కేసీఆర్కు 120 డిగ్రీల జ్వరం!?
- మండలిలో నోరుజారిన టీఆర్ఎస్ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: 'తెలంగాణ రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఎం కేసీఆర్ 120 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో పాదయాత్ర చేశారు..' అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం శాసన మండలిలో పేర్కొనడం నవ్వులు పూయించింది.
102 డిగ్రీలకు బదులు ఏకంగా 120 డిగ్రీలని పేర్కొనడంతో సభలోని మిగిలిన సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో వెంటనే కర్నె ప్రభాకర్ తన మాటను సరిదిద్దుకున్నారు. రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా రైతుల పట్ల ప్రభుత్వ వైఖరీని తెలుపుతూ కర్నె ప్రభాకర్ ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. జ్వరం 105 డిగ్రీలకు చేరితే అత్యంత ప్రమాదకరమని వైద్యులు పేర్కొంటుంటారు. అలాంటిది 120 డిగ్రీలంటే మాటలేనా!!