vishvaksena
-
రాకీ మాటలు మొదలు
మెకానిక్ రాకీగా టైటిల్ రోల్లో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశ్వక్ సేన్ ఆదివారం తన రాకీ పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు.‘‘మంచి మాస్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్, ఫస్ట్ సాంగ్‌కి మంచి స్పందన లభించింది’’ అని చిత్రబృందం పేర్కొంది. దీపావళి సందర్భంగా అక్టోబరు 31న ఈ చిత్రం విడుదల కానుంది. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కటసాని. -
దాస్ కా ధమ్కీ మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
12 సార్లు చెంప దెబ్బ కొట్టా
‘‘హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతంలోని వాస్తవికతను ‘ఫలక్‌నుమాదాస్’ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు విష్వక్ సేన్. ఈ సినిమా షూటింగ్లో 12 సార్లు విష్వక్‌ను చెంప దెబ్బ కొట్టా. ఇంకా గట్టిగా కొట్టు అనేవాడు. అంత డెడికేటెడ్‌గా వర్క్ చేశాడు’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. ‘వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాల్లో నటించిన విష్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. కరాటే రాజు సమర్పణలో వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్ అనుసంధానంతో పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి హీరోయిన్లుగా నటించారు. తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ని విష్వక్సేన్ తల్లి దుర్గ రిలీజ్ చేశారు. హీరో, దర్శకుడు విష్వక్సేన్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల రోజు సందర్భంగా టీజర్ విడుదల చేయడానికి కారణం ఈ సినిమా నా గర్ల్ ఫ్రెండ్. ఏడాదిగా ఈ సినిమాతోనే గడిపాను. ఇది చిన్న సినిమా కాదు.. దయచేసి అలా రాయొద్దు, మాట్లాడొద్దు. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమో అంత పెట్టాను. చాలా పెద్ద సినిమా.. కాకపోతే చిన్నోడు తీశాడంతే’’ అన్నారు. ‘‘20 నుంచి 25 సంవత్సరాల వయసుండే 40 మంది కుర్రాళ్లంతా కష్టపడి ఈ సినిమా చేశారు. మొత్తం మీద అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. హైదరాబాద్‌లో ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయని ఎవరికీ తెలియని 118 లొకేషన్స్‌లో తీశాం’’ అని నిర్మాత కరాటే రాజు చెప్పారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నటుడు కౌశిక్, రచయిత కిట్టు విస్సా ప్రగడ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు హాజరయ్యారు. -
నాన్నగారి బయోపిక్ ఆలోచన లేదు
‘‘పెళ్ళి చూపులు’ సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్‌కి పెద్ద స్టార్‌తో సినిమా చేసే చాన్స్ వచ్చినా తగ్గాడు. తనకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడా ప్రాసెస్‌లో ఉన్నాడు. ఓ రోజు తప్పకుండా హైట్స్‌కి రీచ్ అవుతాడు. అది గ్యారంటీ’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఆయన నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఈ నెల 29న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు... ► మా బ్యానర్లో చిన్న సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా 2 పాయింట్స్ ఉంటాయి. కొత్తవారిని, కొత్త ట్యాలెంట్‌ని పరిచయం చేయడం, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ని ఇంకా బెటర్ చేయడం. ఇస్రో లాంటి చాలా సంస్థలు పనిని క్రమశిక్షణతో ఒక ప్రాసెస్‌లో చేస్తాయి కాబట్టే వరల్డ్ క్లాస్ సక్సెస్‌ని అచీవ్ చేస్తున్నాయి. అదే రివల్యూషన్, అంత క్రమశిక్షణ ఫిల్మ్ మేకింగ్‌లోనూ రావాలి. దీన్ని ఆచరణలో పెట్టడం కష్టమేం కాదు. కచ్చితంగా చేరుకుంటాం. ► మనం సినిమా చూడ్డానికి వెళ్లి కూర్చోగానే లైట్స్ ఆఫ్ చేసి, స్క్రీన్‌పై ఏదో ప్లే చేస్తారు. ఆ వీడియోకి మనం కనెక్ట్ అయితే సినిమా హిట్.. లేకపోతే ఫ్లాప్.. సింపుల్ ఫార్ములా. సింక్ సౌండ్ ప్రాసెస్‌లోనే ఫిల్మ్ మేకింగ్ జరగాలి. ఈ రోజుల్లో యంగ్ ఫిల్మ్ మేకర్స్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ► ‘ఈ నగరానికి ఏమైంది’ షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండుసార్లు సెట్స్‌కి వెళ్లాను. ప్రతీదీ పర్ఫెక్ట్గా అనిపించింది. నాన్నగారి (రామానాయుడు) బయోపిక్ రిస్క్. ‘మహానటి, సంజు’ లాంటి బయోపిక్స్ వేరు, వాళ్లు ఒకే లైఫ్‌లో మల్టిపుల్ లైవ్స్ బతికారు. నాన్నగారి లైఫ్ అలా కాదు. నిజానికి ఒక స్టోరీలో కాంట్రవర్సీస్ లేకపోతే ఆ స్టోరీ ఎవరూ వినరు.. చూడరు. ప్రస్తుతానికి నాన్నగారి బయోపిక్ ఆలోచన లేదు. ► సురేశ్ ప్రొడక్షన్స్ ఏ సినిమా నిర్మించినా పార్టనర్స్‌ని కలుపుకోవడానికే ఇష్టపడతాను. మా ప్రొడక్షన్లో బాబీ డైరెక్షన్లో వెంకటేశ్, చైతన్య సినిమా ఉంటుంది. ఒక్కో సినిమాకి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. రాజమౌళి ‘బాహుబలి’కి ఐదేళ్లు పట్టింది. మా బ్యానర్లో గుణశేఖర్ డైరెక్షన్లో ‘హిరణ్యకశ్యప’కు చాలా రోజులుగా వర్క్ జరుగుతోంది. ఏదైనా పర్ఫెక్ట్గా అయ్యాకే సెట్స్‌పైకి వస్తుంది. మేకింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. -
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు : సిఫార్సులు రద్దు
తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక, వీఐపీ దర్శనం, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. అలాగే 18వ తేదీన గరుడ సేవ, 22వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమంతో ఉత్సవాలు అంకురార్పణ జరగనుంది. ఈ వేడుకలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. అందులోభాగంగా మంగళవారం సాయంకాల వేళలో విష్వక్సేనుడు ఆలయ పురవీధుల్లో ఊరేగుతారు. అనంతరం యాగశాలలో భూమిపూజ చేస్తారు. 9 పాళికలలో నవధాన్యాలతో అంకురార్పణ చేస్తారు.