TMC Mla
-
ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం..
కోల్కతా: నోటి దురుసుతో తరచూ వార్తల్లో నిలిచే టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారు. భారత సంస్కృతిలో ఒక భార్యను ఐదుగురు పురుషులు పంచుకోవచ్చని వ్యాఖ్యానించారు. మహాభారతంలో ద్రౌపదిని పరోక్షంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కేంద్ర విద్యా శాఖ బృందం సమీక్ష నిర్వహించింది. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఐదుగురు వంట సిబ్బందికి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏడుగురికి సమానంగా ఇస్తోందని కనిపెట్టారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన మదన్ మిత్రా.. భారత సంస్కృతిలో ఐదుగురు కలిసి ఒకే భార్యను పంచుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తుందో తెలిపేందుకు మదన్ వ్యాఖ్యలే నిదర్శనం అని కమలం పార్టీ ఎమ్మెల్యే, నటి అగ్నిమిత్ర పాల్ ధ్వజమెత్తారు. టీఎంసీ నాయకులు అందుకే అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. సొంత టీఎంసీ పార్టీ కూడా మదన్ మిత్రా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సూచించారు. మిత్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత ఇతిహాసాల గురించి తప్పుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదన్నారు. చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
బీజేపీతో టచ్లో 45మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేతల మాటలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత నిశిత్ ప్రమానిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన 40-45 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కీలక పరిణాణాలు చోటు చేసుకోనున్నాయని తెలిపారు. అంతకు ముందు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరెస్ట్ కాబోతోందని, 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. కూచ్ బెహర్లో నిర్వహించిన ఓ కార్యక్రమం వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్. తృణమూల్ కాంగ్రెస్ పునాదులు బలహీనంగా మారాయని ఆరోపించారు. ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునాదులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇసుక మేటల వలే ఉన్నాయి. పేకమేడలా ఎప్పుడైనా కూలిపోవచ్చు. అది మాకు అర్థమవుతోంది. బెంగాల్ ప్రజలకు సైతం తెలుసు. 40 నుంచి 45 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
మమతకు మరో షాక్.. స్కూల్ జాబ్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యే మానిక్ భట్టాచర్యను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. టీచర్స్ జాబ్ స్కాంలో భాగంగా సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఈడీ.. ఉదయం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసింది. ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా నగదు దొరికిన క్రమంలో ఆయనను అరెస్ట్ చేసింది. పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ వాట్సాప్ చాట్ను పరిశీలించగా ఈ కేసులో లంచాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే భట్టాచార్యపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ తర్వాత భట్టాచార్యను వైద్య పరీక్షల నిమిత్తం తరలించి.. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. పార్థా ఛటర్జీ అరెస్ట్ తర్వాత మానిక్ భట్టాచార్య పేరు బయటకు రావటంతో.. ఆయనను బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఇదీ చదవండి: Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్ -
‘నేను మగవాడిని.. నా శరీరాన్ని ఈడీ, సీబీఐ తాకలేవు’
కోల్కతా: మహిళా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఇటీవల పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని.. సువేందు అధికారిని వ్యాన్లోకి ఎక్కిస్తున్న తరుణంలో మహిళా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మహిళా అధికారి. నన్ను టచ్ చేయొద్దు.. పురుష సిబ్బందిని పిలవండి’ అని వారించారు. తాజాగా సువేందు అధికారి వ్యాఖ్యలకు టీఎంసీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత ఉన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు. చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం కాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘నబానా ఛలో’ పేరుతో బీజేపీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓ మహిళా పోలీస్ తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మహిళా పోలీసులు అతన్ని వ్యాన్లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను టచ్ చేయొద్దు’ అని వారించారు. అనంతరం ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళా కళ్లల్లో దుర్గామాతను చూస్తానని, మహిళలంటే ఎంతో గౌరవమని తెలిపారు. -
ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ‘భారత్ కూడా శ్రీలంకలాగే.. మోదీకి అదే గతి’
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకీ పడుతుందని అన్నారు. ఆయనలాగే మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని పేర్కొన్నారు. ఆదివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇద్రిస్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులను గమనిస్తే మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారి మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని ఇద్రిస్ అలీ జోస్యం చెప్పారు. #WATCH | West Bengal: Whatever happened with the President of Sri Lanka, will happen with PM Modi here. Looking at the things in India, PM Modi is a total failure...it will be even worse here. PM Modi will also resign and flee: TMC MLA Idris Ali in Kolkata pic.twitter.com/ailsU5jfgm — ANI (@ANI) July 10, 2022 కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ కూడా శనివారం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితులు భారత్లో కూడా కన్పిస్తున్నాయని అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయారని వార్తలు వచ్చాక ఉదిత్ రాజ్ ఈమేరకు మాట్లాడారు. రాహుల్ గాంధీ సైతం మే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. శ్రీలంకతో భారత్ను పోల్చిన ఆయన.. మోదీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోందని ధ్వజమెత్తారు. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయే కారణమంటూ ఆందోళనకారులు శనివారం ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఎవరికంటా పడకుండా పారిపోయారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటికి కూడా నిరసనకారులు నిప్పుపెట్టారు. ఇద్దరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారు పదవుల నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
కరోనా కాటుకు మరో ఎమ్మెల్యే బలి
కోల్కతా : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు.. పేదోడు నుంచి పెద్దోడు దాకా అందరినీ పట్టి పీడిస్తోంది. కోవిడ్ ధాటికి తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా బారినపడి పశ్చిమబెంగాల్లో మరో ఎమ్మెల్యే మృతి చెందారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్(74) సోమవారం కరోనాతో మరణించారు. (చదవండి : దేశంలో 26 లక్షలు దాటిన కరోనా కేసులు) ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సమరేష్ దాస్ కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా విపత్తుల సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను అందించారు. ఈ క్రమంలో ఆయనకు జూలై 18న కరోనా సోకింది. సాల్ట్ లేక్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమరేస్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో కరోనాతో మరణించిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు జూన్లో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)కరోనాతో మృతి చెందారు. ఎమ్మెల్యే సమరేష్ దాస్ మృతి తీరని లోటని, ఆయనకు సీఎం మమతాబెనర్జీ సంతాపం తెలిపారు. కాగా, రాష్ట్రంలో ప్రతిరోజూ 3 వేలకు పైగా కొత్తగా వైరస్ లక్షణాలు గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ 1.15 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. (చదవండి : తెలంగాణలో 894 పాజిటివ్, 10 మంది మృతి) -
బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు
కోల్కతా: బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని పలువురు టీఎంసీ నేతలు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారని, ఆ పార్టీ విధానాలతో వారు విసుగుచెందారని శనివారం ఆయన విలేకరులకు తెలిపారు. పలువురు టీఎంసీ కౌన్సిలర్లు బీజేపీలోకి వచ్చి, వెంటనే తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ముకుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున బీజేపీలో చేరారు. -
‘మా పార్టీలో ఊపిరాడటంలేదు.. బీజేపీలో చేరతా’
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుభ్రాంగ్షు రాయ్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కొద్ది రోజులకే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాంగ్షు రాయ్.. గర ఎన్నికల్లో టీఎంసీ తరఫున బిజ్పూర్ నుంచి గెలుపొందాడు. కానీ కొన్ని రోజుల క్రితం పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో.. ఆరేళ్ల పాటు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు సుభ్రాంగ్షు రాయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీఎంసీలో చేరుతున్నప్పుడే మా నాన్న నన్ను జాగ్రత్తగా ఉండు. నీ మీద దాడి చేయవచ్చు.. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించవచ్చు అని హెచ్చరించారు. టీఎంసీలో ఉన్నన్ని రోజులు నాకు ఊపిరాడనట్లు అనిపించింది. పార్టీ నుంచి బయటకు వచ్చాక స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాను. త్వరలోనే కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను. రెండు మూడు రోజుల్లో బీజేపీలో చేరతాను. టీఎంసీలో చాలా మంది నాయకులు నాలానే భావిస్తున్నారు’ అని తెలిపారు. సుభ్రాంగ్షు రాయ్ బిజ్పూర్ నుంచి రెండు సార్లు టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. -
జాతీయ గీతానికి ఎమ్మెల్యే అవమానం
ఆమె సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే. కానీ జాతీయగీతం వస్తున్న సమయంలో ఫోన్లో మాట్లాడుతూ కెమెరాకు దొరికేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని హౌరాలో చోటుచేసుకుంది. వైశాలి దాల్మియా టీఎంసీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హౌరాలో జరిగిన ఒక క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. అయితే అక్కడ జాతీయ గీతం ఆలపిస్తుండగా.. సెల్ఫోన్లో మాట్లాడుతూ కెమెరాకు దొరికేశారు. అంతలో కెమెరాలు అన్నీ తనవైపే తిరగడాన్ని గమనించి.. వెంటనే కాల్ కట్ చేశారు. ఆ సమయంలో కార్యక్రమానికి హాజరైన పలువురు పోలీసు అధికారులు, ఇతరులు అంతా గుండెల మీద చేతులు పెట్టుకుని గట్టిగా జాతీయ గీతం ఆలపిస్తూ కనిపించారు. జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం, జాతీయ గీతం వస్తున్నప్పుడు దాన్ని డిస్ట్రబ్ చేసేలా ఎవరైనా ప్రవర్తిస్తే, వారిని జైలుకు పంపొచ్చు. మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో కూడా తప్పనిసరిగా జాతీయ గీతం ఆలపించాలని, ఆ సమయంలో ప్రేక్షకులంతా కూడా తప్పనిసరిగా నిలబడి ఉండాలని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కేరళలో ఓ సినిమా ప్రదర్శన సందర్భంగా ఇలా నిలబడనందుకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళకు చెందిన 12 మంది ప్రతినిధులను అరెస్టు చేశారు కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
జాతీయ గీతానికి ఎమ్మెల్యే అవమానం