vijaykumar reddy
-
అభివృద్ధికు ఇచ్చిన ప్రతి రూపాయి. తన జోబులో వేసుకున్న శాడిస్ట్
-
కోటంరెడ్డి బండారం బయటపెట్టిన ఆనం విజయకుమార్ రెడ్డి
-
సాయుధ తెలంగాణకు ఓటు ఆయుధమై..
అది 1952 మార్చి 27... కాలినడకన కొందరు, ఎడ్ల బండ్లపై మరికొందరు సుదూరాన ఉన్న పోలింగ్ బూత్‌లకు ఒకరెనక ఒకరు వెళ్లి తమ ఓటుతో తొట్టతొలి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకున్న రోజు. సుమారు 224 ఏళ్ల అసఫ్‌జాహీల రాచరికం, ఆపై నాలుగేళ్ల సైనిక పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో ఓటు వేసేందుకు జనం వస్తారో లేదోనన్న అధికారుల అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి ఎన్నికలోనే జనచైతన్యం ఓటెత్తింది. అప్పటివరకు తుపాకుల నీడలో అభద్రత, భయం నీడలో తలదాచుకున్న వారంతా ఊరూరా కదిలి మొత్తంగా 52,02,214 మంది ఓటు వేయడంతో అధికార యంత్రాంగం సంబురపడింది. నాటి ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మాపూర్‌కు చెందిన జరుపాటి రాములమ్మ (110) తొలి ఓటు వేసి తమకు స్వాతంత్య్రం రావడం నిజమేనని నమ్మినట్టు పేర్కొంది. మిశ్రమ ఫలితాలు... నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థులు విజయం సాధించగా సత్యాగ్రహ పోరాటాలు జరిగిన హైదరాబాద్, ఔరంగాబాద్, గుల్బర్గా డివిజన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా తెలుగు ప్రజలు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు, పీడీఎఫ్ 35 స్థానాల్లో, సోషలిçస్టు పార్టీ 11 చోట్ల, మరో 10 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. బీఆర్ అంబేడ్కర్ ఆధ్వరంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) 5 చోట్ల గెలవగా అందులో తెలంగాణలోని ద్విసభ నియోజకవర్గాలైన జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకుంది. అంటే మొత్తంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోని ఓటర్లు 66 స్థానాల్లో కాంగ్రేసేతర అభ్యర్థులను గెలిపించారు. అప్పటి ఓటు.. ఇంకా గుర్తుంది నాకు ఓటు వచ్చే సరికి 40 ఏళ్లు . ఇప్పుడు 110 ఏళ్ల వరకు ఉంటాయనుకుంటా. అప్పుడు ఎండాకాలం. ఊరోళ్లమంతా నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసినం. ఇంకా నాకు గుర్తుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు తప్పకుండా వేస్తున్న. – జరుపాటి రాములమ్మ, లక్ష్మాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా తొలి సభలో అత్యధికం విద్యావంతులే.. హైదరాబాద్ తొలి శాసనసభకు ఉన్నత విద్యావంతులే అత్యధికంగా ఎన్నికైయ్యారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన మాసూమాబేగం శాలీబండ స్థానం నుంచి ప్రముఖ కవి ముగ్ధూం మోహియొద్దీన్‌ను ఓడించారు. 1927లో ఉస్మానియాలో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ జీఎస్ మెల్కొటే ముషీరాబాద్ నుంచి విజయం సాధించారు. చాదర్‌ఘాట్ నుంచి జస్టిస్ గోపాలరావు ఎక్బోటే, సోమాజిగూడ నుంచి మెహిది నవాజ్ జంగ్, వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి, షాద్‌నగర్ నుంచి బూర్గుల రామకృష్ణారావు, వికారాబాద్ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, బేగంబజార్ నుంచి కాశీనాథ్ వైద్య గెలుపొందారు. ఓటు వేయకపోవడం చనిపోవడంతో సమానం.. నాకిప్పుడు 103 ఏళ్లు. తొలి ఎన్నికలప్పుడు మా ఊర్లో డప్పు చాటింపు వేసి ఓటు వేసేందుకు పిలుచుకొనిపోయిండ్రు. అప్పటి నుంచి ఓటు తప్పకుండా వేస్తున్న. ఓటు వేయకపోతే చనిపోవడంతో సమానమని నమ్ముత. వచ్చే ఎన్నికల్లోనూ ఓటు వేస్త. – మల్తుం బాలవ్వ, చిట్యాల, కామారెడ్డి అజ్ఞాతం నుంచి చట్ట సభకు.. తొలుత నిజాం, ఆపై భారత సైన్యంపై తుపాకులు ఎక్కుపెట్టిన కమ్యూనిస్టు పార్టీల నాయకులు అనేక మంది అజ్ఞాతం వీడిన అనంతరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ వేసి స్వయానా తన బావమరిది భూదాన్ రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. గత 70 ఏళ్లలో ఓటు తప్పలేదు.. నాకిప్పుడు 98 ఏళ్లు. రజాకార్ల బాధలు ప్రత్యక్షంగా చూసినం. వారిపై తిరగబడినం. స్వతంత్రం వచ్చినంక తొలి ఎన్నికలో ఓటు వేసేందుకు ఎడ్లబండిలో పోయినం. 1952 ఎన్నికల నుంచి ప్రతిసారీ ఓటు వేస్తూనే ఉన్న... – చల్లారం మధురవ్వ, తిమ్మాయపల్లి, సిద్దిపేట - శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
45 నెలల్లో పేదలకు రూ.2,96,148.09 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 45 నెలల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా (డీబీటీ, నాన్ డీబీటీ) రూ.2,96,148.09 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల ద్వారా ఏడాది పొడవునా ప్రయోజనం చేకూర్చనుందో వెల్లడిస్తూ సంక్షేమ క్యాలెండర్‌ను ముందే ప్రకటించి మరీ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం. జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023 – 24ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచారశాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. 2023–24 ఏ నెలలో ఏ పథకం? ఏప్రిల్ 2023: జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం మే 2023 : వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు– షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా జూన్ 2023: జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి జూలై 2023: జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం) ఆగస్టు 2023: జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర సెప్టెంబర్ 2023: వైఎస్సార్ చేయూత అక్టోబర్ 2023: వైఎస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ (రెండో విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత) నవంబర్ 2023: వైఎస్సార్ సున్నావడ్డీ– పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు– షాదీతోఫా (మూడో త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడో విడత) డిసెంబర్ 2023: జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండో విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి జనవరి 2024: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ (మూడో విడత), వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండో విడత), వైఎస్సార్ లా నేస్తం (రెండో విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ.3,000) ఫిబ్రవరి 2024: జగనన్న విద్యా దీవెన (నాలుగో విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు – షాదీ తోఫా (నాలుగో త్రైమాసికం), వైఎస్సార్ ఈబీసీ నేస్తం మార్చి 2024: జగనన్న వసతి దీవెన (రెండో విడత), ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు -
సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?
(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి) ఉద్వేగాల నేల తెలంగాణ.. సంతోషం, సంబురం, వినోదం, విషాదం.. ఏదైనా సామూహిక విందు ఇక్కడి కలివిడి జీవితాలకు సంకేతం. నలుగురు కలిసిన సమయంలో విందు, విలాసాల్లో సరదాగా మొదలవుతున్న మద్యం వినియోగం.. తర్వాత అలవాటుగా మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్న మద్యంతో వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దేశంలో అరుణాచల్‌ప్రదేశ్ 15 లక్షలు జనాభాలో సుమారు 7.60 లక్షల మందికి మద్యం తాగే అలవాటుతో టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ నాలుగు కోట్లకుపైగా జనాభా ఉండగా.. వీరిలో 15– 49 ఏళ్ల మధ్య వయసువారిలో యాభై ఐదు శాతం మంది మద్యం తాగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–21) ఇటీవలే వెల్లడించింది. కొత్తగా మద్యం అలవాటు అవుతున్న వారి సంఖ్య జాతీయ సగటు కంటే వేగంగా పెరుగుతోందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా.. తెలంగాణలో మద్యం అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా 62 శాతం (15–49 ఏళ్ల మధ్య వయసువారిలో) మేర ఉంది. ఇందులో 7శాతం మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇందులో 54శాతం మంది వారంలో ఒకసారి మద్యం తాగుతుంటే.. 28శాతం మంది నాలుగు రోజులకోసారి, మరో 19 శాతం మంది ప్రతిరోజు తాగుతున్నారు. ఇక మద్యం అలవాటు/వ్యసనంగా మారిన కుటుంబాల్లో 28 శాతం మంది మహిళలు భర్తల నుంచి హింసకు గురవుతున్నారు. 16 శాతం మంది మహిళలు తీవ్రగాయాల పాలవుతున్నట్టు జాతీయ కుటుంబ సర్వే పేర్కొంది. నిషాలో ప్రమాదాలతో.. దేశంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పది రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బాధితులు 18– 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇక పదిలక్షల జనాభా దాటిన యాభై నగరాల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి.. హైదరాబాద్ 7వ స్థానంలో ఉందని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ వింగ్ 2020 నివేదిక పేర్కొంది. అమ్మకాలు.. ఆదాయం.. చీర్స్ మద్యం వినియోగం అధికంగా ఉండే రాష్ట్రాలతో పోలిస్తే తలసరి వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉంది. రాష్ట్రంలో 2017–2020 మధ్య మద్యం వినియోగం 18 శాతం పెరిగి రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించింది. అత్యధికంగా మద్యం విక్రయించిన వైన్స్‌ల వివరాలు చూస్తే తాజా ఎక్సైజ్ ఏడాదిలో.. హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ వైన్స్ రూ.38 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయిస్తే, అశ్వారావుపేటలో రూ.31 కోట్లు, కరీంనగర్లో రూ.29 కోట్లు, కల్వకుర్తిలో ఒక వైన్స్ రూ.20.50 కోట్లు, నిజామాబాద్‌లో ఒక వైన్స్ రూ.19.50 కోట్లు, తొర్రూరులో ఒకవైన్స్ రూ.14.33 కోట్లు విలువైన మద్యాన్ని బాటిలింగ్ యూనిట్ల నుంచి కొనుగోలు చేసి జనానికి విక్రయించాయి. డ్రంకెన్ డ్రైవ్.. ప్రాణాలు తీసింది.. అది 2021 డిసెంబర్ 18. తెల్లవారుజామున రెండుగంటలు.. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కారు సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైంది. డ్రైవర్ సీట్లో ఉన్న రహీం అనే యువకుడితోపాటు ఎం.మానస, ఎన్.మానస ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. సిద్ధు అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రహీం మద్యం మత్తులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై జడ్చర్లకు చెందిన మానస తండ్రి రవీందర్‌ను పలకరిస్తే.. ‘‘ఆరేళ్ల క్రితమే తల్లిని పోగొట్టుకున్న మానసను గారాబంగా పెంచాను. ఆమెకు ఇష్టమైన టీవీ, సినిమా రంగంలోకి వెళ్తానంటే సంతోషపడ్డాను. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటుందని భావించాను. కానీ డ్రంకెన్ డ్రైవ్ నా బిడ్డను నాకు కాకుండా చేసింది. ఇలాంటి శిక్ష ఏ తండ్రికి పడొద్దు..’’అని కన్నీళ్లు పెట్టారు. పెంచిన చేతులతోనే.. అతడి పేరు కిరణ్ (28).. బీరుతో సరదాగా మొదలైన వ్యసనం విస్కీతో విస్తరించింది. ఆపై గంజాయికీ చేరింది. మత్తు లేనిదే ఉండలేక డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం, దాడులు చేయడం దాకా ఉన్మాదం చేరింది. కిరణ్ భార్య వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అక్టోబర్ 10న మత్తులో ఇంటికి వచ్చిన కిరణ్ డబ్బులు కావాలంటూ తల్లి మీద దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రినీ గాయపరిచాడు. ఏమీ దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కిరణ్ మెడకు తాడు బిగించి చంపేశారు. ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన విషాద ఘటన. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాలనుకున్న తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ మద్యం పెట్టిన చిచ్చుతో జైలు జీవితం గడుపుతున్నారు. తల్లి కోసం తండ్రిని.. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ ఉన్నంతలో బాగానే కాలం గడిపారు. భర్త భాస్కర్ (45) ఆటో నడుపుతూ భార్య కరుణారాణి, ఇద్దరు కుమారులు బాలతేజ, తరుణ్ తేజలను పోషించుకుంటూ వచ్చాడు. కానీ భాస్కర్ సరదాగా మొదలుపెట్టిన మద్యం తాగుడు.. తర్వాత అలవాటుగా, వ్యసనంగా మారింది. కొన్నేళ్ల క్రితం మద్యం మత్తులో భాస్కర్ దాడి చేయడంతో భార్య చేయి విరిగింది. తర్వాతా మద్యానికి డబ్బుల కోసం వేధించడం పెరిగింది. ఈ నెల 20న ఆలేరు మండలం తూర్పుగూడెంలో చర్చి పండగతో ఊరంతా సందడిగా ఉంటే.. భాస్కర్ మాత్రం తనకు తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన కొడుకులను గాయపర్చాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇద్దరు కొడుకులు కత్తితో దాడి చేయగా.. భాస్కర్ చనిపోయాడు. ఆ ఇద్దరు జైలుకు వెళ్లారు. కరుణారాణిపైనా కేసు నమోదైంది. కష్టం చేస్తేగానీ పూటగడవని కుటుంబానికి మద్యం అలవాటు చేసిన గాయం ఎలా మానుతుందంటూ తూర్పుగూడెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమపెళ్లి.. నడిరోడ్డులో ఆలిని నరికేసి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం భవానినగర్ తండాలో ఉండే జాటోత్ భాస్కర్ 15 ఏళ్ల కింద కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భాస్కర్ ఒకచోట గుమాస్తాగా, కల్పన ఇళ్లలో పనిచేస్తూ ముగ్గురి ఆడపిల్లల్ని పోషించుకుంటూ వచ్చారు. కానీ, కొంతకాలంగా మద్యానికి బానిసైన భాస్కర్ తాగి వచ్చి డబ్బుల కోసం కల్పనను కొట్టేవాడు. వేధింపులు భరించలేక కల్పన ఈ ఏడాది సెప్టెంబర్ 17న పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై ఆగ్రహించిన భాస్కర్ సెప్టెంబర్ 22న ఉదయం పనికోసం వెళ్తున్న కల్పనను నడిరోడ్డులో కత్తితో పొడిచి చంపాడు. తల్లి హత్యకు గురై తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అమ్మమ్మ ఇంట్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. భారీగా మద్యం ఆదాయం 2020–21లో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు పదివేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మిగతా జిల్లాల్లో బాట్లింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వానికి నేరుగా వచ్చిన ఆదాయం ఇదీ .. సులువైన ఆదాయం మద్యం నుంచే.. అది పేరుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. కానీ ప్రొహిబిషన్ (నిషేధం) బదులు విస్తరణ శాఖగా మార్చేశారు. మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వాలకు సులువుగా వచ్చే ఆదాయం ఇదే. కానీ మద్యం వినియోగంతో పాటు క్రైం రేటు భారీగా పెరుగుతోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను మర్చిపోయామనిపిస్తోంది. – ఎంవీ చంద్రవదన్, ఎక్సైజ్ మాజీ కమిషనర్ డేంజర్ జోన్‌కు చేరువలో ఉన్నాం తెలంగాణ ఇప్పుడు డేంజర్ జోన్‌కు చేరువలో ఉంది. మా అంచనా మేరకు 90శాతం మంది (15 ఏళ్లు పైబడిన వారిలో) పలు రకాల మద్యం తాగుతున్నారు. మొదట తొలుత కల్లు, బీరు, విస్కీ.. అనంతరం గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. పంజాబ్ ఇప్పటికే మద్యం వినియోగం నుంచి డ్రగ్స్ వైపు వెళ్లింది. తెలంగాణలో పరిమితికి మించి మద్య వినియోగం జరుగుతుంది. కొన్నాళ్లకు ఈ మత్తు చాలక గంజాయి, డ్రగ్స్ వైపు వెళ్లటం సహజం. తక్షణం మద్య నియంత్రణ కార్యాచరణ ప్రకటించకపోతే తెలంగాణ మరో పంజాబ్ కావడానికి ఎంతో సమయం పట్టదు. – ఎం పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మద్యం విచక్షణను దూరం చేస్తుంది సరదా కోసం తీసుకునే మద్యం అలవాటుగా మారి మనిషిలో విచక్షణను దూరం చేస్తోంది. మెదడు నుంచి కాలిబొటన వేలి వరకు ప్రభావం చూపుతుంది. ఆహారంలా అవసరంగా మారి.. మద్యం తీసుకోకపోతే మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. – డాక్టర్ ఎ.లక్ష్మీలావణ్య, హైదరాబాద్ -
వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల జాబితా సిద్ధం
సాక్షి, అమరావతి: వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ – 2022’ అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు శుక్రవారం ప్రకటించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన దాదాపు 25 మంది వ్యక్తులు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేస్తోందని తెలిపారు. వివిధ రంగాల్లో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన అర్హులైన వ్యక్తులు, సంస్థలను గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్రస్థాయి హైపవర్ స్క్రీనింగ్ కమిటీ అవార్డుల ఎంపికకు జాబితాను సిద్ధం చేసిందని పేర్కొన్నారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద ఎంపికైన వారికి రూ.10 లక్షలు, వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారని తెలిపారు. అదే విధంగా వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద ఎంపికైన వారికి రూ.5 లక్షలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారని విజయ్‌కుమార్ రెడ్డి వివరించారు. -
రెవెన్యూ లీలలు.. పేదలే సమిధలు
పరిగి: నిరుపేదలపై రెవెన్యూ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకోవాలంటూ పట్టాలిచ్చిన రెవెన్యూ అధికారులే ఇప్పు సర్వే చేసి ఆ స్థలం ఖాళీ చేయాలంటున్నారు. కష్టపడి రెక్కలుముక్కలు చేసుకుని కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు కూల్చేస్తామంటూ ప్లాట్లు లాక్కుంటామంటున్నారు. పేదలకు పట్టాలిచ్చిన స్థలం జూనియర్ కళాశాలకు చెందినదంటూ సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. పేదల ఇళ్లు కూల్చేసి ఆ స్థలంలోంచి కళాశాల ప్రహరీ నిర్మిస్తామని సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న 20 కుటుంబాలు, అక్కడ ప్లాట్లు పొందిన మరో వందకు పైగా కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. రెవెన్యూ లీలల్లో సమిధలు కానున్న పేదబతుకులు.. పరిగికి కిలో మీటర్ దూరంలో ఆరు సంవత్సరాల క్రితం సర్వే నెంబర్: 530లోని 10 ఎకరాల భూమిలో 350 మందికి అప్పటి రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. ఆ కాలనీకి విద్యారణ్యపురి అని పేరుపెట్టగా ప్రస్తుతం 150 నుంచి 200 మంది వరకు అక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కిమ్మనని అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా పేదలకు పట్టాలిచ్చిన స్థలం జూనియర్ కళాశాలకు చెందినదని పేర్కొంటున్నారు. శుక్రవారం సర్వే నిర్వహించిన అధికారులు పేదలు ఇళ్లు నిర్మించుకున్న స్థలంలో రెండెకరాలు కళాశాల భూమి అని, అక్కడ ప్రహరీ నిర్మిస్తామని చెప్పి పేదల ఇళ్లలోంచి సరిహద్దులు ఏర్పాటు చేసి వెళ్లిపోయారు. 15 సంవత్సరాల క్రితం ఈ కళాశాలకు తొమ్మిది ఎకరాల స్థలం కేటాయించిన అధికారులు, ఆ తరువాత ఎనిమిదేళ్లకు ఇక్కడే పేదలకు పట్టాలిచ్చారు. అయితే ఇప్పుడు కళాశాలకు కేటాయించిన స్థలం ఏడెకరాలే ఉందని, మిగిలిన రెండు ఎకరాలను విద్యారణ్యపురి కాలనీ నుంచి స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు. రెవెన్యూ అధికారుల నిర్వాకంతో 20కిపైగా ఇళ్లతోపాటు 150 వరకు ప్లాట్లు, అక్కడ నిర్మించుకున్న ప్రార్థనా స్థలాలు కూల్చి వేసే పరిస్థతి తలెత్తింది. ఈ విషయమై తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. అప్పట్లో అధికారులు అందుబాటులో ఉన్న స్థలాన్ని కచ్చితంగా అంచనా వేయకుండా పేదలకు స్థలాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు సర్వే చేస్తే అది కళాశాల స్థలం అని తేలిందని, అందుకే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నుట్ల తెలిపారు. మరోవైపు ఇక్కడ ప్లాట్లు పొందిన కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. తమ ప్లాట్ల వద్దకు వస్తే ఉరుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నాం ఏడేళ్ల క్రితం ఇక్కడ మాకు స్థలం కేటాయిస్తూ అప్పటి రెవెన్యూ అధికారులు పట్టా కాగితాలు ఇచ్చారు. ఆ తర్వాత బాగా కష్టపడి నాలుగేళ్ల క్రితం ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడేమో మేము ఇల్లు నిర్మించుకున్న స్థలం కళాశాలదని చెబుతున్నారు. అప్పుడు పట్టాలు వారే ఇచ్చి ఇప్పుడు మళ్లీ వారే లాక్కుంటామని చెబుతున్నారు. మాకు నష్టం కలిగిస్తే ఉరుకునే ప్రసక్తే లేదు. -ఎండీ అబ్దుల్ రషీద్, విద్యారణ్యపురి