవరి 2గా ఉంటుంది. ఫిబ్రవరి 13 బిడ్డర్ల ప్రీ-క్వాలిఫికేషన్ జరుగుతుంది. 23న వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలం ద్వారా కనీసం రూ. 64,840 కోట్లు (2,100 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం) రాగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇందులో రూ. 16,000 కోట్లు ఖజానాకు జమ కాగలవని పేర్కొంది. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్ బిడ్డింగ్‌లో గెలుపొందితే తుది ధరలో 33 శాతాన్ని 10 రోజుల్లోగా జమ చేయాల్సి ఉంటుంది. అదే 900, 800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ విషయంలో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు రెండేళ్ల మారటోరియం ఉంటుంది. వన్ టైమ్ చార్జీలను 10 సమాన వాయిదాల్లో చెల్లించవచ్చని కేంద్రం తెలిపింది. 3జీ వేలం కూడా అప్పుడే..: అటు 3జీ స్పెక్ట్రం (2,100 మెగాహెర్ట్జ్) వేలాన్ని కూడా అదే సమయంలో నిర్వహించాలని కేంద్రం భావిస్తోందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. తగినంత స్థాయిలో స్పెక్ట్రంను అందుబాటులో ఉంచడం, సముచిత విధంగా పోటీతత్వాన్ని ప్రోత్సహించడం, వినియోగదారులకు టెలికం సర్వీసులను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఈ వేలం నిర్వహణలో ప్రధాన లక్ష్యాలని ఆయన వివరించారు. కేంద్రం ఆమోదం తెలిపిన వాటిలో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ మినహా మిగతావన్నీ టెలికం కమిషన్ సిఫార్సు చేసిన రిజర్వ్ ధరలే. టెలికం కమిషన్ 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌కి రూ. 3,695 కోట్లు సిఫార్సు చేయగా కేబినెట్ రూ. 3,980 కోట్లు ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 22 టెలికం సర్వీస్ ఏరియాలు ఉన్నాయి. 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కి సంబంధించి అన్ని సర్వీస్ ఏరియాల్లోనూ 103.75 మెగాహెర్ట్జ్‌ని ప్రభుత్వం వేలానికి ఉంచింది. 17 టెలికం సర్కిల్స్‌లో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో 103.75 మెగాహెర్ట్జ్ను, 1800 మెగాహెర్ట్జ్కి బ్యాండ్‌విడ్త్‌కి సంబంధించి 15 సర్కిళ్లలో 99.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలం వేయనుంది. ప్రస్తుతం 900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌ను జీఎస్ఎం ఆధారిత సర్వీసులు అందించే ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, యూనినార్ వంటిసంస్థలు ఉపయోగిస్తున్నాయి. 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌ను సీడీఎంఏ టెక్నాలజీ ఆధారిత సేవలు అందించే ఎంటీ ఎస్, టాటా టెలీసర్వీసెస్, ఆర్‌కామ్ ఉపయోగిస్తున్నాయి. గనుల వేలం ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర బొగ్గు బ్లాకుల వేలం, బీమా సంస్కరణలు మొదలైన వాటి తరహాలోనే ప్రభుత్వం తాజాగా ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలానికీ ఆర్డినెన్స్ బాట పట్టింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను సోమవారం ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముడి ఇనుము, బొగ్గు యేతర ఖనిజాలకు సంబంధించిన గనుల వేలానికి ఇది ఉపయోగపడగలదని వివరించాయి. అలాగే, ఆయా ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే వారి సంక్షేమానికి తోడ్పడేలా జిల్లా ఖనిజ నిధి(డీఎంఎఫ్) ఏర్పాటుకూ ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడనుంది. కీలకమైన బిల్లులు పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందకపోవడం వల్ల.. కేంద్రం ఆర్డినెన్స్ బాట పట్టింది. అయితే, వేలం విధానం వల్ల గుత్తాధిపత్య ధోరణులు పెరగ వచ్చంటూ ఖనిజ సంస్థల సమాఖ్య వ్యతిరేకిస్తోంది. -
స్పెక్ట్రం రేసులో 8 కంపెనీలు
న్యూఢిల్లీ: వచ్చే నెల 3 నుంచి జరగబోయే 2జీ టెలికం స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు ఎనిమిది కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఉన్నాయి. వేలంపై పెద్ద కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్న దరిమిలా.. దీని ద్వారా రూ. 11,343 కోట్ల పైగా రాగలవనేది ప్రభుత్వం అంచనా. ఎనిమిది కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు, వేలం విజయవంతం కాగలదని ఆశిస్తున్నట్లు టెలికం విభాగం కార్యదర్శి ఎంఎఫ్ ఫారుఖీ తెలిపారు. టెలికం స్పెక్ట్రం వేలం ద్వారా రూ. 11,343 కోట్లు రాబట్టాలని బడ్జెట్లో నిర్దేశించుకోగా, దాన్ని అధిగమించగలమని భావిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తుల దాఖలుకు బుధవారం ఆఖరు రోజు కాగా, ఉపసంహరణకు జనవరి 27 ఆఖరు తేది. అన్నింటికన్నా ముందు వొడాఫోన్ ఆ తర్వాత ఎయిర్టెల్, ఎయిర్‌సెల్, టాటా టెలీ, ఐడియా సెల్యులార్, ఆర్జెఐఎల్, టెలీవింగ్స్(యూనినార్), ఆర్‌కామ్ దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లూప్, వీడియోకాన్ దరఖాస్తు చేసుకోలేదు. తమ లెసైన్సు వ్యవధిని పొడిగించాలంటూ టెలికం ట్రిబ్యునల్ టీడీశాట్‌ని కోరినట్లు, సానుకూల నిర్ణయం రాగలదని ఆశిస్తున్నట్లు లూప్ మొబైల్ ఎండీ సందీప్ బసు తెలిపారు. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా దరఖాస్తు చేయలేదు. బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రం ఉన్న ఆర్జేఐఎల్ మాత్రం తాజాగా జీఎస్ఎం స్పెక్ట్రం కోసం కూడా పోటీపడుతోంది. కనీస రేటు తగ్గింపు..: కనీస రేటు అధికంగా ఉందన్న కారణంతో గతేడాది మార్చిలో నిర్వహించిన వేలంలో జీఎస్ఎం ఆపరేటర్లు పాల్గొనలేదు. దీంతో కేంద్రం ఈసారి రేటును సవరించింది. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ రేటును మెగాహెర్ట్జ్కి రూ.1,765 కోట్లుగా నిర్ణయించింది. ఇది మార్చి రేటు కన్నా 26% తక్కువ. అలాగే, 900 మెగాహెట్జ్ ధరను 53% తక్కువగా నిర్ణయించారు. దీని ప్రకారం ఢిల్లీలో మెగాహెర్ట్జ్ కనీస ధర రూ. 360 కోట్లు, ముంబైలో రూ. 328 కోట్లు, కోల్‌కతాలో రూ. 125 కోట్లుగా ఉండనుంది. ప్రస్తుతం 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 403 మెగాహెట్జ్ మేర, 900 మెగాహెట్జ్‌లో 45 మెగాహెట్జ్ పరిమాణాన్ని ప్రభుత్వం వేలం వేయనుంది. 2జీ స్కామ్‌లో 122 లెసైన్సులు రద్దయిన దరిమిలా అందుబాటులోకి వచ్చిన స్పెక్ట్రం (1800 మెగాహెట్జ్ బ్యాండ్) అంతటినీ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వేలం వేస్తోంది. మరోవైపు నవంబర్‌లో ఎయిర్టెల్, వొడాఫోన్, లూప్ సంస్థల లెసైన్సుల గడువు ముగియపోనుండటంతో వీటికి సంబంధించి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సర్కిళ్లలో 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను కూడా వేలం వేస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్లకు ఈ బ్యాండ్ స్పెక్ట్రం చాలా కీలకం. -
స్పెక్ట్రమ్ ధర పెంచితే టారిఫ్‌లూ పెరుగుతాయ్
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ ధర భారీగా ఉంటే తాము కాల్స్, ఎస్ఎంఎస్, ఇతర చార్జీలు 50 శాతం దాకా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే వేలంలో స్పెక్ట్రమ్ బేస్ ధరను తగ్గించాలని కోరాయి. స్పెక్ట్రమ్ ధర మరీ అధికంగా ఉంటే.. టారిఫ్‌లు భారీగా పెరుగుతాయని, స్పెక్ట్రమ్ కూడా అమ్ముడు కాకపోవడం వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉండబోవని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి తెలిపాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సు గడువు 2014తో ముగిసిపోనుండటంతో.. రీఫార్మింగ్ కింద వాటి స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. ఇందుకోసం బేస్ ధరను 2008 నాటి రేటుతో పోలిస్తే 11 రెట్లు అధికంగా నిర్ణయించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి. మొబైల్ కాల్ చార్జీలు గత రెండేళ్లలో 100 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం నిమిషానికి 90 పైసల నుంచి రూ. 1.20 దాకా చార్జీలు ఉన్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఆమోదించిన పక్షంలో టారిఫ్‌లు మరో 26 పైసల దాకా పెరగొచ్చని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు ఎయిర్టెల్ తెలిపింది. మరోవైపు, రీఫార్మింగ్ వల్ల నెట్‌వర్క్‌లో మార్పులు చేర్పుల కోసం పరిశ్రమ రూ. 55,000 కోట్లు, నిర్వహణ వ్యయాల కింద ఏటా మరో రూ. 11,800 కోట్ల మేర వెచ్చించాల్సి వస్తుందని లూప్ మొబైల్ పేర్కొంది. గతంలో ఉన్న బేస్ ధరనే కొనసాగిస్తే మంచిదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అభిప్రాయపడింది. రూ. 30,000 కోట్ల బకాయిలు.. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సహా టెలికం కంపెనీలు మొత్తం రూ. 30,158 కోట్ల మేర స్పెక్ట్రం చార్జీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో వన్ టైమ్ ఫీజు, యూసేజ్ చార్జీలు కూడా ఉన్నాయి. దీంతో ఆపరేటర్లకు డిమాండ్ నోటీసులు పంపినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవరా తెలిపారు. బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా రూ. 6,980 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ. 6,075 కోట్లు, వొడాఫోన్ రూ. 4,477 కోట్లు, ఐడియా రూ. 2,206 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 2,004 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌రూ. 1,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
స్పెక్ట్రమ్ ధర పెంచితే టారిఫ్‌లూ పెరుగుతాయ్
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ ధర భారీగా ఉంటే తాము కాల్స్, ఎస్ఎంఎస్, ఇతర చార్జీలు 50 శాతం దాకా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే వేలంలో స్పెక్ట్రమ్ బేస్ ధరను తగ్గించాలని కోరాయి. స్పెక్ట్రమ్ ధర మరీ అధికంగా ఉంటే.. టారిఫ్‌లు భారీగా పెరుగుతాయని, స్పెక్ట్రమ్ కూడా అమ్ముడు కాకపోవడం వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉండబోవని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి తెలిపాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సు గడువు 2014తో ముగిసిపోనుండటంతో.. రీఫార్మింగ్ కింద వాటి స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. ఇందుకోసం బేస్ ధరను 2008 నాటి రేటుతో పోలిస్తే 11 రెట్లు అధికంగా నిర్ణయించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి. మొబైల్ కాల్ చార్జీలు గత రెండేళ్లలో 100 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం నిమిషానికి 90 పైసల నుంచి రూ. 1.20 దాకా చార్జీలు ఉన్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఆమోదించిన పక్షంలో టారిఫ్‌లు మరో 26 పైసల దాకా పెరగొచ్చని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు ఎయిర్టెల్ తెలిపింది. మరోవైపు, రీఫార్మింగ్ వల్ల నెట్‌వర్క్‌లో మార్పులు చేర్పుల కోసం పరిశ్రమ రూ. 55,000 కోట్లు, నిర్వహణ వ్యయాల కింద ఏటా మరో రూ. 11,800 కోట్ల మేర వెచ్చించాల్సి వస్తుందని లూప్ మొబైల్ పేర్కొంది. గతంలో ఉన్న బేస్ ధరనే కొనసాగిస్తే మంచిదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అభిప్రాయపడింది. రూ. 30,000 కోట్ల బకాయిలు.. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సహా టెలికం కంపెనీలు మొత్తం రూ. 30,158 కోట్ల మేర స్పెక్ట్రం చార్జీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో వన్ టైమ్ ఫీజు, యూసేజ్ చార్జీలు కూడా ఉన్నాయి. దీంతో ఆపరేటర్లకు డిమాండ్ నోటీసులు పంపినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవరా తెలిపారు. బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా రూ. 6,980 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ. 6,075 కోట్లు, వొడాఫోన్ రూ. 4,477 కోట్లు, ఐడియా రూ. 2,206 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 2,004 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌రూ. 1,400 కోట్లు చెల్లించాల్సి ఉంది.