Vijayawada Center
-
చంద్రబాబు పై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్
-
దిశ యాప్‌తో 6 నిమిషాల్లోనే యువతికి రక్షణ
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): అక్కచెల్లెమ్మల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌తో వారికి క్షణాల్లోనే రక్షణ అందుతోందని మరోసారి రుజువైంది. వేధింపులకు గురైన యువతి దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని రక్షించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దేవీనగర్‌కు చెందిన యువతి (19) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న ఆకాష్ ఆమెను ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నాడు. అతడిపై యువతి తన తండ్రికి, కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో వారు యువకుడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా ఆకాష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. యువతి శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్ష రాసి తండ్రితో కలసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా ఆకాష్ ద్విచక్రవాహనంపై వెంటపడుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో యువతి దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసింది. మధ్యాహ్నం 12.31కి దిశ కాల్ సెంటర్‌కు సమాచారం రాగానే వెంటనే స్పందించిన సత్యనారాయణపురం పోలీసులు 12.37కి ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. నిందితుడు ఆకాష్‌ను అదుపులోకి తీసుకుని 483, 354డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
‘టీడీపీ కంటే మాది వందరెట్లు మెరుగైన పాలన’
సాక్షి, విజయవాడ: టీడీపీ పాలన కంటే వంద రెట్లు మెరుగైన పాలన అందిస్తున్నామని విజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు చెప్పారు. శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నాం. లాక్డౌన్ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం నాలుగో విడుత రేషన్ అందిస్తోంది. వాలేంటీర్ల వ్యవస్థ ను వినియోగించుకుని భౌతిక దూరం పాటిస్తూ పేదలకు రేషన అందిస్తున్నాం.రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షల పై చిలుకు, నగరంలోని 1లక్ష 74వేల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ ద్వారా లబ్ది చేకూరుతుంది. రేషన్‌కార్డు లేని వారికి వార్డు సచివాలయల ద్వారా నూతన కార్డులు వచ్చేలా చర్యలు చేపట్టాం. రాష్టంలో లబ్ధిదారులకు 80 వేల నూతన రేషన్ కార్డులు అందించాం. పేదవారు ఎవరు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. లాక్ డౌన్ సమయంలో సైతం సంక్షేమపథకాలు అమలు చేస్తోన్నాం. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ పధకాలు తెచ్చాం. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని మల్లాది విష్ణు తెలిపారు. ఇక కరెంట్ చార్జీల విషయంలో ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులను తమ ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. దేవినేని ఉమా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. (జనసేన నేత దాడి.. ఆత్మహత్యాయత్నం) మొక్క జొన్న రైతులకు 500 కోట్లు , విద్యార్థులకు1700 కోట్లు చెల్లించామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని ప్రతి పక్షాలు చూస్తున్నాయని, నిబంధనలకు వ్యతిరేకంగా కరెంటు చార్జీలు పెంచిన దాఖలాలు లేవని వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులను సబ్ స్టేషన్ ల వారిగా ప్రజల్లోకి వెళ్లి ఈ విషయాన్ని వివరించమని ఆదేశించినట్లు తెలిపారు. విజయపాల డైరీ ధరలను లీటరుకు 4 రూపాయలు ఎవరిని అడిగి పెంచారని నిలదీశారు. పాల ధరల పెంపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల మీద నాలుగు రూపాయలు భారం వేసి ఏ మోహం పెట్టుకుని తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. బకాయిలు, అప్పులు, అవినీతి ప్రభుత్వం టీడీపీదని ... సంక్షేమ ప్రభుత్వం తమదని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. సబ్సిడీలు ప్రగతికి ప్రతి బంధకాలు అనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడుని, దుర్ఘటనలను కూడా స్వార్ధ ప్రయోజనాలకు వాడుకునే నీచ నాయకుడు ఆయన అని ధ్వజమెత్తారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, అన్ని వర్గాలకు ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తుందని తెలిపారు. మే 30 రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజు అని తెలిపారు. టీడీపీ దౌర్భాగ్య పాలనకు నిదర్శనం 23 సీట్లు గెలవడమేనని ఎద్దేవా చేశారు. బోండా ఉమా, దేవినేని ఉమాకి సీఎం జగన్ మోహన రెడ్డిని విమర్శించే నైతిక హక్కులేదని మండిపడ్డారు. ('పర్యావరణం కాపాడేవారైతే అక్కడెందుకున్నారు') -
బెజవాడ కేంద్రంగా కొత్త జిల్లా?
సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాలను కలిపి విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఆర్డీఏ పరిధిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రెండు జిల్లాల్లోని ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు సూచించినట్లు సమాచారం. సీఆర్డీఏ పరిధిలోని 58 మండలాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
ఎయిర్ కోస్టా హ్యాపీ అవర్స్ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ కోస్టా ‘హ్యాపీ అవర్స్’ పేరుతో ఎంపిక చేసిన రూట్లలో తగ్గింపు ధరలకే టిక్కెట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింది అన్ని పన్నులతో కలుపు కొని రూ. 1,499 నుంచి రూ. 3,999 లకే టిక్కెట్లను అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా తెలిపింది. హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, బెంగళూరు - కోయంబత్తూర్‌లకు రూ.1,499కే అందిస్తుండగా, జైపూర్-చెన్నై, విజయవాడ-కోయంబత్తూర్‌లకు రూ.3,999కే అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 24 మధ్యాహ్నం 3 గుంటల నుంచి నవంబర్ 27 మధ్యాహ్నం 3 గంటల లోపు బుక్ చేసుకున్న వారికి ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో జనవరి 15, 2015 నుంచి ఏప్రిల్ 15, 2015లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే నగదు వెనక్కి రాదని, అలాగే ప్రయాణ తేదీలను మార్చుకుంటే రూ.1,500 అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ కోస్టా సీఈవో కెప్టెన్ కె.ఎన్.బాబు తెలిపారు.