vijayawada tdp leaders
-
బెజవాడ టీడీపీకి ఏమైంది?.. మళ్లీ కొత్త రగడ!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉందంటే ఉందని అనుకోవడమే గాని.. అక్కడ 1983 తర్వాత పచ్చ జెండా ఎగిరింది లేదు. వామపక్షాలతో పొత్తు కుదిరినపుడు గెలిస్తే సీపీఐ అభ్యర్థి.. లేదంటే అప్పట్లో కాంగ్రెస్ నేతలు గెలిచేవారు. గత రెండుసార్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండానే పశ్చిమలో ఎగురుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇప్పుడు పచ్చ పార్టీలో పంచాయతీ నడుస్తోంది. పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ కేశినేని నానితో లోకల్ లీడర్లకు అసలు పడటంలేదు. చాన్నాళ్లుగా ఈ గొడవ పచ్చ పార్టీలో నడుస్తూనే ఉంది. రాబోయే ఎన్నికల్లో బెజవాడ వెస్ట్ టిక్కెట్ అభ్యర్థి విషయంలో ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబును కలవడంపై ఇప్పుడు కొత్తగా రగడ మొదలైందట. 1983 తర్వాత పశ్చిమ సీటును మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ జెండా ఈసారి ఎలాగైనా ఎగరేయాలని చంద్రబాబు కలగంటున్నారట. తమ్ముళ్లే కుమ్మేసుకుంటున్నారు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి కేశినేనికి బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో పడటంలేదని టాక్. వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయి... మూడున్నరేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయట పశ్చిమ పార్టీలో పరిస్థితులు. కొన్నాళ్లుగా తన సోదరుడు కేశినేని శివనాధ్ పార్టీలో యాక్టివ్ కావడంతో కేశినేని నాని ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ అధినేత తనకు అధికారం ఇవ్వడంతో ఈ సెగ్మెంట్లో దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. నాని ట్రావెల్స్‌కు స్టాప్ లేదా? తనతో ఒకప్పుడు టచ్ లో ఉన్న నేతలందరినీ కలుపుకుని పోతూ ఇటీవల వరుసగా కార్యక్రమాలు చేస్తూ హడావిడి చేస్తున్నారట కేశినేని నాని. ఈ క్రమంలో వయోభారంతో మొన్నటి వరకూ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న జలీల్ ఖాన్ సైతం ప్రస్తుతం యాక్టివ్ అయ్యారు. జలీల్‌ఖాన్ ఇప్పుడు కేశినేని నాని వెంట తిరుగుతుండటంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మూలన ఉన్న నేత బయటకు రావడం వరకు బానే ఉంది. అయితే తాజాగా కేశినేని నాని తన అనుచరుడైన ఎం.కె.బేగ్ ను వెంటబెట్టుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లడంతో పశ్చిమ టీడీపీలో కొత్త చిచ్చు రాజేసిందట. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు వెళ్లిన కేశినేని నాని ఈసారి పశ్చిమ టిక్కెట్టు ఎం.కె. బేగ్ కు ఇవ్వాలంటూ చంద్రబాబును కోరినట్లు సమాచారం. చదవండి: ఏది నిజం ?: సీబీఐ నుంచి రామోజీ ‘లై’వ్ రిపోర్టింగ్ నాలుగో కృష్ణుడి ఎంట్రీ ఈ విషయం బయటికి తెలియడంతో ఇప్పుడు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో పాటు జలీల్ ఖాన్ కూడా నాని పై గుర్రుగా ఉన్నారట. గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా తన కుటుంబానికే సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న జలీల్ ఖాన్ కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదట. విదేశాల్లో ఉంటూ ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి హడావిడి చేసే ఎం.కె.బేగ్ కు టిక్కెట్ ఇవ్వాలని నాని అడగటంపై లోలోన ఉడికిపోతున్నారట. నిన్న మొన్నటి వరకూ కేశినేని నాని అంటే పీకల్లోతు కోపం ఉన్న బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాల సరసన ఇప్పుడు జలీల్ ఖాన్ కూడా చేరిపోయారన్న చర్చ జరుగుతోంది. ఇక వెస్ట్ తమ్ముళ్లు మాత్రం ఇప్పటికి ముగ్గురు కృష్ణులు అయిపోయారు ... ఇక నాలుగో కృష్ణుడు వచ్చాడంటూ సెటైర్లు వేసుకుంటున్నారట. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బెజవాడ టీడీపీలో మంటలు.. కొత్త చిచ్చు రగులుకుంది..
సాక్షి, విజయవాడ: ఆ జిల్లా ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట. క్రమంగా అక్కడి కోటలన్నీ బీటలు వారాయి. పైకి వీర విధేయులమనే చెప్పుకుంటున్నారు కానీ ఏమాత్రం తేడా కొట్టినా ఝలక్ ఇస్తుంటారు. ఇదీ బెజవాడలో సైకిల్ పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం మీరంటే.. మీరంటూ పచ్చ పార్టీ నాయకుల మధ్య కొట్లాట మొదలైంది. ఈ తగాదాలతో నేతల మధ్య మొదలైన గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఫలితంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా అనేలా పరిస్థితులు మారాయి. కొంతకాలం క్రితం తనకు సరైన గౌరవం దక్కడం లేదని కేశినేని నాని అలకబూనారు. చదవండి: అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా? దీంతో చంద్రబాబే ఒక మెట్టు దిగి వచ్చి కేశినేని నానిని బుజ్జగించడంతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఆ నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారు. ఐతే ఈ నిర్ణయాన్ని అప్పట్లో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక అప్పట్నుంచి కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారాయి పరిస్థితులు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కేశినేని నాని తమ్ముడు కేశినేని శివనాధ్ ఆలియాస్ చిన్ని బెజవాడ పాలిటిక్స్‌లో చురుగ్గా ఉండటంతో పార్టీలో కొత్త చిచ్చు రగులుకుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం కేశినేని నానికి ఇబ్బందిగా మారింది. ఇదంతా తనను పార్టీలోంచి పొమ్మనలేక పొగబెట్టడానికే అని కేశినేని నాని బలంగా నమ్మడంతో చంద్రబాబుతో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు సైతం కేశినేని నాని దూరంగా ఉన్నారు. అలాగే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనడం లేదు. ఇక తన అసహనాన్ని, అసంతృప్తినంతా సోషల్ మీడియా వేదికగా పంచుకుని పార్టీలో తీవ్ర చర్చకు తెర తీశారు కేశినేని నాని. ఇలా వరుస పరిణామాలతో పార్టీ అధినేతకే తలబొప్పి కట్టేట్లు చేశారు నాని. చంద్రబాబుకు ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడే ఉన్న కేశినేని నాని బొకే ఇవ్వడానికి కూడా నిరాకరించి అటు అధినేతను.. ఇటు పార్టీ శ్రేణులను నివ్వెరపోయేలా చేశారు. ఇలా తరచూ అలిగే నానితోనే వేగలేకపోతున్న చంద్రబాబుకు తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశాలు మరో తలనొప్పి తెచ్చిపెట్టాయట. ఈ సారి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచి తీరుతామని పదే పదే చెప్పే కేశినేని నాని ఈ సమావేశాలకు హాజరు కాలేదు. ఇక హాజరైన నేతల్లో కొందరికి సరైన గౌరవం దక్కక పోవడం కూడా ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది. విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన బుద్ధా వెంకన్న స్టేజ్ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడం చూసి షాక్ తిన్నారు. తన ఫోటో పెట్టకపోవడంతో స్టేజ్ మీదకు పిలిచినా వెళ్లలేదు. కొల్లు రవీంద్ర స్వయంగా వచ్చి ఆహ్వానించినా బుద్ధా వెంకన్న ససేమిరా కుదరదని తేల్చేశాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని ఇక అక్కడ ఉండలేక వైజాగ్ లో పనుందంటూ సమావేశం నుంచి బయటికి వచ్చేశాడు బుద్ధా. అక్కడి పరిస్థితులు చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని.. చంద్రబాబు కోసం ప్రాణం ఇచ్చే నాలాంటి వారికే ఇలా జరిగితే ఎలా అనుకుంటూ నాగుల్ మీరాతో కలిసి సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయాడు బుద్ధా వెంకన్న. ఈ పరిణామాలను ఊహించని నేతలంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. బుద్ధా వెంకన్నకు జరిగిన అవమానంతో పశ్చిమ నియోజవర్గ టీడీపీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. నాగుల్ మీరా సైతం ఈసారి తనకు టిక్కెట్ ఇస్తే సరేసరి లేకపోతే పార్టీ మారిపోవడానికైనా నేను సిద్ధం అంటూ తెగేసి చెప్పేశారట. -
టీడీపీ తప్పుడు ప్రచారం :దేవినేని అవినాష్
-
బాబు వ్యూహం.. కేశినేనికి చెక్!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిత్వంపై టీడీపీలో తీవ్ర తకరారు నెలకొంది. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఖరారు చేయాలని పట్టుపడుతుండగా ఆయన వ్యతిరేకవర్గం అడ్డుతగులుతోంది. గుంటూరు మేయర్ అభ్యరి్థగా అక్కడి పశి్చమ నియోజకవర్గ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని)ను టీడీపీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడ మేయర్ అభ్యర్థులుగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని ఎలా ఖరారు చేస్తారనే ప్రశ్నను కేశినేని వ్యతిరేకవర్గం లేవనెత్తుతోంది. కోవెలమూడి, కేశినేనిలు టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. బాబు వ్యూహంతోనే శ్వేతకు చెక్ కేశినేని శ్వేతకు విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకూడదనే చంద్రబాబు ముందస్తు వ్యూహం పన్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం పార్టీ ప్రధాన కార్యా లయంలో రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు గుంటూరు, విజయవాడ ముఖ్య నాయకులతో మాట్లాడారు. కోవెలమూడి రవీంద్రను గుంటూరు మేయర్ అభ్యరి్థగా అధికారికంగా ప్రకటించారు. కేశినేని నానీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితరులతోనూ చర్చించిన అచ్చెన్నాయుడు కలిసిమెలిసి పనిచేయాలని సూచించారే తప్ప శ్వేతను బెజవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించకపోవడమే ట్విస్ట్. ఇటీవలి కాలంలో కేశినేని స్వరం అధిష్టానాన్ని ధిక్కరించే రీతిలో ఉంటోందని చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. విజయవాడకు తానే అధిష్టానమని, తనకు ఎవరూ హైకమండ్ లేరని, 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పినప్పుడు లేని తప్పులు 39వ డివిజన్ అభ్యర్థిగా శివశర్మను చేస్తే ఎందుకు వస్తాయి, ఓడిపోయిన వారు మాట్లాడేది ఏంటి, వారి మాట వినే పరిస్థితి లేదనే బహిరంగ వ్యాఖ్యానాలు చేయడాన్ని బాబు దృష్టికి వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మాజీ మంత్రి లోకేష్‌నుద్దేశించి నాని అభిప్రాయాలు కూడా చంద్రబాబు చెవిన వేశారనేది వినికిడి. శ్వేత మేయర్‌గా తను చెప్పలేదని, ఎంపీ స్వయం ప్రకటితమని బాబు గుర్రుగా ఉన్నారు. దీంతోపాటు బుద్దా, మీరాలకు తోడు దేవినేని ఉమ, బొండా ఉమ, వర్ల రామయ్య, పట్టాభి కూటమి కేశినేనికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యమే. సామాజిక వర్గం సాకుగా... కేశినేని వ్యతిరేక కూటమి మాటలకు ప్రాధాన్యమివ్వడం, కేశినేనికి చెక్ పెట్టడంలో భాగంగానే కోవెలమూడి పేరు వెలువడింది. తద్వారా రాజధాని ప్రాంతంలోని రెండు కార్పొరేషన్లలో ఒకే సామాజిక వర్గానికి మేయర్ పదవులా అనే వివాదానికి తెరతీసేందుకు వీలవుతోంది. దీన్నే సాకుగా చూపి శ్వేతకు చెక్ పెట్టవచ్చనేది బాబు ఎత్తుగడగని స్వపక్షీయులే అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా కోవెలమూడి నానికి గుంటూరు నగరంలో ఉన్నంత వ్యతిరేకత మరెవరికీ లేదు. అవినీతి ఆరోపణలు, మోసాలు లెక్కకుమిక్కిలి ఉన్నాయని మేయర్‌గా పేరు ప్రకటించవద్దని సీనియర్లు అధిష్టానానికి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నానికి చెక్ పెట్టాలంటే కోవెలమూడి పేరును ప్రకటించాలని అచ్చెన్నకు బాబు సూచించి కుప్పంకు బయలుదేరినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. బుద్ధా హైదరాబాద్‌కు... చంద్రబాబుకు నమ్మిన బంటునని చెప్పుకునే బుద్ధా వెంకన్న గురువారం అచ్చెన్నతో మీటింగ్ కాగానే కుమారుడు బుద్ధా వరుణ్‌ను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కూతురు పూజితకు కాకుండా కేశినేని బలపరిచిన శివశర్మకే 39వ డివిజన్ అభ్యర్థిత్వం ఖరారు చేసినందునే బుద్ధా వెళ్లారంటున్నారు. నాయకుల అలక తీర్చే సాకుతో శ్వేత పేరును ప్రకటించకుండా వాయిదా వేయడానికి బాబు కోటరి వేసిన మరో ఎత్తుగడగా కేశినేని వర్గం భావిస్తోంది. -
చాల్లే ఆపండి.. పార్టీ పరువు తీశారు
అసమ్మతి గ్రూపునకు చంద్రబాబు క్లాస్ శ్రీధర్‌ను మార్చే ప్రసక్తి లేదు స్వరం మారుస్తున్న కార్పొరేటర్లు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతి తుస్సుమంది. మేయర్ చైర్‌ను టార్గెట్ చేస్తూ అసమ్మతి వర్గం నడిపిన కథకు మహానాడు సాక్షిగా ఆ పార్టీ అధిష్టానం తెరదించింది. మీరు చేసిన అల్లరి వల్ల ఇప్పటికే పార్టీ పరువుపోయింది. మేయర్‌ను మార్చే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమ్మతి వర్గానికి క్లాస్ తీసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. చీటికిమాటికి గొడవలు పడితే జనంలో పల్చబడతామంటూ చీవాట్లు పెట్టినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో కోనేరు శ్రీధర్‌ను మార్చాలంటూ సంతకాలు చేసిన కార్పొరేటర్లు స్వరం మారుస్తున్నారు. ఏదో తెలియక సంతకం చేశాం. మేము మీకు వ్యతిరేకం కాదంటూ మేయర్‌కు సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. శ్రీధర్‌దే పై చేయి మేయర్ చైర్ వార్‌లో శ్రీధర్‌దే పై చేయి అయింది. కౌన్సిల్లో 38 మంది సభ్యుల బలం టీడీపీకి ఉంది. వ్యూహాత్మకంగా పావులు కదిపిన అసమ్మతి వర్గం 23 మంది సంతకాలను సేకరించింది. ఒకదశలో శ్రీధర్ అవుట్ అన్న వాదనలు వినిపించాయి. డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు, ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబుతో పాటు మరో 13 మంది మేయర్ పక్షాన నిలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సైతం అసమ్మతి వర్గం కొమ్ము కాసింది. ఈ క్రమంలో అసమ్మతి వర్గం నెలవారీ మామూళ్లు ఇస్తామంటూ కార్పొరేటర్లకు ఎర వేయడాన్ని మేయర్ క్యాష్ చేసుకున్నారు. అసమ్మతి గ్రూపు వ్యవహరిస్తున్న తీరువల్ల పార్టీ అల్లరైపోతుందంటూ నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్ అధికారులు సైతం అసమ్మతి నేతల తీరుపై వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇవన్నీ శ్రీధర్‌కు కలిసొచ్చిన పరిణామాలు. కొరవడిన ఐక్యత శ్రీధర్‌ను గద్దె దించాలని ప్లాన్ చేసిన అసమ్మతి గ్రూపులో ఐక్యత కొరవడింది. మేయర్‌చైర్ కోసం పోటీపడ్డ ముగ్గురు కార్పొరేటర్లు తలోదారి అవ్వడంతో సంతకాలు చేసిన కార్పొరేటర్లు సైతం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పార్టీలో గ్రూపు తగదాల కారణంగా విజయవాడలో మేయర్‌ను మారిస్తే ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు మార్పు కోరుకొనే అవకాశం ఉందని అధిష్టానం అంచనా కట్టినట్లు తెలుస్తోంది. మేయర్ చైర్ మార్చే అవకాశం లేదని తేల్చిన అధిష్టానం, డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లను ఇప్పట్లో మార్చమంటూ సంకేతాలు ఇచ్చినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం హుషారు కాగా, అసమ్మతి గ్రూపు దిగాలు పడింది.