tenth class girl
-
పదో తరగతి బాలికకు గర్భం..
గుంటూరు: తన చెల్లెలి దగ్గరికొచ్చే పదో తరగతి బాలికకు (15)కు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో దుర్మార్గుడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలిక సమీపంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి తరచూ వెళ్లి పుస్తకాలు తెచ్చుకునేది. అదే అవకాశంగా భావించిన స్నేహితురాలి సోదరుడు గుంజి నరేంద్ర (23) బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి లైంగిక దాడి చేశాడు. ఇది నిందితుడి కుటుంబ సభ్యులకు తెలియగా.. తమ కుమారుడితో పెళ్లి జరిపిస్తామని, విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను నమ్మించారు. దీన్ని అలుసుగా తీసుకున్న యువకుడు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి అయింది. రోజు రోజుకూ తమ కుమార్తెలో మార్పులు వస్తుండటాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి చేతులు దులుపుకొన్నారు. అయితే తమ కూతురిపై లైంగికదాడికి ప్రోత్సహించిన నిందితుడి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత బాలిక, కుటుంబ సభ్యులతో కలసి సోమవారం గుంటూరు పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులందరిని జైలుకు పంపితేనే మరొకరికి తనలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉంటుందని బాధిత బాలిక కన్నీటి పర్యంతమైంది. కాగా, నిందితుడు గుంజి నరేంద్ర ఐటీఐ పూర్తి చేసి తాపీ పనులకు వెళ్తాడని తెలిసింది. -
బావిలో శవమైన టెన్త్ బాలిక
కర్ణాటక, క్రిష్ణగిరి: యువతి అనుమానాస్పద స్థితిలో బావిలోపడి మరణించిన సంఘటన మంగవారం ఉదయం జరిగింది. సూళగిరి తాలూక కానలట్టి గ్రామానికి చెందిన నారాయణప్ప గోవిందమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు. వీరి రెండవ కూతురు పవిత్ర (15). అనుమానాస్పద స్థితిలో మారండపల్లి సమీపంలోని కావేరి గ్రామంలో తాత ఇంటికెళ్లి పక్కనున్న బావిలో పడి మరణించింది. మంగళవారం ఉదయం ఇంటి నుండి పవిత్ర బయటకెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో తల్లి గోవిందమ్మ పవిత్రకోసం వెతకసాగింది. సమీపంలో వెంకటరాజుకు చెందిన బావిలో శవమై తేలింది. సూళగిరి పోలీసులు సంఘటనా స్థలానికెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకొని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. పవిత్ర కానలట్టి గ్రామంలో 10వ తరగతి చదువుతుందని బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు బావిలో పడిందా ? లేక ఆత్మహత్య చేసుకొందా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ప్రేమించలేదని టెన్త్ బాలిక నరికివేత
అభంశుభం తెలియని పదో తరగతి బాలిక ప్రేమోన్మాది కొడవలికి బలైంది. బాలిక తనతో మాట్లాడడం లేదని, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్న ఓ యువకుడు వెంటాడి ప్రాణాలు తీశాడు. ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా దాడి చోటుచేసుకుంది. కర్ణాటక, దొడ్డబళ్లాపురం: బాలికను ఓ సైకో పట్టపగలు నడిరోడ్డుమీద తెగనరికి చంపాడు. తన ప్రేమను కాదన్నందుకు అమాయకపు బాలికను నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నాడు. బ్యాగ్ తగిలించుకుని ఉత్సాహంగా పాఠశాలకు బయలుదేరిన ముద్దుల కూతురు దారుణ హత్యకు గురైందని తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ ఘోర విషాదం దొడ్డ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఎలా జరిగిందంటే.. పట్టణ శివారులోని బసవేశ్వర నగర్లో నివసిస్తున్న నందీశ, లలిత దంపతుల రెండవ కూతురు కీర్తన (15) హత్యకు గురైన చిన్నారి. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న గార పని చేసే నవీన్ (28) ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కీర్తన పట్టణంలోని బీఎస్ఏ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి ఇంటికి సమీపంలోనే టీకొట్టు నడుపుకుంటూ ముగ్గురు కూతుర్లను చదివిస్తున్నాడు. బుధవారం ఉదయం 8–30 సమయంలోకీర్తన పాఠశాలకు బయలుదేరింది. అక్కడే కాపు కాసిన నవీన్.. కొడవలితో బాలికను తీవ్రంగా నరికాడు. కీర్తన అక్కడే కుప్పకూలి ప్రాణం వదిలింది. దుండగున్ని అడ్డుకోబోయిన స్థానికులను నవీన్ కొడవలితో బెదిరించాడట. పెళ్లి చేయాలని ఒత్తిళ్లు కీర్తన అక్క వైశాలి, హంతకుడు నవీన్ తమ్ముడు ప్రవీణ్‌కుమార్ ఏడాది క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. అలా ఇరు కుటుంబాలకు బంధుత్వం ఏర్పడింది. తరచూ కీర్తన ఇంటికి వచ్చే నవీన్ బాలికలను తనకిచ్చి వివాహం చేయాలని వారిని ఒత్తిడి చేసేవాడు. అతడు చెడు వ్యసనాలకు అలవాటుపడి జులాయిగా తిరుగుతుండడంతో కీర్తన తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. అయినా అతడు బాలికను పాఠశాలకు వెళ్లేసమ యంలో వెంటాడి వేధించేవాడు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని స్థానికులు కొన్నిసార్లు దేహశుద్ధి చేశారు. ఒకసారి పోలీస్‌స్టేషన్‌కు కూడా పిలిపించి వార్నింగ్‌లు ఇప్పించారు. అతని వ్యవహారాలు తెలిసి బాలిక కూడా ఇష్టపడేది కాదు. దీంతో కసి పెంచుకున్నారు. విషం తాగినట్టు డ్రామా హత్య చేసిన నవీన్ బసవ భవనం వద్దకు వెళ్లి (ఇంటికి సమీపంలోనే) విషం తాగినట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు.కుటుంబ సభ్యులు వచ్చేసరికి నవీన్ సొమ్మసిల్లి పడిపోయినట్టు నటించాడు. తక్షణం అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పోలీసులు చికిత్స చేసి ప్రమాదమేమీ లేదని తేల్చిచెప్పారు. పోలీసులు ఆ మృగాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: నమ్మినవారే వంచించారు..
పట్నంబజారు(గుంటూరు): ఆంటీ.. అక్కా.. అని పిలుస్తున్న ఆ బాలికను ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న ముగ్గురు మహిళలు వంచించారు. మృగాళ్లకు సహకరించి బాలికపై సామూహిక అత్యాచారానికి కారకులయ్యారు. గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన పదో తరగతి బాలికపై అత్యాచారం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకొస్తున్నాయి. బాలిక ఇంటి పక్కన ఉన్న మహిళలే యువకులకు సహకరించి ఆ బాలికను నమ్మించి వంచించినట్లు తెలుస్తోంది. స్వర్ణభారతినగర్‌కు చెందిన త్రినాథ్.. ప్రేమ పేరుతో బాలిక వెంటపడి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గత నెల 29న కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం త్రినాథ్ సహా అతని స్నేహితులు ఏలూరి మోహన్‌కృష్ణ, చిన్ని, ఇజ్రాయిల్, వలీ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచార ఘటనలో 15 మంది వరకూ ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటికొస్తున్నట్టు తెలుస్తోంది. త్రినాథ్ అతని స్నేహితులకు బాలిక నివాసానికి సమీపంలో ఉండే ముగ్గురు మహిళలు సహకరించినట్టు దర్యాప్తులో బయటపడినట్టు సమాచారం. పోలీసులు ఆ ముగ్గురులో ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాలికపై ఆ యువకులు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతుండడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. మాయ మాటలు చెబుతూ.. బాలిక నివాసానికి సమీపంలో ఉండే మహిళ, త్రినాథ్ ఇంటి పక్కనే ఉండే మరో మహిళ, అదే ప్రాంతంలో ఉండే ఇంకో మహిళ.. వీరంతా బాలికకు మాయమాటలు చెబుతూ త్రినాథ్ వైపు ఆకర్షితురాలయ్యేలా చేసినట్టు సమాచారం. అతని ఉచ్చులో పడిన బాలికను అదే ప్రాంతంలో ఉండే మహిళ 2 రోజుల పాటు నిర్బంధించి.. ఇద్దరు యువకులతో అత్యాచారం చేయించినట్టు సమాచారం. కొన్ని రోజుల తర్వాత వెంగళాయపాలెం కొండల్లోని ఒక స్నేహితుడి గదికి తీసుకెళ్లిన సందర్భంలో వారి నుంచి తప్పించుకుని పారిపోయిన బాలికను ఓ మహిళ కాపాడినట్టు తెలిసింది. పలుమార్లు బాలికపై అత్యాచారం చేయటంతో పాటు అందుకు సహకరించిన యువకులు, పాఠశాల వద్ద బాలిక కిడ్నాప్‌నకు సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు. -
బాలికల పాఠశాలలో చొరబడి..
సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఓ బాలికల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తరగతి గదిలోకి దూరి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలికకు న్యాయం చేయాలని బంధువుల ఆందోళన చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని బిషప్ అజరయ్య బాలికల పాఠశాలలోకి బుధవారం ఓ ఆగంతకుడు పదో తరగతి గదిలోకి అకస్మాత్తుగా దూరాడు. అనంతరం క్లాస్‌రూంలో ఉన్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయానికి గురైన ఆ బాలిక పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకింది. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం బాలికను వెంటనే దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. -
దారుణం : విషం ఇచ్చి మరీ అత్యాచారం..
చండీగఢ్: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతోన్న ఓ విద్యార్థికి విషం ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి మైనర్, మరో ఇద్దరు బాధితురాలికి బంధువులు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేహాబాద్ జిల్లాలోని భట్టుకలాన్ గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అనంతరం ఆమెను ఊరి చివర ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెకి విషం ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పొంది. అనంతరం ఆమెను ఇంటికి సమీపంలో వదిలి పారిపోయారు. కాగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. కూతురు ఆచూకీ కోసం వెతికారు. ఇంతలోనే ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కూతురిని ఇంటి ముందు చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. కాగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గిరిలో మైనర్ బాలుడిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు తప్పించుకున్నారని, హరియాణా డీఎస్పీ(హెడ్‌క్వార్టర్స్) గురుదయాళ్ సింగ్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
విద్యార్థిని కిడ్నాప్ చేసిన యువకుడు
హైదరాబాద్: పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఎస్ ఐ వెంకట్ రెడ్డి కథనం ప్రకారం కుర్మగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఆంజనేయులు కుమార్తె(16) పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (24) ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి పది రోజుల క్రితం ఇంటి నుంచి తీసుకెళ్లాడు. బాలిక ఆచూకీ కోసం గాలించిన కుటుంబసభ్యులు ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.