undavalli aruun kumar
-
టెరా సాఫ్ట్వేర్ కంపెనీతో 'హెరిటేజ్'కి లింక్: ఉండవల్లి
రాజమండ్రి: ఏపీ సర్కార్ చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో లొసుగులున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఆయన మరోసారి బయటపెట్టారు. టెరా సాఫ్ట్వేర్ అనే కంపెనీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారే ఈ ఏడాది మే నెలలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని.. అయితే, నేడు అదే కంపెనీకి ఏకంగా రూ.333 కోట్ల భారీ టెండర్ ఎలా అప్పగిస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ శనివారమిక్కడ ప్రశ్నించారు. టెరా సాఫ్ట్వేర్ కంపెనీతో చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ కంపెనీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. -
చేసింది చెప్పకుండా జగన్‌పై ఆరోపణలా
-
'చేసింది చెప్పకుండా జగన్‌పై ఆరోపణలా'
రాజమండ్రి: బాక్సైట్ తవ్వకాలపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసి చర్చించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. బాక్సైట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్ని అవాస్తవాలే ఉన్నాయని ఉండవల్లి ఆరోపించారు. తాము చేసింది చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. యనమలతో ఎందుకు అబద్ధాలు చెప్పిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేసి దానిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ఆర్ ఇలాగే చేసేవారని గుర్తు చేశారు.