వైఫై ఏసీలు వచ్చేస్తున్నాయి.. | Videocon launches Wi-Fi enabled ACs | Sakshi
Sakshi News home page

వైఫై ఏసీలు వచ్చేస్తున్నాయి..

Published Fri, Feb 20 2015 12:53 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

వైఫై  ఏసీలు వచ్చేస్తున్నాయి..

వైఫై ఏసీలు వచ్చేస్తున్నాయి..

*రూ.35,990-రూ.41,990 శ్రేణిలో ధరలు...
హైదరాబాద్: వీడియోకాన్ సంస్థ వై-ఫై ఎనేబుల్ ఏసీలను మార్కెట్లోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఏసీలను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా నియంత్రించవచ్చని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది.  4 మోడళ్లలో, రెండు రంగుల్లో 1, 1.5 టన్నుల రేంజ్‌లో వీటిని అందిస్తున్నామని వీడియోకాన్‌కు చెందిన అక్షయ్ ధూత్ పేర్కొన్నారు. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ ఏసీల ధరలు రూ.35,990-రూ.41,990రేంజ్‌లో ఉన్నాయని వివరించారు.

అత్యంత సమర్థంగా విద్యుత్‌ను వినియోగించుకునేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని రూపొందించామని పేర్కొన్నారు. ఆఫీసులో ఉంటూనే స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఇంట్లో ఉన్న ఈ ఏసీను ఆన్/ఆఫ్ చేయవచ్చని తెలిపారు. బయటి వాతావరణానికి అనుగుణంగా తనకు తానే ఈ ఏసీ అడ్జెస్ట్ చేసుకునేలా అవర్లీ వెదర్ ఫీడ్ ఫీచర్ ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement