vijaya yatra
-
గెలవనని తెలుసు.. పవన్ కల్యాణ్ ఖాతాలో మరొకటి
క్రమశిక్షణలేని తన కార్యకర్తల వల్లే తాను ఓడిపోయానంటాడు.. ఓసారి పొత్తుగా ముందుకు వెళ్దామంటూ ప్రతిపక్షాలను బతిమాలతాడు.. ఓసారేమో ఏకంగా సీఎం అవుతా అంటాడు.. మరోసారి ‘అది రాసిపెట్టి ఉండాలని’ అంటాడు ఓసారి ప్రాణహాని ఉందంటాడు.. ఓసారి ఎమ్మెల్యేగా తనను గెలవకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటాడు.. కానీ.. సంక్షేమం ఉసెత్తకుండా ప్రతీసారీ ప్రభుత్వాన్నే విమర్శిస్తాడు.. గత ప్రభుత్వ పాలన గురించి మాత్రం పన్నెత్తి మాట్లాడడు. తాజాగా జనసేనాని ఖాతాలో మరో స్టేట్మెంట్ వచ్చి చేరింది.. ఎమ్మెల్యేగా గెలవనని తెలిసే ఎన్నికలకు వెళ్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు.. ఏందో ఈ పవనాలది పూటకో మాట.. రోజుకో వేషం.. సాక్షి, అమలాపురం/ముమ్మిడివరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేయలేదా?. ఉద్దేశపూర్వకంగానే సంక్షేమాల గురించి జనసేనాని మాట్లాడడం లేదా?.. తానేం చేస్తాననే విషయం చెప్పకుండా.. ప్రజలను అడిగే తీరులో ఓటు అడగకుండా.. పవన్ వ్యవహరించే తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కేవలం ఎవరితోనో చేస్తున్న తిట్టి పోతల ఒప్పందంలో భాగంగానే పవన్ అలా వ్యవహరిస్తున్నాడనే అనుమానాలు రాకమానవు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా.. నిలబడి ఉండటానికి సిద్ధపడి గొడవ పెట్టుకుంటున్నాను. మా నాన్న చెప్పేవాడు.. కీడెంచి మేలెంచమని. నేను ఇంకొకసారి ఓడిపోతానని నిర్ణయించుకున్నారు. అందుకే గొడవ పెట్టుకుంటున్నాను. జనసేన గెలవకపోయినా.. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ప్రశ్నించడమే నా నైజం. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా ఉండి.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లలేకపోతే గనుక మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుంది’’ అని వారాహి విజయ యాత్రలో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో బుధవారం రాత్రి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాటలివి. ఒకదానికొకటి పొంతన లేకుండా పవన్ ఇచ్చే స్టేట్మెంట్లలోకి ఇదీ వచ్చి చేరింది ఇప్పుడు.. పవన్ తన యాత్రలో మాట్లాడినవన్నీ పరిశీలిస్తే.. ఎక్కడైనా ప్రజలకు తాను ఏం చేయాలనుకున్నది పవన్ చెప్పాడా?.. పోనీ.. ప్రభుత్వానికి ఇంకా ఏం మంచి చేయాలో సూచించాడా?.. వెళ్లిన ప్రతీచోటల్లా నిజయోకవర్గాల పరిధిలో అభివృద్ధి అనేది లేదని మాట్లాడినట్లుంది ఆయన ప్రసంగం. పైగా అక్కడి నేతలంతా అవినీతిపరులేనని చెడామడా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ప్రశ్నించి తీరతానంటున్న పవన్.. ఆ ప్రశ్నలు కూడా సహేతుకంగా ఉండాలనే విషయం మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. బాబు స్క్రిప్ట్ వల్ల.. దానికితోడు ఓటమి భయం వల్ల పవన్ అలాంటి ప్రకటనలు ఇస్తున్నాడనుకుందాం. పోనీ.. తన పార్టీ అక్కడ గెలిస్తే ఏం చేస్తాడో చెప్తున్నాడా?(స్పష్టంగా..). ప్చ్.. కేవలం ప్రభుత్వం మీద పడి ఏడవడం, తాటతీస్తా.. తొక్కినారాతీస్తా.. ఛీరేస్తా.. అంటూ వీధికెక్కి మరీ వైఎస్సార్సీపీ నేతలను తిట్టిపోయడం.. విమర్శల కంకణం కట్టుకున్న పవన్.. తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు. జనసేనాని జాగ్రత్త.. ఇదంతా జనం గమనిస్తూనే ఉన్నారు!. ఇదీ చదవండి: నాన్నోరు.. మన మేనిఫెస్టో మళ్లీ చెత్తబుట్టకేనా? -
'నా ప్రతి సినిమా ఒక డ్రీమ్ రోలే'
‘మజ్ను’ విజయయాత్రలో హీరో నాని రాజమహేంద్రవరం : తన ప్రతి సినిమా ఒక డ్రీమ్ రోలేనని, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వల్లే విజయాలు సొంత చేసుకుంటున్నానని సినీ హీరో నాని అన్నారు. ఆయన నటించిన ‘మజ్ను’ సినిమా విజయయాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజెన్సీలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ నేను లోకల్’ అనే సినిమాలో నటిస్తున్నానన్నారు. తన సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ విజయాల హీరో నానితో తాను నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిత్ర దర్శకులు విరించి వర్మ మాట్లాడుతూ తన తొలిచిత్రం ఉయ్యాల జంపాల సమయంలో రాజమహేంద్రవరంతో అనుబంధం ఏర్పడిందన్నారు. అనంతరం చిత్ర యూనిట్ మజ్ను సినిమా ప్రదర్శింపబడుతున్న అనుశ్రీ, నాగదేవి థియేటర్లకు వెళ్లి సందడి చేసింది. కార్యక్రమంలో అనుశ్రీ థియేటర్ మేనేజర్ విష్ణు, సుంకర బుజ్జి పాల్గొన్నారు. -
'నా ప్రతి సినిమా ఒక డ్రీమ్ రోలే'
-
చిద్విలాసం
రాజమహేంద్రవరంలో ‘మజ్ను’ సినిమా బృందం సందడి చేసింది. ఆ సినిమా హీరో నాని, హీరోయిన్ అను ఇమ్మానుయేల్‌లు సినిమా ప్రదర్శితమవుతున్న సినిమా హాళ్లకు వెళ్లి ప్రేక్షకుల కనువిందు చేశారు. సినిమాను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
‘విజయ యాత్ర’కు మంగళం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎవరికి వారుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను ఒకే వేదిక మీదకు తెస్తుందని భావించిన ‘విజయ యాత్ర’ ప్రారంభానికి ముందే రద్దయినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ‘విజయ యాత్ర’ చేపట్టారు. తెలంగాణవ్యాప్తంగా సాగాల్సిన ఈ యాత్ర మెదక్ జిల్లాలో ఈ నెల 6న ప్రారంభం కావాల్సి ఉంది. పదో తేదీ వరకు వివిధ నియోజకవర్గాల్లో ‘విజయ యాత్ర’ పేరిట సభలు నిర్వహించాలని నిర్ణయించారు. యాత్రకు నేతృత్వం వహిస్తున్న వి.హనుమంతరావుకు స్వాగతం పలకడంతో పాటు జిల్లాలో ఎక్కడెక్కడ సభలు నిర్వహించే బాధ్యతను జిల్లా కాం గ్రెస్ కమిటీకి అప్పగించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి పార్టీ నేతలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల భేటీకి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెం బ్లీకి హాజరు కావాలని భేటీలో నిర్ణయించారు. దీంతో వీహెచ్ జిల్లా పర్యటనకు వచ్చినా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఏర్పాట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా పర్యటన రద్దు చేసుకోవాల్సిందిగా వీహెచ్‌ను కోరేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. పట్టాలెక్కని ‘జైత్రయాత్ర’ సోనియాకు కృతజ్ఞతలు చెప్పే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గతంలోనూ జిల్లాకు ఒకటి చొప్పున ‘జైత్రయాత్ర’ పేరిట సభలు నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 22న జిల్లాలో నిర్వహించాల్సి ఉండగా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లా నేతల మధ్య సమన్వయం లోపం, జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విప్ జయప్రకాశ్‌రెడ్డి దూరం పాటిస్తుండటంతో ‘జైత్ర యాత్ర’ ఎక్కడ నిర్వహించాలో బాధ్యులకు అంతు చిక్కడం లేదు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆమోదం తెలిపితేనే జైత్రయాత్ర సభ పట్టాలెక్కే సూచన కనిపిస్తోంది. అటు జైత్రయాత్ర నిర్వహించలేకపోవడం, ఇటు విజయయాత్ర రద్దు అయినట్టు సమాచారం అందడంతో కేడర్ లో నిరుత్సాహం కనిపిస్తోంది.