V. dinesh reddy
-
రోడ్‌షో అదుర్స్
దినేశ్‌రెడ్డి ప్రచారానికి విశేష స్పందన హోరెత్తిన సాజిద్‌అలీ బైక్‌ర్యాలీ ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు బోడుప్పల్,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి, ఆ పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి సయ్యద్ సాజిద్అలీలు నిర్వహిస్తున్న రోడ్‌షోలు, ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో వారివురు పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ఆయా ప్రాంతాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దినేశ్‌రెడ్డి శనివారం రాత్రి బోడుప్పల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు వరమన్నారు. ప్రతి పేదోడికి మేలు జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తనను ఈఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని హామీఇచ్చారు. జోరుగా బైక్‌ర్యాలీ నాంపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి సయ్యద్ సాజిద్‌అలీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన బైక్‌ర్యాలీకి విశేష స్పందన లభించింది. నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి, రెడ్‌హిల్స్ డివిజన్లలోని బోయిగూడ కమాన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సీతారామ్‌భాగ్ మీదుగా నోబుల్ టాకీస్ చౌరస్తా, మల్లేపల్లి బడేమజీదు, నాంపల్లి మార్కెట్, బజార్‌ఘాట్, నాంపల్లి కోర్టులు, ఏసీగార్డ్స్, శాంతినగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా యువకులు పార్టీ జెండాలు పట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా ఈ బైక్‌ర్యాలీకి అన్నివర్గాల నుంచి మంచి మద్దతు లభించింది. ఈసందర్భంగా సాజిద్‌అలీ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ‘ఫ్యాన్’గాలి వీస్తోం దని, తనతోపాటు పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సభలను సక్సెస్ చేయండి : సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదివారం నిర్వహించే ప్రచారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సాజిద్‌అలీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. -
ఓర్వలేకే ఆరోపణలు: వి.దినేశ్‌రెడ్డి
ఇంటర్వ్యూ: దినేశ్‌రెడ్డి * వీస్తోంది జగన్ ప్రభంజనమే * రాజన్న ఆశయాలే జగన్ శ్వాస * అందుకే వైఎస్సార్సీపీలో చేరా * తెలంగాణతో విడదీయలేని బంధం * అధికారిగానూ సహకరించా * టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తా వనం దుర్గాప్రసాద్: హోరెత్తుతున్న జగన్నినాదం కొన్ని రాజకీయ పార్టీలకు గుండెదడ పుట్టిస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి 420 ఆలోచనలు చేస్తున్నారని మాజీ డీజీపీ వి.దినేశ్‌రెడ్డి మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా బ్యానర్లు కడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల రాష్ట్ర గతినే మార్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల వారసుడిగా ఎదిగిన జగన్‌కే జనం పట్టం కడతారని దినేశ్ స్పష్టం చేశారు. రాజకీయ పబ్బం కోసం అవినీతి మచ్చ వేస్తున్న పార్టీలు, నేతలు... జనమంతా జగన్ వైపే ఎందుకున్నారో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. తెలంగాణతో విడదీయలేని బంధమే ఈ ప్రాంతంలో తనను ప్రజాసేవకు పురిగొల్పిందంటున్న దినేశ్‌రెడ్డి ‘జనాయుధం’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పోలీసు విభాగంలో 36 ఏళ్లు నిస్వార్థ సేవ చేసిన నేను అనేక ఉన్నత పదవులు నిర్వహించా. ప్రజలకు మేలు చేసే సంస్కరణలు తీసుకొచ్చా. పదవీ విరమణ తర్వాత కూడా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన నాకు వైఎస్ రాజశేఖరరెడ్డితో పనిచేసే అవకాశం రావడం ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఉన్నతాధికారిగా ఆయన వద్దకు వెళ్లిన ప్రతిసారీ ఆయన ప్రజల గురించే మాట్లాడేవారు. ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కూడా అంతే. నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారు. వారికే అంకితమవ్వాలనే ఆకాంక్ష ఆయనది. ఇవే నన్ను ఆకర్షించాయి. ఆయన నేతృత్వంలోనే ముందుకెళ్లాలని నా అంతరాత్మ చెప్పింది. దాంతో వైఎస్సార్సీపీలో చేరా. టీడీపీవి 420 ఆలోచనలు జగన్మోహన్రెడ్డిపై టీడీపీ చేస్తున్న ఆలోచనల్లో అర్థం లేదు. అందంతా నాన్సెన్స్. ఏ ఆధారంతో ఆయనపై నిందలు వేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదంతా వైఎస్ వ్యతిరేక శక్తుల కుట్రగా భావించాలి. అవన్నీ 420 ఆలోచనలు. ఈ ఆరోపణలు చూస్తుంటే నాక్కూడా బాధేస్తోంది. మాజీ పోలీసు అధికారిగా నాకున్న సమాచారంతో చెబుతున్నా. జగన్‌పై ఓ వర్గం కుట్ర చేస్తోంది. దీని వెనుక ప్రజా విశ్వాసం కోల్పోయిన పార్టీలున్నాయి. నాయకులున్నారు. ఈ శక్తులకు వత్తాసు పలుకుతూ ఎల్లో పత్రికలు జగన్‌పై ముప్పేట దాడికి దిగాయి. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఎల్లో మీడియా వాస్తవ రూపాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. ఎవరెన్ని అనుకున్నా ఒక్కటి మాత్రం నిజం. ప్రజలందరూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. వైఎస్ స్మృతులను చెరిపేసే కుట్ర నా సర్వీసులో ఎన్నో కేసులు చూశాను. ఆ అనుభవంతోనే చెబుతున్నా. జగన్మోహన్రెడ్డిపై చేసిన ప్రతీ ఆరోపణలోనూ రాజకీయ కోణమే కన్పిస్తోంది. మొదట్లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేసును సీబీఐకి అప్పగించారు. ఏం తేలింది? చార్జిషీట్లో రూ.300 కోట్లని పేర్కొన్నారు. ఇది కూడా ఆరోపణ మాత్రమే. కోర్టులో నిరూపణ కాని అంశం. ఇతర నేతలపై ఇలాంటి ఆరోపణలు లేవా? కోర్టులు తప్పుబట్టలేదా? వాటిని పత్రికలు ఎందుకు హైలెట్ చేయవు. కారణం.. జనానికి జగన్‌ను దూరం చేయాలి. వైఎస్ స్మృతులను చెరిపేయాలి. కానీ అది సాధ్యం కాదు. దళితులు, మైనార్టీలు, మహిళలు, యువత, ఉద్యోగులు.. ఒకరేంటి? వైఎస్ పాలనను అంతా రామరాజ్యం అన్నారు. మళ్లీ అలాంటి పాలన తేగల సత్తా ఒక్క జగన్‌కే ఉంది. దమ్ముంటే సర్వే చేయించమనండి? ఇదే ఫలితం వస్తుందో? రాదో? చూడండి. అభివృద్ధి పత్రికల మహిమే హైదరాబాద్‌ను చంద్రబాబే అభివృద్ధి చేశారని ఆయనకు వత్తాసు పలికే పత్రికలు పతాక శీర్షికన ప్రకటిస్తున్నాయి. అదే నిజమైతే చంద్రబాబు రెండుసార్లు ఎందుకు ఓడిపోతారు? ఆయనపై మైనారిటీల్లో ఎందుకంత వ్యతిరేకత వస్తుంది? గోరంతను కొండంతగా చూపే పత్రికల ప్రచారం మినహా, ఇందులో వాస్తవం లేదు. వైఎస్ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయి. పారిశ్రామికాభివృద్ధిలో హైదరాబాద్ పరుగులు తీసింది. ఈ వాస్తవాన్ని విస్మరించి చంద్రబాబు ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆ ఆరోపణల్లో నిజం లేదు నేను తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాననే ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు. ఉద్యమ సమయంలో కాస్త కఠినంగా వ్యవహరించి ఉంటాను. అది ప్రజల కోసమే. శాంతిభద్రతల అదుపుకోసమే అలా ఉండాల్సి వచ్చింది. నేను తెలంగాణ వ్యతిరేకినే అయితే.. ఏ తెలంగాణ సభనైనా అడ్డుకున్నానా చెప్పమనండి? ఏ సభకైనా అనుమతి నిరాకరించానా? లేదే. తెలంగాణతో మమేకమయ్యా నేను స్థానికేతరుణ్ని కాదు. పుట్టింది ఇక్కడ కాకపోవచ్చు. కానీ పెరిగింది, చదువుకుంది ఇక్కడే. మా అక్కను నల్గొండ ఇచ్చాం. వియ్యం, కయ్యం అంతా తెలంగాణలోనే. బంధువులంతా తెలంగాణలోనే ఉన్నారు. తెలంగాణతో మమేకమయ్యాను అనడానికి ఇంతకన్నా ఏం కావాలి? నా సర్వీసులో తొమ్మిదేళ్లు మినహా మిగిలిన కాలం మొత్తం హైదరాబాద్‌లోనే. కాబట్టే ఇక్కడ నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నా. అభివృద్ధి చేసి చూపిస్తా మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానం. అనేక ప్రాంతాల వాళ్లు ఇక్కడ రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల రక్షణ కోసం కేం ద్రస్థాయిలో ఎంతకైనా వెళ్లగల నేత ఉండాలని భావిస్తున్నారు. అనేక మంది నా దగ్గరకొచ్చి ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక ఈ ప్రాం తంలో నిరుద్యోగులున్నారు. అభివృద్ధికి దూరమైన వాడలున్నాయి. బడుగు, బలహీనవర్గాల మహిళలు రక్షణ కోరుకుంటున్నారు. అందు కే ఈ స్థానాన్ని చాలెంజ్‌గా తీసుకున్నా. అభివృద్ధి చేసి చూపిస్తా. ప్రాణాలు పణంగా పెట్టడానికైనా సిద్ధం పోలీసు అధికారిగా ప్రజలను నేరుగా కలిసే అవకాశం ఉండేది కాదు. కానీ ఏ గల్లీలో ఏం జరిగినా వెంటనే స్పందించేవాణ్ని. పరిష్కారం చూపేవాడిని. అయితే ఈ విషయం ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను నేరుగా వారి వద్దకే వెళ్తా. సమస్యలు తెలుసుకుంటా. ఏ క్షణంలోనైనా నాతో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేకంగా టోల్ఫ్రీం నంబరు ఏర్పాటు చేస్తా. మైనార్టీలకు బాసటగా నిలుస్తాను. అవసరమైతే ప్రాణాలు పణంగా పెడతాను. క్రమశిక్షణ నరనరాన నిండిన మాజీ పోలీసు అధికారిగా ఇస్తున్న భరోసా ఇది. నన్ను నమ్మండి. -
81 అసెంబ్లీ.. 13 లోక్‌సభ..
-
81 అసెంబ్లీ.. 13 లోక్‌సభ..
* తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైఎస్సార్ సీపీ * 5 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎంతో అవగాహన సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసింది. 81 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కాగా, సీపీఎంతో సీట్ల అవగాహనలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పాలేరు, మధిర నియోజకవర్గాలు, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట, భద్రాచలం, మహబూబాబాద్ స్థానాల్లో వైఎస్సార్సీపీ తన అభ్యర్థులను ప్రకటించలేదు. పార్లమెంట్ అభ్యర్థులు వీరే.. 1.ఆదిలాబాద్ -ఆదె లీలారాణి, 2. కరీం నగర్ - మీసాల రాజారెడ్డి, 3. నిజామాబాద్- ఎస్.రవీందర్‌రెడ్డి, 4.జహీరాబాద్- ఎండీ మొహియుద్దీన్, 5. మల్కాజ్గిరి- వి.దినేష్ రెడ్డి, 6.హైదరాబాద్- బొడ్డు సాయినాథ్‌రెడ్డి, 7.నాగర్‌కర్నూలు- జె.ధర్మరాజ్, 8.నల్లగొండ - గున్నం నాగిరెడ్డి, 9.మహబూబాబాద్- తెల్లం వెంకట్రావ్, 10.చేవెళ్ల-కొండా రాఘవరెడ్డి, 11.ఖమ్మం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 12.మహబూబ్‌నగర్ -ఎస్.ఎ.రెహమాన్, 13.మెదక్ -ప్రభుగౌడ్. వైఎస్సార్సీపీ తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ షబ్బీర్ హుస్సేన్ చెన్నూరు(ఎస్సీ) మేకల ప్రమీల బెల్లంపల్లి (ఎస్సీ) ఎరుకల రాజ్‌కిరణ్ మంచిర్యాల సయ్యద్ అఫ్జలుద్దీన్ ఆసిఫాబాద్ (ఎస్టీ) మహేశ్వరం శంకర్ ఆదిలాబాద్ బి.అనిల్‌కుమార్ బోథ్ (ఎస్టీ) గేదెం తులసీదాస్ నిర్మల్ అల్లూరి మల్లారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎస్కె మహబూబ్ బోధన్ కాటిపల్లి సుదీప్‌రెడ్డి జుక్కల్( ఎస్సీ) నాయుడు ప్రకాష్ బాన్సువాడ రావుట్ల శోభనా మహేందర్‌గౌడ్ ఎల్లారెడ్డి పెద్దపట్లోల సిద్ధార్థరెడ్డి కామారెడ్డి పైలా కృష్ణారెడ్డి నిజామాబాద్ (అర్బన్) అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిజామాబాద్ (రూరల్) బొడ్డు గంగారెడ్డి బాల్కొండ పాలేపు మురళి కరీంనగర్ జిల్లా కోరుట్ల అల్లల సంతోష్‌రెడ్డి జగిత్యాల కట్టా సంధ్యాశివకుమార్ ధర్మపురి (ఎస్సీ) అక్కన్నపల్లి కుమార్ పెద్దపల్లి ఎం.ఎ.ముస్తాఖ్‌పాష కరీంనగర్ కటికనేని నాగేశ్ చొప్పదండి (ఎస్సీ) మలియాల ప్రతాప్ వేములవాడ ముసుకు వెంకటరెడ్డి సిరిసిల్ల వేలుముళ్ల శ్రీధర్‌రెడ్డి మానకొండూరు (ఎస్సీ) సొల్లు అజయ్‌వర్మ హుజూరాబాద్ సందమల్ల నరేష్ హుస్నాబాద్ సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి మెదక్ జిల్లా మెదక్ అల్లారం కృష్ణదాస్ నారాయణఖేడ్ అప్పారావు షెట్కర్ నర్సాపూర్ డి.బస్వానందం జహీరాబాద్ (ఎస్సీ) నల్లా సూర్యప్రకాష్ సంగారెడ్డి జి.శ్రీధర్‌రెడ్డి దుబ్బాక శ్రావణ్‌కుమార్ గజ్వేల్ దొంతి పురుషోత్తంరెడ్డి రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి గుడిమెట్ల సూర్యనారాయణరెడ్డి కుత్బుల్లాపూర్ కొలను శ్రీనివాస్‌రెడ్డి ఉప్పల్ అంపాల పద్మారెడ్డి ఇబ్రహీంపట్నం ఎరుకల చంద్రశేఖర్ ఎల్బీనగర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి మహేశ్వరం దేప భాస్కర్‌రెడ్డి రాజేంద్రనగర్ ముస్తాబా అహ్మద్ సయ్యద్ శేరిలింగంపల్లి ముక్కా రూపానందరెడ్డి వికారాబాద్ చింతల క్రాంతి కుమార్ హైదరాబాద్ జిల్లా మలక్‌పేట లింగాల హరిగౌడ్ ఖైరతాబాద్ పి.విజయారెడ్డి జూబ్లీహిల్స్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి సనత్‌నగర్ వెల్లాల రాంమోహన్ కార్వాన్ బి.శ్రీకాంత్‌లాల్ సికింద్రాబాద్ ఆదం విజయ్‌కుమార్ కంటోన్మెంట్ (ఎస్సీ) పి.వెంకట్రావ్ నాంపల్లి సిద్దిఖీ ముషీరాబాద్ బాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట పి.జయదేవరెడ్డి మహబూబ్‌నగర్ బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి మక్తల్ వి.జగన్నాధరెడ్డి అలంపూర్ (ఎస్సీ) బంగి లక్ష్మణ్ నాగర్‌కర్నూల్ మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి అచ్చంపేట (ఎస్సీ) బి.రవీందర్ కల్వకుర్తి ఎడ్మ కిష్టారెడ్డి కొల్లాపూర్ యాపర్ల మహేశ్వరి నల్లగొండ జిల్లా దేవరకొండ (ఎస్టీ) జటావత్ నాగేశ్వర్ రావు నాయక్ నాగార్జునసాగర్ ఎం.రవీందర్‌రెడ్డి హుజూర్నగర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి సూర్యాపేట బీరవోలు సోమిరెడ్డి మునుగోడు ఎం.గవాస్కర్‌రెడ్డి భువనగిరి గూడూరు జైపాల్‌రెడ్డి నకిరేకల్ (ఎస్సీ) ఎన్.స్వామి తుంగతుర్తి (ఎస్సీ) ఇరుగు వెంకటేశ్వర్లు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) విలియం మునిగాల డోర్నకల్ సుజాత బానోత్ వరంగల్ వెస్ట్ భీంరెడ్డి సుధీర్‌రెడ్డి వర్దన్నపేట (ఎస్సీ) బి.రాజయ్య భూపాలపల్లి అప్పం కిషన్ ములుగు (ఎస్టీ) లోకిని సంపతి ఖమ్మం జిల్లా పినపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు ఇల్లందు (ఎస్టీ) జి.రవిబాబు వైరా (ఎస్టీ) బానోతు మదన్‌లాల్ నాయక్ సత్తుపల్లి (ఎస్సీ) మట్టా దయానంద్ కొత్తగూడెం వనమా వెంకటేశ్వర్లు అశ్వరావుపేట (ఎస్టీ) తాటి వెంకటేశ్వర్లు -
మీడియా హక్కులను కాలరాస్తున్నారు: ఏపీయూడబ్ల్యూజే
గవర్నరుకు ఏపీయూడబ్ల్యూజే ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ వి.దినేష్‌రెడ్డి తన అధికారాలతో మీడియా హక్కులను కాలరాస్తున్నారని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ఫిర్యాదు చేసింది. యూనియన్ నేతృత్వంలో సీనియర్ పాత్రికేయుల బృందం గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నరును కలిసింది. మీడియా విషయంలో డీజీపీ వ్యవహరిస్తున్న తీరును వివరించి వినతిపత్రం అందజేసింది. పాతబస్తీలో మతగురువును డీజీపీ కలిసిన వ్యవహారంపై వార్త ప్రచురించిన నేపథ్యంలో హిందూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్‌ను పోలీసులు వేధించడం పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని వారు వివరించారు. నగేష్‌కుమార్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పటికీ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. జీ-24 గంటల చానల్వారిని బెదిరించి క్షమాపణ చెప్పించుకున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీనిపై కలుగజేసుకుని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమసుందర్, వై.నరేందర్‌రెడ్డితోపాటు వివిధ పత్రికల సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు సంతకాలు చేశారు. జీ టీవీ ప్రతినిధులకు ఊరట వేధించొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘డీజీపీపై కథనం’ కేసు లో జీటీవీ ప్రతినిధులకు ఊరట కలిగింది. వీరిపై నమోదైన మూడు ఫిర్యాదుల్లో ఒక దానిని మాత్రమే ఎఫ్ఐఆర్గా పరిగణించి, మిగిలిన రెండింటినీ స్టేట్మెంట్లుగా తీసుకోవాలని పోలీసులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఆదేశించా రు. కేసు విచారణను సీసీఎస్ పోలీసులు చేపట్టాలని, జీ టీవీ ఉద్యోగులను వేధించరాదని ఆదేశించారు. -
అక్రమాస్తుల్లేవ్: డీజీపీ వి.దినేష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీబీఐ తన ఆస్తులపై విచారణ ప్రారంభించినట్లు వచ్చిన వార్తలో వాస్తవం లేదని డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.దినేష్‌రెడ్డి స్పష్టంచేశారు. తనకు అక్రమాస్తులు లేనేలేవని ఆయన గురువారం పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నెల్లూరులో తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు మాత్రమే ఉన్నాయని, తాను మాత్రం ఎలాంటి ఆస్తులనూ కొనుగోలు చేయలేదని చెప్పారు. తనను డీజీపీ కాకుండా అడ్డుకునేందుకు ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్ కేంద్ర హోంశాఖకు 2011 జూన్‌లో నిరాధారమైన ఫిర్యాదుచేశారని దినేశ్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని శివార్లలో 542 సేల్డీడ్లను ఆధారాలుగా చూపుతూ తనకు 1,500 ఎకరాలు ఉన్నాయని పార్లమెంట్ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉమేష్‌కుమార్ ఫిర్యాదుచేశారని తెలిపారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు 542 సేల్డీడ్లలో తన పేరుతో ఒక్క ఆస్తి కూడా లేదని దినేష్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆ 542 సేల్‌డీడ్‌లకు సంబంధించి మాత్రమే విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిందన్నారు. మామిడిపల్లిలో తన భార్య 7.5 ఎకరాలు కొనుగోలు చేశారని, తన పేరుతో ఒక్క సెంటు భూమి కూడా అక్కడ కొనుగోలు చేయలేదని తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో ఆ ఫిర్యాదులను ఉమేష్‌కుమార్ పంపినట్లుగా తర్వాత దర్యాప్తులో తేలింద ని తెలిపారు. ఫోర్జరీ సంతకం కేసును కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఉమేష్‌కుమార్ ఆశ్రయించగా.. కచ్చితంగా ఆ కేసును ఎదుర్కొనాల్సిందేనని న్యాయస్థానం స్పష్టంచేసిందని వివరించారు. అదే సమయంలో ఆ ఫిర్యాదులో పేర్కొన్న 542 సేల్డీడ్లపై కూడా విచారణ జరపాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని దినేష్‌రెడ్డి చెప్పారు. రాజధాని శివార్లలో ఒక రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోవారం రోజుల పాటు జరిగిన సేల్‌డీడ్ వివరాలన్నీ ఉమేష్‌కుమార్ ఫిర్యాదులో చేర్చారని చెప్పారు. సీబీఐ విచారణ తాను డీజీపీగా కొనసాగడానికి ఇబ్బంది కాబోదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
డీజీపీ ఆస్తులపై సీబీఐ ప్రాథమిక విచారణ
16నే కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాల వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డీజీపీ వి.దినేష్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఉపక్రమించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వ్యవహారంపై సీబీఐ 16వ తేదీన ప్రాథమిక విచారణ(పీఈ)కు కేసు నమోదు చేసిందని సీబీఐ ఉన్నత స్థాయి వర్గాలు బుధవారం ఢిల్లీలో వెల్లడించాయి. దినేష్‌రెడ్డి ఆస్తుల విషయమై ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై విచారణ ప్రారంభించిన న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేతో కూడిన ధర్మాసనం ఈ నెల 6న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దినేష్‌రెడ్డి ఆస్తుల క్రయ విక్రయాల దస్తావేజులను దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అందించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. అలాగే, కేసు దర్యాప్తుపై నివేదికను నాలుగు నెలల్లోగా తమకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. -
డీజీపీ దినేశ్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు
ఉమేశ్‌కుమార్ ‘ఫోర్జరీ’పై దర్యాప్తు కొనసాగుతుంది: సుప్రీం సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.దినేశ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అలాగే దినేశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పార్లమెంటు సభ్యుడు ఎం.ఎ.కాన్ సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్‌పై కూడా విచారణ కోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డీజీపీపై ఫిర్యాదు కాపీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించి దర్యాప్తు చేపట్టాల్సిందిగా నిర్దేశించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తూ చేపట్టకపోవటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ‘రాష్ట్ర పోలీస్ బాస్‌పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిం చటం దిగ్భ్రాంతి కలిగించింది’ అని పేర్కొంది. డీజీపీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, దర్యాప్తుపై స్థాయీ నివేదికను నాలుగు వారాల్లో తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. రాష్ట్రానికే చెందిన ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ దాఖలుచేసిన అప్పీలును విచారించిన జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసిం ది. డీజీపీ దినేశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు ఉమేశ్‌కుమార్ ఒక ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేయటానికి ఫోర్జరీ చేసినప్పటికీ.. దినేశ్‌రెడ్డిపై చేసిన ఆరోపణల్లో బలం ఉన్నందున దీనిపై దర్యాప్తు అవసరమని ధర్మాసనం పేర్కొంది. ‘ఫిర్యాదు బూటకమైనప్పటికీ, దానితో జతపరిచిన సేల్ డీడ్లను అక్రమమార్గంలో సేకరించినవైనప్పటికీ, ఆ పత్రాలు బూటకపు పత్రాలుగా నిర్ధారణకాలేదు. ఆరోపణల్లో కొంత బలం ఉన్నట్లయితే, ప్రతివాదికి (దినేశ్‌రెడ్డికి) నేరంలో భాగస్వామ్యం ఉన్నదని బలప రచే భౌతిక ఆధారాలు ఉన్నట్లయితే.. ఈ కేసును పూర్తిస్థాయిలో పరిశీలించాలి.. అంతేకానీ కక్ష సాధించటానికో, మరేదో స్వార్థ లక్ష్యం కోసమో ఫిర్యాదు చేశారనే ప్రాతిపదిక మీద దానిని కొట్టివేయకూడదు’ అని స్పష్టంచేసింది.