రెచ్చిపోయిన తృణమూల్ కార్యకర్తలు | Celebrations turn violent in Asansol (WB): TMC supporters allegedly vandalize CPI(M) office | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన తృణమూల్ కార్యకర్తలు

Published Thu, May 19 2016 4:44 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

రెచ్చిపోయిన తృణమూల్ కార్యకర్తలు - Sakshi

రెచ్చిపోయిన తృణమూల్ కార్యకర్తలు

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయఢంకా మోగించడంతో పార్టీ కార్యక్రతలు సంబరాలు చేసుకున్నారు. అయితే సంబరాలు కాస్తా శ్రుతిమించి హింసకు దారి తీసింది. ఆసన్సోల్లో సీపీఎం కార్యాలయంపై  తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు.

కార్యాలయం లోపలకు చొచ్చుకువెళ్లి ఫర్నిచర్, ఫైళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా కార్యాలయానికే నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికార పీఠం సొంతం చేసుకుంది.

కాగా పశ్చిమ బెంగాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అలాగే కేరళలో ప్రజలు అభివృద్ధికి ఓటేశారని ఆయన అన్నారు. తీర్పునిచ్చిన కేరళ ప్రజలకు తాను సెల్యూట్  చేస్తున్నానని ఏచూరి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement