Visakha Utsav
-
విశాఖ వాసుల కోసం మూడోరోజు ఫ్లవర్ షో
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫ్లవర్ షోను చూడటానికి మూడో రోజు కూడా జనం పోటెత్తారు. డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా రెండురోజులు మాత్రమేనని ప్రకటించినప్పటికీ విశాఖ నగర వాసుల సౌకర్యార్థం ఫ్లవర్ షోను మరో రోజు పొడిగించారు. దీంతో పుష్ప సోయగాలను వీక్షించడానికి విశాఖవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు రూ. 60 లక్షల వ్యయంతో ముంబై, కోల్‌కతా, హిమాచల్ ప్రదేశ్, బెంగళూరు ప్రాంతాల నుంచే కాకుండా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, ధాయిలాండ్ వంటి ఇతర దేశాల నుంచి సైతం పూలను తెప్పించారు. 15 టన్నుల వివిధ పుష్పాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన మిక్కీమౌస్, నెమలి వివిధ రకాల ఆకృతులు పర్యాటకుల మనసును దోచుకున్నాయి. ఫ్లవర్ షోలో ఏర్పాటు చేసిన ఆర్కిటెక్ట్స్, లిలియమ్స, టులిప్స్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, టెలికోనియా వంటి అరుదైన జాతి పువ్వులను చూసి విశాఖ వాసులు ఆనంద పరవశులయ్యారు. వాటి దగ్గర సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మరోవైపు ఫ్లవర్ షో సమీపంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ కలర్ ఫౌంటైన్ ఆకట్టుకుంది. -
విశాఖ ఉత్సవ్ వైభవోపేతం
-
ఉత్సవ్ తరంగం..
సాక్షి, విశాఖపట్నం: జనమా.. తీరాన వీచిన ప్రభంజనమా! నగరమా.. నవ్యోత్సాహ తరంగాల సాగరమా! ఆదివారం సాయంత్రం అగుపించిన విచిత్రాన్ని చూస్తే కలిగిన సందిగ్ధమిది. చలికాలం సాయంత్రం ఉప్పొంగిన ఉత్సాహాన్ని చూస్తే తలెత్తిన సందేహమిది. ఉత్సవ సంరంభంతో విశాఖ అంతా హోరెత్తిపోయింది. అపూర్వరీతిలో ఎగసిన ఉత్తేజంతో సాగర నగరమంతా ఉప్పొంగిపోయింది. ఆవంక సాగర తీరంలో రాత్రివేళ.. సాంస్కృతిక కార్యక్రమాల హరివిల్లు విరిస్తే.. ఇటు నగర మధ్యంలోని వైఎస్సార్ పార్క్‌లో ఉప్పొంగిన పూల కెరటం ఉల్లాసపు జల్లుల్ని కురిపించింది. బీచ్‌లో వేల దీపాల వెలుగుల మధ్య జిగేల్మన్న సాంస్కృతిక సంరంభం.. ప్రజానీకాన్ని సమ్మోహితుల్ని చేసింది. విభిన్న కళా ప్రదర్శనలకు వినోదం మిళితం కాగా.. సాగరతీరం ఉత్సాహంతో ఊగిపోయింది. ప్రముఖుల ఆటామాటా మరింత సంతోషాని్న చ్చింది. ఉత్సవ ఉత్సాహంతో ఊరంతా సాగరతీరం వైపే ఉరకలేయగా.. ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ జన గమనానికి ఆటంకం కలిగింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి చక్కబడింది. అపూర్వమైన సంబరాన్ని తిలకించిన సంభ్రమంతో నగరం పరవశించింది. వెంకిమామ సందడి విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో హీరో వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జోక్స్‌తో ప్రేక్షకుల్ని నవి్వంచారు. విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. వైజాగ్ వస్తే సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందన్నారు. సంప్రదాయాలను పాటించడం, వినోదాన్ని పంచడంలో విశాఖవాసుల ప్రత్యేకతే వేరని కొనియాడారు. వెంకి మామ చిత్రంలోని పలు డైలాగ్స్‌ను చెప్పి ప్రేక్షకుల్ని అలరించారు. ఉత్సవ్ సాగిందిలా... ►బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన విశాఖ ఉత్సవ్–2019 ఆదివారం అంగరంగ వైభవంగా ముగిసింది. ►ఆర్కేబీచ్‌లోని ప్రధాన వేదికపై సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనేలా సాగాయి. ►వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్కేబీచ్ వరకు జనం పోటెత్తారు. ►‘ఆట’ సందీప్ టీం వినాయక పాటతో ప్రదర్శన ప్రారంభించింది. ►హైదరాబాద్‌కు చెందిన థీరి బ్యాండ్ ప్రదర్శన శ్రోతల్ని సంగీతలోకంలో ఓలలాడించింది. ఈ ప్రదర్శన 45 నిమిషాల పాటు సాగింది. ►థింక్ బిగ్ టీమ్.. మహిళల సంరక్షణ కోసం రూపొందించిన అత్యవసర అలారమ్ వినియోగంపై అవగాహన కలి్పంచింది. ►ఎంజె5 బృందం ప్రదర్శించిన డ్యాన్సులతో సందర్శకులు ఊగిపోయారు. ►సౌత్ ఆఫ్రికాకు చెందిన జరన్ టీం ప్రదర్శన అద్భుతంగా సాగింది. ►ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ తన బృందంతో 45 నిమిషాల పాటు సాగరతీరాన్ని హోరెత్తించారు. సింహా, గీతా మాధురి, శ్రీకృష్ణ, ఆదిత్య, హనుమాన్ తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ►ఉత్సవ్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారులను మంత్రి ముత్తంశెట్టి సన్మానించారు. ►ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా సాగరతీరంలో ఏర్పాటు చేసిన బాణసంచాతో తీరం మెరిసిపోయింది. ►20 నిమిషాల పాటు సాగిన లేజర్ షోతో విశాఖ ఉత్సవ్ ముగిసింది. ►ముగింపు వేడుకల్లో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కలెక్టర్ వినయ్‌చంద్, జేసీలు వేణుగోపాల్ రెడ్డి, శివశంకర్, ఎమ్మెల్యేలు అమర్నాథ్, నాగిరెడ్డి, అదీప్ రాజ్, వైఎస్సాసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ట తదితరులు పాల్గొన్నారు. -
మురిసిన విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నం ప్రజలు శనివారం అపూర్వ స్వాగతం పలికారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన ఆయనకు.. 24 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడి ‘థాంక్యూ సీఎం’ అంటూ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సీఎం పర్యటన ఆద్యంతం విశాఖ నగరం జన సంద్రమై ఉప్పొంగింది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. విశాఖ పర్యటనలో భాగంగా రూ.1,285.32 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బీచ్‌రోడ్డులో విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. దారిపొడవునా అభిమాన సంద్రమై.. శనివారం మధ్యాహ్నం 3.47 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా ఏకమై వేలాదిగా తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బయటికి రాగానే పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులందరినీ ఆత్మీయంగా పలకరించి జగన్ కాన్వాయ్‌లో బయలుదేరారు. వివిధ కళాశాలల విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చోడవరం, అనకాపల్లి నుంచి రైతులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి హర్షధ్వానాలతో పూలు చల్లుతూ సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎన్ఏడీ జంక్షన్, ఆర్అండ్బీ కూడలి, తాటిచెట్లపాలెం.. కైలాసగిరి అక్కడి నుంచి సెంట్రల్ పార్కు.. ఆపై ఆర్కే బీచ్ వరకూ సాగిన కృతజ్ఞతా యాత్రలో ఆసాంతం కొండంత అభిమానం కనిపించింది. విమానాశ్రయం నుంచి తాటిచెట్లపాలెం వరకూ కాన్వాయ్ చేరేందుకు 50 నిమిషాల సమయం పట్టడాన్ని చూస్తే.. అభిమాన తరంగం ఎంతగా ఉప్పొంగిందో అర్థం చేసుకోవచ్చు. రూ.1,290 కోట్లతో శంకుస్థాపనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.1285.32 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా కైలాసగిరిపై వీఎంఆర్డీఏ చేపట్టే రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాతజైలు రోడ్డులోని వైఎస్సార్ సెంట్రల్‌పార్క్‌లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్కులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ కార్యక్రమాన్ని వీక్షించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేరుగా ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ ప్రాంగణానికి బయల్దేరారు. మీ ప్రేమానురాగాల మధ్య ఉత్సవాలు ప్రారంభిస్తున్నా.. సాయంత్రం 6.39 గంటలకు ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ వేదిక వద్దకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. నవరత్నాలపై ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రదర్శనతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం.. సీఎం జగన్ మాట్లాడుతూ ఆప్యాయతలూ.. ప్రేమానురాగాల మధ్య.. ఈ రోజు విశాఖ ఉత్సవాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. 22 సెకన్లు మాత్రమే మాట్లాడినా.. జనం సీఎం.. సీఎం.. అంటూ జేజేలు పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు. జిగేల్మనే లేజర్ షో.. బాణసంచా వెలుగుల నడుమ.. విశాఖ సంబరాలు అంబరానంటేలా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవాలు ముగిసిన అనంతరం తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్‌జైన్ దంపతులకు సీఎం ఆత్మీయ సత్కారం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి జ్ఞాపిక అందించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ముఖ్యమంత్రికి ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి అశేష జనవాహినికి అభివాదం చేస్తూ విమానాశ్రయానికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రామ్స్ కోర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పాండుగాయిల రత్నాకర్‌తో పాటు ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుష్ఫ సోయగం అదరహో స్వదేశీ, విదేశీ పుష్ఫాలతో డాక్టర్ వైఎస్సార్ సిటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రూ.60 లక్షలతో 22 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 15 టన్నుల పుష్ఫాలను వాడి పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటిలో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్ నుంచి తెప్పించిన 20 రకాల పుష్ఫాలు కూడా ఉన్నాయి. అభివృద్ధి విధాతకు జయహో నగరంలో దాదాపు 24 కిలోమీటర్ల మేర అభిమానం పూలవర్షమై కురిసింది. ‘థ్యాంక్యూ సీఎం సర్.. థ్యాంక్యూ జగనన్న.. ‘అభివృద్ధి విధాతకు జయహో’ అనే నినాదాలతో నగరం మార్మోగిపోయింది. పలుచోట్ల తమ అభిమాన నేతతో సెల్ఫీలు దిగాలన్న ఆత్రుతతో కాన్వాయ్‌కు అడ్డు వచ్చేందుకు పలువురు ప్రయత్నించగా.. అతి కష్టంమ్మీద పోలీసులు వారిని నిలువరించారు. విశాఖ నగరం నుంచే కాకుండా.. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన జనం సీఎంకు స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో తరలివచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమైన అభిమాన యాత్రలో అడుగడుగునా ధన్యవాదాలు చెబుతున్న ప్రజలు, అభిమానులను జగన్ చిరు మందహాసంతో ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. ప్రతీ కూడలిలోనూ వాయిద్యాలు, జానపద నృత్యాలతో సందడి నెలకొంది. చిన్నారి వైద్యానికి సీఎం భరోసా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామానికి చెందిన రెండేళ్ల పాప ఎస్.తన్విత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ వివరించారు. పెద్ద పేగుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారని, తమకు అంత స్తోమత లేదని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. చిన్నారి కష్టాన్ని చూసి చలించిపోయిన సీఎం జగన్ తక్షణమే తన్వితకి శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డిని ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ పాపకి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందనీ.. త్వరలోనే ఆరోగ్యంగా తిరుగుతుందని తన్వితని ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. ఆ కుటుంబం సీఎంకు ధన్యవాదాలు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. -
విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
విశాఖ ఉత్సవ్: తరలివచ్చిన సినీ ప్రముఖులు
-
ముగిసిన సీఎం జగన్ విశాఖ పర్యటన
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటన ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు గన్నవరం నుంచి బయలుదేరిన సీఎం జగన్.. మధ్యాహ్నం 3.50గంటలకు విశాఖ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువులు మంత్రులు, వైఎస్సార్సీపీ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. (చదవండి : విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం) తమ అభిమాన నేతను చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి రోడ్డుపై నిల్చోని తమ అభిమాన నేత జగనన్న కోసం ఎదురు చూశారు. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. కారులో ఉన్న సీఎం జగన్‌లో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్ పార్క్ నుంచి ఆర్కేబీచ్కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో సీఎంకు థాంక్స్ చెప్పారు. (చదవండి : విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్) దాదాపు రెండు గంటల పాటు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించిన సీఎం జగన్.. కైలాసగిరికి చేరుకొని పలు అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించారు. ఒకేసారి ఏకంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కైలాసగిరిలో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో నిర్మించనున్న ప్లానెటోరియానికి శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి బయలుదేరి నేరుగా వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆర్కే బీచ్‌కు చేరుకుని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిచారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్‌కు వారు సన్మానం చేశారు. అనంతరం సాయంత్రం 7.40 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. -
విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం
-
విశాఖ నేవీ కోస్ట్ కామాండర్కి సీఎం వైఎస్ జగన్ సన్మానం
-
విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
-
నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. డాక్యుమెంటరీ
-
విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసేలా రెండు రోజుల పాటు ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. సీఎం రాకతో సాగర తీరం జనసందోహంలా మారింది. థాంక్యూ సీఎం నినాదం హోరెత్తింది. వేదికపైకి వచ్చిన సీఎం జగన్‌కు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి శాలువా కప్పి సత్కారం చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. లేజర్ స్పెషల్ షో ప్రదర్శించారు. స్థానికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ‘మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ రోజు విశాఖ ఉత్సవాలను ఇప్పేడే ఇక్కడే ప్రారంభిస్తున్నాం’ అని సీఎం జగన్ అనగానే లేజర్ షో ద్వారా విశాఖ ఉత్సవ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్‌కు వారు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమాని జనం భారి ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించనున్నారు. మొదటి రోజు శాస్త్రీయ నృత్యం, లేజర్ షో, పాప్ సింగర్ అనుదీప్ ప్రత్యక్ష కచేరీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు జరగనున్నాయి. రెండవ రోజు, 'త్రీరీ' లైవ్ బ్యాండ్, ఆర్చరీ షో, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కచేరీ, లేజర్ షో మరియు బాణసంచా తదితర ప్రోగ్రామ్‌లతో విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ఘనంగా ముగియనుంది. -
విశాఖలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.50 నిమిషాల నుంచి 4.20 నిమిషాల వరకు కైలాసగిరి వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం డాక్టర్ వైఎస్సార్ సెంట్రల్ పార్కు వద్ద పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు రామకృష్ణ బీచ్‌లో విశాఖ ఉత్సవ్-2019 కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి 7.40కు తన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటాడు. విశాఖ ఉత్సవ్‌కు ముస్తాబైన వైఎస్సార్ సెంట్రల్ పార్క్ విశాఖ ఉత్సవ్ సందర్భంగా శని ఆదివారాల్లో వైఎస్సార్ సెంట్రల్ పార్కులో ప్రవేశం ఉచితమని అధికారులు ప్రకటించారు. విశాఖ ఉత్సవ్ రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో సెలబ్రిటీలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వైఎస్సార్ సెంట్రల్ పార్కులో రూ.60 లక్షల వ్యయంతో ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. దీనికోసం నెదర్ ల్యాండ్, సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్ దేశాల నుంచి 20 రకాల ప్రత్యేక పూలను ప్రదర్శనకు తెప్పించారు. ఫ్లవర్ షోలో పది టన్నుల పూలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమాలను విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డిఏ) కమిషనర్ కోటేశ్వరరావు, చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విశాఖ ఉత్సవ్ నేపపథ్యంలో బీచ్ రోడ్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. -
వహ్వా.. అనిపించేలా విశాఖ ఉత్సవ్
సీతమ్మధార(విశాఖ ఉత్తర) : సాగరనగరి హోరెత్తేలా విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ప్రతిబింబించే విధంగా, ఈ ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయన మంగళవారం సాక్షితో మాట్లాడారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్సవాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. హాజరు కానున్న హీరో వెంకటేష్ ప్రముఖ సినీ హీరోలు వెంకటేష్, రవితేజ, సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్, దేవి శ్రీ ప్రసాద్ ప్రదర్శనల్లో పాల్గొంటారని మంత్రి తెలిపారు. టీవీ యాంకర్లు సుమ కనకాల, శిల్పాచక్రవర్తి, భార్గవ్ కార్యక్రమాలను నడిపిస్తారన్నారు. ప్రముఖ గాయనీగాయకులు, కళాకారులతో ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఫ్లవర్ షో వైఎస్సార్ సెంట్రల్ పార్కులో ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణ అని ముత్తంశెట్టి చెప్పారు. అక్కడే రెండు రోజులపాటు రమణీయమైన, అద్భుత ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో.. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రముఖ దేవాలయాల నమూనాలను ఆర్.కె. బీచ్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుందర విశాఖను సందర్శిస్తూ ఈ ప్రాంత ప్రాముఖ్యతను గురించి తెలియజేసి, ప్రపంచ స్థాయిలో విశాఖ ఘనకీర్తిని తెలియజేసే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ముగింపు రోజు విద్యుద్దీపాలతో పడవలు, బోట్లతో సముద్రంలో ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఆర్కే బీచ్, సెంట్రల్ పార్కుల్లో వేదికలు రామకృష్ణ బీచ్‌లో ప్రధాన వేదిక ఉంటుందని, వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌లో రెండో వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీచ్‌లో దేవాలయ నమూనాలు, ఫుడ్ కోర్డు, ఫొటో ఎగ్జిబిషన్, స్పోర్ట్స్ ఎరీనా మొదలైనవి ఉంటాయన్నారు. వైఎస్సార్ సెంట్రల్ పార్కులో స్థానిక కళాకారుల ప్రదర్శనలు, ప్లవర్ షో ఉంటాయన్నారు. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేజి నిర్వహణ, వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల నిర్వహణకు అధికారులను నియమించామన్నారు. ఉత్సవాలకు ఆహ్వానం సీటింగ్, లైటింగ్ ఏర్పాట్లు, పారిశుద్ధ్య నిర్వహణలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగరలో ట్రాఫిక్ సమస్య లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారన్నారు. విశాఖ ఉత్సవ్ తిలకించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తాగునీరు, వైద్య సదుపాయాల కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. డ్వాక్రా మహిళలతో సహా వివిధ శాఖలు, సంస్థలు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను తెలియజేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. వేదిక1 ఆర్.కె.బీచ్ ♦ ప్రారంభ, ముగింపువేడుకలు ♦ సెలబ్రిటీల సాంస్కృతికకార్యక్రమాలు ♦ సంగీత విభావరులు ♦ ప్రముఖ దేవాలయాల నమూనాలు ♦ తీరం పొడవునా లైటింగ్‌తో పడవల ప్రదర్శన వేదిక2 వైఎస్సార్ సెంట్రల్ పార్క్ ♦ 2 రోజులపాటుపుష్ప ప్రదర్శన ♦ స్థానిక కళాకారులతో నృత్య, నాటక ప్రదర్శనలు -
వైభవంగా విశాఖ ఉత్సవ్
-
ఆ రూ.6.5 లక్షల కోట్లు కేంద్రానివే
‘విశాఖ ఉత్సవ్’లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన రూ.10.50 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూల్లో రూ.6.50 లక్షల కోట్లు కేంద్రం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలవేనని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు రూ.2.25 లక్షల కోట్లు ప్యాకేజీగా ఇస్తుందన్నారు. మూడు రోజుల పాటు సాగరతీరంలో జరగనున్న విశాఖ ఉత్సవ్‌ను ఆయన శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ఉద్యమాలు చేయడం తగదన్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడడం, గణతంత్ర దినోత్సవం నాడు ఆందోళనలు చేపట్టడడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన లోటును పూడ్చే పనిలో కేంద్రం ఉందని, విభజన చట్టంలో ఉన్నవీ, లేనివి కూడా అమలు చేస్తుందని చెప్పారు. ఏటా విశాఖ ఉత్సవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ చైతన్యం, వికాసానికి మారుపేరు విశాఖ అని, పోరాటం చేయగల స్ఫూర్తిమంతులు విశాఖ వాసులని కొనియాడారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సాగరతీరంలో మూడు కిలోమీటర్ల పొడవున పలు కార్యక్రమాలు, వేదికలను ఏర్పాటు చేశారు. -
చినబాబు – కో..దే విశాఖ ఉత్సవ్
⇒ ఆయన సిఫార్సు చేసిన సంస్థకే నిర్వహణ కాంట్రాక్టు ⇒ ఎక్కువ రేట్ కోట్ చేసినా.. అస్మదీయునికే ధారాదత్తం ⇒ ట్రాక్ రికార్డు లేదు.. నిబంధనలూ పట్టించుకోలేదు ⇒ ఇటీవలే విండ్ ఫెస్టివల్ ఫ్లాప్ అయినా.. ఓకే ⇒ లోకల్ టాలెంట్‌ను విస్మరించడంపై విమర్శలు ఎక్కడైనా.. ఏదైనా కాంట్రాక్టును.. తక్కువ ధర కోట్ చేసిన వారికే ఇస్తారు. ప్రభుత్వమైనా, ప్రైవేట్ సంస్థలైనా ఇదే ఫార్ములాను అనుసరిస్తాయి. ఎవరి విషయంలోనో అయితే ఇవన్నీ ఓకే గానీ.. సాక్షాత్తు చిన్నబాబే రంగంలోకి దిగితే ఫార్ములాలన్నీ ఫార్సుగా మారిపోవాల్సిందే..కావాలంటే విశాఖ ఉత్సవ్టెండర్ తతంగాన్నే చూడండి..తక్కువ కోట్ చేసిన సంస్థను కాలదన్ని.. ఎక్కువ ధర కోట్ చేసిన సంస్థకుకాంట్రాక్టు కట్టబెట్టారు.భారీ ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి అనుభవమూ లేని సంస్థకు.. ఎక్కువ ధరకు కట్టబెట్టారంటేనే..విశాఖ ఉత్సవ్ ఉత్సాహమంతా చినబాబు అండ్ కో..దేనని వేరే చెప్పాలా! విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌ను ఈ నెల 27 నుంచి మూడ్రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.75 కోట్లు మంజూరు చేసిందని అధికారులు చెబుతున్నారు. కానీ అంచనా వ్యయం మాత్రం రూ.3.50 కోట్లుగా అధికారులు లెక్కలు వేస్తున్నారు. గత ఏడాది ఇవే ఉత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలు మాత్రమే ఇవ్వగా..అప్పట్లో అధికారులు నగరంలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల నుంచి సుమారు ఐదు కోట్ల వరకు విరాళాల రూపంలో దండేశారు. లెక్కాపత్రం లేకుండా వసూళ్లు సాగించి.. సగానికి పైగా విరాళాల సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. ఇక ఈ ఏడాది ఉత్సవాలకు టూరిజం శాఖ టెండర్ పిలవగా రెండే రెండు టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన వైబ్రీ ఈవెంట్స్ సంస్థ, మరొకటి పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్. హైదరాబాద్‌కు చెందిన వైబ్రీ ఈవెంట్స్(విష్ణు) మేనేజ్మెంట్ సంస్థ రూ.1.85 కోట్లకే టెండర్ దాఖలు చేయగా, పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్ సంస్థ రూ.1.97 కోట్లకు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం చూస్తే.. తక్కువ రేటు కోట్ చేసిన వైబ్రీసంస్థ టెండర్‌నే ఖరారు చేయాలి. సైమా అవార్డుల ఫంక్షన్ వంటి భారీ ఈవెంట్లు నిర్వహించిన అనుభవం కూడా ఈ సంస్థకు ఉంది. కానీ అధికారులు దాన్ని కాదని పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు. దీని వెనుక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న చినబాబు ఒత్తిళ్లు పనిచేశాయంటున్నారు. తన స్నేహితులు భాగస్వాములుగా ఉన్న పూణే సంస్థకు కాంట్రాక్టు దక్కేలా ఆయనగారు చక్రం తిప్పారని అంటున్నారు. పూణేలో వెడ్డింగ్ ప్లానింగ్స్, కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ నిర్వ హించే ఈ సంస్థకు రూ.5 కోట్ల టర్నోవర్ ఉందనే ఏకైక కారణంతో అప్పగించినట్టు తెలుస్తోంది. విండ్ ఫెస్టివల్ దెబ్బతిన్నా... పర్యాటక రంగంలో ఏపీ ప్రభుత్వానికి కన్సల్టెంట్‌గా ఉన్న కౌశిక్ ముఖర్జీ ఈ టెండర్ ఖరారు వెనుక క్రియాశీల పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. ఇటీవలే అట్టర్ ఫ్లాప్ అయిన విండ్ ఫెస్టివల్ కాంట్రాక్టును కూడా కౌశిక్ ముఖర్జీయే చినబాబు ద్వారా మంత్రాంగం జరిపి ఈ ఫ్యాక్టర్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్‌కు అప్పగించారు. కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టిన ఈ విండ్ ఫెస్టివల్ ఎవ్వరినీ ఆకర్షించలేకపోయింది. స్వయంగా సీఎం చంద్రబాబు సైతం ఈవెంట్ నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ అదే సంస్థకు విశాఖ ఉత్సవాల కాంట్రాక్టు కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. కేవలం చినబాబు సిఫార్సు మేరకే చేసేది లేక కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ కూడా ఓకే చేసిందని అంటున్నారు. లోకల్ టాలెంట్ పనికి రాదా? వాస్తవానికి గతంలో విశాఖకు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకే ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. నిర్వహణలోపాలు ఎలా ఉన్నా ఆ సంస్థలు లోకల్ కళాకారుల ప్రతిభను బాగానే వినియోగించుకున్నాయి. అయితే ఇప్పుడు లోకల్ టాలెంట్‌ను కాదని బడాబాబుల పెళ్లిళ్లు, పేరంటాలు చేసే ఈ ఫ్యాక్టర్‌కు భారీ సొమ్ముకు కట్టబెట్టడం విమర్శల పాలవుతోంది. ఇంతవరకు విశాఖ ఉత్సవ్ వంటి పెద్ద ఈవెంట్ చేసిన ట్రాక్ రికార్డు ఆ సంస్థకు లేదు. కేవలం చినబాబు నుంచి సిఫార్సు రాగానే లోకల్ టాలెంట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి ప్రామాణికాలు, అర్హతలు లేని సంస్థకు అప్పజెప్పడంపై వివాదం రేగుతోంది. -
జనం సొమ్ముతో జాతర
రేపటి నుంచి విశాఖ ఉత్సవ్ రూ.కోటి ప్రకటించినా పైసా విదల్చని సర్కార్ ముందుకు రాని దాతలు.. బలవంతంగా వసూళ్లు విశాఖపట్నం: సొమ్మొకడిది.. సోకొకడది..అన్నట్టుగా ఉంది సర్కార్ తీరు. విశాఖ ఉత్సవాలకు సర్కార్ రూ.కోటి ప్రకటించినా నేటికీ ఒక్క పైసా విడుదల కాలేదు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఉత్సవాలకు చేయూతనిచ్చేందుకు పారిశ్రామిక సంస్థలు, దాతల నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదు. అయినా సరే జనం సొమ్ముతో జాతర చేసేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. అన్నీ అనుచరగణానికే నూతన సంవత్సరం తొలిరోజైన జనవరి ఒకటో తేదీన విశాఖ సాగరతీరంలో శ్రీకారం చుట్టుకోనున్న ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు జరగనున్నాయి. రాష్ర్ట ఉత్సవాలుగా నిర్వహిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సర్కార్ రూ.కోటి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. కానీ ఉత్సవాల ప్రారంభానికి మరో 48 గంటలలే మిగిలి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మరోపక్క గత ఏడాదితో పోలిస్తే దాతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. అన్నీ అరువు బేరాలే అన్నట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పారదర్శకత పేరుతో టెండర్ల నాటకమాడినా చివరకు ఈవెంట్స్, పనులన్నీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరగణం దక్కించుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఐఐఎం శంకుస్థాపనకు అయిన ఖర్చు అరకోటి. స్వాతంత్య్ర వేడుకలకు అయిన ఖర్చు రూ.అర కోటి. ఏడాది తర్వాత ఐఐఎం శంకు స్థాపన సొమ్ములు అరకొరగా విడుదలైనా.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ల నిధులు నేటికీ విడుదల కాలేదు. గత ఏడాది అట్టహాసంగా జరిగిన విశాఖ ఉత్సవాల్లో ప్రదర్శనలిచ్చిన కళాకారులకు నేటికీ చెల్లింపులు జరగలేదు. రూ.30 లక్షలకుపైగా చెల్లింపులు జరగాల్సి ఉంది. పాత బకాయిలకే దిక్కులేని పరిస్థితుల్లో ఈసారి ఉత్సవాలకు ఏకంగా మూడున్నర కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సర్కార్ కోటి ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అధికారులు మిగిలిన రెండున్నర కోట్లు దాతల నుంచి కూడగట్టాలని ప్రణాళికలు రచించారు. ఈ వంకతో మరో రూ.కోటికి పైగా దండుకోవాలని అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వుడా, జీవీఎంసీలపై భారం మోపారు. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా వుడాకే అప్పగించడంతో కొంత మేర ఆర్ధిక భారం మోసేందుకు వుడా సిద్ధమైంది. మరో పక్క ఆర్ధిక లోటుతో సతమతవుతున్న జీవీఎంసీ మాత్రం నిధులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. కావాలంటే తమ సిబ్బంది ద్వారా పనులు చేయిస్తాం తప్ప నిధులు సమకూర్చలేమని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ విలేకర్ల సమావేశంలోనే స్పష్టం చేశారు. హుద్‌హుద్ తో తీవ్రంగా నష్టపోయిన పారిశ్రామిక సంస్థల నుంచి గత ఏడాది ముక్కుపిండి మరీ విరాళాలు వసూలు చేశారు. ఈ ఏడాది ఆ స్థాయిలో వీరి నుంచి సహకారం లభించడం లేదని ఉత్సవాల నిర్వహణ కమిటీలో ఉన్న కీలకాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి తోడు గడిచిన ఏడాదిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి బకాయిలు రూ.1.50 కోట్ల వరకు పేరుకుపోవడంతో ఉత్సవాల్లో పాలు పంచుకునేందుకు గతంలో ఉత్సాహం చూపిన సంస్థలు ఈసారి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. మరోపక్క మంత్రి పంపించారు.. ఉత్సవాలకు ఇవ్వాల్సిందేనంటూ కొంతమంది అధికారులు పారిశ్రామిక సంస్థల నుంచి బలవంతంగా వసూలు చేసినట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారికంగా ఇప్పటికే రెండు కోట్లకు పైగా దండినట్టు తెలుస్తోంది. జనం సొమ్ముతో మరోసారి జాతర చేసేందుకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. -
ఉప్పొంగిన ఉత్సవ్
వైభవంగా విశాఖ ఉత్సవ్ ఆరంభం నాలుగు ప్రాంతాల్లో సంబరాలు కళా ప్రదర్శనలతో కళకళలాడిన ఆర్కె బీచ్ పరిసరాలు వుడాపార్క్‌లో ఫల, పుష్ప ప్రదర్శన కైలాసగిరిలో లేజర్‌షో ప్రత్యేక ఆకర్షణ విశాఖపట్నం: కడలి కెరటాలతో పోటీపడుతూ ‘విశాఖ ఉత్సవ్’ ఉప్పొంగింది. సంస్కృతి, సంప్రదాయాల కలయికలో సంబరాలు తీసుకువచ్చింది. సంప్రదాయ నృత్యాలు, పౌరాణిక ఘట్టాలు, అభివృద్ధి, సంక్షేమ శకటాలు, యుద్ధ విన్యానాలు, వీనుల విందైన ప్రదర్శనలతో నగరమంతా పండుగ నింపింది. హుద్ హుద్ తుపాను చేసిన గాయాలను మరిపించేలా, ఉజ్వ ల భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించేలా విశాఖ ఉత్సవం శుక్రవారం ప్రారంభమైం ది. మూడు రోజుల పాటు ఈ సంబరాలు విశాఖ వా సులను ఆనందడోలికల్లో ముంచెత్తనున్నాయి. కైలాసగిరి, వుడాపార్క్, గురజాడ కళాక్షేత్రం, శిల్పారామంలో ఉత్సవ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో భాగంగా బీచ్ రోడ్డులో భారీ కార్నివాల్ జరిగింది. పౌరాణిక వేషధారణలతో కళాకారులు ఈ కార్నివాల్లో పాల్గొన్నారు. కోలాటం భజనలు, శాస్త్రీయ నృత్యాలు, తప్పెటగూళ్లు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, థింసా, లంబాడీ గిరిజన నృత్యాలు కనువిందు చేశాయి. జిల్లా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, లు, నీటి యాజమాన్య సంస్థ, నేవీ, అన్నవరం సత్యదేవుడు రధం, సింహాచలం నర్శింహస్వామి రథం, హరేకృష్ణ మూమెంట్, విశాఖ మెట్రో నమూనా సెకటాలు ప్రదర్శించారు. కార్నివాల్లో వివిధ విద్యాసంస్థల విద్యార్ధులు, బ్రహ్మకుమారీలు, జిల్లా అధికారులు కార్నివాల్లో పాదయాత్ర చేశారు. విద్యార్ధులు మైమ్ వంటి కళారూపాలు ప్రదర్శించారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, సర్ఫింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ దేవాలయాల నమూనాలు తీరంలో నెలకొల్పారు. స్వైన్‌ఫ్లూ నివారణ మందులు అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నావికాదళం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అణు జలాం తార్గామి అరిహంత్ సముద్రంలో చక్కర్లు కొడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధ పరికరాలను నేవీ ప్రదర్శించింది. కైలాసగిరి మీద నిర్వహించిన లేజర్ షో అబ్బురపరిచింది. వుడాపార్క్‌లో ఫల, పూల ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన లక్షలాది రకాల పూలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వైఎంసిఎ వద్ద గోకార్టింగ్,జోర్బింగ్(వాటర్ గేమ్), బుల్ గేమ్‌లలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వీటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. సగం ధరకే గోకార్టింగ్‌ను నిర్వాహకులు అందిస్తున్నారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను వివరిస్తూ, తెలుగు వారి పిండి వంటలను రుచి చూపించే దాదాపు 150 స్టాల్స్‌ను బీచ్‌లో ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల వస్తువులు కూడా ఈ ప్రదర్శనలో కొనుగోలుకు ఉంచారు. చిన్నారులు పతంగులు ఎగురవేశారు. తొలి రోజు వేడుకల్లో ఎంపీలు కె.హరిబాబు ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాస్, మంత్రులు గంటా శ్రీనివాసరావు కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, పంచకర్ల రమేష్‌బాబు, పి.విష్ణుకుమార్‌రాజు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్, గణబాబు, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, రాష్ట్ర హిందీ అకాడమీ చైర్మన్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, కలెక్టర్ ఎన్.యువరాజ్, వుడా విసీ టి. బాబూరావునాయుడు, జివిఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై కైలాసగిరి శివపార్వతుల సెట్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేదిక నుంచే వెంకయ్యనాయుడు ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నేవీ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణ కాగా పద్మశ్రీ శివమణి వాయించిన డ్రమ్స్ కుర్రకారును చిందులేయించాయి. -
విశాఖకు పండుగ
నేటినుంచి ఉత్సవ్ మూడు రోజుల పాటు నిర్వహణ సర్వాంగ సుందరంగా విశాఖ {పత్యేక కార్యక్రమాల కనువిందు విశాఖ అర్బన్: విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుం దరంగా ముస్తాబైంది. సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుద్‌హుద్ తుపాను ఛాయలు కనిపించని విధంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయిలో వేదికలను ముస్తాబు చేస్తోంది. విశాఖ పర్యాటకాభివృద్ధికి, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు ఈ విశాఖ ఉత్సవ్‌ను వేదికగా చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. విశాఖ ఉత్సవ్ వేడుకలు జరిగే ప్రాంతాల రూపురేఖలు మార్చేశారు. ప్రతి వేదికను విభిన్నంగా, ప్రత్యేక సెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కే బీచ్ వద్ద కైలాసగిరిని తలపించే సెట్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ వేదికపై ఒకేసారి వంద మంది కళాకారులు ప్రదర్శనల్చినా తట్టుకునే స్థాయిలో స్టేజ్‌ను నిర్మించారు. అక్కడే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రముఖమైన ఎనిమిది దేవాలయాల నమూనాలను నిర్మించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంగణాలను తీర్చిదిద్దారు. ఇక్కడ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, వేద పారాయణం, కచేరీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గురజాడ కళాక్షేత్రం, వుడా పార్కు, కైలాసగిరి, మధురవాడలో ఉన్న జాతర ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి వేదిక వద్ద తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలు చాటి చెప్పే కళలు, నృత్యాలు, కోలాటం, తప్పెటగుళ్లు కార్యక్రమాలతో పాటు సినీతారల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆట, పాటలతో పాటు పర్యాటకులను కడుపుబ్బా నవ్వించే హాస్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవ్‌కు వచ్చే సందర్శకుల కోసం ఆర్కే బీచ్ నుంచి 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వివిధ సంస్థలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఒకవైపు షాపింగ్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రముఖుల రాక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ ఉత్సవ్ వేడుకలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆర్కే బీచ్ వద్ద ప్రారంభించనున్నారు. 24వ తేదీన సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అనేక మంది సినీ హీరో, హీరోయిన్లు, సంగీత దర్శకులు, గాయనీ, గాయకులు రానున్నారు. ఉత్సవాలు చివరి రోజు 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. పతంగుల వేడుక విశాఖపట్నం-కల్చరల్: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా గురువారం సాయంత్రం గాలిపటాల వేడుక నిర్వహించారు. ఆర్కే బీచ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వేడుకలను ప్రారంభించారు. వుడా, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, మహిళలకు ఉచితంగా గాలిపటాలను అందజేశారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.బాబూరావునాయుడులు పతంగులను ఎగరవేశారు. నగరానికి చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాము లై విశాఖ సంస్కృతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని సూచించారు. -
పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న విశాఖ ఉత్సవానికి థీమ్ సాంగ్ రాసేందుకు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరాకరించినట్లు సమాచారం. ఈ ఉత్సవం కోసం థీమ్ సాంగ్ రాయాలని నిర్వాహాకులు సిరివెన్నెలను సంప్రదించగా అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఈ ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో థీమ్ సాంగ్ కోసం నిర్వహాకులు థీమ్ సాంగ్ రాయించేందుకు స్థానికంగా ఉన్న గీత రచయితలను సంప్రదిస్తున్నారని సమాచారం. అయితే విశాఖ ఉత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తామని భీమిలి ఎమ్మెల్యే, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో వెల్లడించారు. అందుకోసం ప్రముఖ గీత రచయితతో థీమ్ సాంగ్ రాయిస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉత్సవం జనవరి 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. -
బలవంతపు వసూళ్లకు పాల్పడటం లేదు:గంటా
విశాఖపట్నం: ఈ నెల 23, 24, 25వ తేదీల్లో విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఆర్కే బీచ్, మధురవాడ జాతర, ఉడా పార్కు, కైలాసగిరి, గురజాడ కళాక్షేత్రం తదితర వేదికల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన ఆయన సోమవారం ఇక్కడ వెల్లడించారు. 23వ తేదీ మధ్యాహ్నం వెయ్యిమంది కళాకారులు, నేవీ బ్యాండుతో ప్రారంభమయ్యే కార్నివాల్ తో విశాఖ ఉత్సవ్ ప్రారంభమవుతుందని గంటా తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ 'ఉత్సవ్' కు సాంస్కృతిక కళాకారులు, సినీ నటులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్నివాల్ ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని గంటా తెలిపారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను వైజాగ్ మున్సిపల్ కౌన్సిల్, ఉడా సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఎవరినుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడడం లేదని తెలిపారు. ఉత్సవ్ ప్రధాన వేదిక నిర్మాణం విషయంలో బీచ్‌కు ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా గంటా హామీ ఇచ్చారు. ఉత్సవాల కోసం బీచ్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కులో 100 అడుగుల కరెంటు ప్రభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ 300 మంది మహిళలతో ముగ్గుల పోటీలు, 22న ఉత్తరాది ప్రజలతో కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు. -
ఉత్సవ్ కలెక్షన్
విశాఖఉత్సవ్ కోసం భారీగా టార్గెట్లు నలిగిపోతున్న పారిశ్రామిక సంస్థలు.. దాతలు {పజాప్రతినిధుల మెప్పుకోసంఅధికారుల వెంపర్లాట నిర్వహణ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు విశాఖపట్నం: సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టుంది విశాఖ ఉత్సవ్ నిర్వహణ తీరు. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చిన పాపానపోలేదు. భారమంతా ప్రయివేట్ సంస్థలపై మోపుతున్నారు. దీంతో ఈ పేరు వింటేనే ప్రయివేటు సంస్థలు.. పరిశ్రమల యజమానులు భయపడుతున్నారు. ఉత్సవాల నిర్వహణకు రూ.5కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. వుడా రూ.50 లక్షలు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. ఏపీ టూరిజంతో సహా అనుబంధ శాఖల న్నీ దాదాపు చేతులెత్తాశాయి. దీంతో ‘ప్రయివేటు’ గా నిధులు సేకరించాలని నిర్ణయించారు. ‘మంత్రి గారు ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని త లపెట్టారు. ఆయనకు మాట రాకూడదు.. నిర్వహణలో ఎక్కడా ఫెయిల్ కాకూడదంటూ ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉదయం కలెక్టరేట్లో..మధ్యాహ్నం వుడాలో.. సాయంత్రం సర్క్యూట్ హౌస్‌లో అన్నట్టుగా సాగుతున్న ఈ సమీక్షల సారాంశం ఒక్కటే. ఎవరెవరు ఎంత ఇస్తామన్నారు? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? మిగిలిన మొత్తం ఎప్పటిలోగా ఇవ్వను న్నారు? చెప్పండంటూ రహస్య(ఇన్‌కెమెరా)సమావేశాల్లో టార్గెట్లు పెడుతుంటే ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల అన్ని వర్గాలతోపాటు పారిశ్రామిక రంగానికి తీరని నష్టం వాటిల్లింది. ఈనష్టాన్ని పూడ్చేచర్యలు చేపట్టడంలో అటు కేంద్రం..ఇటు రాష్ర్టం ఇప్పటివరకూ రూపాయి విదిల్చింది లేదు. పుట్టెడు నష్టాల్లో ఉన్న ఈసంస్థలకు ఇప్పుడు ఉత్సవాల పేరిట ఇండెంట్లు పెడుతున్నారు. ఇస్తారా?..చస్తారా?అన్నట్టుగా మెడపై కత్తిపెడుతున్నారు. ఒక కమి టీ వచ్చి ఇండెంట్ పెట్టిన కొద్ది గం టలకే మరొక కమిటీ వచ్చి మరో ఇం డెంట్ పెడుతుందని ఓ సంస్థ యజ మాని ఆవేదన చెందారు. మా వల్ల కాదని సంస్థలు చెబుతుంటే కన్నెర్ర చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కొక్క సంస్థకు ఐదు లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఇండెంట్లు పెడుతుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో దా తలు కొట్టు మిట్టాడుతున్నారు. ప్రతీ నెలా ఏదో ఒక కార్యక్రమం పేరుతో విరాళా లు ఇవ్వాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలని ఓ ప్రముఖసంస్థ సీఈఒ సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
జనవరిలో అరకు ఉత్సవ్
అప్పుడే విశాఖ ఉత్సవాలు కూడా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం సిరిపురం: అరకు, విశాఖ ఉత్సవ్‌ను జనవరిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా అధికారులు, హోటల్ యజమానులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. హుద్‌హుద్ తుపాను వల్ల నష్టపోయిన విశాఖకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు పునరుజ్జీవం కల్పించాలనే లక్ష్యంతో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు నగరం, జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సలహాలు, సూచనలిచ్చికార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. విశాఖ ఉత్సవ్ నిర్వహణ పై త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి తేదీలను వెల్లడిస్తామన్నారు. ఇందులో భాగంగానే అరకు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణకు నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, వివిధ రంగాల సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని డీఆర్డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్ను ఆదేశించారు. గతంలో విశాఖ ఉత్సవ్ నిర్వహించిన విధానం, ఏర్పాటు చేసిన కమిటీలపై డీఆర్డీఏ పీడీ ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. వివిధ రకాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ డి.వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ మహేశ్వర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, పర్యాటక శాఖాధికారి డాక్టర్ ఎ.సిరి తదితరులు పాల్గొన్నారు.