umar khaleed
-
ధిక్కార ‘స్వర’ భాస్కరం!
స్వర భాస్కర్... బాలీవుడ్ హీరోయిన్, నటిగా కొందరికి తెలుసు. హిందుత్వ వ్యతిరేకిగా... తప్పును తప్పు అని ఎత్తిచూపగల వ్యక్తిగా మరికొందరికి పరిచయం! ముస్లిం స్నేహితుడిని పెళ్లాడి.. ఇటీవలే తల్లిఅయిన స్వర భాస్కర్ తాజాగా మళ్లీ తన ధిక్కార స్వరంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీరును నేరుగా ప్రశ్నించారు. ఏళ్లుగా నిర్బంధంలో మగ్గుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, గుజరాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వంటి వారికి మద్దతుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో స్వర భాస్కర్ మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు న్యాయవ్యవస్థను ఒక ప్రశ్న అడగదలిచాను. దేనికి మీకు భయం? సామాన్య ప్రజలకైతే బతుకు సాగాలన్న భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేసి కొడతారన్న భయం ఉంటుంది. దేశంలో ముస్లింలను ఎక్కడపడితే అక్కడ దాడి చేసి కొట్టేస్తున్నారు. పాపం ఈ దేశంలో దళితులపై కూడా విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయి. మాలాంటి వాళ్లకు కూడా పని దొరకదనో.. కామెడీ షోల్లాంటివి చేయనివ్వరని, నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకంటారనో భయాలు ఉండవచ్చు. మరి మీకే రకమైన భయాలు ఉన్నాయి? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు.. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లోకి చేరిపోతున్నారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై పోయి ఉంటారు. ఖరీదైన.. మంచి కాలేజీల్లో, విదేశాల్లో చదువుకుని ఉంటారు. పెళ్లాం పిల్లలతో వాళ్లు జీవితంలో స్థిరపడి పోయి ఉంటారు. అలాంటి మీకు ఈ వృద్ధాప్యంలో ఎందుకు భయం? ఇంకా ఎలాంటి ఆశ మిగిలిపోయింది మీలో? ఏం కావాలి మీకు? రాజ్య సభ సభ్యత్వం, గవర్నర్ పదవుల అవసరం ఏమిటి? ఇన్ని ఆశలు పెట్టుకున్న మీరు మీ పని చేయమని మాత్రమే కదా మేము అడుగుతున్నది? అది కూడా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు?’’ అంటూ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.Why are you so scared at this age? What is the greed you have at this age? Do you want a Governor or Rajya Sabha post at this age?- @ReallySwara#UmarKhalidpic.twitter.com/2CSyEGWUFL— Mohammed Zubair (@zoo_bear) September 18, 2024 ఉమర్, ఖాలిద్, అతర్, గుష్ఫా, షెర్జీల్ ఇమామ్ వంటి ఎందరో మూడు నాలుగైదేళ్లుగా జైళ్లలో మగ్గిపోతున్నారని గుర్తు చేసిన స్వర.. ‘‘న్యాయవ్యవస్థ వీరిని పూర్తిగా మరచిపోయినట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ లేకుండా.. విచారణ కూడా మొదలు కాకుండా ఇలాంటి వాళ్లు ఎంతకాలం నుంచి మగ్గిపోతున్నారో కూడా న్యాయవ్యవస్థ పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘అందుకే నేను ఈ వేదికపై నుంచి నాలుగేళ్ల కాలం అనేది ఎంత పెద్ద సమయమో చెప్పదలుచుకున్నాను. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరులో ఇరవయ్యవ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత మూడుసార్లు కోవిడ్ వచ్చి పోయింది. వ్యాధి కారక వైరస్ మూడు నాలుగు మార్లు రూపం మార్చుకుంది కూడా. ప్రాణాంతక మహమ్మారి జబ్బుకు చికిత్స కూడా దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఫహాద్ (భర్త)ను కలిశా. అప్పట్లో ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండింది. తరువాత మా దోస్తీ కాస్తా ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. పెళ్లికి నిర్ణయించాం. అదీ పూర్తయ్యింది. కానీ... అప్పుడూ.. ఇప్పుడూ వాళ్లు (ఉమర్ తదితరులు) జైళ్లల్లోనే ఉండిపోయారు. బెయిల్ రాలేదు.. విచారణ మొదలు కాలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘జేఎన్‌యూ’ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి దేశద్రోహం కేసులో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతర నిందితులపై ఢిల్లీ పోలీసులు సోమవారం అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేశారు. కన్హయ్యతోపాటు జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలపై దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగాలను పోలీసులు మోపారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు వర్ధంతిని జేఎన్‌యూ క్యాంపస్‌లో 2016 ఫిబ్రవరి 9న కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులు నిర్వహించడంతో వారిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే మూడేళ్ల తర్వాత పోలీసుల చేత బీజేపీ ఈ పని చేయిస్తోందని నిందితులు, ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా, అభియోగపత్రంలో కశ్మీరీ విద్యార్థులు అఖీబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీయా రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 36 మందిలో సీపీఐ నేత డి. రాజా కూతురు అపరాజిత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, బానోజ్యోత్స్న లాహిరి, రమా నాగ తదితరులున్నారు. బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిశీలించనుంది. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫుటేజీతోపాటు పలు పత్రాలను కూడా పోలీసులు అభియోగపత్రంతోపాటు కోర్టుకు సమర్పించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసేలా కన్హయ్య కుమారే అక్కడున్న గుంపును రెచ్చగొట్టాడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితమే: కన్హయ్య ఇన్నాళ్ల తర్వాత చార్జిషీట్ వేయడం తమకు మంచిదేననీ, కేసు విచారణ పూర్తయితే నిజానిజాలు ఏంటో బయటకొస్తాయని కన్హయ్య అన్నారు. సీపీఐ నేత డి. రాజా మట్లాడుతూ రాజకీయ కారణాలతోనే ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేస్తున్నారనీ, దీనిపై తాము కోర్టులోనూ, కోర్టు బయట రాజకీయంగానూ పోరాడతామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తోందని కేసులో మరో నిందితుడు ఉమర్ ఖలీద్ ఆరోపించారు. షెహ్లా రషీద్ మాట్లాడుతూ ఇది నకిలీ కేసు అనీ, నిందితులందరూ నిర్దోషులుగా కేసు నుంచి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 9: పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి రోజున అతనిని పొగుడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో ర్యాలీ ఫిబ్రవరి 10: దీనిపై క్రమశిక్షణా విచారణకు జేఎన్‌యూ యంత్రాంగం ఆదేశం. ఫిబ్రవరి 11: బీజేపీ ఎంపీ మహేశ్ గిరి, ఆరెస్సెస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 12: కన్హయ్య కుమార్ అరెస్ట్.. భారీ ఆందోళనలకు దిగిన విద్యార్థులు ఫిబ్రవరి 15: కన్హయ్య కేసు విచారణకు ముందు పాటియాలా హౌస్ కోర్టులో విద్యార్థులు, పాత్రికేయులు, అధ్యాపకులను దేశ వ్యతిరేకులుగా పేర్కొంటూ న్యాయవాదుల దాడి. ఫిబ్రవరి 25: తీహార్ జైలుకు కన్హయ్యను పంపిన కోర్టు మార్చి 3: కన్హయ్యకు ఆరు నెలల బెయిలు ఆగస్టు 26: కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్లకు సాధారణ బెయిలు 2019 జనవరి 14: కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు -
ఉమర్ ఖలీద్‌పై దాడి : ఆ నెంబర్ ఆధారంగా..
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించడంలో విఫలమైన ఢిల్లీ పోలీసులు తాజాగా కీలక ఆధారాలు రాబట్టారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవాని, జేఎన్‌యూ విద్యార్థి షెహ్లా రషీద్‌లకు బెదిరింపు మెసేజ్‌లు పంపేందుకు వాడిన మొబైల్ నెంబర్ కొన్ని క్లూలను ఇస్తుందని భావిస్తున్నారు. ఈ నెంబర్ విదేశాల్లో నమోదైందా అనే కోణంలో విచారిస్తున్నామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వర్గాలు తెలిపాయి. ఈ నెంబర్ ఏ దేశానికి చెందినదో వెల్లడైతే యూజర్ వివరాలను తెలుసుకోవచ్చని చెబుతున్నాయి. గ్యాంగ్ స్టర్ రవిపూజారిగా చెబుతున్న వ్యక్తి నుంచి జూన్, ఆగస్ట్‌ల్లో మెవాని, రషీద్‌లకు బెదిరింపు మెసేజ్‌లు వెళ్లాయి. ఖలీద్‌కు హాని తలపెడతానని కూడా మెసేజ్ పంపిన వ్యక్తి మెవానిని హెచ్చరించినట్టు సమాచారం. కాగా, తనకు భద్రత కల్పించే విషయంతో పాటు దాడి కేసుకు సంబంధించి గురువారం తనను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు పిలిచారని, భద్రత కల్పించాలని కోరుతూ తాను మరో దరఖాస్తు సమర్పిస్తానని ఉమర్ ఖలీద్ పేర్కొన్నారు. -
నాపై దాడికి వారే బాధ్యులు..
సాక్షి, న్యూఢిల్లీ : తనపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం వెనుక బీజేపీ ప్రతినిధులు, కొన్ని టీవీ ఛానెళ్లు, ప్రైమ్‌టైమ్ యాంకర్ల ప్రమేయం ఉందని జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ ఆరోపించారు. నిర్ధిష్టంగా ఖలీద్ ఏ ఒక్కరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. తనపై దాడివెనుక అసలైన కుట్రదారులు పాలక పార్టీ ప్రతినిధులు, ప్రైమ్ టైమ్ యాకంర్లు, కొన్ని టీవీ చానెళ్లని చెప్పుకొచ్చారు. అవాస్తవాల ప్రాతిపదికన తనను దేశ వ్యతిరేకిగా ముద్ర వేశారని, తనపై మూకదాడులను ప్రేరేపించడంతో తన జీవితం దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమర్ ఖలీద్‌పై దేశ రాజధానిలో అత్యంత భద్రతతో కూడిన కాన్సిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద స్వాతంత్ర్య వేడుకలకు రెండు రోజుల ముందు ఓ వ్యక్తి కాల్పులతో తెగబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌కు సమీపంలోని వేదిక వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఖలీద్ అక్కడికి వచ్చారు. తనపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించిన క్రమంలో తన ప్రాణాలకు ముప్పుందని భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. మరోవైపు దాడిచేసిన వ్యక్తి ఘటనా ప్రాంతంలో గన్ను వదిలివేసి పారిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. 2016లో ఉమర్ ఖలీద్‌తో పాటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్, అనిర్బన్ భట్టాచార్యలను దేశద్రోహం కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో వారు బెయిల్‌పై విడుదలయ్యారు. -
'కన్హయ్య' కథ అడ్డం తిరిగిందా!
న్యూఢిల్లీ: కథ అడ్డం తిరిగిందా? కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ లు చెప్పినవన్నీ కట్టు కథలని తేలాయా? దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం సృష్టించిన జేఎన్‌యూ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ ర్యాలీ సందర్భంగా విద్యార్థి నేతలు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది ముమ్మాటికి నిజమేనని సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనలో తేలింది. సీబీఐ ల్యాబ్ తుది రిపోర్టుకూడా తమకు అందినట్లు ఢిల్లీ పోలీసులు ధృవీకరిస్తున్నారు. (చదవండి: 'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి') నాటి ఘటనకు సంబంధించి ఓ హిందీ న్యూస్ చానెల్ ప్రసారం చేసిన వీడియో ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ దృశ్యాలను చిత్రీకరించిన కెమెరా, మెమరీ కార్డు, సీడీలు, వైర్లు తదితర పరికరాలన్నింటినీ ఢిల్లీలోని ప్రఖ్యాత సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నాలుగు నెలల సుదీర్ఘ పరిశీలన అనంతరం సదరు వీడియోల్లోని దృశ్యాలు నిజమైనవేనని, ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదని నిపుణులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక జూన్ 8నే పోలీసులకు చేరినట్లు సమాచారం. సీబీఐ ల్యాబ్ నుంచి రిపోర్టు అందిన మాట వాస్తవేనని ప్రత్యేక కమిషనర్ అరవింద్ దీప్ మీడియాకు చెప్పారు. (చదవండి: మళ్లీ అఫ్జల్ గురు ప్రకంపనలు!) టీవీ చానెళ్లలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా కాకుండా రా వీడియో ఫుటేజి ఆధారంగానే తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారింది. ఇప్పుడు రిపోర్టు పోలీసులకు అనుకూలంగా రావడంతో జేఎన్ యూ విద్యార్థి నాయకుల భవిష్యత్ పై చర్చలు మొదలయ్యాయి. అయితే సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు భావిస్తున్నారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యలు బెయిల్ పై బయటే ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్)