trs mlc karne prabhakar
-
బాబు భక్తుడిగా ఉత్తమ్: కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు భక్తుడిలా మారారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శిం చారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే ఉత్తమ్ తెలంగాణ పీఠంపై అమరావతి బాస్‌లను కూర్చోబెడతారా అని ప్రశ్నిం చారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలసి కర్నె బుధవారం తెలంగాణభవన్‌లో మాట్లాడారు. ‘కేసీఆర్ కన్నా ఆంధ్రా పాలకులే నయమని ఉత్తమ్ మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. ఈ మాటలతో మొత్తం తెలంగాణ సమాజాన్నే ఆయన అవమానించారు. ఉత్తమ్‌కు సిగ్గుండాలి.. వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గొప్ప పాలకుడా, ఆంధ్రా పాలకులు గొప్పవారా అనే ఒక్క అంశంపైనే ఎన్నికలకు పోదామని ఉత్తమ్‌కు సవాలు విసురుతున్నా. 42 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణను ఎండబెట్టినందుకు ఆంధ్రా పాలకులు గొప్పవారా.. గాంధీభవన్‌కు బానిసభవన్ అని పేరు పెట్టుకుంటే మంచిది. ఇలాంటి బానిస ఆలోచనలున్న ఉత్తమ్ నల్లగొండలో తన సీటు గెలవడమే కష్టం. చంద్రబాబు పంపిన డబ్బులతో ఉత్తమ్ గెలవాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. నిరుద్యోగులకు తానేదో పేటెంట్ అని ఉత్తమ్ మాట్లాడుతున్నారు. అసలెన్ని ఉద్యోగాలున్నాయో ఆయనకు తెలుసా.. ’అని కర్నె ప్రశ్నించారు. -
కాంగ్రెస్ ఓ ముసలి నక్క: కర్నె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ఓ ముసలి నక్క అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎడారిగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర పదవుల కోసం జరుగుతున్న రాజకీయ యాత్ర అని దుయ్యబట్టారు. పచ్చి అబద్ధాలతో ఇప్పటి దాకా గాంధీభవన్‌కే పరిమితమైన కామెడీ షోలను ప్రజల ముందు ప్రదర్శించడానికి వెళ్తున్నారని, ఇలాంటి అబద్ధాలను, కాంగ్రెస్ నేతల ముసలి నక్క వేషాలను ప్రజలను నమ్మరని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరివ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నామని చెప్పుకునేందుకు ప్రజల దగ్గరికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల యాత్రలతో ప్రజలకు ఒరిగిదేమీ లేదని వెల్లడించారు. -
బ్లాక్ మనీకి కేరాఫ్ అడ్రసే కాంగ్రెస్: టీఆర్ఎస్
హైదరాబాద్: నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నల్లధనం విషయంలో తమ వైఖరి చెప్పకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి చెప్పాలని కాంగ్రెస్ కోరడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ నేతుల పంచభూతాలను అవినీతి మయం చేశారన్నారు. నల్లధనం, పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందన్నారు. షబ్బీర్ అలీ ప్రతి విషయాన్ని రాజకీయం చెయ్యాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతతో మెలుగుతాం..నష్టం కలిగిస్తే విభేదిస్తామన్నారు. బిహార్‌లో నితీష్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు..బయటకు వస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర సహాయం ఎందుకు కోరుతున్నారని డీకే అరుణ అనడం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నామన్నారు. -
చనిపోయిన రైతు పేరిట కాంగ్రెస్ పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల కోసం న్యాయస్థానాలను సైతం వాడుకుంటున్న నీచ సంస్కతి కాంగ్రెస్‌దేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలపాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ నేతలకు ఏనాడూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సమస్యలు తమవి కావన్న రీతిలో వారు వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టులంటే టీఆర్ఎస్కు అత్యంత గౌరవం ఉందని, కానీ, కాంగ్రెస్ మాత్రం తన రాజకీయాల కోసం కోర్టులను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. 2014లో చనిపోయిన ఓ రైతు పేరిట మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ఈ విధంగా తప్పుడు పిటిషన్ వేసినందుకు కాంగ్రెస్ నేతలపై కోర్టు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
కేసీఆర్‌కు 120 డిగ్రీల జ్వరం!?
- మండలిలో నోరుజారిన టీఆర్ఎస్ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: 'తెలంగాణ రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఎం కేసీఆర్ 120 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో పాదయాత్ర చేశారు..' అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం శాసన మండలిలో పేర్కొనడం నవ్వులు పూయించింది. 102 డిగ్రీలకు బదులు ఏకంగా 120 డిగ్రీలని పేర్కొనడంతో సభలోని మిగిలిన సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో వెంటనే కర్నె ప్రభాకర్ తన మాటను సరిదిద్దుకున్నారు. రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా రైతుల పట్ల ప్రభుత్వ వైఖరీని తెలుపుతూ కర్నె ప్రభాకర్ ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. జ్వరం 105 డిగ్రీలకు చేరితే అత్యంత ప్రమాదకరమని వైద్యులు పేర్కొంటుంటారు. అలాంటిది 120 డిగ్రీలంటే మాటలేనా!!