under-19 cricket troney
-
South Africa Under-19: అర్షిన్ సెంచరీ: అజేయంగా భారత్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అమెరికాతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 201 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్ దశను అజేయంగా ముగించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్షిన్ కులకర్ణి (108; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అనంతరం అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడిపోయింది. మంగళవారం జరిగే ‘సూపర్ సిక్స్’ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడతుంది. -
హ్యాట్రిక్
వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాలమూరు చివరి లీగ్‌లో 72పరుగల తేడాతో ఆదిలాబాద్‌పై ఘనవిజయం రాణించిన రహీం, ఖయ్యుం, గణేష్ రేపు సెమీస్‌లో మెదక్‌తో ఢీ మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్–19 టోర్నీలో జిల్లా జట్టు దూసుకెళ్తోంది. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించి, గ్రూప్–ఏలో టాపర్‌గా నిలిచింది. గురువారం జిల్లాస్టేడియంలో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో పాలమూరు 72పరుగుల తేడాతో ఆదిలాబాద్‌ను చిత్తు చేసింది. టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాలమూరు జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. టాపార్డర్, మిడిల్డార్ విఫలమైంది. మంజునాథ్ (31), హర్షవర్ధన్ (27)లు మాత్రమే మోస్తారుగా రాణించారు. 153 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు ఆల్‌రౌండర్ అబ్దుల్ రహీం (42, 46 బంతుల్లో 2 ఫోర్లు), అర్జున్ (21, 25 బంతుల్లో 2 ఫోర్లు) ఏడు వికెట్‌కు 55పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆదిలాబాద్ బౌలర్లు సైఫ్ అలీ నాలుగు, ప్రదీప్ రెండు వికెట్లు తీసుకున్నారు. 216పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలాబాద్ ప్రారంభంలోనే ఓపెనర్ జగదీశ్‌రెడ్డి (4) వికెట్‌ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ ప్రదీప్ (52), సైఫ్ అలీఖాన్(29) రెండో వికెట్‌కు 44పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత జిల్లా బౌలర్లు ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో ఆ జట్టు 37.5 ఓవర్లలో 143పరుగులకే కుప్పకూలింది. జిల్లా బౌలర్లలో ఖయ్యుం, గణేశ్‌లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలి రాష్ట్ర క్రికెట్ క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని టూటౌన్ సీఐ డీవీపీ రాజు ఆకాంక్షించారు. ఉదయం ఆయన మహబూబ్‌నగర్–ఆదిలాబాద్ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ క్రీడలు ఆడటంతో పాటు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. క్రమశిక్షణ, ఏకాగ్రతతో ఆడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఈసీ సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు. రేపు సెమీస్.. టోర్నీలో గ్రూప్–ఏ నుంచి మహబూబ్‌నగర్, నిజామాబాద్, గ్రూప్–బీ నుంచి మెదక్, వరంగల్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. శుక్రవారం విశ్రాంతి దినం. శనివారం తొలి సెమీఫైనల్లో మహబూబ్‌నగర్ జట్టు మెదక్‌తో జిల్లాస్టేడియంలో తలపడనుంది. జడ్చర్లలో జరిగే రెండో సెమీస్‌లో వరంగల్‌తో నిజామాబాద్ ఢీకొంటుంది. ఉత్కంఠ పోరులో నెగ్గిన నిజామాబాద్ జడ్చర్ల టౌన్: రెండు విజయాలతో నిజామాబాద్ జట్టు సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారం జడ్చర్ల ఎర్రసత్యం స్మారక క్రీడామైదానంలో ఉత్కంఠగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నిజామాబాద్ ఒక వికెట్ తేడాతో కరీంనగర్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ జట్టు 39.4ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. నిజామాబాద్ బౌలర్లలో శ్రావణ్, నిఖిల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నిజామాబాద్ జట్టు 31.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. జట్టులో కమలేష్ (27) ఒక్కడే రాణించాడు. కరీంనగర్ బౌలర్లలో ఆకాష్‌రావు ఐదు, రాహుల్ 3 వికెట్లు తీసుకున్నారు. -
సెమీస్‌లో పాలమూరు
వరుసగా రెండో లీగ్‌లో గెలుపు నిజామాబాద్‌పై 152పరుగుల తేడాతో భారీ విజయం అర్ధసెంచరీతో రాణించిన హర్షవర్ధన్ హెచ్‌సీఏ అండర్–19 క్రికెట్ టోర్నీ మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–19 క్రికెట్ టోర్నీలో ఆతిథ్య పాలమూరు జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జిల్లా స్టేడియంలో జరిగిన కీలక రెండో లీగ్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 152 పరుగులు భారీ ఆధిక్యతతో నిజామాబాద్‌ను చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జిల్లా జట్టు నిర్ణీత 46ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 253పరుగులు చేసింది. ఓపెనర్ హర్షవర్ధన్ (48 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు) అర్ధసెంచరీతో రాణించారు. మరో ఓపెనర్ షాకీర్‌ఖాన్ (27), ఖయ్యుం (29)ఫర్వాలేదనిపించారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో 159 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి జిల్లా జట్టు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన అర్జున్ (43 నాటౌట్: 42 బంతుల్లో 3 ఫోర్లు), మంజునాథ్ (43 నాటౌట్: 26బంతుల్లో 4 ఫోర్లు)లు చివర్లో మెరుపు బ్యాటింగ్ చేసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 94పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ స్కోరును అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిజామాబాద్ బ్యాట్స్‌మన్ జిల్లా బౌలర్ల ధాటికి విలవిలలాడారు. ఆ జట్టు 32.3ఓవర్లలో 102పరుగులకే కుప్పకూలింది. లలిత్‌రెడ్డి (29), అఖిల్(26) మాత్రమే కాస్త పోరాడారు. పాలమూరు బౌలర్లలో అబ్దుల్ రహెమాన్, ఖయ్యుం నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. గ్రూప్–ఏలో చివరి లీగ్ మ్యాచ్‌లో గురువారం జిల్లాస్టేడియంలో మహబూబ్‌నగర్‌తో ఆదిలాబాద్‌తో తలపడనుంది. టోర్నీలో విజేతగా నిలవాలి అండర్–19 రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్టు మళ్లీ విజేతగా నిలవాలని మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ మనోహర్‌రెడ్డి అన్నారు. ఉదయం స్టేడియంలో మహబూబ్‌నగర్–నిజామాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఏక్రాగత, సమష్టిగా ఆడాలని కోరారు. జిల్లాలో నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తారని అన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, వెంకటరామారావు, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్, తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌పై నెగ్గిన కరీంనగర్ జడ్చర్లటౌన్: జడ్చర్ల ఎర్రసత్యం స్మారక క్రీడామైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 42పరుగుల తేడాతో ఆదిలాబాద్‌ను ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు నిర్ణీత 47ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఆ జట్టులో అజయ్‌రెడ్డి (104: 109 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేసి, జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మరో బ్యాట్స్‌మన్ సిద్ధార్థ్‌రెడ్డి (56: 73 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ఆదిలాబాద్ బౌలర్లలో రోహన్ మూడు, ప్రదీప్, సైఫ్ అలీ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. 239పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆదిలాబాద్ 43.4 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయ్యారు. జట్టులో ఒంటరిపోరాటం చేసిన సైఫ్ ఆలీ (95: 113 బంతుల్లో 6 ఫోర్లు)కి మరో ఎండ్‌లో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా సహకరించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కరీంనగర్ జట్టులో అశోక్ మూడు, విష్ణు, సిద్ధార్థ్‌రెడ్డి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. గురువారం ఇదే మైదానంలో కరీంనగర్–నిజామాబాద్ జట్లు తలపడనున్నాయి.