కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాలను కలిపి విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాలను కలిపి విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఆర్‌డీఏ పరిధిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రెండు జిల్లాల్లోని ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు సూచించినట్లు సమాచారం. సీఆర్‌డీఏ పరిధిలోని 58 మండలాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.