Vinod Vijayan
-
'ఒక పథకం ప్రకారం' టీజర్ రిలీజ్ చేసిన రవితేజ
Raviteja Launched Sairam Shankar Oka Pathakam Prakaram Teaser: సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. జాతీయ అవార్డుగ్రహీత వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌పై వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో రవితేజ విడుదల చేశారు. సినిమాని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో రామ–రావణ తరహా పాత్రలో నటించారు సాయిరామ్ శంకర్’’ అన్నారు. కాగా ఇంతకుముందు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. శృతీ సోధి, సముద్రఖని, కళాభవన్ మణి, భాను శ్రీ నటించిన ఈ చిత్రానికి రాహుల్ రాజ్ సంగీతం అందించగా రాజీవ్ రవి, వినోదిల్లంపల్లి, సురేష్ రాజన్ కెమెరా వర్క్స్ చేశారు. చదవండి: 'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు.. -
క్రిమినల్ లాయర్‌గా పూరీ సోదరుడు
హైదరాబాద్ : ఇప్పటి వరకు ప్రేమికుడు, రోమియో, పోకిరీ తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్... తాజాగా 'వాడు నేను కాదు' చిత్రంలో క్రిమినల్ లాయర్ పాత్రను పోషించనున్నాడు. ఆ చిత్ర షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నికి వినోద్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ క్రిమినల్ లాయర్ బిగ్ పజిల్‌ను ఎలా ఛేదించాడు అనేది ఈ చిత్రం ద్వారా చూడవచ్చని చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, భోజ్‌పూరి భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సాయిరాం శంకర్‌కి దర్శకుడు విజయన్‌కు మధ్య గత కొద్ది సంవత్సరాలుగా ఈ చిత్ర కథపై జరిగాయని... అయితే అవి ఇటీవల కొలిక్కి రావడంతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని వివరించింది. నటి మహిమ నంబియార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పింది. అలాగే మరో నటిని ఎంపిక చేయవలసి ఉందని... అందుకోసం ఇప్పటికే చిత్ర దర్శకుడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారని పేర్కొంది. వివిధ చిత్రాలకు పని చేసి పలు అవార్డులు అందుకున్న ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారని చిత్ర యూనిటి తెలిపింది. ఈ చిత్రంలో సాయిరాం ద్విపాత్రాభినయం చేయనున్నాడు. -
అయిదు భాషల్లో హంగామా!
హీరో సాయిరామ్ శంకర్‌ను ఇక నుంచి రామ్ శంకర్‌గా పిలవాలి. ఆ పేరుతోనే ఆయన ‘వాడు నేను కాదు’ సినిమా చేస్తున్నారు. ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలు కలిసి పనిచేస్తున్న ఈ చిత్రాన్ని అయిదు భాషల్లో తీస్తున్నారు. వినోద్ విజయన్ దర్శకత్వంలో రవి పచ్చ ముత్తు, కె. మోహనన్, వినోద్ విజయన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఈ సినీవేడుకలో పాల్గొని కెమెరా స్విచాన్ చేయడం విశేషం. అలాగే ఈ వేడుకలో ప్రపంచలోనే అతిపెద్ద శ్రీచక్రంను ఏర్పాటు చేయడం మరో విశేషం. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాతో తనకు బ్రేక్ రావడం ఖాయమని రామ్ శంకర్ నమ్మకం వ్యక్తపరిచారు. ఇందులో రామ్ శంకర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని దర్శకుడు చెప్పారు. కేరళ, హైదరాబాద్, తమిళనాడు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తామని నిర్మాత తెలిపారు. తమిళంలో ఏడు సినిమాలు చేసిన తనకిది తొలి తెలుగు చిత్రమని కథానాయిక మహిమా నంబియార్ చెప్పారు. ఏఎమ్ రత్నం, పూరి జగన్నాథ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.