Union minister Suresh Prabhu
-
రిక్తహస్తం
బడ్జెట్లో గుంటూరు డివిజన్‌కు నూతన కేటాయింపులు శూన్యం రైల్వే జోన్ ప్రస్తావనే లేదుమౌలిక వసతులకంటే టెక్నాలజీకే ప్రాధాన్యం పెండింగ్ ప్రాజెక్టులకే నిధులుసామాన్య ప్రయాణికుల్లో తీవ్ర నిరాశ నవ్యాంధ్రరాజధానిలో బడ్జెట్ రైలు ఆగలేదు. గుంటూరు రైల్వే డివిజన్‌కు నూతన కేటాయింపుల ఊసే లేదు. ఇప్పుడిప్పుడే రాజధాని అమరావతి నిర్మాణ పనులు పుంజుకుంటున్న నేపథ్యంలో గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి కనెక్టవిటి అత్యవసరం. బడ్జెట్ కేటాయింపుల్లో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు మినహా నూతన రైళ్లు, రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. నగరంపాలెం (గుంటూరు) కేంద్రమంత్రి సురేష్‌ప్రభు గురువారం పార్లమెంట్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ గుంటూరు డివిజన్ ప్రజలను నిరాశకు గురిచేంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై చేస్తున్న హడావుడి కార్యరూపం దాల్చేందుకు చాలాకాలం పట్టేలా ఉందని భావించారో ఏమో కనీసం రాజధాని ప్రాంతంలో రైల్వేలైన్ల అభివృద్ధిపై హామీలు కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. మౌలిక వసతుల కంటే టెక్నాలజీకే ప్రాధాన్యమిచ్చారు. వీటికి నిధులొచ్చే అవకాశం.. గుంటూరు - విజయవాడకు రాజధాని ప్రాంతమైన అమరావతి మీదుగా సుమారు 85 కి.మీ, నల్లపాడు-బీబీనగర్‌కు 243 కి.మీ డబ్లింగ్ సర్వేకు అనుమతించింది. ఇక విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా నూతన రైల్వేజోన్ ఊసేలేదు. డివిజన్లో ప్రధానమంత్రి ప్రయార్టీ ప్రాజెక్టుల కింద నడుస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి పనులకు రూ.182 కోట్లు, గతంలో పనులు ప్రారంభించి ఆగిపోయిన మాచర్ల-నల్లగొండ రైల్వే లైన్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. దేశం మెత్తంలోని పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలపడం ద్వారా డివిజన్లో ప్రస్తుతం జరుగుతున్న తెనాలి-గుంటూరు డబ్లింగ్, గుంటూరు- నంద్యాల విద్యుదీకరణ పనులకు బడ్జెట్ నిధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధుల సమర్థతను బట్టే సౌకర్యాలు రాష్ట్రప్రభుత్వ కేంద్రమంత్రి సురేష్‌ప్రభు గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో భాగస్వామ్యంతో గుంటూరు-నంద్యాల డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. మేళచెర్వు-జగ్గయ్యపేట పెండింగ్ ప్రాజెక్టుకు రూ.110 కోట్లు కేటాయింపు ద్వారా భవిష్యత్తులో గుంటూరు డివిజన్‌కు విష్ణుపురం మీదుగా సరుకురవాణా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక వివరాలు లేకుండా దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లకు వైఫై, 311 స్టేషన్లులో సీసీ కెమేరాల ఏర్పాటు, అన్ రిజర్వుడ్, సూపర్‌ఫాస్ట్ అంత్యోదయ ట్రైన్లు, దీన్‌దయాళ్ కోచ్‌లు, రిజర్వేషన్, పర్యటకరంగ ప్రయాణికుల కోసం హమ్‌సఫర్, తేజస్, ఉదయ్, రైళ్లు నడపాలని ప్రకటించారు. దీని వలన జోన్ స్థాయిలో అధికారుల సమర్థతను బట్టి, ప్రజప్రతినిధులు రైల్వే బోర్డుపై తెచ్చే ఒత్తిడి వలనే ఈ సౌకర్యలు డివిజన్‌కు సమకూరే అవకాశం ఉంది. భద్రతకు ఆన్లైన్ టెక్నాలజీ రైల్వే శాఖలో ఆన్లైన్ టెక్నాలజీని ప్రయాణికులకు, భద్రతకు విస్తృతంగా వినియోగించేలా పథకాల రూపకల్పన చేయనున్నారు. ప్లాట్ ఫాం టికెట్‌ను యాప్ ద్వారా అందించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. సగటు రైల్వే ప్రయాణికుడికి మేలు చేయలేని బడ్జెట్‌గా దీనిని రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్లో 2016-17 సాధించనున్న లాభాలు ప్రస్తావించటం, పీపీపీ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ద్వారా, రైల్వేశాఖలో భవిష్యత్తులో జరిగే ప్రయివేటీకరణకు ఇది నాంది బడ్జెట్ అవుతుందంటున్నారు. ఇక ఉద్యోగుల సంక్షేమంపై కనీస ప్రస్తావనే లేదు. మంగళగిరికీ మొండిచేయి.. మంగళగిరి : నవ్యాంధ్ర నూతన అమరావతి రాజధానిలో ప్రధాన స్టేషన్‌గా వున్న మంగళగిరిలోనే బడ్జెట్ రైలు కూత వినిపించలేదు. అధికారులు,అధికారపార్టీనేతలు గొప్పగా చెప్పిన రైల్యే లైన్లు విస్తరణ,దేశనలుమూలలకు నూతన రైళ్లు దక్కకపోగా సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్న కనీస మౌలిక వసతులుకు బడ్జెట్లో స్థానం దక్కకపోవడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. స్టేషన్లో కనీసం రెండో రిజర్యేషన్ కౌంటర్, ప్రయాణికుల విశ్రాంతి గదులతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు ఏర్పాటుకు దిక్కు లేకపోవడం విశేషం. గత ఏడాది దక్షిణ మధ్య రైల్యే జీఎం పర్యటించిన సమయంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల సంక్షేమసంఘం ప్రతినిధులు కలిసి పలు వినతులు చేశారు.రాజధాని స్టేషన్లో మరిన్ని మౌలికవసతులతో పాటు స్టేషన్ అభివృద్ధికి మరిన్ని ప్రతిపాదనలు చేశామని బడ్జెట్లో నిధులు కెటాయించిన వెంటనే స్టేషన్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని చెప్పిన అధికారులు ఆమేరకు చేతలలో సాధించలేకపోవడం గమనార్హం. -
సిక్కోలు ఆశలపై నీళ్లు
ఎన్నో ఆశలను రేకెత్తించిన రైల్వే బడ్జెట్ నిరుత్సాహపర్చింది. జిల్లా ప్రజల ఆశలపై నీళ్లుచల్లింది. రైల్వేపరంగా ఒక్క సమస్యకూ పరిష్కారం లభించలేదు. కనీసం జిల్లా డిమాండ్లపై కన్నెత్తయినా చూడలేదు. కొత్త రైలు కూత కూడా వినిపించలేదు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన రైళ్లను పొడించనూ లేదు. ఎంతో ఊరించిన రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడం నిరుద్యోగ యువతను నీరుగార్చింది. ఈ ప్రాంతం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన నేతలు ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేకపోయారు. ప్రతిపాదనల సమర్పణకే పరిమితమయ్యారని జిల్లాప్రజానీకం నిరసిస్తోంది. సదుపాయాల విషయంలో ప్రకటించిన అంశాలు ఆచరణలో కనిపించవని గతం నిరూపించింది. అదే పునరావృతమవుతుందని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కనీసం వెనుకబడిన జిల్లాపై కూడా కరుణ చూపకపోవడంపై నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం టౌన్: కేంద్రరేల్వేమంత్రి సురేష్ ప్రభు పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన రేల్వేబడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు మరోసారి మొండిచేయి చూపారు. విశాఖ రేల్వేజోన్ ఊసేలేకుండా కొత్తబడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రయాణికుల ఆశలపైనీళ్లు చల్లారు. దీనికి తోడు శ్రీకాకుళం జిల్లాకు ఈసారి కొత్తగా ఎటువంటి మంజూర్లు తీసుకురాలేకపో యారు. కేంద్రమంత్రిగా అశోక్‌గజపతిరా జు, ఎంపీలుగా కింజరాపు రామ్మోహననాయు డు, కొత్తపల్లి గీతలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ జిల్లాలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టును సాధించుకోలేక పోయారు. విశాఖ జోన్ ఏర్పాటైతే కొత్తగా 6 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. జిల్లాలను ఉత్తరాది రాష్ట్రాల్లో కలపడం వల్ల ఇక్కడున్న నిరుద్యోగులకు అవకాశాలు రాకుండా పోయాయి. ఉత్తరాది యువకులకు జిల్లా వ్యాప్తంగా గ్యాంగ్ మెన్లు, ట్రాక్మెన్లు, గేట్‌మెన్‌లుగా నియమించుకున్నారు. ఈప్రాంతంలో పెద్దసంఖ్యలో వారే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక స్టేషన్ మాస్టరు, టీటీ, రేల్వేకానిస్టేబుళ్లు అంతా వారే పనిచేస్తున్నారు. కొత్తజోన్ వస్తే ఆ అవకాశాలన్నీ తెలుగువారికే దక్కుతాయని ఆశపడ్డా రేల్వే మంత్రి నెరవేర్చలేదు. కొత్త రైళ్ల జాడే లేదు... ఉత్తరాది రాష్ట్రాలను కలుపుతూ కొత్తరైళ్లకు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. నౌపడా- రాయఘడ్ మార్గాన్ని కలిపేందుకు పర్లాకిమిడినుంచి కొత్తలైన్ మార్గం ఏర్పాటుకు కేటాయింపులు జరగలేదు. జి.సిగడాం నుంచి రాజాం మీదుగా విజయనగరంకు రైలు మార్గం ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. జిల్లాలో కొత్త రేల్వేహాల్ట్‌లు ఇవ్వలేదు. కేవలం రేల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఎల్సీడీ టీవీలు ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. పలాస, బెండిగేటు, పొందూరు రేల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల పనులు పూర్తిచేసేందుకు మాత్రమే నిధులు కేటాయించారు. రేల్వేస్టేషన్ల ఆధునీకరణ ఊసేలేదు. కొత్తరైళ్ల మంజూరు లేనట్టే.. జిల్లా మీదుగా ప్రయాణించేందుకు పాతరైళ్లు మినహా కొత్తరైళ్లు ఈ బడ్జెట్లో కేటాయించలేదు. పాతవాటికి హాల్ట్‌లైనా మంజూరవుతాయని ఆశపడ్డ ప్రయాణికులకు నిరాశే మిగిలింది. రైళ్ల వేగం పెంచుతామని మంత్రి ప్రకటించినప్పటికి ఏఏ రైళ్లు వేగం పెరుగుతాయో అందులో పొందుపరచలేదు. కొత్తగా లైన్ల ఏర్పాటు లేకుండా వేగం పెంచడానికి ఎలా వీలౌతుందని రేల్వే ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. -
రైల్వే జోన్‌పై నాన్చుడు
- నిర్దిష్ట హామీ ఇవ్వని కేంద్రమంత్రి - మంత్రి వైఖరిపై సందేహాలు - నిరాశ పర్చిన సురేష్ ప్రభు పర్యటన విశాఖపట్నం సిటీ : రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ దిశగా స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేత వైఖరి అవలంభించారు. చూస్తున్నాం...పరిశీలిస్తున్నాం అని చెప్పి తప్పించుకున్నారు. విశాఖలో బుధవారం బీజేపీ సభలో పాల్గొన్న ఆ యన్ను రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, రైల్వే జోన్ ప్రకటించాలని కోరారు. వీరి విన్నపాల తర్వాత ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు గానీ ఇస్తామని సూటిగా ప్రకటించలేదు. విజయవాడ-గుంటూరు, గుంతకల్లులలో కూడా రైల్వే జోన్ కోసం అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జోన్‌పై మంత్రి మాటలు సందేహాలకు తావిస్తున్నాయి. జోన్ స్వరూపంపై కూడా రైల్వే మంత్రి నేరుగా స్పందించలేదు. అత్యధిక ఆదాయాన్నిచ్చే కేకే లైన్‌ను వదులుకునేది లేదని ఒడిశా పట్టుబడుతోంది. కేకే లైన్ లేని వాల్తేరు డి విజన్ ఆర్ధికంగా నిలదొక్కుకోలేదు. అందుకే ప్రస్తుత వాల్తేరు డివిజన్‌తో పాటు రాష్ట్ర పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ అంశంలో కూడా మంత్రి సురేష్ ప్రభు స్పష్టత ఇవ్వకపోవడంపై రైల్వే వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో ఆర్ఆర్బి పరీక్షా కేంద్రం డిమాండ్‌ను కూడా మంత్రి పట్టించుకోలేదు. మొత్తం మీద రైల్వేమంత్రి పర్యటన ఉత్తరాంధ్ర వాసులకు కొంత నిరాశే మిగిలింది. పోర్టు కాలుష్య సమస్య పరిష్కారానికి కూడా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. తగినన్ని రైల్వే రేక్‌లు లేకపోవడం వల్ల పోర్టులోని బొగ్గు, ఇనుప ఖనిజం రవాణా ఆలస్యమవుతోందని పలువురు మంత్రికి వివరించారు. విశాఖ పోర్టుకు రైల్వే రేక్ కేటాయింపులు పెంచాలని కోరారు. దీనిపై మంత్రి హామీ ఇవ్వలేదు. రైల్వే శాఖ రేక్‌ల సంఖ్య పెంచలేమని తేల్చిచెప్పారు. ప్రైవేట్ కంపెనీలే రేక్‌లను నిర్మించుకుని రవాణా చేసుకునే వెసులబాటు కల్పిస్తామన్నారు. జోన్‌పై నిరాశ పరిచారని శ్రామిక్ యూనియన్ మహిళా విభాగం అధ్యక్షురాలు షలీల్ ఆవేదన వ్యక్తంచేశారు. స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఓబీసీ రైల్వే ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు పెదిరెడ్ల రాజశేఖర్ వ్యాఖ్యానించారు. -
‘తూర్పు’ చేరని రైలు
ఆవిరయ్యాయి. అనుకున్నట్టే మన ‘సార్లు’ ఈసారి కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సాధించితీరతామన్న ఎంపీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గతవారం హైదరాబాద్‌లో సమీక్షించి ఫలితమేమిటని జిల్లావాసులు నిట్టూరుస్తున్నారు. కాకినాడ మెయిన్ లైన్‌ను ఈసారి పట్టాలెక్కించాలన్న కృష్ణారావు సూచనకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పుడు.. బడ్జెట్లో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల్ని కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు కరుణించలేదు. నాలుగు దశాబ్దాలుగా కాకినాడ సహా జిల్లావాసులు గంపెడాశతో ఎదురు చూస్తున్న కాకినాడ మెయిన్‌లైన్ డిమాండ్‌కు బడ్జెట్లో రిక్తహస్తమే ఎదురైంది. ఎప్పుడో ఆమోదం లభించిన ప్రాజెక్టు కావడంతో ఏటా మాదిరిగానే బడ్జెట్లో మొక్కుబడిగా రూ.10 లక్షలు విదిల్చారు. కేవలం 21 కిలోమీటర్ల నిడివి కలిగిన లైన్ నిర్మాణంతో కాకినాడను మెయిన్‌లైన్‌తో అనుసంధానించే దిశగా ఎంపీల ప్రయత్నం కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు సాధిస్తామని ఆర్భాటంగా ప్రకటించే ఎంపీలు పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించే కొత్త ప్రభుత్వం.. మొదటి బడ్జెట్ అద్భుతంగా ఉంటుందని ఊహించిన ప్రజలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇదివరకటి ప్రభుత్వాల బాటలోనే పయనించిన ‘మోదీ రైలు’ షరా మామూలుగానే ‘తూర్పు’ తీరం చేరలేదు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనకు కానీ, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు కానీ, కొత్త రైళ్ల ప్రకటనకు కానీ చోటు లేకుండా పోయింది. రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సంక్షేమం అనే రెండు అంశాలనూ పక్కనపెట్టి రూపొందించిన ఈ బడ్జెట్ ప్రగతినిరోధకంగా ఉందని, మోదీ రైల్ గాడీ ఒట్టి గారడీగా మిగిలిందని జిల్లాకు చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారీ అన్యాయమే.. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రతిసారీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 42 మంది ఎంపీలు ఉన్నప్పుడే న్యాయం జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయింది. ఆంధ్రావాసుల కలగా ఉన్న విజయవాడ, విశాఖ జోన్ల కోరిక నెరవేరడంలేదు. ప్రత్యేక రాష్ట్రంలో రైల్వే లైన్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు లేకపోవటం బాధాకరం. - పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి, పీఏసీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాశపరచిన బడ్జెట్ రైల్వే బడ్జెట్ జిల్లావాసుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కొత్త ప్రభుత్వమైనా క్లియర్ చేస్తుందనుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు, రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదో చేస్తుందని ప్రజలు ఆశ పడ్డారు. కనీసం కొత్త రైళ్లను కూడా రైల్వే మంత్రి ప్రకటించకపోవడం విచారకరం. కాకినాడను మెయిన్ రైల్వే లైనుతో అనుసంధానించడం, కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను ఏర్పాటువంటి డిమాండ్లు దీర్ఘకాలంగా ఉన్నవే. వాటిని మరోసారి నిర్లక్ష్యం చేశారు. - ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనం రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపారు. రాష్ట్రానికి కొత్త లైన్లు, కొత్త రైళ్లు వస్తాయని, ముఖ్యంగా కోనసీమ రైల్వేలైనుకు మోక్షం కలుగుతుందని ప్రజలు ఆశించారు. విజయవాడ రైల్వే జోన్ ఏర్పాటు డిమాండ్ అసలు ప్రస్తావనకే నోచుకోలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా ఏ ప్రయోజనాలూ సాధించలేకపోయింది. ఆ పార్టీ ఎంపీల నోటికి సీఎం చంద్రబాబు తాళం వేసి పంపించడమే దీనికి కారణం. - చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట రైల్వే జోన్‌పై అన్యాయం రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే మంత్రి మొండిచేయి చూపారు. సాయం చేసి ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం అన్యాయం. సాధారణ బడ్జెట్లోనైన నిధులు కేటాయించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. లోటు బడ్జెట్‌ను భర్తీ చేయడానికి అవసరమైన మొత్తం నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను. - దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని జిల్లాకు మొండిచెయ్యి రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచెయ్యి చూపడం దారుణం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాకినాడ మెయిన్ లైన్ సాధనలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. కోనసీమలో అలంకారప్రాయంగా మారిన రైలు పట్టాలను తొలగించడం మేలు. జనాభా పరంగా రాష్ట్రంలోనే పెద్దదైన మన జిల్లాకు బడ్జెట్లో నిరాశ ఎదురవడం దురదృష్టకరం. వచ్చే బడ్జెట్లోనైనా జిల్లాకు అధిక నిధులు, కాకినాడ మెయిన్‌లైన్ పనుల కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. - వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కొత్త రైలుగాని, కొత్త లైన్లుగాని ప్రకటించలేదు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. తూర్పు తీరంలో ఏర్పాటు చేస్తామన్న కోస్తా కారిడార్‌ను పశ్చిమ తీరానికి తరలించుకుపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ ప్రాంతం రాజధాని కాబోతోంది. అక్కడికి ప్రజల రాకపోకలు పెరిగాయి. అయినా వసతుల కల్పన, కొత్త రైళ్లు వేయడంపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కొవ్వూరు - భద్రాచలం రైల్వే లైను నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. - వంతల రాజేశ్వరి, ఎమ్మెల్యే, రంపచోడవరం ఏపీకి ఏమాత్రం ప్రాధాన్యం లేదు రైల్వే బడ్జెట్లో ఏపీకి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆధునికీరణ అవసరమే. కానీ దాంతోపాటు ఎంతోకాలంగా కోరుతున్న రైల్వే లైన్ల విస్తరణ పనులు కూడా అవసరమే. వీటిపై గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చూపింది. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైనుపై జిల్లావాసులకు నిరాశే మిగిలింది. - జక్కంపూడి విజయలక్ష్మి, సీజీసీ సభ్యురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిధుల కేటాయింపు ఉంటుందని ఎదురుచూశా కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైనుకు ఈసారి రైల్వే బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుందని భావించాను. కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తారని ఎదురు చూశాను. ఇందుకోసం రైల్వే మంత్రిని, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందించాను. వారిచ్చిన భరోసాను బట్టి ఈసారి నిధులపై గట్టి నమ్మకం పెట్టుకున్నాను. పెండింగ్ ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు పార్లమెంటులో చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయింపు భారీగా ఉంటుందని ఎదురు చూశా. కానీ ఆ స్థాయిలో నిధులు కేటాయించలేదు. - డాక్టర్ పండుల రవీంద్రబాబు, ఎంపీ, అమలాపురం ప్రతి రైల్వే బడ్జెట్లో ఇదే నిర్లక్ష్యం కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను పెండింగ్ ప్రాజెక్టుపై పధ్నాలుగేళ్లుగా ప్రతి రైల్వే బడ్జెట్లో కొనసాగుతున్న నిర్లక్ష్యమే ఈసారీ కొనసాగింది. కోనసీమవాసులు చిరకాల వాంఛ అయిన ఈ లైనును సాధించడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. 15 ఏళ్ల నుంచి ఇక్కడి అవసరాలు, ప్రజల ఆకాంక్షలను రైల్వే శాఖ కనీసంగా కూడా పరిగణనలోకి తీసుకోవటంలేదు. వినతుల ద్వారా ఈ లైను సాకరమయ్యే పరిస్థితి కనిపించటంలేదు. ప్రజా ఉద్యమాల ద్వారానే రైల్వే శాఖ దిగివచ్చేలా చేయాలి. - గిడుగు రుద్రరాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీసీసీ అమలాపురం అక్కరకు రాని రూ.5 కోట్లు కోటిపల్లి - నర్సాపురం రైల్వేలైనుకు ఈసారి కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తారని, దీంతో పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ బడ్జెట్లో కేవలం రూ.5 కోట్లు కేటాయించారు. గతంలో ఎప్పుడూ రూ.కోటి లేదా రూ.అరకోటి కేటాయించే రైల్వే శాఖ ఈసారి కాస్త పెంచింది. అయినా అవి అక్కరకు రావు. ఇక ప్రజా ఉద్యమానికి తెర తీయాల్సిందే. మా సమితి ద్వారా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. - డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, కన్వీనర్, కోనసీమ రైల్వే సాధన సమితి, అమలాపురం అభివృద్ధి నిరోధక బడ్జెట్ రైల్వే బడ్జెట్ పూర్తి అభివృద్ధి నిరోధకంగా ఉంది. విభజన అనంతరం విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఊసే లేకుండా పోయింది. కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైను మినహా కొత్త రైళ్లు కూడా లేవు. పెండింగ్ ప్రాజెక్టులైన కాకినాడ మెయిన్‌లైన్, కోటిపల్లి - నర్సాపురం, కొవ్వూరు - భద్రాచలంపై ఎలాంటి ప్రకటనా లేకపోవడం బాధాకరం. ప్రజలపై భారం లేదంటూనే సిమెంటు, స్టీలు, బొగ్గుపై రవాణా చార్జీలు పెంచారు. తద్వారా పరోక్ష భారం పడుతుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రైల్వే టిక్కెట్ల ధరలు కూడా తగ్గాలి. - కందుల దుర్గేష్, అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ వాస్తవానికి దగ్గరగా ఉంది రైల్వే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంది. గతంలో పెండింగ్‌లో ఉన్న పథకాలు పూర్తి చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. చార్జీలు పెంచకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప విషయం. ప్రత్యేక సదుపాయాలు కల్పించి ప్రయాణికులకు పెద్ద పీట వేశారు. సాధారణ రైళ్లలోనూ ప్రయాణికులకోసం అనేక సదుపాయాలు కల్పించడం అభినందనీయం. - వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షులు, బీజేపీ ప్రజల ఆశలను నట్టేట ముంచారు జిల్లా ప్రజల ఆశలను ప్రజాప్రతినిధులు నట్టేట ముంచారు. పెండింగ్‌లో ఉన్న కాకినాడ మెయిన్ లైన్, కోటిపల్లి - నర్సాపురం లైన్లపై బడ్జెట్లో కనీస ఊసెత్తకపోవడం విచారకరం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటే రైల్వే రంగాన్ని ప్రైవేటుపరం చేయడమే. - తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి, సీపీఐ శుష్క వాగ్దానాలు..శూన్యహస్తాలు ఎటువంటి కేటాయింపులూ లేని మొదటి రైల్వే బడ్జెట్‌గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలతో మంత్రి ప్రసంగం సాగింది. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం దారుణం. జిల్లా ప్రజలను నిరాశపర్చడమేకాకుండా దేశ ప్రజలను మోదీ మోసం చేశారు. - దడాల సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీపీఎం