Videocon company
-
వీడియోకాన్ విండోస్ 10 తొలి ఎల్ఈడీ టీవీ
* పీసీగానూ వినియోగానికి వీలు.. * 32 అంగుళాల టీవీ @ రూ.39,990 * 40 అంగుళాల టీవీ @ రూ.52,990 హైదరాబాద్: వీడియోకాన్ కంపెనీ- విండోస్ 10 ఓఎస్ ఆధారిత తొలి ఎల్ఈడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో ఈ టీవీని తెస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్సనల్ కంప్యూటర్‌గా కూడా పనిచేసే ఈ తొలి హైబ్రిడ్ టీవీ విక్రయాలు వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని వీడియోకాన్ హెడ్(టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్) అక్షయ్ ధూత్ పేర్కొన్నారు. విండోస్ 10 పై పనిచేసే తొలి టీవీ ఇదేనని తెలిపారు. బాగా అమ్ముడయ్యే 32, 40 అంగుళాల టీవీలనే మార్కెట్లోకి తెచ్చామని, 32 అంగుళాల టీవీ ధర రూ.39,990, 40 అంగుళాల టీవీ ధర రూ.52,990 అని వివరించారు. వినియోగదారుల స్పందనను బట్టి 24, 55, 65 అంగుళాల టీవీలను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మారుతున్న కాలంలో, వినియోగదారుల అవసరాలకనుగుణంగా ప్రపంచంలోనే ఈ తొలి హైబ్రిడ్ టీవీని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ టీవీలో ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 2జీబీ ర్యామ్, ఇన్‌బిల్ట్ వై-ఫై, 16 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్టర్నల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. విండోస్ 10కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని వినీత్ దురాని చెప్పారు. ఈ వినూత్నమైన టీవీతో విండోస్ 10ను మరింత మందికి చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. -
వీడియోకాన్‌కు కాస్ట్ మేనేజ్మెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్
హైదరాబాద్ : వీడియోకాన్ కంపెనీకి కాస్ట్ మేనేజ్మెంట్లో ఎక్స్లెంట్(2014వ సంవత్సరం) అవార్డ్ లభించింది. ద ఇనిస్టిట్యూట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అందిస్తున్న ఈ అవార్డును వరుసగా మూడో ఏడాది గెల్చుకున్నామని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ సంస్థల కేటగిరిలో ప్రైవేట్ తయారీ రంగంలో ఈ అవార్డును గెల్చుకున్నామని వీడియోకాన్ గ్రూప్ సీఎఫ్ఓ సునీల్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డ్ స్వీకరించామని తెలిపారు. వీడియోకాన్ ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్లనే ఈ గుర్తింపు లభించిందని వివరించారు. -
వైఫై ఏసీలు వచ్చేస్తున్నాయి..
*రూ.35,990-రూ.41,990 శ్రేణిలో ధరలు... హైదరాబాద్: వీడియోకాన్ సంస్థ వై-ఫై ఎనేబుల్ ఏసీలను మార్కెట్లోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఏసీలను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా నియంత్రించవచ్చని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది. 4 మోడళ్లలో, రెండు రంగుల్లో 1, 1.5 టన్నుల రేంజ్లో వీటిని అందిస్తున్నామని వీడియోకాన్‌కు చెందిన అక్షయ్ ధూత్ పేర్కొన్నారు. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ ఏసీల ధరలు రూ.35,990-రూ.41,990రేంజ్లో ఉన్నాయని వివరించారు. అత్యంత సమర్థంగా విద్యుత్‌ను వినియోగించుకునేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని రూపొందించామని పేర్కొన్నారు. ఆఫీసులో ఉంటూనే స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఇంట్లో ఉన్న ఈ ఏసీను ఆన్/ఆఫ్ చేయవచ్చని తెలిపారు. బయటి వాతావరణానికి అనుగుణంగా తనకు తానే ఈ ఏసీ అడ్జెస్ట్ చేసుకునేలా అవర్లీ వెదర్ ఫీడ్ ఫీచర్ ఉందని పేర్కొన్నారు.