thinker
-
వైరస్ను నిర్వీర్యం చేసే 3డీ ప్రింటెడ్ మాస్క్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మనం ధరించిన మాస్కును తాకగానే నిర్వీర్యమైపోతే? కోరలు తీసిన పాములా శక్తిహీనమైపోతే? సూపర్ కదా... మనకు డబుల్ రక్షణ లభించినట్లే. వైరస్ను సంహరించే ఔషధ మిశ్రమాలను కలగలిపి... త్రీడీ ప్రింటెడ్ మాస్కులను రూపొందించి పుణె కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ థింకర్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ. సోడియం ఓలెఫిన్ సల్ఫోనేట్ ఆధారిత రసాయనమిశ్రమం దీంట్లో వాడారు. ఇది వైరస్ పైపొరను ధ్వంసం చేస్తుంది. ఈ మాస్కులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు నిర్ణయించింది. ‘‘ఇళ్లలో తయారవుతున్న మాస్కులు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ వీటి నుంచి సరైన రక్షణ లేదు. ఇన్ఫెక్షన్ నివారణకు మరింత సమర్థంగా పనిచేసే మాస్కుల రూపకల్పనపై దృష్టి సారించి 3డీ ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును అభివృద్ధి చేశాం. ఔషధ మిశ్రమాలను మాస్కుపై పైపూతగా చేర్చి వినూత్నంగా మాస్కు రూపొందించాం. ఈ మాస్కులు వైరస్ నుంచి అదనపు రక్షణను అందిస్తాయి. ఈ మాస్కులు బ్యాక్టీరియాను 95 శాతం నిరోధిస్తాయని పరీక్షల్లో వెల్లడైంది’’ అని థింకర్ టెక్నాలజీస్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ శీతల్కుమార్ జాంబాద్ వివరించారు. కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న విధానాలు రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ 2020 మేలో పరిశోధనలను చేపట్టడానికి థింకర్ టెక్నాలజీస్కి నిధులను సమకూర్చింది. -
ముకేశ్ అంబానీ మరో ఘనత
-
ముకేశ్ అంబానీ ‘గ్లోబల్ థింకర్’!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ 2019 ఏడాదికి సంబంధించి ప్రకటించిన 100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో ముకేశ్ నిలిచారు. ఇంకా ఈ ర్యాంకింగ్స్లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ తదితరులున్నారు. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్ పాలసీ... పూర్తి జాబితాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘44.3 బిలియన్ డాలర్ల సంపదతో 2018లో జాక్ మాను వెనక్కినెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే నంబర్ వన్ అపర కుబేరుడిగా అవతరించారు. ప్రధానంగా చమురు, గ్యాస్, రిటైల్ స్టోర్ల ద్వారా ఆయన ఈ స్థాయిలో సంపదను దక్కించుకున్నారు. అయితే, కొత్తగా ప్రారంభించిన రిలయన్స్ జియో ద్వారా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఫేస్బుక్, గూగుల్లకు కూడా పోటీనిచ్చే సత్తా జియోకు ఉంది’ అని ఫారిన్ పాలసీ పేర్కొంది. కాగా, మొత్తం జాబితాను 10 విభాగాలుగా విభజించామని, అందులో ముకేశ్ అంబానీ... టాప్–10 టెక్నాలజీ థింకర్స్లో నిలిచినట్లు వెల్లడించింది. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్కు కూడా చోటు లభించింది. -
'మోహన్ భగవత్ ప్రగతిశీల ఆలోచనాపరుడు'
ఆలయాల్లో స్త్రీల ప్రవేశం కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్... తమ హక్కుల పోరాటంలో మోహన్ భగవత్ వైఖరిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు. తాజాగా ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలంటూ డిమాండ్ చేసిన ఆమె... మోహన్ భగవత్ జీ ప్రగతిశీల ఆలోచనాపరుడు అంటూ ప్రశంసలు కురిపించారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ వైఖరిని ఆయన గౌరవిస్తారని భావిస్తున్నానన్నారు. స్త్రీ, పురుష సమాన హక్కుల కోసం పోరాటంలో భాగంగా తృప్తిదేశాయ్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ డిమాండ్ ను మోహన్ భగవత్ గౌరవిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. తాము సాధించాలని ప్రయత్నిస్తున్న హక్కులపై సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తమ వైఖరిని తెలియజేయాలన్నారు. ఆ విధంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ సమానత్వంకోసం పోరాడుతున్న తమకు.. మద్దతు పలుకుతుందని నమ్ముతున్నట్లు తృప్తి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రీయ సేవికా సమితి ద్వారా మహిళలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆర్ ఎస్ ఎస్ లో ప్రత్యక్షంగా సభ్యంత్వం కోసం తృప్తి డిమాండ్ ను లేవనెత్తారు. తృప్తిదేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే తృప్తి తాజా డిమాండ్ పై మాట్లాడిన బిజెపి ఉపాధ్యక్షుడు కాంత నలవాడే మాత్రం ఆమె డిమాండ్లు అర్థరహితమని, అనవసరమైన సమస్యలు సృష్టించకుండా.. మహిళలను వేధిస్తున్న ఇతర సమస్యల పరిష్కారానికి పోరాడితే మంచిదని సూచించారు.