బ్లాక్ మనీకి కేరాఫ్ అడ్రసే కాంగ్రెస్: టీఆర్‌ఎస్
హైదరాబాద్: నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నల్లధనం విషయంలో తమ వైఖరి చెప్పకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి చెప్పాలని కాంగ్రెస్ కోరడం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్ నేతుల పంచభూతాలను అవినీతి మయం చేశారన్నారు. నల్లధనం, పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందన్నారు. షబ్బీర్ అలీ ప్రతి విషయాన్ని రాజకీయం చెయ్యాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతతో మెలుగుతాం..నష్టం కలిగిస్తే విభేదిస్తామన్నారు. బిహార్‌లో నితీష్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు..బయటకు వస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర సహాయం ఎందుకు కోరుతున్నారని డీకే అరుణ అనడం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నామన్నారు.