Vanteru Venugopal Reddy
-
వైఎస్ జగన్‌తో కొత్తపల్లి, వంటేరు భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. తాము అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, ఒక మంచి వాతావరణంలో చర్చించుకుని తామిద్దరమూ ఒక అవగాహన, ఆలోచనకు వచ్చామని కొత్తపల్లి మీడియాకు వెల్లడించారు. జగన్ చెప్పిన మాటలతో తాను 100 శాతం ఏకీభవించానన్నారు. ఈ నెల 28న జగన్ తమ జిల్లాలో పర్యటించనున్నందున అప్పుడు పార్టీలో చేరడమా.. లేక అంతకు ముందుగానే చేరడమా అనేది తర్వాత చెబుతాననని అన్నారు. మరోవైపు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కూడా ఆదివారం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్న తాను వి.విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిల ప్రోద్భలంతో ఇకపై క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇదే విషయం జగన్‌కు తెలియజేశానన్నారు. పార్టీలో చేరిన గిరిజన నేత శంకర్‌నాయక్ గిరిజన సంక్షేమ సంఘం నేత వడిత్యా శంకర్‌నాయక్ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత ఐదేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలనలో రాష్ట్రంలో గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు అన్యాయమై పోయారని శంకర్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మచిలీపట్నంకు చెందిన వైద్యురాలు, ఏపీసీసీ మాజీ కార్యదర్శి బల్లెం రాధికా మాధవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే దేవినేని చేరిక సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా రేపల్లె ఎన్నికల ప్రచార సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు ఆదివారం పార్టీలో చేరారు. రేపల్లె నియోజకవర్గంలోని రావిఅనంతవరం గ్రామం నుంచి వేలాది మందితో ర్యాలీగా వచ్చి, జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు టీడీపీ కౌన్సిలర్లు, పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. వీరికి రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మోపిదేవి వెంకట రమణరావు పార్టీలోకి ఆహ్వానం పలికారు. -
ఆలస్యంగా వాస్తవంలోకి వచ్చారు
కావలి (నెల్లూరు): నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ పట్టించుకోకుండా, ఇప్పుడు రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణానికి ఉన్న సానుకూలతలను అంగీకరించి, పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారని రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్ యార్డ్ సాధన సమితి చైర్మన్, వైఎస్సార్ సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఉన్న సాధన సమితి కమిటీ సభ్యులు కావలిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రామాయపట్నంలో ఓడరేవును నిర్మిస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎన్ని రకాలుగా చెప్పినా పట్టించుకోలేదన్నారు. సాంకేతిక నిపుణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రామాయపట్నంలో ఉన్న అన్నిరకాల సానుకూలతలతో అందజేసిన నివేదికలను ప్రాతిపదికగా చేసుకుని నిర్మాణం జరిగేలా చేయమన్నా దురుద్దేశాలు అంటగట్టారని గుర్తు చేశారు. ఎంపీలుగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దీని కోసం పలు ఉద్యమాలు చేశారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రామాయపట్నంలోనే భారీ ఓడరేవు నిర్మిస్తామని ప్రకటించడం శుభపరిణామమన్నారు. సాధన సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ వింతా కృష్ణారెడ్డి, కుందుర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఒక్క కావలిలోనే కాకుండా, ప్రకాశం జిల్లాలోనూ ఆందోళనల్లో పాల్గొని పోర్టు సాధనకు కృషి చేశారన్నారు. చంద్రబాబు అన్ని హామీలు, ప్రకటల లాగానే ఈ పోర్టు శంకుస్థాపన కూడా ఉత్తుత్తి కాకుండా, కార్యరూపం దాల్చేలా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాధన సమితి ప్రధాన కార్యదర్శి సురే మదన్‌మోహన్‌రెడ్డి, కోశాధికారి తన్నీరు మాల్యాద్రి, కార్యదిర్శి, జె.మల్లికార్జునరావు, సభ్యులు తలమంచి రవి, ఆకుమళ్ల శీనుబాబు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్ యార్డ్ సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి వెంకట నారాయణ పాల్గొన్నారు. -
టీడీపీకి వంటేరు ఝలక్
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. గతంలో జరిగిన ఎన్నికలలో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అపజయం పాలైన సంగతి తెలిసిందే.