Vijayababu
-
సంచలన విషయాలు బయటపెట్టిన అడ్వకేట్
-
‘ఆంధ్ర సంపాదక శిఖరాలు’.. పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, విజయవాడ: సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన 'ఆంధ్ర సంపాదక శిఖరాలు' పుస్తకాన్ని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ రాజశేఖర్,ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు సోమవారం ఆవిష్కరించారు. నాగార్జున యూనివర్సిటీ(ఎన్యూ)లో జరిగిన "తెలుగు భాష సేవా రత్న" అవార్డుల ప్రదానోత్సవ సభలో ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఆర్. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్రికా రంగాన్ని ఉర్రూతలూగించిన తొలి తరం సంపాదకుల సంక్షిప్త జీవిత చరిత్రలను ప్రస్తుత తరానికి అందించాలన్న తలంపుతో మీడియా అకాడమీ ఈ పుస్తకాన్ని ప్రచురించిందన్నారు. ఆయా సంపాదకుల వివరాలు సేకరించి మా శర్మ ఈ పుస్తకాన్ని అద్భుతంగా రచించారని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీతో మీడియా అకాడమీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కొమ్మినేని గుర్తుచేసుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టులకోసం తాను ఛైర్మన్‌గా పనిచేసిన కాలంలో ప్రారంభించిన జర్నలిజం డిప్లమో కోర్సుకు సహకరించిన వైస్ ఛాన్సిలర్, ప్రొ. రాజశేఖర్‌కు, జర్నలిజం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ డా. జి. అనితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రచయిత మా శర్మను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సిలర్ ప్రొ. కొలకలూరి ఇనాక్ సి.ఆర్. మీడియా అకాడమీ తరపున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస ఆంధ్రుల కమిటీ చైర్మన్, మేడపాటి వెంకట్, తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వాసుదేవరావు, జర్నలిజం హెచ్‌వోడీ డా. జి. అనిత, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి.. తిరుమల ధార్మిక సదస్సులో పలు తీర్మానాలు -
అమరజీవి నడిచిన దారిలో...
‘నాకు శ్రీరాములు వంటి పదకొండు మంది అను చరులు ఉంటే చాలు. నేను ఒక్క సంవత్సరంలో బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేస్తాను’ అని పొట్టి శ్రీరాములు అంకిత భావం, ఉపవాస సామర్థ్యం గురించి వ్యాఖ్యానిస్తూ గాంధీజీ అన్నారు. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీ యుడైన శ్రీరాములు గొప్పదనానికి ఇంతకంటే కితాబు ఏముంటుంది? పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ ఫలితంగా తెలంగాణ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో 1956 నవంబర్ 1న ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏటా నవంబర్ ఒకటవ తేదీ నాడు జరుపుకోవడం ఆనవాయితీ అయింది. అయితే 2014లో ఏపీ తెలంగాణ నుంచి విడి పోయిన తర్వాత నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1 నుంచి మార్చి వేశారు. ఇది అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి జరిగిన మహా అపరాధంగా భావించాలి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ తప్పును సరిదిద్ది ఎప్పటిలాగే నవంబర్ 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతూ శ్రీరాములు త్యాగానికి ఘన నివాళులర్పిస్తున్నారు. మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చరిత్ర సృష్టించారు. పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసి వేలాదిమంది తెలుగు ప్రజలు మద్రాస్‌లోని మౌంట్ రోడ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ప్రజా ఆస్తుల విధ్వంసం జరిగింది. తెలుగు ప్రాంతాలైన విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కనిగిరి, నెల్లూరులతో సహా అనేక ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. అనకాపల్లి, విజయవాడ లలో పోలీసులు ఏడుగురిని కాల్చి చంపారు. ఫలితంగా మద్రాస్, ఆంధ్రా ప్రాంతాలలో పెద్ద ఎత్తున నాలుగు రోజుల పాటు ప్రజాందోళన కొనసాగింది. దీంతో కేంద్ర సర్కారు దిగివచ్చి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ 1952 డిసెంబరు 19న ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే వారి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అయ్యింది. అనంతరం, తెలంగాణను కలుపుతూ తెలుగు మాట్లాడే జిల్లాలు అన్నీ కలిసి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. నెల్లూరు జిల్లాలోని పడమటపల్లిలో 1901లో శ్రీరాములు జన్మించారు. అయితే ఆ ప్రాంతంలో కరవు పరిస్థితులు నెలకొనడంతో వారి కుటుంబం మద్రాసుకు తరలి వెళ్లింది. అక్కడే పాఠశాలలో శ్రీరాములు తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత శానిటరీ ఇంజనీరింగ్ బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చేశారు. కళాశాల విద్య తర్వాత, ముంబైలోని ‘గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే’లో చేరారు. దురదృష్టవశాత్తు తన భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయారు. ఆయన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఇది. ఆ సంఘటనను ఆయన జీర్ణించు కోలేకపోయారు. మనోవేదనతో రెండు సంవత్సరాల తరువాత ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు గాంధీజీ నిర్వహిస్తున్న సబర్మతి ఆశ్రమంలో చేరారు. గాంధీజీ ఆశయాలకు ప్రభావితులై దళితుల అభ్యున్నతికి విశేషమైన కృషి చేశారు. సమాజంలోని అంటరానితనాన్నీ, అసమానతలనూ నిరసించి అట్ట డుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త. కుల, మతాలకు అతీతంగా అట్టడుగు వర్గాల ఇళ్లలో భోజనం చేసేవారు. దళితుల హక్కులకు మద్దతుగా ఉపవాసాలు చేశారు. నెల్లూరు మూలపేట వేణుగోపాల స్వామి ఆలయంలో దళితుల ప్రవేశానికి మద్దతుగా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. వారి హక్కుల సాధనకు కాళ్లకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో గొడుగు లేకుండా తిరిగే వారు. సమసమాజ స్థాపన కోసం గాంధీజీ సిద్ధాంతాలను ఆచరిస్తున్న ఆయన్ని చూసి కొంతమంది స్థానికులు పిచ్చివాడిగా భావించేవారు. దళితులకు సంఘీభావం తెలిపినందుకు ఒక దశలో అగ్రకులాల వారి ఆగ్రహానికి గురయ్యారు. ప్రత్యేకించి తన వైశ్య కులం వారు ఆయన్ని కులం నుంచి బహిష్కరించినట్లుగా ప్రకటించారు. అయినా ఆయన అవేవీ పట్టించుకోకుండా తన సంకల్పం కోసం దీక్షతో ముందుకు సాగిపోయారు. తదనంతర కాలంలో కానీ ఆయన గొప్పతనం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు. దళితుల అభ్యున్నతికీ, అణగారిన వర్గాల సంక్షే మానికీ కృషి చేయడం నాయకుల బాధ్యత అని చెప్పిన పొట్టి శ్రీరాములు బాటలోనే నేటి సీఎం జగన్ మోహన్ రెడ్డి పయనించడం ముదావహం. పి. విజయబాబు వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు (నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం) -
23 నుంచి తెలుగు భాషా వారోత్సవాలు: విజయబాబు
సాక్షి, అమరావతి: తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోనూ, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ వారోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తాం. వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహిసామని పేర్కొన్నారు. సాహితీ స్రష్టలను, భాషా సేవకులను, భాషా వారసత్వాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని గుర్తించి సముచిత స్థాయిలో సత్కరిస్తాం. తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ వారోత్సవాలు ప్రారంభమౌతాయి. 29 వ తేదీ మద్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంతో ముగుస్తాయి. 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో, 25వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు విజయవాడలోని ఆంధ్ర లాయోల డిగ్రీ కళాశాలలోను, 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని బెజవాడ బార్ అసోసియేషన్‌లో, సాయంత్రం 4.00 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో, 27 వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు విజయవాడ ఘంటసాల సంగీత విశ్వవిద్యాలయంలో, 28వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని విజయబాబు పేర్కొన్నారు. -
Vemana: లోకకవి మన వేమన!
వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘసంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకీ; అన్ని ద్రవిడ భాషల్లోకీ వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సి.ఇ. గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోక కవిగా కీర్తించారు. వేమన 1602–1730 మధ్య కాలానికి చెందిన వాడనీ కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడనీ అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం, వేమన అసలు పేరు బెధమ కోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెధమ కోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివ రిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారు పల్లె ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. వేమన భోగలాలసుడుగా తిరుగుతూ ఒకానొక దశకు వచ్చేటప్పటికి ఓ సాధువు ద్వారా ఆత్మ జ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధలనుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలు పెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్ట మొదటగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలనీ... వేమన చిన్న నాటి నుంచే జ్ఞానశీలి అనీ, తదనంతరం స్నేహితుల ప్రభావంవల్ల దారితప్పి, ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడనీ అంటారు. ఆయన పద్యమకుటానికి ‘సృష్టి కర్తకు ప్రియమైన వేమా వినుము’ అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్ ఈ అర్థాన్నే తీసుకొని వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు; మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు... ఒకటే మిటి? కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తనకలం ఝుళిపించాడు. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యా లన్నీ ఆటవెలది చందస్సులోనే చెప్పాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గుర జాడ అంటాడు శ్రీశ్రీ. ‘వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక, ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది’ అంటారు రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలిగెత్తి చాటిన సామ్యవాద ప్రజా కవి వేమన. (క్లిక్ చేయండి: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట) - పి. విజయబాబు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (జనవరి 19 వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా) -
లిటిగేషన్లతో అడ్డుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: పరిపాలనలో తలెత్తే అంశాలను లిటిగేషన్ల ద్వారా అడ్డుకోవాలని చూడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ మేధావులు, పౌరుల సమాఖ్య(ఏపీఐసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు పి.విజయబాబు విమర్శించారు. కొన్ని సందర్భాల్లో కోర్టుల తీర్పునకు వక్రభాష్యం చెప్పడం, కోర్టుల వ్యాఖ్యానాలను తమ అనుకూల మీడియా ద్వారా మసిపూసి మారేడుకాయ చేసి చూపడం ఇటీవలికాలంలో తెలుగుదేశం లాంటి పార్టీలకు పరిపాటి అయిందని తప్పుపట్టారు. సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పాత్ర – న్యాయపరమైన సమస్యలు’ అనే అంశంపై ఏపీఐసీ ఆధ్వర్యంలో మంగళవారం వర్చువల్ సమావేశం జరిగింది. ఇందులో పలువురు విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాదులు, మేధావులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత చంద్రబాబుతోపాటు కొన్ని పత్రికలు, చానల్స్ పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. జగన్ తల నరుకుతా వంటి చర్చలు పెట్టి హెడ్డింగ్స్ హైలెట్ చేస్తూ, ఇదే జర్నలిజమని తొడలు చరుచుకుంటూ, ఇది రాజద్రోహం కాదంటూ.. చట్టాల్లో ఉన్న లూప్‌హోల్స్‌ను అవకాశంగా తీసుకుని తప్పించుకోజూస్తున్న సోకాల్డ్ మీడియా సంస్థలు, వాటిని మోస్తున్న బోయీలు ఇప్పటికైనా తీరుమార్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఒకట్రెండు మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నాయని ఫార్మా కాలేజ్ ఆచార్యులు డాక్టర్ అవనాపు శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో వినూత్నమైన పాలన... నేను విన్నాను–నేను ఉన్నాను అని పాదయాత్రలో చెప్పినట్లే.. అధికారంలోకి వచ్చాక దాన్ని తూచా తప్పక చేసి చూపించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు డి.బాలాజీరెడ్డి ప్రశంసించారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్‌కు అడుగడుగునా న్యాయస్థానాల్లో అడ్డుతగలడం చూస్తుంటే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనడానికి నిదర్శనమని చెప్పారు. ఆర్టీఐ కార్యకర్త జి.శాంతామూర్తి మాట్లాడుతూ.. జగన్ రెండేళ్ల పాలన స్ఫూర్తిదాయకమే కాక చరిత్రాత్మకమన్నారు. దీన్ని సహించలేని ఎల్లో మీడియా అయినదానికి, కానిదానికి ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది మల్లికార్జునమూర్తి మాట్లాడుతూ న్యాయవాదులకు సంబంధించి సంక్షేమనిధికి చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి ఇవ్వలేదని, సీఎం జగన్ వచ్చాక రూ.100 కోట్లు సంక్షేమనిధికి ప్రకటించారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ టి.నాగభూషణరావు, బీబీఏ మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ పిళ్లా రవి, ప్రొఫెసర్, లా కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ముద్దా బెంజమిన్ పాల్గొన్నారు. -
ఎస్ఈసీ చర్యలు ప్రమాదకరం
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చర్యలు ప్రమాదకరంగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) మాజీ కమిషనర్, ఏపీ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజెన్స్ ఫోరం చైర్మన్ విజయబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్న నిమ్మగడ్డకు అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ద్వారా నోటీసులివ్వాలని, కమిటీ ముందుకు రాకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య పరిణామాలపై సోమవారం విజయవాడలో చర్చాగోష్టి నిర్వహించారు. విజయబాబు మాట్లాడుతూ.. కోర్టు తీర్పు తర్వాత తాను ఏం చేసినా చెల్లుతుందనేలా నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ వ్యవహారం కక్ష సాధింపు చర్యగా ఉందని మండిపడ్డారు. మంత్రులకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలనడం ద్వారా నిమ్మగడ్డ తన పరిధిని అతిక్రమించారన్నారు. ప్రజా పరిపాలనకు ఆయన అవరోధం సృష్టిస్తున్నారన్నారు. ఇలాగే ఒకప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకపోతే.. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆయన్ను అరెస్ట్ చేయాలని నిర్ణయించిందన్నారు. గవర్నర్, కోర్టును సంప్రదించడానికి కూడా సమయం ఇవ్వకుండానే అరెస్టు చేయించిందని గుర్తుచేశారు. -
ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ఘర్షణ పడైనా.. ఇంతటి కరోనా విపత్తులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకింత పట్టుదల కనబరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపనంత మాత్రాన స్థానిక సంస్థల స్థాయిలో ప్రస్తుతం సాగుతున్న పాలన కుంటుపడుతోందా అని నిలదీసింది. పాలన సజావుగా సాగుతున్నప్పుడు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ (మేధావుల) ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయబాబు నేతృత్వంలోని పలువురు ప్రతినిధులు సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే కరోనాకు భయపడి మూడొంతుల మంది ఓటర్లు ఓటేయడానికే రాలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అంత తక్కువ స్థాయి ఓటింగ్‌తో ఎన్నికలు నిర్వహిస్తే ‘ఫ్రీ అండ్ ఫెయిర్ (స్వేచ్ఛ, పారదర్శకం)’గా ఎన్నికల నిర్వహించినట్టా అని విజయబాబు ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు అనుకూల పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై నిమ్మగడ్డతో ఏ చర్చకైనా సిద్ధమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ మంచిది కాదని తమ ఫోరం తరఫున గవర్నర్‌కు లేఖ రాస్తామని చెప్పారు. ప్రభుత్వంపై అక్కసు.. ప్రతిపక్షంపై ప్రేమా? నిమ్మగడ్డ వ్యవహారశైలి ప్రభుత్వంపై అక్కసు, ప్రతిపక్షంపై అవ్యాజ్యమైన ప్రేమ చూపుతున్నట్టు ఉందని విజయబాబు విమర్శించారు. ఇందుకు ఆయన కొందరు నేతలతో స్టార్ హోటళ్లలో జరిపిన రహస్య చర్చలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు మల్లికార్జునమూర్తి, పిళ్లా రవి, సాయిరాం పాల్గొన్నారు. -
‘ఓ పార్టీ కనుసన్నల్లో ఎస్ఈసీ’
సాక్షి, విజయవాడ: స్వప్రయోజనాల కోసం ఎన్నికల కమిషనర్ పని చేయకూడదని, ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చాల్సిన అవసరం లేదని మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ పునరాలోచన చేయాలని సూచించారు. ‘‘ఎన్నికలను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నిర్వహిస్తామని చెప్పడం భావ్యం కాదు. బీహార్ ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు పెరగటం చూశాం. హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్లు కోవిడ్ భయానికి ప్రజలు ఓటు వేసేందుకు కూడా రాని పరిస్థితి చూశాం. యూఎస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా అధికసంఖ్యలో యూఎస్‌లో కేసులు పెరిగాయని’’ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఓ పార్టీ కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తుందని.. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని విజయబాబు విమర్శించారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
గుత్తి: ఇంటి నుంచి బయటకెళ్లిన యువకుడు మూడు రోజుల అనంతరం బావిలో శవమై తేలాడు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని బెస్త వీధికి చెందిన విజయబాబు(26) ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సురేష్ దుకాణంలో పని చేసేవాడు. గత బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయబాబు దుకాణానికి వెళ్లలేదు. ఇంటికీ రాలేదు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే శుక్రవారం పట్టణ శివారులోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్న మునిసిపాలిటీ బావిలో శవమై తేలాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఏఎస్ఐ ప్రభుదాస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
ఐఏఎస్ అధికారులపై ఆర్టీఐ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల పనితీరు, వారి వ్యవహార శైలిపై ఏపీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన సమాచారాన్ని అధికారులు ఇవ్వడంలేదని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సహా అయిదుగురు కమిషనర్లు గవర్నర్‌ను కలిశారు. అనంతరం విజయబాబు మాట్లాడుతూ కొంతమంది ఐఏఎస్ అధికారులు కావాలనే ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కొందరు అధికారులు తెంపరితనం చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐని నీరుగారుస్తున్నారన్నారు. ఈ విషయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారులు ఆర్టీఐ చట్టాలను నిర్వీర్యం చేయడంపై ఉదాహరణలతో సహా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమవైపు నుంచి తప్పు ఉంటే విచారణ చేపట్టాలన్నారు. ఐఏఎస్‌ల వ్యవహారశైలి చట్ట స్ఫూర్తికి అవమానకరమని ఆయన అన్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు వారి ఆదాయాలకు, వారి స్థాయికి మించి భవనాలు కడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నిటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా వివరిస్తామని విజయబాబు చెప్పారు. -
ఐఏఎస్ అధికారులపై ఆర్టీఐ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు!
-
మ్యాట్రిమోనీ ప్రకటన ఇచ్చి మోసపోయిన మహిళ
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మ్యాట్రి మోనీ వెబ్సైట్ల ద్వారా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ప్రకటన చూసి మోసపోతే, మరికొందరు ప్రకటనలు ఇచ్చి మోసపోతుంటారు. పోలీసులు చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా, మోసపోయే వారి సంఖ్యా మాత్రం తగ్గడం లేదు. మోసం చేసే వారు కూడా పెరిగిపోతున్నారు. ఇప్పుడు మోసపోవడం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఒక మహిళ వంతైంది. రాజమండ్రికి చెందిన రమణకుమారికి నలభై ఏళ్లు. తన వయసుకు తగ్గ వరుడు కావాలని మ్యాట్రి మోనీలో ప్రకటన ఇచ్చింది. విజయవాడలో ఆంజనేయ స్వామి గుడి కార్యకలాపాలు చూస్తున్న విజయబాబు ఆమెను సంప్రదించి పెళ్లికి ఒప్పించాడు. పెళ్లికి ముందే 30 వేల రూపాయలు తీసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె పేర ఉన్న ఇంటిని అమ్మించాడు. ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ తరువాత విజయబాబు ఆమెని విజయవాడలోని ఆంజనేయ స్వామి గుడి వద్దకు తీసుకొచ్చి, అక్కడ వదిలి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ రాలేదు. మోసపోయిన విషయం ఆమెకు అప్పుడు అర్ధమైంది. అప్పుడు విజయబాబు గురించి ఆరా తీయడం మొదలు పెట్టింది. ఆసలు విషయం అప్పుడు గానీ ఆమెకు తెలియలేదు. విజయబాబుకు ఇదివరకే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. న్యాయం కోసం విజయబాబు ఉంటున్న అపార్ట్ మెంట్ వద్దే ఆందోళన చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదు. తనకు న్యాయం జరిగే వరకు అపార్ట్మెంట్ వద్ద నుంచి కదలనని అక్కడే భీష్మించుకు కూర్చుంది. -
సమాచారమివ్వకపోతే చర్యలే
అమలులో నిర్లక్ష్యం =స.హ.చట్టం పరిధిలోనే దేవాదాయశాఖ =తప్పుడు సమాచారమిస్తే జరిమానా =కమిషనర్ పీ విజయబాబు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఉద్యోగులూ ప్రజలేనన్న నిజాన్ని గ్రహిస్తే సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించగలుగుతారని స.హ. చట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. స్థానిక హిందూ కళాశాలలో స.హ. చట్టంపై జిల్లా అధికారులు, అప్పిలేట్ అధికారులు, పౌరసమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులకు గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ స.హ. చట్టాన్ని అమలు చేయడం ఉద్యోగుల విధుల్లో భాగమేనన్నారు. 2005 అక్టోబరు నుంచి అమలులోకి వచ్చిన స.హ. చట్టం సత్ఫలితాలిస్తుందని చెప్పారు. ఈ చట్టం అమలులో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ్ణజిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం వివిధ అభివృద్ధి పథకాల్లో ప్రజల భాగస్వామ్యం లేకపోవటమేనని చెప్పారు. స.హ. చట్టం ప్రకారం సమాచారమివ్వని కార్యాలయ అధికారులపై 41-బీ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉందన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులకు రూ. 25 వేలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలతో పోలిస్తే మనదేశం ఆదర్శంగానే ఉందన్నారు. పారదర్శకమైన పాలన అందించడానికి స.హ. చట్టం అమలు చేయడం మంచి పరిణామమని చెప్పారు. జేసీ పీ ఉషాకుమారి మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు. వివిధ శాఖల అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు స.హ. చట్టం కమిషనర్ విజయబాబు సమాధానమిచ్చారు. జిల్లా ఖజానాశాఖ డీడీ నాగేశ్వరరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ , విజయవాడ, నూజివీడు సబ్కలెక్టర్లు డీ హరిచందన, చక్రధరరావు, బందరు ఆర్డీవో పీసాయిబాబు, డీఆర్డీఏ పీడీ శివశంకరరావు, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ సీహెచ్ బాలునాయక్, గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల ఉద్యోగి పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమలులో ఇంత నిర్లక్ష్యమా.... సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా వెనుకబడి ఉందని విజయబాబు అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమలులోకి వచ్చిన 120 రోజుల్లో చట్టాన్ని అమలు చేసే అప్పిలేట్ అధికారుల వివరాలను ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాల్సి ఉండగా.... 8సంవత్సరాలైనా ఈ ప్రక్రియ జిల్లాలో పూర్తి కాలేదన్నారు. స.హ. చట్టం అమలులో జిల్లాలో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదని చెప్పారు. దేవాదాయశాఖ అధికారులు తాము ఈ చట్టం పరిధిలో లేమని చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. స.హ. చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలో ఒక దేవస్థానం ట్రస్టీ పరిధిలో ఉన్నందున సమాచారం ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విధంగా స.హ. చట్టంపై పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఢిల్లీలో అమ్ఆద్మీ పార్టీని స్థాపించి ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన క్రేజీవాల్ స.హ. చట్టం కార్యకర్తగానే తన జీవితాన్ని ప్రారంభించారన్నారు. మచిలీపట్నం విలేకరుల ఆధ్వర్యంలో విజయబాబును ఘనంగా సత్కరించారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో... మోపిదేవి : మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన వెంట అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాస్, వీఆర్వో శేషగిరిరావు, ఆలయ సిబ్బంది ఉన్నారు.