ummareddy
-
టీడీపీ ప్రభుత్వం కళ్లు మూసుకుని పరిపాలిస్తోంది
-
జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్సీపీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : దళితులకు ఓటు హక్కు ఉండి తీరాలని పోరాడి సాధించిన మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు శ్లాఘించారు. బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీ శాసనమండలి సభాపక్ష వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలుత శ్రద్ధాంజలి ఘటిస్తూ కేంద్ర మంత్రివర్గంలో 9 శాఖలు నిర్వహించిన ఘనత ఆయనదన్నారు. దేశంలో దళితులకు ఓటు హక్కు కావాలని 1936లోనే బ్రిటిష్ వారితో జగ్జీవన్ పోరాడారని గుర్తు చేశారు. ఆహారభద్రత గురించి ఇపుడు కొందరు పెద్దగా మాట్లాడుతున్నారని.. కానీ బాబూ ఎప్పుడో దీని గురించి దూరాలోచన చేసి ఆహారధాన్యాల నిల్వ కోసం ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో గోదాములు నిర్మించారన్నారు. ప్రధాని కాగల అర్హతలన్నీ ఉన్నా కాలేక పోయారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఏ పదవి తీసుకున్నా సమర్థంగా పనిచేశారన్నారు. సమర్థత ఉన్నా జనతా ప్రభుత్వంలో ఆయనను ప్రధాని కాకుండా అన్యాయం చేశారన్నారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నేతలు పీఎన్వీ ప్రసాద్, కొండా రాఘవరెడ్డి, విజయచందర్, చల్లా మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, నాగదేశి రవికుమార్, కర్నాటి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. -
మానవ వనరులు పుష్కలం
- ఏపీలో పెట్టుబడులకు అది సానుకూలం - బ్రిటిష్ హైకమిషనర్ బృందానికి బుగ్గన, ఉమ్మారెడ్డి వివరణ సాక్షి, హైదరాబాద్: ఏపీలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడ వ్యాపార, వాణిజ్య అవకాశాలు పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బ్రిటిష్ హైకమిషన్ బృందానికి తెలియజేశారు. తెలివి తేటలతోపాటుగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, పట్టుదల గల యువకులు ఉండటం ఈ రాష్ట్రంలో సానుకూల అంశమని వారు నొక్కి చెప్పారు. బ్రిటిష్ హైకమిషనర్ యాష్‌క్విత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడానికి వచ్చారు. జగన్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నందున ఏపీ అసెంబ్లీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శాసనమండలిలో పార్టీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హైకమిషన్ బృందానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో సాదరంగా ఆహ్వానం పలికి వారితో సుమారు 45 నిమిషాలు రాష్ట్ర స్థితిగతులపై మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రత్యేకతలు, అభివృద్ధి అవకాశాలు వివరించారు. హైకమిషనర్ యాస్క్విత్‌తోపాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యవహారాలను చూసే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్తర్ మరి కొందరు ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు. ఏపీలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు గల అవకాశాలు, రాజధాని నిర్మాణం, ఇతర అంశాలపై హైకమిషనర్ బృందం కూలంకషంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకుంది. ముద్రగడ ఆవేదన హృదయ విదారకం: ఉమ్మారెడ్డి ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్నపుడు ఆసుపత్రిలో ఆయన పడ్డ బాధలు, అనుభవించిన ఆవేదన స్వయంగా వివరిస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉందని శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ముద్రగడ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని విమర్శించారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. -
'వాస్తు పేరుతో రైతులకు అన్యాయం'
విజయవాడ: నూజివీడులో ప్రభుత్వ భూమి 55 వేల ఎకరాలు ఉన్నప్పటికీ.. వాస్తు పేరుతో భూములు లాక్కొని చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఆదివారం హనుమాన్ జంక్షన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని పేరుతో రైతుల నుండి భూములు లాక్కొని, వాటిని 99 ఏళ్లు పరాయి దేశానికి అప్పగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాజధాని నిర్మాణంలో గ్రామాల జోలికి వెళ్లమని చెప్పిన చంద్రబాబు.. రోడ్ల నిర్మాణం పేరుతో గ్రామాలను ఖాళీ చేయించడం దారుణమైన చర్య అన్నారు. గ్రీన్ బెల్ట్ విధానం ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్న ఆయన 30 మండలాలను గ్రీన్ బెల్ట్‌గా చేయడం సబబు కాదన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి నోరు మూయించాలనుకోవడం చంద్రబాబు అవివేకమన్నారు. -
పఠాన్‌కోటలో కొత్త పాఠాలు
విశ్లేషణ సైన్యంలోకి విదేశీ శక్తులు, దేశద్రోహులు ఇప్పటికీ ప్రవేశించగలుగుతున్నాయంటే భారత భద్రతా వ్యవస్థ ఏ మేరకు పటిష్టంగా ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. లొసుగులను అధిగమించడం తక్షణ కర్తవ్యం. సరిహద్దు ప్రాంతంలో చొరబాట్లను అరికట్టేందుకు సింగపూర్, ఇజ్రాయెల్ తరహాలో ‘ఫర్హీన్ లేజర్ వాల్’ ప్రతిపాదనను అమలు చేయాలి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వాయుసేన స్థావరం మీద జరిగిన ఉగ్రదాడి సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. దేశాన్నీ, అంతర్జాతీయ సమాజాన్నీ కలవరపాటుకు గురిచేసిన ఆ ఉదంతం, అనంతరం రేగుతున్న దుమారం ఒక పార్శ్వం. సైన్యంలో ఇంటిదొంగలు ఎక్కువై, కీలక రక్షణ సమాచా రాన్ని శత్రుదేశాలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు మరో పార్శ్వం. భద్రతా వ్యవస్థలో లొసుగులు, నిఘా వ్యవస్థల మధ్య సమన్వయలేమి వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రత మీద ఆందోళనలు వ్యక్తం కావడం ఆశ్చర్యం కాదు. దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశిం చారన్న సమాచారాన్ని పఠాన్‌కోట్ దుర్ఘటన జరగటానికి రెండు రోజుల ముందే కేంద్ర నిఘా వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశాయి. దాంతో, ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన మాట నిజం. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నూతన సంవత్సరం తొలి రోజు, వేకువన ఆరుగురు ముష్కరులతో కూడిన ఆత్మాహుతి దళం అత్యాధునిక మందుగుండుతో విరుచుకుపడింది. రెప్పపాటు వ్యవధే అయినా ఆ స్థావరానికి రక్షణగా ఉన్న సైనికులు చూపిన ఉదాసీనత, లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉగ్రవాదులు చొరబడేటందుకు దోహదం చేశాయి. అయితే, భారత సైనిక దళాలు వీరోచితంగా పోరాడాయి. ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతం కాగా, ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. మన సైనికుల తెగువను అభినందించవలసిందే. దాడి గురించి భిన్నస్వరాలు దాడి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌తో నెరపుతున్న దౌత్యనీతి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత గడ్డ మీద ఉగ్రవాదాన్ని తుద ముట్టించేంత వరకూ పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ప్రయోజనం లేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగమంత్రి యశ్వంత్‌సిన్హా వ్యాఖ్యానించారు. రక్షణమంత్రి మనోహర్ పారికార్ ‘దెబ్బకు దెబ్బ తీస్తాం’ అని హెచ్చరించారు. అది ఉగ్రవాద సంస్థలను ఉద్దేశించి చేసిందా? లేక పాకిస్తాన్‌ను ఉద్దేశించి చేసిందా? స్పష్టత లేదు. పారికార్ వ్యాఖ్యలకు భిన్నమైన పంథాను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనుసరించడం కూడా చర్చనీయాంశమే. దాడి వెనుక పాకిస్తాన్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని, అప్పుడే ఆ దేశాన్ని వేలెత్తి చూపడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఎన్డీఏ వైఖరి కూడా అదే. తొందరపడి నిందించే బదులు, పాక్ సహకారంతోనే అక్కడ తిష్ట వేసిన ‘జైష్ ఏ మహ్మద్’ వంటి ఉగ్రవాద సంస్థల ఆట కట్టించవచ్చునన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తున్నది. ఇది యూపీఏ పంథాకు భిన్నం కాదు. కాకపోతే, నాడు యూపీఏని తప్పు పట్టిన బీజేపీ, ఇప్పుడు అదే పంథాను అనుసరించడమే చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నంత మాత్రాన తెగతెంపులు చేసుకోరాదన్నది అంతర్జాతీయ దౌత్యనీతి సూత్రం. అందువల్ల, పాక్ మీద చర్యకు భారత్ పూనుకోవడం సరికాదు. ప్రమాదకర ఆపరేషన్లు ఇటీవలి కాలంలో భారత రక్షణ దళాల్లోకి శత్రువులు పెద్ద సంఖ్యలో చేరడం, కొంతమంది సైనికులు, అధికారులు ప్రలోభాలకు లొంగి సమాచారాన్ని వెల్లడిం చడం ఎక్కువయిందనే అభిప్రాయం తరచూ వినబడుతున్నది. పఠాన్‌కోట్ ఉదంతం తర్వాత, దేశద్రోహం అభియోగం మీద వైమానిక దళానికి చెందిన నలుగురు అధికారులను నిర్బంధించారు. ఇంటి దొంగల కారణంగానే ఉగ్రవాదులు పఠాన్‌కోట్ స్థావరంలోకి ప్రవేశించగలిగారనేదే అభియోగం. హతమైన ఉగ్రవాదుల వద్ద పఠాన్‌కోట్ నగర మ్యాప్, స్థావరం మ్యాప్‌లు దొరకడంతో.. ఇంటిదొంగలే వారికి ఉప్పందించారన్నది బహిర్గతమయింది. అంతకు ముందే ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని సైనికస్థావరాల్లోకి, పోలీసు ఠాణాల్లోకి దర్జాగా చేరిపోయారు. కోవర్ట్ ఆపరేషన్లతో తీరని నష్టం కలిగించారు. అయితే ప్రలోభపరిచి కీలక సమాచారాన్ని సేకరించడం కొత్త సంస్కృతి కాదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ, అమెరికా) శత్రుదేశాల్లో కల్లోలం సృష్టించ డానికి ఏజెంట్లను పంపిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. కమ్యూనిస్టు దేశాలను బలహీన పరిచేందుకు ‘సీఐఏ’ నిరంతరం పనిచేసింది. అనేక దేశాల రాజకీయ, సైనిక సంక్షోభాలలో ‘సీఐఏ’దే ప్రధాన పాత్ర అన్న ఆరోపణలు లేకపోలేదు. ఇప్పుడు ఆ పోకడ భారతదేశంలో తలెత్తడం ఆందోళన కలిగిస్తు న్నది. పదవీ విరమణ చేసిన సైనికోద్యోగులు కొందరు ‘ఐఎస్ఐ’తో కుమ్మక్కయి, రహస్యాలను చేరవేస్తున్నారని విమర్శ. గత మూడేళ్లలో ఇలా కుమ్మక్కయిన 34 మందిని నిఘా విభాగం అరెస్ట్ చేసిందని ఇటీవల రాజ్యసభలో ప్రభుత్వమే ప్రకటించింది కూడా. కానీ ఎవరో కొందరు దేశద్రోహానికి ఒడిగడితే ఆ తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడం సమంజసం కాదు. అనేక వ్యవస్థలు కాలక్ర మేణా బలహీనపడినప్పటికీ, భారత సైన్యం మాత్రం క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరుగా నిలిచింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, అఫ్ఘానిస్తాన్‌ల సరిహద్దుల వెంబడి సుమారు 15,000 కిలోమీటర్ల మేర నిరంతరం భద్రతా దళాలు గస్తీ కాస్తుంటాయి. ప్రాణాలను పణంగా పెట్టి భారత సైనికులు విధులు నిర్వహిస్తున్నందునే దేశప్రజలు నిశ్చింతగా జీవించగలుగుతున్నారు. సరిహద్దుల్లో భద్రతాదళాలు ఎదుర్కొం టున్న సమస్యలు, ఇబ్బందుల్ని తల్చుకొంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. హిమాల యాలలో, లేహ్, సియాచిన్ వంటి ప్రాంతాలలో రాత్రింబవళ్లు సైనికులు విధి నిర్వహణలో ఉంటారు. దట్టమైన అటవీప్రాంతాల్లో, ‘ధార్ ఎడారి’ లాంటి ప్రాంతాల్లో నిరంతరం దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దేశానికి నూతన సవాళ్లు గత ఆరున్నర దశాబ్దాల కాలంలో ఒకసారి 1962లో చైనాతో, 1947లో జరిగిన యుద్ధం సహా నాలుగు సార్లు పాకిస్తాన్‌తో భారత్ యుద్ధానికి తలపడింది. చైనా యుద్ధంలో భారతదేశానికి అపార నష్టం వాటిల్లినా విజయతీరాలకు చేరింది. 1965 నాటి పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. 1971లో బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) ను విముక్తం చేయడానికి పాకిస్తాన్‌తో చేసిన యుద్ధంలోనూ మన సైన్యం విజయం సాధించింది. ‘ఆపరేషన్ విజయ్‌గా’ పేర్కొనే 1990 నాటి ‘కార్గిల్ యుద్ధం’లో భారత్ విజయం చిరస్మరణీయం. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలంక ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు టైగర్లను ఏరివేసేందుకు.. ‘ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్’ (ఐపీకేఎఫ్) పేరుతో భారత సైన్యం వెళ్లింది. అయితే శ్రీలంకకు ఐపీకేఎఫ్‌ను పంపడం రాజీవ్ తప్పిదమన్న వాదన లేకపోలేదు. రాజీవ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రాణాలనే కబళించింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా అమృత్‌సర్‌లోని స్వర్ణాలయం మీద జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో కూడా సైన్యం విజయం సాధించింది. ఖలిస్థాన్ ఉద్యమం సమసిపోయింది. ప్రపంచ దేశాల్లో సైనిక బలం పరంగా భారతదేశానికి 3వ స్థానం. మన త్రివిధ దళాలలో సుమారు 13 లక్షల 25 వేల మంది మిలటరీ, లక్షా16 వేల మంది రిజర్వ్ దళాలు, 13 లక్షల మంది పారా మిలటరీ దళాలు.. వీరుకాక.. సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు.. ఇంకా అనుబంధ వైద్య, ఇంజనీరింగ్ విభాగాలలో పని చేసే వారు ఉంటారు. 80వ దశకం నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత సైన్యానికి పెనుసవాల్‌గా మారింది. 1984 నుంచి నేటి వరకు భారత్‌లో జరిపిన ఉగ్రవాదుల దాడులలో 1,920 మంది జవాన్లు వీరమరణం పొందారని గణాం కాలు వెల్లడిస్తున్నాయి. కశ్మీర్ ఈనాటికీ రగులుతూనే ఉంది. కారణం- పాకి స్తాన్‌లో ఏర్పడుతున్న ప్రభుత్వాలు పేరుకే ప్రజా ప్రభుత్వాలు. సైన్యమే పాల కులను నియంత్రిస్తుంది. 1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాక్‌తో సఖ్యతను ఆశించారు. చరిత్రాత్మక లాహోర్ బస్సుయాత్ర చేశారు. కానీ, ఈ సఖ్యత గిట్టని శక్తులు కార్గిల్ యుద్ధానికి తెగబడ్డాయి. ఇప్పుడు చరిత్ర పునరావృతమయింది. ప్రధాని మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జన్మదిన వేడు కకు లాహోర్ వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే పఠాన్‌కోట్ ఉదంతం జరగటం యాదృ చ్ఛికం కాదు. తాజాగా పఠాన్‌కోట్ ఘాతుకం నేపథ్యంలో ‘జైషే మహ మ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజాక్’’ అతని సోదరుడు, మరి కొందరు ఉగ్రవాదులను పాక్ అరెస్ట్ చేయడమే కాక పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని ఏరివేయాలని, ఈ ప్రయత్నంలో భారత్‌తో కలిసి పనిచేయాలని సంకల్పించడం ఇరుదేశాల దౌత్య సంబంధాలు మెరుగుపడాలనే కోణంలో హర్షించదగ్గదే. అయితే అది కార్య రూపం దాల్చాలి. మరింత పటిష్టం చేయాలి దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా సైనికులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారింది. వారిని అమరవీరులుగా కీర్తించడంతోనే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు. సైన్యంలోకి విదేశీ శక్తులు, దేశద్రోహులు ఇప్పటికీ ప్రవేశించగలుగుతున్నాయంటే భారత భద్రతా వ్యవస్థ ఏ మేరకు పటిష్టంగా ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. లొసుగులను అధిగమించడం తక్షణ కర్తవ్యం. సరిహద్దు ప్రాంతంలో చొరబాట్లను అరికట్టేందుకు సింగపూర్, ఇజ్రాయెల్ తరహాలో ‘ఫర్హీన్ లేజర్ వాల్’ను నిర్మించాలన్న ప్రతిపాదనను ఇప్పటికైనా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. భారత్- పాక్‌ల మధ్య 15 శాతం మేర, బంగ్లాదేశ్ సరిహద్దులో 25 శాతం మేర సరిహద్దు ఫెన్సింగ్ వేయవలసి ఉంది. కాగా చైనా సరిహద్దులో ఎక్కువ భూభాగానికి ఇప్పటికీ ఫెన్సింగ్ లేదు. సైన్యంలో ఇంటిదొంగల భరతం పట్టేందుకు ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలను మరింత పటిష్టం చేయాలని ‘జీపీ సక్సేనా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను కూడా తక్షణం పరిగణలోకి తీసుకోవాలి. పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడంతోపాటు దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యం కల్పించడం ద్వారానే దేశంలో ఉగ్రవాద చర్యలను అరికట్టడం సాధ్యం. అన్నింటికీ మించి అంతర్జాతీయంగా అన్ని దేశాల సమష్టి చర్యకు కూడా సమయం ఆసన్నమైందనే వాస్తవాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి: డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సెల్ : 99890 24579) -
రోజా సస్పెన్షన్ అన్యాయం
-
నేడు జీఓ ఎలా జారీ చేస్తారు ? ఉమ్మారెడ్డి
-
ఆశయం సరే.. ఆచరణ సంగతి!
విశ్లేషణ: ఎన్నికలలో ఇచ్చిన 'ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి' హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటించిన 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' కేవలం నినాదప్రాయంగా మిగలనున్నదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలవని అనుకుంటున్న 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' పథకాలు కేవల నినాదాలుగానే మిగిలిపోతాయా? యువతలో నెలకొన్న ఈ భయాందోళనలను వెంటనే తొలగించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకున్న చైనాలో ఇటీవల ఏర్పడిన ఆర్థిక మందగమనం భారత్‌కు అందివచ్చిన అవకాశం. ఈ ఏడాది చైనా ఆర్థిక రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో తన జీడీపీ వృద్ధిరేటు లక్ష్యాన్ని 7 నుంచి 6.5 శాతానికి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కిందటేడాది ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా గురించి దేశంలో ఆశలు చిగురించాయి. కొన్నేళ్లుగా దేశ స్థూల జాతీ యోత్పత్తిలో 15 శాతంకంటే మించలేకపోతున్న తయారీ రంగం (మాన్యు ఫాక్చరింగ్ సెక్టార్) వాటాను 2020 నాటికి 25 శాతానికి పెంచి, కనీసం 10 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించడానికి మోదీ మేక్ ఇన్ ఇండియా మిషన్ ఆరంభించారు. ఒక అంచనా ప్రకారం దేశంలో దాదాపు 8 కోట్ల మంది నిరు ద్యోగులున్నారు. చదువుకు తగిన ఉద్యోగాలు లేక నిరాశానిస్పృహలకు లోన వుతున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 368 ప్యూన్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడగా 23 లక్షల దర ఖాస్తులు అందాయి. అందులో 255 మంది డాక్టరేట్లు. ఆంధ్రప్రదేశ్ విభజ నకు ముందు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అధిక సంఖ్యలో పోస్టు గ్రాడ్యు యేట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల తెలంగాణలో 856 విద్యుత్ ఇంజ నీర్ల ఖాళీలకు 1.09 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ దేశంలో ఉన్న నిరు ద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పట్టేవే. ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు ఆవశ్యకమే. 2025 నాటికి దేశ జనాభా ప్రస్తుతం ఉన్న 128 కోట్ల నుంచి దాదాపు 150 కోట్లకు చేరుకోబోతోందని అంచనా. ఉన్నత విద్యను అభ్యసించే యువత సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి కోట్లాది ఉద్యో గాలను సృష్టించుకోవాలి. ఉపాధి అవకాశాలు విస్తృతపరచాలి. ఎగుమతుల స్థాయికి ఉత్పత్తులు ఉద్యోగావకాశాల కల్పనకు ఉద్దేశించిన మేక్ ఇన్ ఇండియా మిషన్ 25 ప్రాధా న్యతా రంగాలను గుర్తించింది. వాటిని అభివృద్ధి చేసుకుని చైనాకు దీటుగా ఆసియాలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరించి దేశీయ అవసరాలను తీర్చుకుంటూ ఎగుమతులను కూడా చేపట్టే స్థాయిలో పారిశ్రామికోత్పత్తు లను అందించాలన్నది మిషన్ లక్ష్యం. ఇందుకు అనుకూల పరిస్థితులు కూడా భారత్‌కు ఉన్నాయి. దేశ జనాభాలో 65 శాతం 35 సంవత్సరాలలోపు యువతే కావడం గొప్ప మానవ వనరు. ఒకప్పుడు చైనాలో అధిక జనాభా సమస్య అనుకునేవారు. కానీ జనాభాయే అన్ని సమస్యలకు పరిష్కారమని చైనా నిరూపించింది. ఆ బాటలోనే భారత్ పయనించాలని అనుకుంటున్నది. కానీ ఈ అనుకూలతలతో పాటు, అనేక ప్రతికూలతలు కూడా వ్యవస్థీకృ తంగా మారిన విషయాన్ని విస్మరించలేం. దేశంలో విద్యాసంస్థలు, విశ్వవిద్యా లయాలు ఆశించిన స్థాయిలో సాంకేతిక నిపుణులను అందించలేకపోతున్నాయి. దేశంలో వృత్తి నైపుణ్యతా శిక్షణ కలిగిన వారు 2.3 శాతమే. మేక్ ఇన్ ఇండియా ఆశిస్తున్న ఫలితాలు రావాలంటే, అందుకు సరిపడే నైపుణ్యం కలిగిన యువత భారత్‌లో ఉన్నదా? లేకుంటే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి చేపట్టవలసిన చర్యలు ఏమిటి? ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. మేక్ ఇన్ ఇండియా ఆలోచనకు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలైన రతన్ టాటా, ముకేశ్ అంబానీ, ఆజీమ్ ప్రేమ్‌జీ తదితరులు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని ముందుకు వచ్చారు. వివిధ రంగాలకు సంబంధించిన పారిశ్రా మికోత్పత్తులు దేశంలోనే తయారుకావాలన్న భావన మేక్ ఇన్ ఇండియాలో ప్రతిబింబించినప్పటికీ, అది ఆచరణాత్మకం కావడానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రావలసి ఉంది. అందుకే మోదీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ, 'స్కామ్‌ల ఇండియా కాదిప్పుడు, స్కీమ్‌ల ఇండియా' అంటూ ఇన్వె స్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు తెలియచేస్తున్నారు. నిజానికి ఎన్డీఏ అధికారం లోకి వచ్చాక స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ కూడా బలపడి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. అయితే దేశంలో సుస్థిర పారిశ్రామి కాభివృద్ధికి దోహదం చేసేవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే. విదేశీ పెట్టుబడులే ప్రధానం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి దేశీయంగా వివిధ రాష్ట్రాలు ఎలా పోటీ పడుతున్నాయో, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య కూడా అందుకు తీవ్ర పోటీ నెలకొని ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం అంత సుల భం కూడా కాదు. నిర్దిష్టమైన ప్రామాణికతలను పరిగణనలోనికి తీసుకున్న తరవాతే విదేశీ పెట్టుబడిదారులు ముందుకు వస్తారన్నది వాస్తవం. ప్రతిష్టా త్మకమైన వివిధ ఏజెన్సీలు ఇచ్చే నివేదికలను, రేటింగ్లను వారు ప్రామా ణికంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై 'రీజన బుల్ రిటర్న్స్' (సహేతుకమైన లాభాలు)ను ఆశిస్తారు. ప్రపంచ బ్యాంకు దాదాపు 190 దేశాల్లో నెలకొని ఉన్న పారిశ్రామిక వాతావరణంపై సర్వే చేసి అందించిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే సమగ్ర నివేదికలో తాజాగా భారత్‌కు లభించినది 130వ ర్యాంకు మాత్రమే. ఆశ్చర్యమేమిటంటే, అఫ్ఘా నిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్‌లు పొం దాయి. ప్రపంచ మార్కెట్ల దృక్కోణం నుంచి చూసినప్పుడు భారతదేశంలో సంక్లిష్టమైన అధికార యంత్రాంగపు ప్రమేయం ఎక్కువ. అలాగే, సరుకులు చేరవేయడానికి వివిధ ప్రాంతాల మధ్య సరైన రవాణా సౌకర్యాలు లేకపోవ డం మరొక ప్రధాన లోపం. ప్రపంచీకరణకు అనువైన సంస్కరణలు చేపట్టక పోవడం, అన్నింటికీ మించి అడుగడుగునా 'అవినీతి' తాండవించడం లాంటి సమస్యలనేకం ఉన్నాయి. వ్యవస్థీకృతంగా మారిన ఈ సమస్యలు తొలగించా లంటే ఉక్కు సంకల్పం కావాలి. 'వ్యాపారం చేసుకోవడానికి అనువైన పరిస్థి తులు'కల్పించకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించడం ఆశించినంత సులభం కాదు. ఇక, దేశంలోకి వెల్లువలా వచ్చిపడుతున్న నకిలీ వస్తువులు (కొన్ని రకాల ఉత్పత్తులు... దేశీయ ఉత్పత్తులకంటే నాణ్యమైనవి) తయారీ రంగం అభివృద్ధికి నిరోధకాలుగా తయారయ్యాయి. చైనా వస్తువులు భారత్ మార్కె ట్లను ముంచెత్తడంతో ఒక దశలో దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోతుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ ప్రమాదం ఇప్పటికీ తొలగిపోలేదు. 'ఇల్లిసెట్ మార్కెట్స్, ఎ థ్రెట్ టు అవర్ నేషనల్ ఇంట్రెస్ట్స్'(జాతీయ ప్రయోజనాలకు గండికొడుతున్న అక్రమ వ్యాపార సామ్రాజ్యాలు) అనే నివే దిక కొన్ని విభ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడించింది. కిందటేడాది... అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,381 కోట్ల మేర దేశంలో అక్రమ వ్యాపారం జరిగింది. లక్ష కోట్ల రూపాయల పైబడిన అమ్మకాల్ని దేశీయ ఉత్పత్తి కంపెనీలు నష్టపోయాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల పన్ను ఆదాయం నష్టం కలిగింది. 'ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్'(మేధోసంపత్తి హక్కులు) విషయంలో మనం తీసుకోవాల్సిన ఆవిష్కరణ లకు చొరవ చూపకపోవడం, సరిహద్దుల్ని దాటుకొని అక్రమంగా వస్తున్న వస్తువుల్ని నిరోధించలేకపోవడం లాంటి లోపాలతో దేశీయ ఉత్పత్తి దారులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. ఇబ్బందులూ ఉన్నాయి 'మేక్ ఇన్ ఇండియా మిషన్' పురోగతిని విశ్లేషిస్తే... ఈ ఏడాదిన్నర వ్యవ ధిలో సాధించిన ఫలితాలు కొంత మేరకు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో... గత ఏడాదితో పోలిస్తే 40 శాతం అభివృద్ధి కనిపిస్తుండగా, (23.7 బిలియన్ల డాలర్లు) భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ మదుపరుల రంగంలో కిందటేడాది కనిపించిన 0.6 శాతం అభివృద్ధి రేటును దాటుకొని 2.7 శాతం మేర వృద్ధి సాధించగలిగింది. ఐతే, ఇది వచ్చే ఐదేళ్లలో ఏ మేరకు స్థిరమైన అభివృద్ధికి దారితీస్తుందో వేచిచూడాలి. మౌలికమైన పరి పాలనా సంస్కరణలు, ప్రజల ఆరోగ్యం, విద్య, సాంకేతిక పరిజ్ఞానం మొద లైన ఉత్పాదక పనిముట్ల (ప్రొడక్షన్ టూల్స్)ను మెరుగుపర్చకుండా కేవలం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తరచూ విదేశీ పర్యటనల మీదనే ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా... ఇప్పటికీ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న 60 శాతం పైగా ఉన్న ప్రజానీకానికి కావలసిన ఉపాధి అవకాశాలపై దృష్టి కేంద్రీకరించకుండా, మరోపక్క సత్వర పారిశ్రామికీకరణ పేరుతో వ్యవసాయం చేయడంతో రాజకీయ ప్రతిష్టం భన ఏర్పడి పెద్ద ఎత్తున వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవు తున్నది. భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనున్నదా అనే ఆందో ళనలు కలుగుతున్నాయి. దీంతో, పారిశ్రామికీకరణ ప్రతిపాదనల ఉద్దేశంపైనే నీలినీడలు కమ్ముకోనున్నాయా! అనే సందేహం కలుగుతుంది. ఇక నరేంద్రమోదీ 'మేక్ ఇన్ ఇండియా' ప్రకటన చేయగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్'అంటూ వెనువెంటనే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తుల తయారీ మెరుగుపర్చాలన్నది బహుశా ఆయన ఆంతర్యం కావచ్చు. దానిని ప్రజలు ఆహ్వానిస్తారు. కాని, ఆచరణలో ఆ దిశగా అడుగులు పడటం లేదు. రాష్ట్ర రాజధాని 'అమరావతి' నిర్మాణం ఆలో చన ఆరంభంలోనే విదేశీ సాంకేతికత కోసం సింగపూర్, జపాన్, జర్మనీ లాంటి దేశాలవైపు పరుగులెత్తడం దేశీయ వనరుల పట్ల తనకున్న చిన్నచూపు బహిర్గతమవుతున్నది. కొసమెరుపు ఏమిటంటే- రూ.2,500 కోట్లతో గుజరాత్లో నిర్మించనున్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ పీస్’ విగ్రహం రూపకల్పన బాధ్యత చైనాలోని ఒక ప్రముఖ సంస్థకు అప్పజెప్పారు. అలాంటప్పుడు 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్'ల పరమార్ధం ఏమిటని ప్రజలు విస్తుపోతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతం కావాలంటే ఆకర్షణీయమైన పారిశ్రామిక వాతావరణం కల్పించాలి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనివార్యం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా కేంద్రం మీద ఒత్తిడి పెంచడంలేదు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తే తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కారణాలవల్ల ప్రత్యేకహోదా అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల మంది గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీచేయకపోవడం, డీయస్సీ నిర్వహించకపోవడం నిరుద్యోగ యువతలో నైరాశ్యం పెంచుతున్నది. ఎన్ని కలలో ఇచ్చిన 'ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగభృతి' హామీ కూడా అమలుకు నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటించిన మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కేవలం నినాదప్రాయంగా మిగలనున్నదా అన్న ప్రశ్న తలె త్తుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలవని అనుకుంటున్న మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పథకాలు కేవల నినాదాలుగానే మిగిలి పోతాయా? యువతలో నెలకొన్న భయాందోళనలను వెంటనే తొలగించాలి. వ్యాసకర్త, ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మొబైల్: 99890 24579 -
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం
-
'రైతుల చేతిలో బాండ్లు, చెవిలో పువ్వులు'
-
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: ఉమ్మారెడ్డి