Vehicle speed
-
హలో బాసూ.. వేగం ఎక్కువైంది.. అని కారు డ్రైవర్‌కు చెబితే!
బండెక్కితే వంద దాటాల్సిందే అనేవాళ్లు చాలా మందే ఉంటారు. రోడ్డు బాగుంటే, జనాలెవరూ లేకపోతే ఈ స్పీడు రెండింతలు కూడా అవుతుంటుంది. ఇలాంటి సమయంలోనే కాస్త అటూఇటైతే ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ఇలాంటి ప్రమాదాలను అరికట్టే అవకాశమే లేదా?.. అంటే ‘మై హూనా’అంటోంది కార్ల కంపెనీ ఫోర్డ్. అత్యవసర సమయాల్లో వాహనం వేగాన్ని తగ్గించే ‘జియోఫెన్సింగ్’టెక్నాలజీని రూపొందించింది. సిటీల్లో ఏయే ప్రాంతాల్లో మెల్లగా వెళ్లాలో అక్కడి నిబంధనల ప్రకారం ఓ వర్చువల్ ప్రాంతాన్ని ఈ టెక్నాలజీ డిజైన్ చేస్తుంది. ఈ ప్రదేశాల్లోకి వాహనం వెళ్లినప్పుడు ఎక్కడైనా వేగం హద్దు మీరినట్టు అనిపిస్తే ‘హలో.. వేగం ఎక్కువైంది’అని డ్రైవర్‌కు ఓ సాఫ్ట్వేర్ రెస్పాన్స్‌ను ఈ టెక్నాలజీ చూపిస్తుంది. ఆ వెంటనే ఆ ప్రాంతానికి తగ్గట్టు వేగాన్ని తగ్గించేస్తుంది. వేగం ఎంత తగ్గుతోందో డ్రైవర్ ముందున్న డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. మరి కొన్నికొన్నిసార్లు రోడ్లు ఖాళీగా ఉన్నా, జనాలెవరూ లేకున్నా ఇలా వేగం తగ్గిస్తే పరిస్థితేంటి?.. అంటే ఈ టెక్నాలజీని ఆఫ్ చేసే వెసులుబాటు కూడా డ్రైవర్‌కు ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్తో అనుసంధానమైన వాహనాల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఫోర్డ్ పరిశీలిస్తోంది. మంచి ఫలితాలొస్తున్నాయని కంపెనీ చెబుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Hyderabad: గంటకు 65 కి.మీ దాటితే ప్రమాదమే..
Road Accidents Hyderabad: దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మద్యం మత్తుతో పాటు అతివేగమూ కారణమే. ప్రమాద సమయంలో ఆ కారు గంటకు 100 కి.మీకి పైగా వేగంతో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వాహనం ప్రయాణించిన కారణంగానే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ఫలితం దక్కలేదు. కేవలం ఈ ఒక్క ప్రమాదమే కాదు.. సిటీలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం అతివేగం వల్లే జరుగుతున్నాయని పోలీసులే అంగీకరిస్తున్నారు. సిటీ రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువైనవని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గంటకు 65 కి.మీలు వేగం దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అని వివరిస్తున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యం, వాటి పైకి వస్తున్న వాహనాల గరిష్ట వేగానికి మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. ఆ రెంటికీ సంబంధం లేదు.. ►రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 25 కి.మీ మించట్లేదు. రహదారులు పరిస్థితి, ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న కొత్త వాహనాలు, ఆక్రమణలు సహా మరెన్నో దీనికి కారణంగా మారుతున్నాయి. మరోపక్క సిటీ రహదారులు గంటకు గరిష్టంగా 50 కిమీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవే. ►నగర రోడ్ల పైకి కొత్తగా వస్తున్న, ఇప్పటికే ఉన్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కి.మీపైగా ఉంటోంది. దిగుమతి చేసుకున్న వాహనాలది ఇంతకంటే ఎక్కువే. రహదారుల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ వీటిని నియంత్రించే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం, నిబంధనలు లేవని పేర్కొంటున్నారు. చదవండి: (ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే బజ్జీ !) రాత్రి వేళల్లోనే ఎక్కువ.. ►వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట సిటీ రహదారులపై మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. కొన్ని రోడ్లలో వేగంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. జంక్షన్లలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే సిగ్నల్స్ కారణంగా దీనికి బ్రేక్ తప్పట్లేదు. ►కేవలం ఇన్నర్ రింగ్ రోడ్, శివారు రహదారులు వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పగటిపూట వేగంగా, ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రయాణించే ఆస్కారం ఉంది. రాత్రి వేళల్లో రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఫలితంగా వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో పాటు రేసింగ్స్ వంటివి జరుగుతున్నాయి. ఏటా నగర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బాధితులుగా మారుతోంది పాదచారులే కావడం గమనార్హం. ►వాహన వేగం మితిమీరి ఉంటే... ఈ సమయంలోపే డ్రైవర్ లేదా ప్రయాణికులు స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్, సీట్లకు కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఎయిర్ బ్యాగ్స్ పేలిపోవడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా వాహనంలోని వారిని రక్షించలేవు. ►హైదరాబాద్ నగరంలో మితిమీరిన వేగం 1,785 ప్రమాదాలకు కారణమైంది. ఫలితంగా 213 మంది చనిపోయారు. 1,548 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 237 ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఓవర్ స్పీడింగ్‌తో జరిగినవి 178. కొంపల్లిలో కారు బీభత్సం కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో కారు నడపడంతో వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఛోటాబజార్కు చెందిన సాయి శ్రీనివాస్ (27) అకౌంటెంట్. ఆదివారం రాత్రి ఆర్మూర్ నుంచి నగరానికి కారులో తన స్నేహితులు పిండిత శ్రీకాంత్, పవన్‌లతో కలిసి వస్తున్నారు. ఈ క్రమంలో కొంపల్లిలోని మహీంద్రా షోరూమ్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్ గ్రిల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. వీరికి బ్రీతింగ్ అనలైజ్ పరీక్ష చేయడంతో మద్యం తాగినట్లు వెల్లడైంది. వీరిపై ఐపీసీ సెక్షన్ 337, 185 కింద కేసులు నమోదు చేశారు. సదరు కారుపై ఇప్పటికే 3 చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
వాహనాల వేగానికి కళ్లెం
సాక్షి, గుంటూరు : అతివేగం వలన జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్పీడ్ గన్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలను స్పీడ్‌గన్‌తో గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు ఒక స్పీడ్ గన్ను ప్రభుత్వం 2018లో అందించింది. ప్రతి రోజు ఒక మోటల్ వెహికల్ ఇన్స్పెక్టర్కు స్పీడ్ గన్‌తో జిల్లాలోని వివిధ రహదారుల్లో తనిఖీలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. స్పీడ్ గన్‌లో సంబంధిత రహదారిపై నిర్దేశించిన వేగాన్ని ముందుగానే సెట్టింగ్ చేస్తారు. రహదారిపై వాహనాలను స్పీడ్ గన్‌తో పరిశీలిస్తారు. నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో ప్రయాణించే వాహనం ఫొటో తీసుకుంటారు. వాహనం నంబరు ఆధారంగా యజమానికి రూ.1500 అపరాధ రుసుం విధిస్తారు. అపరాధ రుసుం విధించిన వాహనాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయటం వలన వాహనంపై జరిగే ఇతర లావాదేవీలు అపరాధ రుసుం చెల్లిస్తేనే సాధ్యం అవుతాయి. అపరాధ రుసుం వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన ఫోన్ నంబరుకు సంక్షిప్త సమాచార రూపంలో అందిస్తారు. జిల్లాలో అతివేగంగా ప్రయాణించే వాహనాలపై 2018 సంవత్సరంలో 1,559 కేసులు నమోదు చేసి, రూ.21.82 లక్షల అపరాధ రుసుం విధించారు. 2019 జూన్ 9వ తేదీ వరకు 1,881 కేసులు నమోదు చేశారు. రూ.26.33 లక్షల జరిమానా వేశారు. అధిక వేగంతో అనర్థాలు వాహన ప్రమాదంలో ప్రాణ నష్టానికి వేగం ప్రధాన కారణం. వాహనాలు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు రహదారిపై ప్రమాదం జరిగిన వాహనంలో ప్రయాణిస్తున్న వారికి జరిగే గాయాల శాతం తీవ్రత తక్కువుగా ఉంటుంది. వీటి మరణాలు శాతం కూడా 10శాతానికి మించి ఉండదు. కాని వాహన వేగం 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటే మాత్రం గాయాల శాతం తీవ్రత ఎక్కువుగా ఉండటంతో పాటు మరణాలు 90శాతం ఉంటుంది. ఇక 100 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమదాలు జరిగితే మాత్రం వాహనంలో రక్షణ పరికరాలైన ఎయిర్‌బెలున్సు ఉన్న అవి ఫెయిల్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రహదారుల పరిస్థితి కూడా వాహనాలు వేగంపై ప్రభావం చూపుతుంది. జిల్లాలోని అంతర్గత సింగిల్, డబుల్ రోడ్లు, స్థానిక పరిస్థితుల బట్టీ కూడా వాహన వేగం నియంత్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వాహనాల్లో స్పీడ్ గంటకు 150 కిలోమీటర్ల పైనే ప్రయాణించే వీలు ఉంటుంది. స్థానికంగా ఉండే రహదారుల నిర్మాణం, పరిసరాల పరిస్థితుల ఆధారంగా అతి వేగంతో ప్రయాణించే వాహనం నియంత్రణ కోల్పోతుంది. వాహనాలు పక్కకు వెళితే చెట్లకు గుద్దుకోవటం, పక్కన ఉన్న కాల్వలోకి దూసుకుపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.జాతీయ రహదారులకు 100 కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు 120 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. అన్ని రహదారులపై జనసమ్మర్థంగా ఉండే ప్రాంతాలు, మూలమలుపుల వద్ద, నారో బ్రిడ్జ్‌ల వద్ద, రోడ్డు క్రాసింగ్‌లు, సర్వీసు రోడ్డులకు వెళ్లే ప్రాంతాల్లో మాత్రం 10 కిలోమీటర్లు నుంచి 5 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సి ఉంది. వేగం నిర్దేశించిన రహదారుల్లో లైట్ మోటర్ వెహికల్(నాన్ ట్రాన్స్‌పోర్టు) నో లిమిట్, లైట్ మోటర్ వెహికల్ (ట్రాన్స్‌పోర్టు) 65 కిలోమీటర్లు, మోటర్ సైకిల్ 50 కిలోమీటర్లు, ప్యాసింజర్/ గూడ్స్ వెహికల్ 65 కిలోమీటర్లు, మీడియం/హెవీ వెహికల్స్ 65 కిలోమీటర్లు, ట్రైలర్ 50 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించాలని నిబంధన ఉంది. -
స్పీడ్ రైడ్..డెడ్లీ దౌడ్!
ఔటర్ రింగురోడ్డుపై వాహనాలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. పరిమితికి మించి రెట్టింపు వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నాయి. వాయువేగం కారణంగా చివరకు వాహనంలోని సేఫ్టీ పరికరాలు సైతం పనికిరాకుండా పోతున్నాయి. వేగ నియంత్రణ కోసం ఔటర్ రింగురోడ్డులో స్పీడ్లేజర్ గన్ నిఘా ఉంచినా ఫలితం లేదు. సగటున 140–200 కి.మీ వేగంతో కార్లు, ఇతర వాహనాలు దూసుకెళ్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఈమేరకు మూడు లక్షల మందికి పైగా ఉల్లంఘనులను గుర్తించారు. దాదాపు రూ.43 కోట్లకుపైగా జరిమానా విధించారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఔటర్‌పై 45 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 39 మంది మృత్యువాతపడ్డారు. సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై వాహనదారులు వాయు వేగంతో దూసుళ్తున్నారు. అతివేగం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి హెచ్ఎండీఏ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అమలు చేస్తున్న ‘స్లో స్పీడ్ సాంకేతిక వ్యవస్థ’ వాహనదారుల వేగం ముందు తెల్లబోతోంది. ఈ ఏడాది నవంబర్ నెలాఖరునాటికి 3 లక్షల రెండు వేల 295 మంది వాహనదారులు 140 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు ‘స్పీడ్ లేజర్ గన్’ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వీరికి రూ.43 కోట్ల 37 లక్షల 93 వేల 325 జరిమానా విధించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్లో శామీర్‌పేట–కీసర మార్గం, వట్టినాగులపల్లి, పోశెట్టిగూడ, హిమాయత్‌సాగర్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో తుక్కుగూడ, రావిర్యాల, బొంగళూరు వద్ద అతివేగంతో వాహనాలు దూసుకెళ్తున్నాయని స్పీడ్ గన్ కెమెరా గణాంకాలు వెల్లడిస్తున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 156.9 కిలోమీటర్ల పరధిలో ఈ ఏడాది జరిగిన 45 రోడ్డు ప్రమాదాల్లో 39 మంది దుర్మరణం చెందారు. 66 మంది గాయపడ్డారు. పొగమంచు కమ్మే డిసెంబర్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే అస్కారముందని, ఈ సమయంలోనైనా వాహనాలు వేగాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించినా మారని తీరు... గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ ఆరు నెలల క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్ జోష్ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్నారు. ఈ అతి వేగం ఉన్న సమయంలో సేఫ్టీ మెజర్స్ కూడా పనిచేయడం లేదు. నిఘా మరింత పెంచాలి... ఓఆర్ఆర్పై వాహనాల వేగాన్ని పరిశీలించేందుకు టోల్‌ప్లాజాల వద్ద తప్ప ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో అధికారులు భావించినట్టుగా వేగనియంత్రణ సాధ్యం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా లేకపోవడంతో తమపై పర్యవేక్షణ లేదనే భావనతో వాహనచోదుకులు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆభయకేసు ఉదంతంతో ఓఆర్ఆర్పై నిఘాలేమి బహిర్గతమైంది. అభయను అపహరించిన దుండుగులు ఓఆర్ఆర్పై దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించినా ఎక్కడా ఆ దృశ్యాలు నమోదు కాలేదు. ఆ తర్వాత హెచ్ఎండీఏ అధికారులు అప్రమత్తమైనట్టు కనిపించినా...ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అయితే ఈ ఏడాది సైబరాబాద్, రాచకొండ పోలీసులకు ఎనిమిది స్పీడ్ లేజర్ గన్ కెమెరాలు ఇచ్చారు. దీంతో పెట్రోలింగ్ వాహనాల్లో ఆ స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఉంచుతూ అతివేగంతో వెళ్లే వాహనదారులకు ఈ–చలాన్లు ఇస్తున్నారు. తీవ్రత ఎలా ఉందంటే... 2014: సెప్టెంబర్ 29న తెల్లవారుజామున శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన ఘోర ప్రమాదంలో సెంట్రల్ ఎక్సైజ్ ఉన్నతాధికారి సత్యనారాయణ కుటుంబసభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో కూతురు తీవ్రంగా గాయపడింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 2015: నవంబర్ 25న తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు ఎదురుగా వచ్చిన పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్‌తో పాటు వారి స్నేహితులిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. 2017: నవంబర్ 23న ఓఆర్ఆర్ పెద్దఅంబర్‌పేట సమీపంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాదర్గుల్లో ఇంజనీరింగ్ చదువుతున్న అభిషేక్ (19), మన్నగూడ వాసి మహేశ్(20) కన్నుమూశారు. సైబరాబాద్ పరిధి ఓఆర్ఆర్లో... ఠాణాలు కేసులు జరిమానా మాదాపూర్ 67,562 9,69,51,470 అల్వాల్ 20175 2,89,51,125 శంషాబాద్ 89588 12,85,58,780 రాజేంద్రనగర్ 60306 8,65,39,110 జీడిమెట్ల 19,437 2,78,92,095 మొత్తం 2,57,068 36,88,92,580 రాచకొండ పరిధి ఓఆర్ఆర్లో... ఠాణాలు కేసులు జరిమానా ఉప్పల్ 173 2,48,255 వనస్థలిపురం 45,054 6,46,52,490 మొత్తం 45,227 64,90,0745 -
ట్రా‘ఫికర్’ తగ్గింది.. ‘స్పీడ్’ పెరిగింది
మెట్రో రైలుతో నగరంలో కాస్త ట్రా‘ఫికర్’ తగ్గింది. వాహనాల సగటు వేగం పెరిగింది. పీక్ అవర్‌లో జనం రయ్..రయ్ అని దూసుకెళ్తున్నారు. గతంలో 12 కేఎంపీహెచ్ ఉన్న వాహన వేగం 20కి పెరిగింది. మరోవైపు ఆర్టీసీలో ఒక శాతం ఆక్యుపెన్సీ తగ్గింది. ఆటోలు, క్యాబ్‌లపైనా మెట్రో ప్రభావం చూపింది. ఇక ఈ రెండు రూట్లలో వ్యక్తిగత వాహనాలు వినియోగించే వారి సంఖ్య దాదాపు 60 వేల వరకు తగ్గినట్లు అంచనా. ఇటీవల మైట్రో రైలు రాకపోకలు ప్రారంభమైన నాగోల్–అమీర్‌పేట, మియాపూర్–అమీర్‌పేట మార్గాల్లో శుక్రవారం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరపగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్/మూసాపేట్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో ప్రభావంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తొలిగాయి. దీంతో మొన్నటివరకు నత్తనడకన సాగిన వాహనాలు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ప్రధానంగా నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ)మార్గంలో ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో రోడ్డుమార్గంలో ప్రయాణానికి 50 నుంచి 60 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు ప్రయాణ సమయం 33 నిమిషాలు మాత్రమే. ఇక మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీమార్గం)లోనూ పీక్అవర్స్లో రోడ్డుమార్గంలో ప్రయాణానికి 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 30 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు. ఇదెలా సాధ్యమైందనుకుంటున్నారా...మెట్రో రాకతో కలల రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రభావంతో మొత్తంగా కాకపోయినా..మెట్రో రూట్లలో సుమారు 60 వేల వ్యక్తిగత వాహనాల (ద్విచక్రవాహనాలు, కార్లు) వినియోగం తగ్గుముఖం పట్టినట్లు మెట్రో, ట్రాఫిక్ అధికారులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. ఇక మొన్నటివరకు నగరంలో సగటు వాహనవేగం 12 కేఎంపీహెచ్ ఉండేది. ఇప్పుడు మెట్రో రాకతో సగటు వాహనవేగం 20 కేఎంపీహెచ్‌కు పెరిగిందని చెబుతున్నారు. మెట్రో రూట్లలో రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీకి చెందిన 80 ఫీడర్ బస్సులు, మరో వెయ్యి ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసుల్లోనూ సరాసరిన ఒకశాతం ఆక్యుపెన్సీ(ప్రయాణికుల భర్తీశాతం)తగ్గినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతుండడం విశేషం. ఇక ఈ రెండురూట్లలో సుమారు ఐదువేల వరకు ఆటోలు, క్యాబ్‌ల రాకపోకలు కూడా తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ వత్తిడి తగ్గి సిటీజన్లు ఊపిరి పీల్చుకుంటున్నట్లు ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. శుక్రవారం రెండు మెట్రో రూట్లలో పరిశీలించగా ఈ విషయం సుస్పష్టమైంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫికర్ బాగా తగ్గింది... ప్రధానంగా సీఎం క్యాంపుకార్యాలయం, అమీర్‌పేట్, మైత్రీవనం, బేగంపేట్, రసూల్‌పురా ప్రాంతాల్లో ట్రాఫికర్ గణనీయంగా తగ్గడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యక్తిగత వాహనాలతోపాటు బస్సులు, కార్లలో వెళ్లే వారు సాఫీగా సాగుతుండడం విశేషం. రూట్–1 నాగోల్–అమీర్‌పేట్ రోడ్డు ప్రయాణం ఇలా.. సమయం: శుక్రవారం ఉదయం 10:17 నిమిషాలు బైక్ ప్రయాణం ప్రారంభం: నాగోల్ మెట్రో స్టేషన్ రూట్: నాగోల్–ఉప్పల్ మెట్రో స్టేషన్ల నుంచి తార్నాక, మెట్టుగూడ, రైల్ నిలయం, బేగంపేట, లైఫ్‌స్టైల్–ప్రకాశ్‌నగర్ మీదుగా అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ చేరడానికి పట్టిన సమయం కేవలం 33 నిమిషాలు. వారం క్రితం 50 నుంచి 60 నిమిషాల సమయం పట్టేది. ఇక మెట్రోరైలులో ఈ రూట్లో ప్రయాణానికి 30–35 నిమిషాల సమయం పడుతోంది. రూట్–2 మార్గం: మియాపూర్–అమీర్‌పేట్ సమయం: ఉదయం 9.00 గంటలు బైక్ ప్రయాణం ప్రారంభం:మియాపూర్ మెట్రో స్టేషన్ మార్గం: మియాపూర్–జేఎన్టీయూ–కెపిహెచ్బి–కూకట్పల్లి–బాలానగర్–మూసాపేట్–భరత్‌నగర్–ఎర్రగడ్డ–ఈఎస్ఐ–ఎస్.ఆర్.నగర్–అమీర్‌పేట్‌కు చేరడానికి 30 నిమిషాల సమయం పట్టింది. అంటే 9.30కు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. గతంలో ఇలా: ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై గతంలో ప్రయాణానికి 50 నిమిషాల సమయం పట్టేది.మెట్రో రైలులో 20–23 నిమిషాల సమయం పడుతోంది. మెట్రో రాకతో ఈ రూట్లో బైక్ ప్రయాణం సుమారు 20 నిమిషాలు తగ్గినట్లే. ఇది శుభపరిణామం తొలిదశ మెట్రో ప్రారంభమైన నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో మొత్తంగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. ఈ రూట్లలో ప్రధాన రహదారులపై వాహనాల సగటు వేగం గణనీయంగా పెరిగినట్లు మా పరిశీలనలో తేలింది. ఎస్పీరోడ్–బేగంపేట్, అమీర్‌పేట్–పంజగుట్ట మార్గంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడంతో సిటీజన్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. – ఎన్వీఎస్రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ రిలీఫ్‌గా ఉంది... ఉప్పల్ నుంచి మెట్టుగూడ వరకు 40 శాతం ట్రాఫిక్ తగ్గింది. సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట వరకు 20 శాతం ట్రాఫిక్ తగ్గింది. ప్రతి నిత్యం ఉప్పల్ నుంచి హైటెక్‌సిటీ వరకు ద్విచక్ర వాహనంపైనే వెళ్తున్నాను. మెట్రో వచ్చిన నాటి నుంచి ట్రాఫ్రిక్ సమస్య తీరింది. రోజు వారిగా దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు జర్నీ సమయం తగ్గింది. రిలీఫ్‌గా ఉంది. – నూతన్ కుమార్ కంచుపు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, సైబర్‌సిటి రోడ్లపై రద్దీ తగ్గింది... దాదాపుగా 25 నుంచి 35 శాతం తార్నాక నుంచి కూకట్పల్లి వరకు ట్రాఫిక్ తగ్గింది. ద్విచక్ర వాహనం ప్రయాణం గతంలో నరకంగా ఉండేది. ప్రస్తుతం అంత ఇబ్బందిగా అనిపించడం లేదు. – భరత్‌రెడ్డి, తార్నాక, హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గతంతో పోల్చితే బెటర్ గత నాలుగైదు రోజుల నుంచి రోడ్లపై జాలీగా ఉద్యోగానికి వెల్తున్నాను. ట్రాఫిక్ బాగా తగ్గింది. డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంది. వేగం 30 దాటక పోతుండేది. ప్రస్తుతం 60 దాటుతుంది. -రాజేష్, సాప్ట్వేర్ ఇంజనీర్ ఈజీ జర్నీ... తార్నాక నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు కారులో వెల్తుంటాను. గత నాలుగైదు రోజుల నుండి రోడ్లపై ట్రాఫిక్ కాస్త తగ్గినట్లు అనిపించింది. ముఖ్యంగా మెట్టుగూడ నుండి సిక్రింద్రాబాద్ వరకు ట్రాఫిక్ కదలకుండా ఉండేది. ఇప్పుడు ఈజీగా వెళ్తున్నాం. -జోయల్, రైల్వే ఉద్యోగి మెట్రో జర్నీ బాగుంది... కూకట్పల్లి నుంచి మియాపూర్ వరకు కళాశాలకు వెళ్తుంటాను. గతంలో బైక్, బస్సుపై వెళ్లేవాడిని. కానీ మెట్రో రైలు ప్రారంభం నుంచి రైలులో వెళ్తున్నాను. జర్నీ సూపర్‌గా ఉంది. ట్రాఫిక్ సమస్య లేదు. పొల్యుషనూ లేదు. –గోస్వామి, విద్యార్థి, కూకట్‌పలి -
ఇక 100 తొక్కొచ్చు
హైవేలపై పెరిగిన వాహన స్పీడ్ తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం ఓఆర్ఆర్ పరిధిలో తగ్గిన హైస్పీడ్ హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇక నుంచి వాహనాల వేగానికి రెక్కలురానున్నాయి. ఔటర్ వంటి బహుళ వరుసల రహదారులపై రయ్‌మని ముందుకు వెళ్లే చోదకుల్లో తాజా నిబంధనలు మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వాహనాల జోరుకు కళ్లెం వేస్తున్న నిబంధనల్లో తాజాగా స్వల్పంగా మార్పులు చేస్తూ కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు త్వరలో నగరంలోనూ అమల్లోకి రానున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. గతంలో కార్లు గంటకు 65 కి.మీ. వేగంతో మాత్రమే దూసుకెళ్లేందుకు నిబంధనలు అనుమతించేవి. తాజాగా నిబంధనల్లో సడలింపు కారణంగా గంటకు 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లే అవకాశం రానుందని జంట పోలీసు కమిషనరేట్ల ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు భారీ వాహనాలు, ట్రక్కులు, కార్లు, ద్విచక్ర వాహనాలకు గతంలో ఉన్న వేగ పరిమితులు(స్పీడ్లిమిట్స్)లోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. ఔటర్‌పై తస్మాత్ జాగ్రత్త..! స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్ (వేగం హుషారెక్కిస్తుంది..కానీ మిమ్మల్ని తిరిగిరానిలోకాలకు పంపిస్తుంది) అన్న విషయాన్ని చోదకులు మరవరాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఔటర్ వంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న రహదారులపై ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు ధరించడం, మితిమీరిన వేగానికి కళ్లెం వేయడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సినీ ఫక్కీలో ఫీట్లు చేసే కుర్రకారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో పాత ఉత్తర్వులు.. గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు డివైడర్‌కు ఒక పక్క మొదటి, రెండు లైన్లలో మాత్రమే వెళ్లాలి. వాహనం వేగం 80కి తగ్గినా, 120 కి.మీ. వేగం పెరిగినా స్పీడ్‌గన్ పసిగట్టడం ద్వారా చలానా విధిస్తారు. ఇక గంటకు 40 నుంచి 80 కి.మీ. వేగంతో వెళ్లే వాహనాలు మూడు, నాలుగు లైన్ల ద్వారా వెళ్లాలి. ఇక్కడ కూడా 40కి తగ్గినా 80 కి.మీ. వేగం పెరిగినా చలానా తప్పదు. ఓఆర్ఆర్ పరిధిలో తాజా ఉత్తర్వులు.. మొదటి, రెండు లైన్లలో మాత్రమే వేగం లో మార్పులు చేశారు. ఇక్కడ గంటకు 80 - 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంటుంది. గతంలో 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవారు. సైబరాబాద్‌లోకి వచ్చే హైవేలు ఇవే.... నాగ్‌పూర్ , బెంగళూరు, ముంబాయి, విజయవాడ, వరంగల్, బీజాపూర్, నర్సాపూర్, రాజీవ్ , శ్రీశైలం, నాగార్జునసాగర్