tragedies
-
కీలక మైలు రాళ్లు, అనేక విషాదాలు:170 ఏళ్ళ రైల్వే ఘన చరిత్ర ఇది!
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన వివరాలు ఇస్తూనే భారత రైల్వేల చరిత్రను, దాని విశిష్ఠతను ఈ ప్రపంచ వార్తాసంస్థలు అందరికీ తెలియజేస్తున్నాయి. బ్రిటిష్ వారి పాలనలోని భారతదేశంలో 1853లో అంటే 170 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన భారత రైల్వే వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి సాధించింది. దేశంలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చడమేగాక, ఇతర సాంప్రదాయ సరకు రవాణా పద్ధతులతో పోల్చితే రైల్వేలు అంతే సామర్ధ్యంతో, ఇంకాస్త చౌకగా వస్తు రవాణా చేయడం ద్వారా భారత ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. 1991 నుంచీ దేశ ఆర్థికవ్యవస్థతో పాటే రోడ్డు మార్గాలు విపరీతంగా విస్తరించినా గాని పెరుగుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భారత రైల్వేలు వృద్ధిచెందాయేగాని వెనుకబడ లేదు, భారతదేశంలో నలుమూలలకూ విస్తరించిన భారత రైల్వేల రైలు పట్టాల వ్యవస్థ మ్తొత్తం విస్తీర్ణం 2022 మార్చి 31 నాటికి 1,28,305 కిలోమీటర్లు కాగా, రైళ్లు నడిచే పట్టాల (రైలు ట్రాక్) పొడవు 1,02,831 కి.మీ. అందులో అన్ని రైలు మార్గాల రూట్లు కలిపి చూస్తే వాటి మొత్తం పొడవు 68,043 కి.మీ. 1853లో మొదలైన భారత రైల్యేల ప్రయాణం వేగంగా ముందుకు సాగడంతో 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాల స్థాయికి చేరింది. దక్షిణాది నగరం మద్రాసులోనే కదిలిన మొదటి (గ్రానైట్ లోడుతో) భారత రైలు! 1953 ఏప్రిల్ 16న భారత రైల్వేల మొదటి రైలు బొంబాయి నుంచి ఠాణె మధ్య లాంఛనంగా పట్టాలపై నడవడంతో ప్రారంభోత్సవం జరిగిందని చెబుతారు. నాటి నగరం బొంబాయితో సమీపంలోని ఠాణె, కల్యాణ్ వంటి ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా కలపాలనే ఆలోచన 1843లో బొంబాయి ప్రభుత్వ చీఫ్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్ బొంబాయి సమీపంలోని భాండప్ ప్రాంతానికి వచ్చినప్పుడు కలిగింది. వెంటనే రైలు మార్గాల నిర్మాణ ప్రయత్నాలు మొదలబెట్టడంతో ఈ ఆలోచన పదేళ్లకు వాస్తవ రూపం దాల్చింది. 21 మైళ్ల దూరం ఉన్న ఈ రూటు మొదటి రైలులోని 14 బోగీల్లో దాదాపు 400 మంది అతిధులు బోరీ బందర్ లో రైలెక్కి ప్రయాణించారు. తర్వాత, తూర్పు తీరంలోని బెంగాల్ లో కలకత్తా నగరం సమీపంలోని హౌరా (బెంగాలీలో హావ్‌డా) నుంచి హుగ్లీకి మొదటి ప్రయాణికుల రైలు 1954 ఆగస్ట్ 15న బయల్దేరింది. ఈ రెండు కొత్త రైల్వే స్టేషన్ల మధ్య దూరం 24 మైళ్లు. భారత ఉపఖండం తూర్పు భాగానికి మొదటి రైలు మార్గాన్ని ఈస్టిండియన్ రైల్వే సంస్థ ఇలా ప్రారంభించింది. తర్వాత దక్షిణాదిలో మొదటి రైల్వే లైను ప్రారంభించారు. 1856 జులై 1న మద్రాస్ రైల్వే కంపెనీ మద్రాసు నగరంలోని వ్యాసరపాడి జీవ నిలయం (వెయసరపాండి), వాలాజారోడ్డు మధ్య మొదటి ప్రయాణికుల రైలు నడిపింది. ఈ రైలు మార్గం దూరం 63 కి.మీ. అయితే, దేశంలో మొదటి రైలు 1853లో నాటి బొంబాయి నగరంలో బయల్దేరిందని చెబుతారు గాని అసలు రైలు అనేది రైలు మార్గంపై నడించింది మాత్రం నాటి మద్రాసు నగర ప్రాంతంలోనే. 1837లోనే నగరంలోని రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట్ బ్రిడ్జికి మొదటి రైలును రెడ్ హిల్ రైల్వే సంస్థ నడిపింది. కానీ ఇది ప్రయాణికుల రైలు కాదు. ప్రఖ్యాత ఈస్టిండియా కంపెనీ ఇంజినీరు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు గ్రానైట్ రవాణా చేయడానికి ఈ రైలును తయారుచేశాడు. గ్రానైట్ రవాణాతో మొదలైన గూడ్సురైళ్లే భారతరైల్వేలకు తెచ్చేది 74శాతం ఆదాయం పైన వివరించినట్టు మద్రాసు నగరంలో గ్రానైట్ రాయి రవాణాతో మొదలైన భారత రైల్వేల గూడ్సు రైళ్లు 1837 నుంచీ అనూహ్య రీతిలో విస్తరించాయి. ఫలితంగా ప్రస్తుతం భారత రైల్వేల ఆదాయంలో 74 శాతం సరకు రవాణా గూడ్సు రైళ్ల వ్యవస్థ ద్వారానే ప్రభుత్వానికి వస్తోంది. ఆసక్తికర అంశం ఏమంటే–చివరికి ఆటోమొబైల్ కంపెనీలు సైతం తమ వాహనాలను గూడ్సు రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపుతున్నాయి. 2027 నాటికి ఇలాంటి రవాణాను 30శాతం పెంచాలని ఈ ఆటోమొబైల్ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న భారత రైల్వేలు 2019 నుంచీ మరింత వేగంగతో ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేసే ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా గత ఐదేళ్లుగా పత్రికల మొదటి పేజీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది వందే భారత్ యుగమని ప్రజలు ఆనందిస్తున్న సమయంలో ఒడిశాలో శుక్రవారం జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. అయితే, భారత రైల్వేలు ఇలాంటి అనేక సవాళ్లను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డాయి. ప్రతి దుర్ఘటన తర్వాతా ఎన్నో పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఒడిశా ప్రమాదం నుంచి కూడా ఎంతో నేర్చుకుని భారత రైల్వేలు శరవేగంతో ముందుకు పరుగెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు
అనంతగిరి(అరకులోయ): మన్యంలోని ప్రకృతి రమణీయత పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక్కడి సహజసిద్ధ అందాలను ఆస్వాదించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలను సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలను తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవు తున్నాయి. చదవండి: అమ్మ బాబోయ్ పులస.. అంత రేటా? ఈ నేపథ్యంలో మన్యంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జలపాతాల వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. కొంత మంది సరదాకు ఈతకు దిగి, మరికొంతమంది ప్రమాదవశాత్తూ జారిపడి, మరికొంత మంది సెల్ఫీలు, ఫొటోలు అంటూ అజాగ్రత్త వ్యవహరిస్తూ.. మృత్యువాతపడుతున్నారు. కన్నవాళ్లకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నారు. ఆకట్టుకునే జలపాతాల వెనుక అంతులేని విషాదగాథలెన్నో ఉన్నాయి. సరియా జలపాతం(అనంతగిరి) సరియా జలపాతం 2015లో బహ్య ప్రపంచానికి పరిచయం అయింది. ఈ జలపాతం వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇందులో 15 మందికి పైగా యువతే ఉన్నారు. కొంతమంది అజాగ్రత్త కారణంగా.. మరికొంతమంది ఈత రాక ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సరియా జలపాతం ఉరకలేస్తూ.. ప్రవహిస్తోంది. ఇక్కడకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోని స్థానికుల సూచనలు, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను చదివి అవగాహన పెంపొదించుకోవాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించవచ్చు. డుడుమ (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు) ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతం సుమారు 2,600 అడుగుల ఎత్తుల్లోంచి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు ఆరుగురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ జారిపడి మృత్యువాత పడ్డారు. హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినా.. పర్యాటకులు పెడచెవిన పెడుతున్నారు. పొల్లూరు(మోతుగూడెం) పొల్లూరు జలపాతం సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రాస్. అల్లరి నరేష్ నటించిన దొంగలబండి, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. చూసేందుకు జలపాతం అందంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తూ కొంత మంది, ఈతకు దిగి మరికొంత మంది మరణించారు. గాదిగుమ్మి(కొయ్యూరు) చూసేందుకు గాదిగుమ్మి జలపాతం అందంగా కనిపిస్తుంది. అందులో దిగితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 40 మందిపైగా పర్యాటకులు మృతి చెందారు. దూరం నుంచే జలపాతం అందాలను వీక్షిస్తే ప్రమాదాలు జరగావు. యువతా.. జాగ్రత్త జలపాతాలను తిలకించే క్రమంలో యువత ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వాళ్లే దూకుడుగా వ్యవహరించి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి.. ఈత సరదాలు.. సెలీ్ఫలు అంటూ అక్కడ పరిస్థితులపై అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబానికి కన్నీరు మిగులుస్తున్నారు. కుటుంబం తమపై పెట్టుకున్న ఆశలను తుంచేసి.. తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. వర్షాలకు రాళ్లు నాచుపట్టి ప్రమాదకరంగా ఉంటాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో జలపాతాలకు దూరంగా ఉండడమే మంచిదని అధికారులు, స్థానికులు సూచిస్తున్నారు. చాపరాయి(డుంబ్రిగుడ) చాపరాయికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అరకు–పాడేరు ప్రధాన రహదారి అనుకుని ఉండడంతో పాటు అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, పర్యాటకులు చాపరాయి అందాలను తిలకిస్తుంటారు. చాపరాయి వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు సుమారు 25 మందిపైగా మృత్యువాత పడ్డారు. ఈతకు దిగి ప్రమాదవశాత్తూ సొరంగంలోకి వెళ్లడంతో మృత్యువాత పడేవారు. అధికారులు చొరవ.. టెండర్‌దారుల సహకారంతో సొరంగం రాయిని బ్లాస్టింగ్ చేయడంలో ప్రమాదాలు తప్పాయి. అయినప్పటికీ అప్రమత్తత అవసరం. గుడ్డిగుమ్మి(హుకుంపేట) హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీ జెండాకొండ మార్గమధ్యలో ఉన్న గుడ్డిగుమ్మి జలపాతం బహ్యప్రపంచానికి పరిచయమై ఏడాదే అయింది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మత్యువాతపడ్డారు. సరదాగా ఈతకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వీళ్లంతా హుకుంపేట మండలానికి చెందిన వాళ్లే. దాలమ్మతల్లి(సీలేరు) సీలేరు దాలమ్మతల్లి జలపాతం 100 అడుగులు ఎత్తుల్లోంచి జాలువారుతుంది. గుడి బయట నుంచి జలపాతం తిలకిస్తే ప్రమాదాలు జరగవు. జలపాతం పక్కనున్న కొండపై సెలీ్ఫలు, ఫొటోలు దిగేందుకు వెళ్లి 20పైగా మృత్యువాతపడ్డారు. ఏటా ఇద్దరు, ముగ్గురు ఇక్కడ ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ►పర్యాటకులు ఎట్టి పరిస్థితిలోనూ జలపాతం కొండలపై ఎక్కడం చేయకూడదు. ఎందుకంటే ఆ బండరాళ్లపై నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల అవి నాచుపట్టి ఉంటాయి. వాటిపై ఎక్కితే జారిపడి పోయే ప్రమాదం ఉంది. ►సెల్ఫీల కోసం జలపాతం లోపల ఉన్నా ఎత్తైన బండలను ఎక్కకూడదు. ►నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న ప్రదేశంలో స్నానాలు చేయకూడదు. ►జలపాతాలకు వెళ్తున్న సమయంలో ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి. ►ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సహసించద్దు. ►వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడమే మేలు. ►జలపాతాలకు ఒక్కరుగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం జలపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. యువత జలపాతాల వద్దకు వెళుతూ దూకుడుగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హెచ్చరికలు ఉన్నా పట్టించుకోవడం లేదు. దూరంగా జలపాతాల అందాలు వీక్షించడమే మేలు. – కరక రాము, ఎస్ఐ, అనంతగిరి -
Mahabubnagar: గోడ కూలి ఐదుగురి దుర్మరణం
సాక్షి, అలంపూర్(మహబూబ్‌నగర్): ఆ కుటుంబ సభ్యులు అప్పటివరకు వివాహ సంబరాల్లో ఆనందంగా గడిపారు. బంధుమిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకున్నారు. రాత్రి సహపంక్తి భోజనం చేసి ఇంటికెళ్లారు. ఆ తర్వాత తల్లిదండ్రులు.. వారి ముగ్గురు పిల్లలు శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిపోయారు. అంతవరకు అందరి మధ్యన ఉన్న ఆ కుటుంబాన్ని గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన హరిజన మోష (35), శాంతమ్మ (33) దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో కుమారులు చరణ్ (10), రాము (8), తేజ (7), చిన్న, కుమార్తె స్నేహ ఉన్నారు. పూరి గుడిసెలో ఈ కుటుంబం నివాసముంటోంది. అర ఎకరం భూమి ఉన్నా సాగు చేసుకోవడానికి స్తోమత లేకపోవడంతో భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఇటుక బట్టీల్లో పనిచేసేవారు. రెండు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి ఇక్కడే సీడ్ పత్తి పనులకు వెళ్తున్నారు. తాముంటున్న గుడిసెలోనే రెండు గదులుగా చేసుకునేందుకు ఆరడుగుల ఎత్తుతో ఇటుక గోడ నిర్మించుకున్నారు. ఆ గోడ పటిష్టంగా లేకపోవడం, దానికితోడు గుడిసెకు చుట్టూ ఉన్న బండల సందులోంచి వర్షపు నీరు రావడంతో మెత్తబడింది. రాత్రి అక్కడే నిద్రిస్తున్న కుటుంబసభ్యులపై గోడ కూలి పడింది. తల్లిదండ్రులతోపాటు చరణ్, రాము, తేజ సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు చిన్నారులు బతికి బయటపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు జరిగింది. గోడ కూలిన సమయంలో పెద్దగా పిడుగు శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు ప్రమాదాన్ని గుర్తించలేక పోయారు. ఆదివారం ఉదయం ఆరు గంటలు దాటినా నల్లా నీటిని పట్టుకునేందుకు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలవారు లోపలికి వెళ్లారు. కూలిన గోడ కింద అందరిని చూసి అవాక్కయ్యారు. శిథిలాలను తొలగించగా అందులో ఐదుగురు అప్పటికే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో స్నేహ, చిన్నను 108 వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రఘురాంశర్మ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందిన మోషకు అన్న ప్రేమరాజు, తమ్ముడు రాజు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడటంతో కొత్తపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం రాత్రి కాలనీలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్లో మోష కుటుంబం పాల్గొంది. అందరితో కలిసి భోజనం చేసి 10.30 గంటల తర్వాత ఇంటికి చేరుకుని వారు నిద్రపోయినట్లు స్థానికులు చెప్పారు. మరికొన్ని గంటలు ఇక్కడే ఉండి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని బంధువులు, కాలనీవాసులు కన్నీరు మున్నీరయ్యారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి ఈ ఘటనపై సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, వైద్య, విద్య సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. -
ఈ విజయుడు ఆపద్బాంధవుడు!
ఆదర్శం కొన్ని విషాదాలు విషాదాలకు మాత్రమే పరిమితమైపోతాయి. కొన్ని విషాదాలు మాత్రం...సరికొత్త పనులకు శ్రీకారం చుట్టేలా చేస్తాయి. ముంబాయిలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసే విజయ్ ఠాకూర్ తాను ట్యాక్సీ డ్రైవర్ కావాలని ఎప్పుడు అనుకొని ఉండరు. అవుతానని కూడా ఊహించి ఉండరు. విజయ్ జీవితంలో జరిగిన ఒక విషాదసంఘటన ఆయన చేస్తున్న వృత్తినే మార్చేసింది. 1982లో...మూడు నెలల గర్భిణి అయిన విజయ్ భార్య సరోజ్‌కు పొత్తికడుపులో నొప్పి మొదలైంది. తెల్లవారుజామున రెండు గంటల సమయం. భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి విజయ్‌కి ఒక్క ట్యాక్సీ కూడా కనిపించలేదు. ఇక చేసేదేమిలేక అందేరి రైల్వేస్టేషన్‌కు వెళ్లి చాలా ఎక్కువ ఛార్జీ చెల్లించి ఒక ట్యాక్సీని మాట్లాడుకొని భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో సరోజ్ గర్భం పోయింది. ఈ విషాదం విజయ్‌ని కుదిపేసింది. ‘‘నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు’’ అనుకున్నారు బలంగా మనసులో. తాను చేస్తున్న ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న విజయ్ ఆ తరువాత ఒక ఫియట్ కారు కొనుగోలు చేసి ట్యాక్సీ పరిమిట్ తెచ్చుకున్నారు. పేద రోగుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా తన ట్యాక్సీలో హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. తనకు ఏ సమయంలో ఫోన్ చేసినా ఆఘమేఘాల మీద బయలుదేరి వెళతారు విజయ్ ఠాకూర్. భద్రతతో కూడిన వైట్-కాలర్ ఉద్యోగాన్ని వదిలి విజయ్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆయన మంచితనాన్ని కొందరు వేనోళ్ల పొగిడారు. ‘నాలుగు రాళ్లు వెనకేసుకొని శేషజీవితాన్ని హాయిగా గడపకుండా ఎందుకీ కష్టం?’ అన్నవాళ్లే ఎక్కువమంది. ‘‘నా నిర్ణయం పట్ల ఎప్పుడూ ఒక్క నిమిషం కూడా పశ్చాత్తాపపడలేదు’’ అంటారు విజయ్. ‘‘ఫైర్‌ఫైటర్‌లా నేను ఎప్పుడూ ఎలార్ట్గా ఉంటాను’’ అని చెప్పే విజయ్ అవసరంలో, ఆపదలో ఉన్నవారి నుంచి కాల్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళతారు. ప్రైవేట్ అంబులెన్స్ ఛార్జీలు అందుబాటు ధరల్లో లేకపోవడం, ప్రభుత్వ అంబులెన్స్ సర్వీస్ అరుదుగా మాత్రమే అందుబాటులో ఉండడం కారణంగా తనలాంటి వారి సేవలు అవసరమవుతాయి అంటారు విజయ్. ఒకరోజు తెల్లవారుజామున రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదానికి గురైన ఒక కారును చూశారు విజయ్. ఆ కారులో ఎనిమిది నెలల కూతురితో ఉన్న దంపతులు కనిపించారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తండ్రి, పసిబిడ్డలు ప్రాణాలతో బయటపడ్డా దురదృష్టవశాత్తు తల్లి మాత్రం చనిపోయింది. ఆమెకు చెందిన రెండు లక్షల విలువైన నగలను వైద్యులు విజయ్‌కు అందించారు. వాటిని హాస్పిటల్‌కు వచ్చిన బంధువులకు అప్పజెప్పారు విజయ్. విజయ్‌కి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికి వాళ్లు సిద్ధపడినా ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటే పోతే...విజయ్‌లోని మంచితన గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉదహరణలు ఉన్నాయి. ‘‘డబ్బు కోసం, ప్రచారం కోసం ఏ పనీ చేయను. నేను సహాయపడినవారు క్షేమంగా ఉంటే చాలు...ఆ తృప్తికి మించిన విలువ ఏముంటుంది?’’ అంటారు విజయ్. ఎప్పుడు ఏ అవసరం ముంచుకొచ్చినా అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా ‘నేనున్నాను’ అంటూ తన ట్యాక్సీతో ప్రత్యక్షమై పేదల పాలిట ఆపద్బాంధవుడు అనిపించుకుంటున్నారు విజయ్ ఠాకూర్. -
2014: విషాదాలు.. ప్రమాదాలు
2014వ సంవత్సరం.. ఎందరో జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, మహిళలపై దారుణాలు వంటి ఘటనలు అంతులేని విషాదాన్ని నింపాయి. ఎందరో జీవితాల్ని కడతేర్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో భయానక సంఘటనలు జరిగాయి. ఈ ఏడాదిలో పీడకలను మిగిల్చిన విషాద ఘటనల గురించి రౌండప్. కూలిన మలేషియా విమానం: 295 మంది మృతి మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం జూలై 17న ఉక్రెయిన్‌లో కుప్పకూలింది. అమెరికాలోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న ఈ విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌లో ఉండగా కూలిపోయింది. ఈ విమానంలో 280 మంది ప్రయాణికులతో పాటు, 15 మంది సిబ్బంది మృతి చెందారు. పాక్‌లో ఉగ్ర ఘాతుకం పెషావర్ ఉగ్రవాద ఘటన ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ఉగ్రవాదులు అభంశుభం తెలియని చిన్నారులను పొట్టనపెట్టుకున్నారు. సైన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి పిల్లలను లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. డిసెంబర్ 16న పెషావర్ ఆర్మీ స్కూల్లో ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో 132 మంది చిన్నారులతో సహా మొత్తం 141 మంది చనిపోయారు. ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసి ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసిలా మారిపోయి ఏడుగురు సొంత బిడ్డల్ని ఓ మహిళ పొడిచి చంపింది. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా(37) డిసెంబర్ 20న తన ఏడుగురు పిల్లలతో పాటు మేనకోడలైన మరో చిన్నారినీ దారుణంగా హతమార్చింది. చనిపోయిన పిల్లల్లో 14, 12, 11, 2 ఏళ్ల వయస్సున్న నలుగురు బాలికలు, 9, 8, 6, 5 సంవత్సరాల మగ పిల్లలు ఉన్నారు. వీడని అనుహ్య మర్డర్ మిస్టరీ కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ అనుహ్య ఎస్తార్ మర్డర్ ఇప్పటికీ వీడలేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె 2014 జనవరి 4న విజయవాడ నుంచి ముంబయి బయల్దేరింది. జనవరి 5న ముంబై లోక్మాన్య తిలక్ టర్మినల్లో దిగిన అనూహ్య హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై కంజుమార్గ్ సముద్ర తీర ప్రాంతంలో జనవరి 16న అనూహ్య డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. నాసిక్ వాసి చంద్రభాన్ అనే పాత నేరస్తుడు అనూహ్యను అత్యంత దారుణంగా డబ్బుల కోసం హత్య చేసినట్లు తేల్చారు. అయితే పోలీసులు చెప్పినదానికి, నిందితుడు వెల్లడించిన విషయాలకు పొంతన కుదరలేదు. అయినా ముంబయి పోలీసులు కేసును క్లోజ్ చేశారు. బియాస్ విషాదం హైదరాబాద్‌కు చెందిన బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు విద్యార్థులు ఈ ఏడాది జూన్ మొదటి వారంలో విహార యాత్రకు వెళ్లారు. 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్‌నదిపై నున్న లార్జీ డ్యామ్ వరద ప్రవాహంలో కోట్టుకుపోయి 24 మంది విద్యార్థులు (ఒక టూర్ ఆపరేటర్ కూడా) మృత్యువాత పడ్డారు. చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలి 61మంది మృతి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి కూలి పనులు చేసుకుంటున్న 61 మంది అసువులు బాశారు. చెన్నైలో జూలై 4వ తేదీన నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరణించినవారిలో ఎక్కువమంది తెలుగువాళ్లే. వీరంతా విజయనగరం జిల్లాకు చెందిన వలస కూలీలే. . వారం రోజుల పాటు 'ఆపరేషన్ రక్ష' పేరిట శిథిలాల తొలగింపు చేపట్టి.. మృతదేహాలతో పాటు, బతికున్నవారిని బయటకు తీశారు. మాసాయిపేట రైలు ప్రమాదం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేటు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు 25మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. జూలై 24వ తేదీన విద్యార్థుల్ని తీసుకు వెళుతున్న కాకతీయ టెక్నో స్కూల్ బస్సుని నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వణికించిన స్నేక్ గ్యాంగ్... స్నేక్ గ్యాంగ్ . అంటే చాలు భయంతో చెమటలు పట్టేస్తాయి. రాక్షసక్రీడ కోసం అమ్మాయిలతో ఈ రేపిస్టులు ప్రవర్తించే తీరు, వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాములను యువతులపై విసరడం, భయంతో బిక్కచచ్చిపోయిన ఆమెను వివస్త్రను వీడియోలు తీస్తూ, సామూహిక అత్యాచారానికి పాల్పడటం. ఇలా పాతకాలం సినిమాను తలపించే యదార్ధ ఘటన 2014 సంవత్సరంలో హైదరాబాద్‌కు మాయనిమచ్చ. జూలై 31న పహాడీషరీఫ్ షాయిన్ నగర్లో స్నేక్ ముఠా సభ్యులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హదూద్ తుఫాన్ విలయం హుదూద్ తుపాను రూపంలో జలరక్కసి ఉత్తరాంధ్రను కాటేసింది. ప్రచండ వేగంతో తాకిన తుపాను ధాటికి విశాఖ నగరం విలవిలలాడింది. ఉక్కునగరం మూగబోయింది. అందాల సాగరతీరం తుడుచుకుపోయింది. అక్టోబర్ 12న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సంభవించి హుదూద్ తుపాను ధాటికి 60మంది మృతి చెందారు. హుదూద్ తుపాను వల్ల ఉత్తరాంధ్రకు దాదాపు లక్షకోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. జమ్మూ కాశ్మీర్ వరదలు, 277మంది మృతి జమ్మూకాశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో 277 మంది మృతి చెందారు. గత 112 ఏళ్లలో కనీవినీ ఎరగని రీతిలో భారీ వరదలు ముంచెత్తాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలతో పాటు ప్రధాన నదులన్నీ పోటెత్తడంతో వరదలు కారణంగా సుమారు 2,600 గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాంతో సాంకేతిక, సమాచార వ్యవస్థ పని చేయడంలేదు. కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట మధ్యప్రదేశ్ సాత్నా జిల్లా చిత్రకూట్‌లోని కంఠానాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. సెప్టెంబర్ 25న జరిగిన ఈ దుర్ఘటనలో పదిమంది భక్తులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బుర్ద్వాన్ పేలుళ్లు పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంట్లో అక్టోబర్ 2వ తేదీన బాంబు పేలుడు సంభవించి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ కేసులో కీలక నిందితుడు షహనూర్ ఆలంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. రావణ దహనంలో తొక్కిసలాట: 32మంది మృతి బీహార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో అక్టోబర్ 4వ తేదీన రావణ దహనం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 32మంది మృతి చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం అమెరికాకు చెందిన ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీస్ 'ఉబర్' పై ఢిల్లీలో నిషేధం విధించారు. డిసెంబర్ 5వ తేదీన ఉబెర్ సంస్థకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ ... 27 ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు శివకుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ దారుణంపై నిరసనలు వెల్లువెత్తడంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఉబెర్ సేవలపై నిషేధం విధించారు. అస్సాం నరమేధం... అస్సాంలో బోడో తీవ్రవాదుల నరమేధం సృష్టించారు. డిసెంబర్ 24న సోనిత్ పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో ఆదివాసీ గ్రామాలపై మెరుపు దాడులు చేశారు. ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 89కి చేరింది. మరోవైపు మహిళలు అని కనికరించకుండా బోడో తీవ్రవాదులు విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరిపి హింసాకాండకు పాల్పడ్డారు.