Trainee IAS Officers
-
సీఎం జగన్‌ను కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ క్యాడర్‌కు చెందిన 10 మంది ఐఏఎస్ ప్రొబేషనర్స్ (2022 బ్యాచ్) సోమవారం కలిశారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లకు సీఎం మార్గనిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బి.స్మరణ్ రాజ్, బి.సహదిత్ వెంకట్ త్రివినాగ్, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, కల్పశ్రీ కే.ఆర్, కుషల్ జైన్, మౌర్య భరద్వాజ్, రాఘవేంద్ర మీనా, సౌర్యమన్ పటేల్, తిరుమణి శ్రీ పూజ, వి.సంజనా సింహా ఉన్నారు. చదవండి: ‘నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను.. మీరు చాలా సాయం చేశారు’ -
సీఎం వైఎస్ జగన్‌తో ట్రైనీ ఐఏఎస్‌ల భేటీ
సాక్షి, అమరావతి: కేటాయించిన శాఖల్లో అవగాహన పెంచుకోవడం ద్వారా అనుభవం సంపాదించాలని ట్రైనీ ఐఏఎస్‌లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ప్రతి వ్యవస్థలో లోపాలు కనిపిస్తుంటాయని, వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందడుగు వేసి వాటిని దృఢంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుందని సీఎం చెప్పారు. ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారని, వారి మార్గ నిర్దేశం తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో ట్రైనీ ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. ముస్సోరీలో రెండో విడత శిక్షణ కోవిడ్ కారణంగా నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌లకు శాఖల కేటాయింపు చేశారు. ఆయా శాఖల్లో అంశాలను, విధానాలను తెలుసుకునేందుకు ఈ కాలాన్ని ట్రైనీ ఐఏఎస్‌లు వినియోగించుకుంటున్నారు. ఆ శాఖలపై ప్రజెంటేషన్లు తయారు చేసిన ట్రైనీ ఐఏఎస్‌లు.. ఎంపిక చేసిన వాటిపై సీఎంకు చూపించారు. ప్రజెంటేషన్లు ఇచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లు కేటన్ గార్గ్, విదేఖరే, ప్రతిస్థలను సీఎం అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించారు. పేదల అభ్యున్నతికి పాటుపడండి పేదల అభ్యున్నతి కోసం పని చేయాల్సిన గురుతర బాధ్యత ఐఏఎస్ అధికారులపై ఉందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో గవర్నర్ మాట్లాడుతూ ఐఏఎస్‌కు ఎంపిక కావడం అంటే ప్రజల సేవకు లభించిన అత్యున్నత అవకాశమని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. సాంఘిక సమానత్వం, మత సామరస్యం, ప్రాంతీయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని శిక్షణ ఐఏఎస్ అధికారులకు గవర్నర్ సూచించారు. -
ఏపీ గవర్నర్‌తో ట్రైనీ ఐఏఎస్‌ల భేటీ
సాక్షి, విజయవాడ : సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయవలసిన అతి పెద్ద బాధ్యత అఖిల భారత సర్వీసుల అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఐఎఎస్ అధికారిగా పని చేయటం అంటే అత్యున్నత పౌర సేవకు అవకాశం పొందినట్లు భావించాలన్నారు. ప్రజా సమస్యలను సానుకూల దృక్పధంతో పరిశీలించగలిగినప్పుడే పరిష్కారాలు లభిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడి, రాష్ట్ర సచివాలయంలో శిక్షణ పొందుతున్న ఐఎఎస్ అధికారులు సోమవారం రాజ్ భవన్లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ముస్సోరీలో వీరు తీసుకోవలసిన రెండవదశ తప్పనిసరి శిక్షణా కార్యక్రమం వాయిదా పడింది. ఈ క్రమంలో వారిని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని వివిధ విభాగాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (ట్రైనీ ఐఏఎస్‌లతో సీఎం జగన్ సమావేశం) ట్రైనీ ఐఎఎస్ అధికారులతో గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. విధుల నిర్వహణలో మార్గదర్శక శక్తిగా రూపుదిద్దుకోవాలని సూచించారు. ప్రజా పరిపాలనలో పారదర్శకతకు కట్టుబడి ఉండాలని గవర్నర్ అన్నారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి, సాంఘిక సమానత్వం, మత సామరస్యం, ప్రాంతీయ అభివృద్ధి సాధనకు సివిల్ సర్వీస్ అధికారులు బాధ్యత వహించాలని గవర్నర్ అన్నారు. అనంతరం సీనియర్ ఐఎఎస్ అధికారి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ప్రత్యేకంగా కలిసి విభిన్న అంశాలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అనుపమ అంజలి, ప్రతిష్ట మమగైన్, హిమాన్హు కౌశిక్, కల్పనా కుమారి, సూరజ్ డిజి, వైదిఖేర్, నుపర్ ఎకె శివాస్, మౌర్య నారపురెడ్డి, ఇమ్మడి పృధ్వీ తేజ్, ఖేతన్ ఘర్గ్, భార్గవ్ టి అమిలినేని, జాహ్నవి తదితరులు ఉన్నారు. -
ట్రైనీ ఐఏఎస్‌లతో సీఎం జగన్ సమావేశం
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ట్రైనీ ఐఏఎస్ అధికారులు సోమవారం క్యాంపు కార్యలయంలో భేటీ అయ్యారు. ముస్సోరీలో రెండో విడత శిక్షణ కరోనా కారణంగా నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌లకు వివిధ శాఖలను కేటాయించారు. ఆయా శాఖల్లో అంశాలను, విధానాలను తెలుసుకునేందుకు ఈ కాలాన్ని ట్రైనీ ఐఏఎస్‌లు వినియోగించుకున్నారు. ఆ శాఖలపై ప్రజంటేషన్లు తయారు చేశారు. (పరిశ్రమలకు రెండో విడత బకాయిలు విడుదల ) కొన్ని ఎంపిక చేసిన వాటిపై ట్రైనీ ఐఏఎస్‌లు సీఎంకు ప్రజెంటేషన్ అందజేశారు. ప్రజంటేషన్లు ఇచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లు కేటన్ గార్గ్, విదేఖరే, ప్రతిస్థలను సీఎం అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ‘కేటాయించిన శాఖల్లో అవగాహన పెంచుకోవాలి. అనుభవం సంపాదించాలి. ప్రతి వ్యవస్థల్లో లోపాలు కనిపిస్తుంటాయి, వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందడుగులు వేసి వాటిని దృఢంగా తీర్చిద్దాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు, వారి మార్గ నిర్దేశంలో పనిచేయాలి’ అని అన్నారు. (‘దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు’) -
భువనగిరి ఖిలాపై ట్రైనీ ఐఏఎస్‌ల సందడి
]సాక్షి, భువనగిరి: ట్రైనీ ఐఏఎస్‌ల బృందం ఆదివా రం భువనగిరి ఖిల్లాను సదర్శించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ఇన్స్టిట్యూట్కు శిక్షణ నిమిత్తం వచ్చిన 13మంది ఖిలాను చూసేందుకు వచ్చారు. రాక్ క్లైంబింగ్ నిర్వహించి కోటపై కట్టడాలను పరిశీలించారు. కోట చరిత్రను భావి తరాలకు అందిల్సాన బా ధ్యత అందరిపై ఉందన్నారు. భువనగిరి రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల నిర్వాహకుడు బచేనపల్లి శేఖర్‌బాబు, కోచ్ పరమేశ్వర్, రాకేశ్, వినోద్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. రాక్ క్లైంబింగ్ -
విద్య, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాలఅగ్రికల్చర్ : ‘‘నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి. వ్యవసాయం, విద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. భారతదేశానికి వ్యవసాయం రంగం నుంచి వచ్చే వాటా ఎంతో ఉంది. దీనిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అందించే పథకాలు, రైతులకు ఆర్థిక లబ్ధిచేకూర్చేలా చూస్తాను. ఆడపిల్లలకు చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తాను. వారిని విద్యావంతులను చేయడం, మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై వారిని చైతన్యవంతులను చేయడం నా కర్తవ్యంగా భావిస్తాను..’’ అని మంచిర్యాల జిల్లాకు కొత్తగా వచ్చిన ట్రెయినీ ఐఏఎస్ మొగిలి స్నేహలత అన్నారు. ఏడాదిపాటు ట్రెయినీ ఐఏఎస్‌గా జిల్లాలో పని చేయనున్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ‘సాక్షి’ ఆమెను పలుకరించింది. పలు విషయాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. మీ బాల్యం, చదువు ఎక్కడ..? పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. 10వ తరగతి, ఇంటర్ అంతా హైదరాబాద్. సీబీఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. కుటుంబం నేపథ్యం గురించి.. స్నేహలత : నాన్న పేరు రాజేంద్రకుమార్, హైదరాబాద్‌లో కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మ మాధవి గృహిణి, అక్క నిఖిత, చెల్లి అలేఖ్యలు ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. తమ్ముడు సాయితేజ గ్రూప్స్‌కు సన్నద్ధం అవుతున్నాడు. ఐఏఎస్ వైపు ఎలా వచ్చారు.. స్నేహలత : డిగ్రీ చదువుతున్నప్పుడు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ప్రజలకు మరింత దగ్గరవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగంలో మంచి స్థానంలో ఉంటే సాధ్యం అని ఐఏఎస్‌కు సన్నద్ధం కావాలని నిర్ణయించకున్నారు. బీటెక్ పూర్తి కాగానే ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాను. వారు కూడా ప్రోత్సహించారు. ఐఏఎస్ ఏ బ్యాచ్, శిక్షణ ఎక్కడ తీసున్నారు.. స్నేహలత : 2016లో పరీక్ష రాశాను. 2017లో వచ్చిన ఫలితాల్లో ఎంపికయ్యాను. మా బ్యాచ్‌కు లాల్‌బహదూర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో రెండు నెలలపాటు భారత్ దర్శన్ యాత్రకు వెళ్లాను. సొంత రాష్ట్రంలో శిక్షణపై మీ అభిప్రాయం? స్నేహలత : ఐఏఎస్ ట్రైనింగ్‌ను సొంత రాష్ట్రంలో కేటాయించడం సంతోషంగా ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం దొరికింది. జిల్లా అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తాను. శిక్షణ పూర్తయ్యేలోపు ఇక్కడి పరిస్థితులపై పట్టు సాధించడమే లక్ష్యం. పరీక్షకు ఎలా సన్నద్ధం అయ్యారు.. స్నేహలత : పరీక్షకు ముందే రెండవ చాయిస్ ఉండకూదనుకొని చదివాను. సంవత్సర కాలం అంతా పుస్తకాలతో గడిపాను. రోజులో సింహభాగం ప్రిపరేషన్‌కు కేటాయించాను. నా కష్టానికి తోడు కుటుంబం నుంచి అందిన ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యాను. శిక్షణ అనంతరం ఒక సంవత్సరంపాటు ట్రైనీ ఐఏఎస్‌గా మంచిర్యాలకు పోస్టింగ్ ఇవ్వడంతో ఇక్కడకు వచ్చాను. యువతకు మీరిచ్చే సందేశం..? స్నేహలత : సమయం ఎక్కువగా ఉన్నదని లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం. కష్టపడి చదివే వారిని విజయం తప్పకుండా వరిస్తుంది. దానిని సాధించేవరకు తపస్సులా శ్రమించాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో మొదలు పెట్టిన ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపవద్దు. ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళితే లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటాం. మన చదువు మనకే కాకుండా మన దేశానికి ఉపయోగపడేలా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమాజ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి. – మంచిర్యాలఅగ్రికల్చర్ -
‘డబుల్’ అద్భుతం: ట్రెయినీ ఐఏఎస్‌లు
జగదేవ్‌పూర్ (మెదక్) : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిని తెలంగాణ జిల్లాలకు చెందిన ట్రెయినీ ఐఏఎస్‌లు గురువారం సందర్శించారు. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నమూనా ఇళ్లను పరిశీలించారు. ట్రెయినీ ఐఏఎస్‌లు సిక్తాపట్నాయక్ (నల్లగొండ), సందీప్కుమార్జా (వరంగల్), గౌతమ్ (కరీంనగర్), ముసరఫ్అలీ ఫారూక్ (ఖమ్మం), కృష్ణ ఆదిత్య (మెదక్)లు ఎర్రవల్లిలో నమూనా కోసం నిర్మించిన రెండు ఇళ్లలో కలియదిరిగారు. నిర్మించిన తీరు, కల్పించిన వసతులను తెలుసుకున్నారు. అదే గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులనూ పరిశీలించారు. అభివృద్ధి పనులపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అత్యద్భుతమని కొనియాడారు. ఈ పథకం దేశంలో నంబర్‌వన్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ వైపు అడుగులు వేసే దిశగా ఈ ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రోజూ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కూడా అద్భుతమని కొనియాడారు.