TMC supporters
-
కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు
-
కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు
కోల్‌కతా: ప్రముఖ నటుడు, గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కాన్వాయ్‌పై తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుప్రియోతో పాటు ఆయన అనుచరులు ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఓ రాయి తన ఛాతీపై పడిందని, గాయమైందని మంత్రి చెప్పారు. బుధవారం పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మలోయ్ ఘటక్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని సుప్రియో ఆరోపించారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పారు. నిరసనకారుల గుంపులోంచి ఓ పెద్ద రాయి విసిరారని సుప్రియో తెలిపారు. కొందరు ఈ ఘటనను వీడియో తీశారని పేర్కొన్నారు. ఆందోళనకారులు మంత్రి కారును ధ్వంసం చేశారు. అక్రమంగా కబేళాలను నడుపుతున్నారని, పరిశీలించేందుకు వెళ్లగా దాడిచేసినట్టు తెలిపారు. సుప్రియో అసన్సోల్ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
రెచ్చిపోయిన తృణమూల్ కార్యకర్తలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయఢంకా మోగించడంతో పార్టీ కార్యక్రతలు సంబరాలు చేసుకున్నారు. అయితే సంబరాలు కాస్తా శ్రుతిమించి హింసకు దారి తీసింది. ఆసన్సోల్లో సీపీఎం కార్యాలయంపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయం లోపలకు చొచ్చుకువెళ్లి ఫర్నిచర్, ఫైళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా కార్యాలయానికే నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికార పీఠం సొంతం చేసుకుంది. కాగా పశ్చిమ బెంగాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అలాగే కేరళలో ప్రజలు అభివృద్ధికి ఓటేశారని ఆయన అన్నారు. తీర్పునిచ్చిన కేరళ ప్రజలకు తాను సెల్యూట్ చేస్తున్నానని ఏచూరి తెలిపారు.