మళ్లీ వస్తా..
గూడూరు, న్యూస్‌లైన్: సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం కడపకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన గూడూరులోని పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి నివాసంలో బస చేశారు. శనివారం పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు పెద్దసంఖ్యలో మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు గోపాల్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. జగన్ కోసం మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎదురుచూశారు. బయటకు వచ్చిన జగన్మోహన్రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆయనతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీపడ్డారు. అనంతరం సైదాపురం, రాపూరు మీదుగా ఆయన కడపకు బయలుదేరారు.
సైదాపురంలో పోటెత్తిన జనం
సైదాపురం: జననేత జగన్మోహన్రెడ్డి సైదాపురం మీదుగా వెళతారని తెలుసుకున్న పలు గ్రామాల ప్రజలు శనివారం మధ్యాహ్నం నుంచే సైదాపురం చేరుకున్నారు. జగన్‌ను పలకరించేందుకు వైఎస్సార్సీపీ నేత బండి సుబ్బారెడ్డి, సర్పంచ్ బండి వెంకటేశ్వర్లురెడ్డి అధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, విద్యార్థులు ఎదురుచూశారు. అనంతరం సైదాపురం మీదుగా వెళ్లిన జగన్మోహన్రెడ్డికి నీరాజనం పలికారు. సైదాపురం బస్టాండ్ సెంటర్లో జగన్ కాన్వాయ్‌ను ఆపి ప్రజలను పలకరించారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఆయనకు అభివాదం చేసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. అభిమాన నేతపై ప్రజలు పూలవర్షం కురిపించారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యుడు శంకరరాజు, యూత్ అధ్యక్షుడు చెముర్తి జనార్దన్‌రాజు, బీసీ సంఘం మండల కన్వీనర్ బీఎస్యాదవ్, నాయకులు సురేష్‌రెడ్డి, రవికుమార్, రాఘవరెడ్డి, తిరుపాల్, శ్రీనివాసులు, శివారెడ్డి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.