vishnumurti
-
మార్గళి ప్రసాదం
మార్గశిర మాసాన్ని మనం ధనుర్మాసం అంటాం. తమిళులు మార్గళి అంటారు. వైష్ణవాలయాల్లో ఉదయపు పూజల్తో ఈ మాసమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువెత్తుతుంది. తిరుప్పావై మార్మోగుతుంది. ప్రసాదాల గుబాళింపు భగవంతునికే కాక భక్తులకూ ప్రీతికరమౌతుంది. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు... వైష్ణవ ఆలయాలకు వెళితే చక్కెర పొంగలి, దద్ధ్యోదనం, పులిహోర, పరమాన్నం ప్రసాదంగా దక్కుతుంది. ధనుర్మాసం ఇంటింటా ప్రసాదాల పంట.ఉదయాన్నే చలిలో ఈ ప్రసాదాలు తయారుచేసి, భగవంతునికి నివేదన చేసి, స్వీకరించండి. పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతాయి. కోయల్ పులిహోర కావలసినవి: బియ్యం – పావు కేజీ; చింతపండు – నిమ్మకాయంత; పసుపు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను. పొడి కోసం: నూనె – ఒక టీ స్పూను; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 6; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; మెంతులు – అర టీ స్పూను; మిరియాలు – ఒక టీ స్పూను, నువ్వులు – 2 టీ స్పూన్లు. పోపు కోసం: నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి అన్నం ఉడికించి, పక్కన ఉంచాలి ►ఒక కప్పు నీటిలో చింత పండు నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, పొడి కోసం తీసుకున్న వస్తువులన్నీ (నువ్వులు మినహా) ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►చివరగా నువ్వులు జత చేసి మరోమారు వేయించి, దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాక, పచ్చి సెనగ పప్పు, పల్లీలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, ఇంగువ జత చేసి సుమారు ఐదు నిమిషాల సేపు ఉడికించాలి ►చిక్కబడ్డాక బెల్లం పొడి జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి ►పెద్ద పళ్లెంలో అన్నం వేసి చల్లారబెట్టాలి ►వేయించిన పోపు, పొడి మిశ్రమాన్ని అన్నానికి జత చేసి బాగా కలియబెట్టి, కొద్దిగా నువ్వుల నూనె వేసి మరోమారు కలపాలి ►దేవునికి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి. కోయల్ పొంగల్ కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెసర పప్పు – అర కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు ; జీడిపప్పులు – 15; మిరియాలు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక, పెసర పప్పు వేసి దోరగా వేయించి దింపేయాలి ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ∙ కుకర్‌లో పెసరపప్పు, బియ్యం, ఐదు కప్పుల నీళ్లు జత చేసి, మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చాక దింపి, మూత తీశాక, మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదపాలి. ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు వేసి వేయించాలి ►మిరియాలు జత చేయాలి ►ఇంగువ, కరివేపాకు, అల్లం తురుము వేసి బాగా వేయించాలి ►ఉడికించిన బియ్యం, పెసరపప్పు మిశ్రమం జత చేసి, తగినంత ఉప్పు వేసి కలిపి దించేయాలి కోయల్ పొంగల్ సిద్ధమైనట్లే. అప్పాలు కావలసినవి: బియ్యప్పిండి – ముప్పావు కప్పు; గోధుమ పిండి – పావు కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; నూనె – పావు కప్పు + డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో బియ్యప్పిండి, గోధుమ పిండి వేసి కలపాలి ►స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు కలుపుతూండాలి ►బియ్యప్పిండి గోధుమ పిండి మిశ్రమం జత చేస్తూ కలియబెట్టాలి ►ఉడుకుపడుతుండగా స్టౌ కట్టేయాలి ►పావు కప్పు నూనె జత చేసి గరిటెతో బాగా కలియబెట్టి, చల్లారబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ►పిండిని కొద్దిగా తీసుకుని, ఉండలా చేసి, నూనె పూసిన ప్లాస్టిక్ కవర్ మీద అప్పం మాదిరిగా ఒత్తాలి ►కాగిన నూనెలో వేసి రంగు మారేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►చల్లారాక దేవునికి నైవేద్యం పెట్టి తినాలి. కోయల్ పాయసం కావలసినవి: బియ్యం – ముప్పావు కప్పు; నెయ్యి – అర కప్పు + ఒక టేబుల్ స్పూను; నీళ్లు – 5 కప్పులు; ముదురు రంగులో ఉండే బెల్లం – రెండున్నర కప్పులు; పటిక బెల్లం – పావు కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; శొంఠి పొడి – పావు టీ స్పూను. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక బియ్యాన్ని అందులో వేసి కొద్దిసేపు వేయించి దింపేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి (ఉడకటానికి సుమారు అరగంట సమయం పడుతుంది) ►స్టౌ మీద మరొక బాణలిలో నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి కరిగించి, ఉడికించాలి ►అన్నానికి జత చేసి, స్టౌ మీద ఉంచి కొద్దిసేపు ఉడికించాలి ►బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి, శొంఠి పొడి జత చేసి కలియబెట్టాలి ►నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ►వేయించిన కొబ్బరి ముక్కలు, పటికబెల్లం ముక్కలు జత చేసి కలియబెట్టి, నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి. కోయల్ దద్ధ్యోదనం కావలసినవి: సన్నని ముడి బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నువ్వుల నూనె – తగినంత; పాలు – 4 కప్పులు; పెరుగు – ఒక టేబుల్ స్పూను. పోపు కోసం: జీడిపప్పులు – గుప్పెడు; పచ్చి సెనగ పప్పు+మినప్పప్పు – 2 టీ స్పూన్లు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూను; మిరియాలు – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నువ్వుల నూనె – తగినంత; అలంకరించడానికి: పచ్చి మామిడి ముక్కలు – కొద్దిగా; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు, ఉప్పు, నూనె జత చేసి ఉడికించి, దింపి, వేడిగా ఉండగానే గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి ►స్టౌ మీద పాలు ఉంచి, మరిగించి, కొద్దిగా చల్లారాక, అన్నంలో పోసి బాగా కలియబెట్టాలి ►కొద్దిగా పెరుగు జత చేసి మూత పెట్టి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాన్లను ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, దింపి, అన్నం మీద వేసి కలియబెట్టాలి ►మామిడి ముక్కలు, కొత్తిమీరతో అలంకరించాలి. -
మిత్రుడి పుట్టినరోజు
కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించినవాడే సూర్యుడు. ఈయన రవి, మిత్రుడు, భాను, అర్క, భాస్కర, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్రకిరణ, పూష, గభస్తిమాన్, ఆదిత్యుడు అనే ఇతర నామాలతో కూడా ప్రసిద్ధుడు. ఛాయాదేవి, సంజ్ఞాదేవి ఈయన పత్నులు. శనీశ్వరుడు, యముడు, యమున మున్నగువారు వీరి సంతానం. సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమదృష్టి కలిగిన వాడు. ఆరోగ్య ప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. మహాశక్తిమంతుడు. సకల శాస్త్రపారంగతుడు. ఆంజనేయునికి గురువు. సువర్చలాదేవి ఈయన మానస పుత్రిక. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనం వ్యయం చేసినా, విద్యాబుద్ధులు ఒంటబట్టక నిరాశలో ఉన్నవారు సూర్యుని ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని నవగ్రహ పురాణం చెబుతోంది. నేత్ర వ్యాధులు, శత్రు బాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి, నియమాలు పాఠిస్తూ, మండలం రోజులపాటు నిష్ఠగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి. రామరావణ సంగ్రామంలో రాముని బలం క్షీణించి, నిరాశానిస్పృహలలో కూరుకుపోయి ఉన్న సమయంలో... అగస్త్య మహర్షి శ్రీరామునికి వారి వంశ మూలపురుషుడైన సూర్యుని శక్తిని వివరించి, ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. ఆ దివ్య శ్లోకాలను పఠించిన శ్రీరాముడు నూతన శక్తిని పుంజుకుని యుద్ధంలో విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం పేర్కొంటోంది. దీనిని బట్టి సూర్యారాధనెంతటి శ్రేష్ఠమో తెలుస్తోంది. రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది. రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ. 12, మంగళవారం రథసప్తమి – కృష్ణకార్తీక -
శుభకరుడు... శయనేశ్వరుడు
హిందూ దేవతలలో శయనం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది విష్ణుమూర్తి. ఆయన శేషాన్ని పాన్పుగా చేసుకుని శయనిస్తాడని, అందుకే ఆయనకు అనంతశయనమూర్తి అని పేరు ఉందని అందరికీ తెలిసిన విషయమే. కానీ సదా యోగముద్రలో, యోగిరూపంలో కనిపించే పరమేశ్వరుడు విగ్రహ రూపంలో కనిపించడమే అరుదు. అందులోనూ శయనించిన భంగిమలో కనిపిస్తే మరీ అరుదు. అటువంటి శివరూపాలలో అరుదైన రూపం మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుజిల్లా దగ్గర సురుటుపల్లిలో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారిని పల్లికొండేశ్వర స్వామి అంటారు. ఇక్కడ అమ్మవారు సర్వమంగలాదేవి మరకతాంబిక అనే పేరుతో నెలకొని వుంది. ఇక్కడ పరమేశ్వరుడు ఒక వైపు ఒరిగి కుడిచేతిని మడిచి తలకింద ఉంచుకొని, తలను అమ్మవారి ఒడిలో ఉంచి విశ్రమిస్తున్న రూపం మనకు గర్భగుడిలో కనిపిస్తుంది. ఈ స్వామి వారి వెనక సూర్యచంద్రులు, దేవతలు ఆయనను సేవిస్తున్నట్లు కనిపిస్తుంది. స్వామివారు సురులతో సేవించబడ్డ పురం కాలక్రమంలో సురుటుపల్లిగా మారిందని క్షేత్ర ఐతిహ్యం. ఈ స్వామివారి శయనరూపానికి సంబంధించి ఒక పురాణగాథ ఇలా ఉంది. క్షీరసాగర మథన సమయంలో వెలువడిన విషాన్ని లోకక్షేమం కోసం పరమేశ్వరుడు తన చేతిలో నేరేడుపండు వలే తీసుకుని కంఠంలో దాచుకున్నాడు. ఆ విషప్రభావానికి తాళలేక శివుడు అమ్మవారి ఒడిలో తల ఉంచి కాస్త విశ్రమించాడట. అప్పుడు దేవతలందరూ ఆయన వెనకాల ఉండి శీతలోపచారాలు చేశారట. అదే నేడు మనం చూస్తున్న రూపమని ఈ క్షేత్రపురాణం చెబుతోంది. ఆగమ, శిల్ప శాస్త్రాలలో మరెక్కడా కానరాని శివుడి శయనమూర్తి రూపాన్ని అరుదైనదిగా భావించవచ్చు. కాలకూటవిషాన్ని స్వీకరించిన ఈ స్వామివారిని విషపానమూర్తి, విషాపహరణమూర్తి అని ఆగమ, శిల్పశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రీతిగా ఈ స్వామివారి శయనమూర్తిని, సర్వమంగలాదేవిని దర్శించి భక్తులు సకల శుభాలను పొందగలరనడంలో ఏ సందేహమూ లేదు. అలాగే ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారు సతీసమేతంగా దర్శనమివ్వడం మరో అద్భుతమైన విషయం. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : దాళ్వాకు అనుమతినివ్వాలని కోరుతూ మంగళవారం వందలాదిమంది రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఉండి రోడ్డులోని లోసరి కాలువ వద్ద ఇరిగేషన్ అధికారులు వేసిన అడ్డుకట్టను తొలగించి, నీటిని విడుదల చేశారు. అక్కడే రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈలోగా అక్కడ పోలీస్ బలగాలను మోహరింపజేశారు. టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై విష్ణుమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని రైతులను కోరగా అధికారులు వచ్చి దాళ్వాకు నీరిస్తామని ప్రకటించేవరకు ఆందోళనను విరమించేదిలేదని బీష్మించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ లోసరి మెయిన్ ఛానల్‌కు నీరిచ్చి దిగువ గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు, మూడేళ్ల నుంచి వరుస తుపానులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు దాళ్వాకు అనుమతినివ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకోసం నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. పెసర, మినుము పంటలు వేసుకోమని అధికారులు చెబుతున్నా చౌడు భూముల్లో అపరాలు వంటివి పండవన్నారు. అనంతరం నరసాపురం ఆర్డీవో వసంతరావు రైతులతో మాట్లాడారు. భీమవరం మండలంలో చాలా మంది నారుమళ్లు వేసుకున్నారని, ఇప్పుడు దాళ్వా వేయవద్దని చెప్పడం సమంజసంకాదని, వెంటనే దాళ్వాకు నీరివ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్డీవో వసంతరావు రైతులతో పాటు భీమవరం మండలం గొల్లవానితిప్ప వెళ్లి పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. కలెక్టర్‌కు పరిస్థితిని నివేదిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన సద్ధుమణిగింది. నాయకులు జేఎన్వీ గోపాలన్, కొప్పర్తి వెంకట రామారావు, గుద్దటి రవికుమార్, బొమ్మిడి శ్రీనివాస్, రేవు రామకృష్ణ, గుద్దటి చంద్రరావు, రామాయణం ఏడుకొండలు, భూసారపు అమ్మిరాజు, ఆరేటి సత్యనారాయణ, బోడపాటి రామకృష్ణ, జడ్డు పెదకాపు, ఆకుల నరసింహమూర్తి, ముత్యాలరావు, ఇంటి రామకృష్ణ, కొప్పర్తి భాస్కరరావు, రైతులు పాల్గొన్నారు.