ten
-
వైరల్ 75 కాదు 25!
సాధారణంగా 75 సంవత్సరాల వయసులో కొద్దిదూరం నడిచినా ఆయాసపడుతుంటారు. అస్సాంలోని దిబ్రూఘర్‌కు చెందిన 75 సంవత్సరాల హీర బోరా అలా కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో యువతను చైతన్యవంతం చేయడానికి త్రివర్ణ పతాకం చేతబూని పదికిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘ఆమె వయసు 75 నుంచి 25కు వచ్చింది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఇంటి దొంగే.. రూ.10 కోట్లు డిమాండ్
ఘజియబాద్‌కు చెందిన ఒక 11 సంవత్సరాల బాలుడు యూట్యూబ్‌లో హ్యాకింగ్ టిప్స్ నేర్చుకున్నాడు. బయట ఎక్కడో ఎందుకు... తాను నేర్చుకున్న విద్యకు ఇంట్లోనే తగిన న్యాయం చేయాలనుకున్నాడు. వెంటనే తండ్రి ఇమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేశాడు. దాని పాస్వర్డ్ మార్చేశాడు. తండ్రికి ఫోన్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశాడు. ‘నేను హ్యాకర్ని. పదికోట్లు ఇవ్వకపోతే మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, అభ్యంతకరమైన ఫోటోలు ఆన్లైన్లో పెడతాను’ అని బెదిరించాడు. తండ్రిలబోదిబో అంటూ పోలీస్‌స్టేషన్‌కు పరుగెత్తాడు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఒక విషయం అర్థమైంది....హ్యాకర్ ఎవరో కాదు ఇంటిదొంగే... అని. కుటుంబసభ్యులను విచారించిన తరువాత హ్యాకర్ పిల్లాడు దొరికిపోయాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ‘లాక్డౌన్ టైమ్‌లో హ్యాకింగ్ ట్రిక్స్, సైబర్‌నేరాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసేవాడిని’ అని రక్షకభటులకు చెప్పాడు 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు. ‘ఏదోలే మీ పిల్లాడే కదా’ అని వదిలేయకుండా ఐపీసీలోని రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. -
ఆగని వదంతులు..!
రూ.10నాణేలు చెల్లుబాటు కావంటూ పుకార్లు ∙ తీసుకోవడానికి నిరాకరిస్తున్న వ్యాపారులు ∙ అటువంటిదేమీ లేదంటున్న బ్యాంకర్లు రాయవరం : పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉంది. రూ.10నాణేలను తీసుకునేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తుండగా..నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం వదంతులేనని బ్యాంకర్లు కొట్టిపడేస్తున్నారు. నోట్ల రద్దు నుంచి.. గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ అదే పరిస్థిథి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల నాణేలు చెల్లవని ఆటోవాలాలు, చిరు వ్యాపారులు, పండ్లు, కూరగాయలు, పాల వ్యాపారులు..ఇలా ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. రూ.10నాణేలు వచ్చిన కొత్తలో, ఆ తర్వాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా మంది వ్యాపారులు మూటలు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న పుకార్లతో వారు ఆ నాణేలను బయటకు తీస్తున్నారు. అయితే వీటిని తీసుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీని వల్ల చిన్న చిన్న తగాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి చిల్లరగా కండక్టర్లు రూ.10నాణేలు ఇస్తే అటు ప్రయాణికులు..ఇటు కండక్టర్లు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయి.. రూ.10 నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం అపోహలు మాత్రమే. రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని రూ.10నాణేల మారకాన్ని వినియోగించుకోవాలి. – డి.సత్యనారాయణ, ఏజీఎం, ఆంధ్రాబ్యాంకు, రాయవరం -
కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలి
ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ మహాసభ డిమాండ్ కాకినాడ సిటీ : కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం స్థ్ధానిక కొండయ్యపాలెంలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స అసోసియేషన్ జిల్లా ప్రథమ మహాసభ హార్లిక్స్ పెన్షనర్స్ సంఘ నాయకులు సీహెచ్.మోహనరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మహాసభలో వివిధ అంశాలు, సమస్యలపై చర్చించిన అనంతరం వక్తలు మాట్లాడుతూ జీపీఎస్ విధానం రద్దు చేయాలని, సమస్యలపై పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా పోరాటాలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. పీఎఫ్ఆర్yీ ఏ బిల్లు రద్దు చేయాలని, హెల్త్ కార్డులు ఇచ్చి వాటిపై అన్ని ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ జిల్లా కన్వీనర్ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేవీవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.స్టాలిన్, అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్, జిల్లా ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం, ఎన్జీవో సంఘ మాజీ అధ్యక్షులు ఆచంట రామారాయుడు, వివిధ పెన్షనర్ల సంఘాల నాయకులు వీవీ కృష్ణమాచార్యులు, పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి, జి.అప్పారావు, ఏవీయూ సుబ్బారావు, బి.సత్యనారాయణ, సదానందమూర్తి పాల్గొన్నారు. -
జిల్లాలో 10 వేల ఈ పోస్ మెషీన్లు
డిసెంబర్ మొదటి వారానికి ఏర్పాటు వీటి కోసం 3,500 దరఖాసులు జన్‌ధన్ ఖాతాదారులకు రుపే కార్డులు కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : జిల్లాలో డిసెంబర్ మొదటి వారానికి 10 వేల ఈ పోస్ మెషీన్లను అందుబాటులోకి తేనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రజల లావాదేవీలు అధికంగా ఉండే జనరల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఎరువుల దుకాణాలు, వైన్ షాపులు తదితర దుకాణాల్లో ఈ మెషీన్లను బ్యాంకులు అందుబాటులోకి తేనున్నాయని చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజలను ఆకర్షితులను చేసేందుకు ఈ పోస్ మెషీన్లను గ్రామ, మండల స్థాయిల్లో అన్ని రకాల వ్యాపారులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ వ్యాపారుల నుంచి ఈ మెషీన్ల కోసం సుమారు 3,500 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంక్‌ల ద్వారా ఈ నెల 27లోగా వాటిని ఆయా వ్యాపార సంస్థల్లో నెలకొల్పనున్నారని తెలిపారు. జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు తెరిచిన వారిలో చాలా మంది రూపే డెబిట్ కార్డును తీసుకోలేదని, వారందరికి వాటిని పంపిణీ చేసి నగదు రహిత లావాదేవీలకు వినియోగించుకునేలా చైతన్యపరుస్తామన్నారు. నగదు కొరత నేపథ్యంలో ప్రజల ఇబ్బందుల నివారణకు జిల్లా స్థాయిలో అధికారులు, బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమన్వయ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. -
మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ కు.. కాంట్రాక్ట్ కష్టాలు!
మూడేళ్ళ వయసునుంచే మోడలింగ్ ఫీల్డ్ లో ప్రతిభను ప్రదర్శించిన ఆ చిన్నారి... ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ గా పేరొందింది. డాల్సీ అండ్ గబ్బనా.... రాబర్ట్ కావిల్లా.... అర్మానీ వంటి ఎంతోమంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో పని చేసింది. పదేళ్ళ వయసున్న ఆ రష్యా చిన్నది... ఇప్పుడు అమెరికాకు చెందిన టాప్ మోడలింగ్ కాంట్రాక్ట్ విషయంలో సమస్యను ఎదుర్కొంటోంది. రష్యాలో జన్మించిన లిటిల్ సూపర్ మోడల్... 'ఎల్ ఏ మోడల్స్ యూత్' సెక్షన్ కాంట్రాక్ట్ కు సైన్ చేసి... ప్రపంచంలోనే ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది. అయితే ఆ అభిమానం ఆమె భవిష్యత్తుకు మాత్రం సహకరించేలా కనిపించడం లేదు. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన క్రిస్టినా ప్రిమెనోవా చిత్రాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఈ పోకడ సరికాదని కొందరు వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆమెకు అడ్డంకిగా మారింది. క్రిస్టినాకు ఫేస్ బుక్ లో సుమారు 20 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చిన్నతనంలోనే ఆమె ప్రతిభా పాటవాలను ప్రోత్సహిస్తున్నవారు కొందరైతే... అసూయ, ఆగ్రహం వ్యక్తం చేసేవారూ అందులో కొనసాగుతున్నారు. కొందరు ఆమె చిన్నపిల్లని చూడకుండా ఆమె శరీరభాగాలపై ఎన్నోఅసభ్య కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోపై ఓ కామెంటర్ తనతో ఉండటం ఇష్టమేనా అన్నాడు. అలాగే కొందరు సెక్సీ లెగ్స్ అన్నారు. అయితే క్రిస్టినా తల్లి 40 ఏళ్ళ గ్లికేరియా పిమెనోవా మాత్రం.. తాను పోస్ట్ చేసిన ఫోటోల్లో ఎలాంటి అసభ్యతా లేదంటోంది. చిన్నారి ధరించిన వస్త్రాలు రెచ్చగొట్టేవిగా లేవని ఆమె వాదిస్తోంది. పసి పిల్లలను అసభ్యంగా చూడటం సరికాదని, తన కూతురు భవిష్యత్తును పాడు చేయొద్దని ఓ పత్రికతో విన్నవించింది. క్రిస్టినా ఫొటోలను తరచుగా ఇన్ స్టాగ్రామ్ లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేసే బాధ్యతను తల్లి గ్లైకేరియా కొనసాగిస్తోంది. కూతురుపై వచ్చే అనుచిత వ్యాఖ్యలను వెంటనే డిలీట్ చేస్తూ, ఆమె పోస్ట్ లు ఛైల్డ్ ఫ్రెండ్లీ గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. క్రిస్టినా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో ఎవరైనా పోస్టు చేసే వీడియోలు, చిత్రాలు, కామెంట్లు.. క్రిస్టినా వయసుకు తగ్గవిగా లేకపోతే డిలీట్ చేయబడతాయని గ్లికేరియా హెచ్చిరిస్తోంది. అంతేకాక పోస్ట్ చేసిన వారిని బ్లాక్ చేస్తామని చెప్తోంది. అయితే ఆన్ లైన్ లో క్రిస్టినా... ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నా... అతి చిన్న వయసు కావడంతో ఆమెకు సోషల్ మీడియాలో ప్రవేశం ఉండకూడదని కొందరు అభ్యంతరాలు కూడ వ్యక్తం చేస్తున్నారు. -
ఈ బాలుడుకి దివ్య దృష్టి
ఢిల్లీ: కనిపించకుండా కళ్లకు గంతలు కట్టుకొని బైకులు నడిపే వారిని మనం తరచుగా చూస్తుంటాం. ఢిల్లీకి చెందిన ఈ పదేళ్ల బాలుడు మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని బైక్ నడపడమే కాదు, రంగుల బంతుల్లో ఏదీ ఏ రంగులో ఉందో, ఏ రంగు ఏ షేడ్‌లో ఉందో కూడా గుర్తుపడతాడు. అంతేకాకుండా తోటి పాఠశాల విద్యార్థులను వరుసగా నిలబడితే దగ్గరికి వెళ్లి ఎవరు ఎక్కడున్నారో గుర్తిస్తాడు. తెలిసిన పరిసర ప్రాంతాల్లో ఏ మోరీ ఎక్కడుందో, ఏ గుంత ఎక్కడుందో గుర్తు పట్టి కళ్లతో చూసినట్టుగానే దాటేస్తాడు. వికాస్ పంచల్ అనే విద్యార్థి కళ్లకు గంతలు కట్టుకొని చేసిన ఈ ఫీట్లను వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. రోజుకు రెండు గంటలపాటు తన మెదడుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా తాను ఈ దివ్వ దృష్టిని సాధించానని వికాస్ తెలిపాడు. మధ్య మెదడును క్రియాశీలకం చేయడం వల్ల గతంలో మనం చూసిన ఏ దృశ్యాన్ని గానీ వస్తువునుగానీ, మాటలనుగానీ మరిచిపోమని, అవి మెదడులో నిక్షిప్తమై ఉంటాయని వికాస్ చెప్పాడు. తనకు గతంలో ఏం చదివినా మెదడుకు ఎక్కేదికాదని, ఏది గుర్తుండేది కాదని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యేవాడినని, మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ సమస్యలన్నింటినీ అధిగమించానని తెలిపాడు. ప్రతి వస్తువుకుండే ప్రత్యేకమైన వాసన ద్వారా వివిధ వస్తువులను, రంగులను, గుంపులో మనుషులను తాను గుర్తించగలుగుతున్నానని చెప్పాడు. తాను భవిష్యత్తులో శాస్త్రవేత్తనై దేశానికి సేవ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఇది ఒకరకమైన మెడిటేషన్ అని, మనిషికి రెండు మెదళ్లు ఉంటాయని, అందులో ఒకటి స్తబ్ధుగా ఉంటుందని, దాన్ని క్రియాశీలకం చేయడం ద్వారా వికాస్ లాంటి విద్యలు చేయవచ్చని అతనికి శిక్షణ ఇస్తున్న గురువు శ్రీ భగవాన్ తెలిపారు. ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలకే ఇది సాధ్యమవుతుందని ఆయన వివరించారు.