
రోడ్‌షో అదుర్స్
- దినేశ్‌రెడ్డి ప్రచారానికి విశేష స్పందన
- హోరెత్తిన సాజిద్‌అలీ బైక్‌ర్యాలీ
- ముందంజలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
బోడుప్పల్,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి, ఆ పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి సయ్యద్ సాజిద్‌అలీలు నిర్వహిస్తున్న రోడ్‌షోలు, ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో వారివురు పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ఆయా ప్రాంతాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దినేశ్‌రెడ్డి శనివారం రాత్రి బోడుప్పల్‌లో రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు వరమన్నారు. ప్రతి పేదోడికి మేలు జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తనను ఈఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని హామీఇచ్చారు.
జోరుగా బైక్‌ర్యాలీ
నాంపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి సయ్యద్ సాజిద్‌అలీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన బైక్‌ర్యాలీకి విశేష స్పందన లభించింది. నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి, రెడ్‌హిల్స్ డివిజన్లలోని బోయిగూడ కమాన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సీతారామ్‌భాగ్ మీదుగా నోబుల్ టాకీస్ చౌరస్తా, మల్లేపల్లి బడేమజీదు, నాంపల్లి మార్కెట్, బజార్‌ఘాట్, నాంపల్లి కోర్టులు, ఏసీగార్డ్స్, శాంతినగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది.
ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా యువకులు పార్టీ జెండాలు పట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా ఈ బైక్‌ర్యాలీకి అన్నివర్గాల నుంచి మంచి మద్దతు లభించింది. ఈసందర్భంగా సాజిద్‌అలీ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ‘ఫ్యాన్’గాలి వీస్తోం దని, తనతోపాటు పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ సభలను సక్సెస్ చేయండి : సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆదివారం నిర్వహించే ప్రచారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సాజిద్‌అలీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.