Vizianagaram municipality
-
సై... అంటే సరికాదు...
ఏ అంశంలోనైనా పోటీ పడాలంటే దానికి తగ్గ కసరత్తు ఉండాలి. కనీసం ప్రయత్నమైనా చేయాలి. కానీ ఇవేవీ లేకుండా పోటీలో ఉన్నామని చెబితే మాత్రం గెలుపు సాధ్యమవుతుందా... ఇప్పుడు విజయనగరం మునిసిపాలిటీ పరిస్థితి అలాగే ఉంది. స్వచ్ఛత సర్వేక్షణ్ –19కోసం దేశవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు పోటీపడుతున్నాయి. అందులో విజయనగరమూ ఉంది. కానీ ఇక్కడ ఆ పోటీకి తగ్గట్టుగా ఎలాంటి ప్రణాళికా అమలు చేయడంలేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉంది. కాలువలు కంపుకొడుతున్నాయి. దుర్వాసన వెదజల్లుతూనే ఉంది. మరి పోటీలో ఉంటే ఇలాగేనా పారిశుద్ధ్యం ఉండేది అన్నదే నగరవాసుల సందేహం. విజయనగరం మున్సిపాలిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పోటీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోటీలో దేశంలోని అన్ని మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయి. ఇందులో విజయనగరం కూడా ఉంది. ఇప్పటికే మిగిలిన మున్సిపాలిటీలు పక్కా కార్యాచరణ రూపొందించుకుని పోటీకి సన్నద్ధమవుతున్నా యి. 2017లో 126వ ర్యాంక్, 2018లో 154వ ర్యాంకు దక్కించుకున్న విజయనగరం మున్సి పాలిటీ ఈ సారి ఏ స్థానాన్ని సాధిస్తుందన్నదే అందరిలోనూ ఉత్కంఠ. ఈ ఏడాది పోటీలోపాల్గొంటున్న మునిసిపాలిటీలు డాక్యుమెంటేషన్ ప్రక్రియతో పాటు దాని ఆధారంగా జరిగే క్షేత్ర స్థాయి పరిశీలనకు సమాయత్తం అవుతుండగా... విజయనగరం మున్సిపాలిటీ ఇదేదీ ప్రారంభమే కాలేదు. గత ఏడాది జనవరి 4 నుంచి మార్చి 4వ తేదీ వరకు పోటీలు నిర్వహించగా ఈ సారి మరింత కఠినతరం చేసిన కేంద్రం పోటీ గడువును కుదించింది. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 31వ తేదీ వరకే పరిశీలిస్తామని పేర్కొంది. గతంలో నాలుగు వేల మార్కులకు ఈ పోటీ నిర్వహించగా.. ప్రస్తుతం 5వేల మార్కులకు నిర్వహించనుంది. డాక్యుమెంటేషన్ ఆధారంగా నిర్వహించే క్షేత్ర స్థాయి పరిశీలనల అంశంలో తప్పుడు సమాచారం ఇస్తే మైనస్ మార్కులు అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 100శాతం డాక్యుమంటేషన్ పక్కాగా ఉండేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ స్వచ్ఛ సర్వేక్షణ్ ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ భారత్‌లో బాగంగా దేశ వ్యాప్తంగా పరిశుభ్రత అమలు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా నగరాలు, పట్టణాల మధ్య స్వచ్ఛత పోటీలు నిర్వహించి తద్వారా పరిశుభ్రమైన నగరాలుగా తీర్చిదిద్ది ప్రజలకు ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన జీవన విధానాన్ని అందించటమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తోంది. మెరుగైన స్వచ్ఛతను అమలు చేస్తున్న నగరాలకు అవార్డులు, రివార్డులు ఇవ్వడంతో పాటు మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా జనవరి 4 నుంచి 31 తేదీలోగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పట్టణంలో పర్యటించి స్వచ్ఛతను పరిశీలించనున్నారు. విజయనగరంలో ఇంకా వెనుకబాటే... 2019 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు సమాయత్తం అవుతున్న విజయనగరం మున్సిపాలిటీ ఇంకా పలు అంశాల్లో వెనుకబడే ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తే స్వచ్ఛత సాధ్యపడటంతో పాటు మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవకాశాలున్నాయి. ప్రధానంగా ఓడీఎఫ్, ప్లాస్టిక్ నిషేధం, పందులు, కుక్కల నియంత్రణ, తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించటం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 5వేల మార్కులకు నిర్వహించే పోటీలో సీనియర్ సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్‌కు 1250 మార్కులు, క్షేత్ర స్థాయి తనిఖీలకు 1250 మార్కులు, డాక్యుమెంటేషన్‌కు 1250 మార్కులు, సర్టిఫికేషన్‌కు 1250 మార్కులు ఇవ్వనున్నారు. ఎక్కడికక్కడే చెత్త నగరంలో ఎక్కడ చూసినా ఇంకా చెత్త కనిపిస్తూనే ఉంది. మురుగునీటి కాలువలు ఇంకా పూర్తిస్థాయిలో శుభ్రం చేయాల్సి ఉంది. ఓ వైపు వాటిని శుభ్రం చేస్తున్నా... పెండింగ్‌లో ఉన్న విస్తరణ పనులవల్ల ఎక్కడా స్వచ్ఛత కానరావడం లేదు. అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి వస్తారన్న ఆత్రంలో ఏవో అరకొర పనులు చేపట్టినా... ఆ తరువాత వాటిపై పెద్దగా శ్రద్ధ చూపించకపోవడంతో ఎక్కడా స్వచ్ఛత ఆనవాళ్లు కానరావడం లేదు. ఇదే పరిస్థితి సర్వే సమయానికీ కనిపిస్తే ఇక ర్యాంకులో మరింత వెనుకబడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. మెరుగైన ర్యాంక్ సాధనకు ప్రణాళిక స్వచ్ఛ సర్వేక్షణ్–2019 సర్వేలో మెరుగైన ర్యాంకు సాధించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మున్సిపాలిటీ తరఫున చిన్న చిన్న లోపాలను అధిగమించేలా చర్యలు చేపడుతున్నాం. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోటీలో విజయనగరం పట్టణాన్ని మెరుగైన స్థానంలో నిలబెట్టేలా ప్రయత్నం చేస్తాం. – టి.వేణుగోపాల్, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ -
27న విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయసేకరణ
విజయనగరం మున్సిపాలిటీ : 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపుదలపై ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ జి.చిరంజీవిరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దాసన్నపేట విద్యుత్ భవనం ఆవరణలో ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా రెగ్యులేటరీ కమిషన్‌కు వెల్లడించవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ఎలూరు, గుంటూరు, కర్నూలు, తిరుపతి కేంద్రాల్లో ఈ తరహా కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. విజయనగరంలో మొట్ట మొదటిగా ప్రారంభిస్తామన్నారు. తొలిసారిగా జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రెగ్యులేటరీ కమిషన్ రానున్న నేపథ్యంలో విద్యుత్ భవనం, పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. కార్యాలయ ఆవరణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. -
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు
విజయనగరం మున్సిపాలిటీ: పంచాయతీలకు వివిధ గ్రాంట్ల కింద మంజూరయ్యే నిధులతో పాటు వాటి ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడంలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు తెలిపారు. జిల్లాలో మొత్తం 490 క్లస్టర్లు ఉండగా... అందులో 231 క్లస్టర్లలో వివరాలను ఆన్లైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ప్రశ్న: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు? జవాబు: జిల్లావ్యాప్తంగా 920 గ్రామ పంచాయతీలు ఉండగా... అందులో 905 పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు వేసే ప్రక్రియను చేపడుతున్నాం. మిగిలిన 15 పంచాయతీలు గిరిశిఖర గ్రామాలు కావటంతో ఆ ప్రాంతాల్లో పనులు చేపట్టడం లేదు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే రోడ్ల నిర్మాణాలకు రూ.65 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 14వ ఆర్థిక సంఘం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో ఈ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రశ్న: ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతోంది.. పన్నుల వసూళ్ల పరిస్థితి..? జ: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి పన్ను, పన్నేతర ఆదాయం కింద రూ.23 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మార్చి 31 నాటికి వసూలు చేయాలని 496 పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ప్రజలు కూడా సహకరించి స్వచ్ఛందంగా పన్నులు చెల్లించాలి. ప్రశ్న: గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఎంతవరకు వచ్చింది..? జ: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు సంబంధించి తొలి విడతగా 34 మండల కేంద్రాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటుచేస్తున్నాం. అందులో 12 మండలాల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. 920 గ్రామ పంచాయతీలకు 560 పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు స్థల సేకరణ జరిగింది. ప్రశ్న: పంచాయతీల పాలన పర్యవేక్షించేందుకు కార్యదర్శులు, ఈఓపీఆర్డీల పరిస్థితి? జ: జిల్లాలో 34 మండలాలు ఉన్నాయి. 29 మంది ఈఓపీఆర్డీలు ఉన్నారు. మిగిలిన ఐదు మండలాల్లో ఇన్ఛార్జిలుగా పక్క మండలాలకు చెందిన వారికి బాధ్యతలు అప్పగించాం. మొత్తం 920 గ్రామ పంచాయతీలను 490 క్లస్టర్లుగా విభజించాం. 496 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానించాం. 21 మంది కార్యదర్శుల పోస్టులకు ఎంపికయ్యారు. వారికి త్వరలోనే బాధ్యతలు అప్పగిస్తాం. ప్రశ్న: ఏకగ్రీవ పంచాయతీలకు విడుదలైన నిధుల వినియోగంపై మార్గదర్శకాలు! జ: జిల్లాలో 126 గ్రామ పంచాయతీలు ఎన్నికల నిర్వహణ లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. వాటిలో ఒక్కో పంచాయతీకి రూ.7 కోట్లు చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమంలో 20 ప్రాధాన్యతాంశాల పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు అవే సూచనలు పంపించాం. ప్రశ్న: నగర పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారా? జ: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేసేందుకు గత డిసెంబర్ 2వ వారంలోనే ప్రతిపాదనలు పంపించాం. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ ఇప్పటి వరకూ రాలేదు. -
డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజాందోళన
విజయనగరం పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో దానికి వ్యతిరేకంగా జిల్లాలోని డెంకాడ మండలం గునుపూరుపేట వద్ద సోమవారం ఉదయం పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. గునుపూర్‌పేట వద్దనున్న డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేదని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేశారు. -
విజయనగరానికి కార్పొరేషన్ హోదా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరానికి కార్పొరేషన్ హోదా రానుంది. జిల్లా కేంద్ర మున్సిపాల్టీల్ని కార్పొరేషన్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో విజయనగరం మున్సిపాల్టీ స్థాయి పెరగనుంది. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుండడంతో పట్టణీకరణకు అవకాశం ఉంటుంది. అలాగే నిధులు భారీగా రానున్నాయి. పన్నులు పెరగనున్నాయి. కమిషనర్‌కు అధికారాలు కూడా పెరుగుతాయి. పోస్టులు ఎక్కువ కానున్నాయి. నిబంధనల మేరకైతే విజయనగరం మున్సిపాల్టీ ఎప్పుడో కార్పొరేషన్ కావల్సి ఉంది. అందుకు కావల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. రెండు లక్షల జనాభా, రూ.10 కోట్ల ఆదాయం ఉన్న మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ లెక్కన చూస్తే విజయనగరం మున్సిపాల్టీలో ప్రస్తుతం 2.5 లక్షల జనాభా ఉండటమే కాకుండా, వార్షిక రూ.20కోట్ల ఆదాయం వస్తోంది. కాకపోతే విజయనగరాన్ని కార్పొరేషన్ చేసే దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఇంతకన్నా తక్కువ జనాభా ఉన్న ఏలూరు, ఒంగోలు, కడప, చిత్తూరు మున్సిపాల్టీలు ఎప్పుడో కార్పొరేషన్ హోదా సాధించాయి. వాటి సరసన ఇప్పుడు విజయనగరం చేరనుంది. మార్పులు ఇవి.... మున్సిపాల్టీలతో పోల్చితే కార్పొరేషన్ అయిన తరువాత రాష్ట్రం నుంచే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరగనున్నాయి. అందుకు తగ్గట్టుగానే పన్నులు కూ డా పెరిగే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ హోదా వస్తే పోస్టులు భారీగా పెరుగుతాయి. కమిషనర్ కు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. ప్రస్తుతం రూ.2వేలు దాటిన ఏ పనికైనా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. అదే కార్పొరేషన్ అయితే రూ.5లక్షల వరకు కమిషనర్ నిర్ణయం తీసుకోవచ్చు. పనుల మంజూరు, టెండర్ల విషయంలో కమిషనర్‌కు విచక్షనాధికారం ఉంటుంది. అలా గే, స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. దీని ద్వారా రూ. 50 లక్షల వరకు కమిటీయే పనులు చేపట్టవచ్చు. చైర్మన్‌తో పనిలేకుండా కమిటీయే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇక, కార్పొరేషన్ హోదా వచ్చినట్టయి తే పట్టణంలోని ఆక్రమణలు, అనధికార కట్టడాల్ని తొలగిం చేందుకు న్యాయపరమైన చిక్కులు ఉండవు. సెక్షన్ 636 ఆ అధికారాన్ని కార్పొరేషన్ కలిగించింది. అంటే, కార్పొరేషన్లో ఏ నిర్ణయమైనా త్వరితగతిన తీసుకునే అవకాశం ఉంటుంది. -
ఏడేళ్ల తరువాత మరో ఛాన్స్ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : భవనాల క్రమబద్ధీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అనుమతి లేకుండా జిల్లాలో నిర్మించిన భవనాలను లైన్ క్లియర్ కానుంది. ఏడేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశాన్ని కల్పించింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని అమలు చేశారు. 2007 డిసెంబర్ 15వరకు భవన క్రమబద్ధీకరణ అమలులో ఉంది. అప్పట్లో జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో 2,552 భవనాల్ని క్రమబద్ధీకరించారు. ప్రభుత్వానికి దాదాపు రూ. 6.23కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా భవనాల క్రమబద్ధీకరణకు సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో ఈసారి అంతకు రెట్టింపు ఆదాయం రావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చివరిగా జరిగిన భవన క్రమబద్ధీకరణలో విజయనగరం మున్సిపాల్టీ పరిధిలో 2,774 దరఖాస్తులు రాగా, 1,795 దరఖాస్తుల్ని అధికారులు క్లియర్ చేశారు. వీటి ద్వారా రూ. 5కోట్ల 15వేల ఆదాయం వచ్చింది. బొబ్బిలి మున్సిపాల్టీ పరిధిలో 324 దరఖాస్తులు రాగా, 284 పరిష్కరించారు. వీటి ద్వారా రూ.38.18లక్షల ఆదాయం వచ్చింది. పార్వతీపురం మున్సిపాల్టీలో 964దరఖాస్తులు రాగా, 243పరిష్కరించడంతో రూ.62.10లక్షల ఆదాయం సమకూరింది. సాలూరు మున్సిపాల్టీలో 512దరఖాస్తులు రాగా, 230 పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా రూ.23.10 లక్షల ఆదాయం లభించింది. చివరిగా భవన క్రమబద్ధీకరణ జరిగి ఏడేళ్లు దాటడంతో ఈసారి అంతకుమించి ఆదాయం లభించే అవకాశం ఉంది. దాదాపు ప్రతీ మున్సిపాల్టీలో అక్రమ కట్టడాల సంఖ్య వందల్లోనే ఉంది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వాటి లెక్క తేలడం లేదు. అలాంటి భవనాల క్రమబద్ధీకరణ చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో అక్రమ కట్టడదారులంతా ముందుకొచ్చి క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంది. భూమి, భవనాల విలువ భారీగా పెరగడంతో తప్పనిసరిగా క్రమబద్ధీకరణకు యజమానులు ఆసక్తి చూపుతారు. ఈలెక్కన మున్సిపాల్టీల్లో ఈసారి భవన క్రమబద్ధీకరణ ఆదాయం రూ.13 నుంచి 15 కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్లాన్ తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన వారు, తీసుకున్న ప్లాన్ కన్నా అదనపు నిర్మాణాలు చేపట్టిన వారంతా భవన క్రమబద్ధీకరణలోకి వస్తారు. వీరంతా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా అధికారులు క్రమబద్ధీకరించనున్నారు. అలాగే, పంచాయతీల్లో కూడా భవన క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది. అయితే వీటిలో అనధికార కట్టడాల్ని అంచనా వేయడం కష్టం. -
నీరుగారుతున్న నిర్మాణం
విజయనగరం మున్సిపాలిటీ: పాలకులు మారినా..అధికారులు వచ్చి పోతున్నా..పట్టణ ప్రజల దాహార్తి మాత్రం తీరడం లేదు. జిల్లా కేంద్రంలో గల 3 లక్షల మంది ప్రజలు కొన్నేళ్లుగా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేకపోవడం దారుణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా వాటిని వినియోగించుకోవడంలో ఇంజినీరింగ్ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి తేవాల్సిన ప్రజాప్రతినిధులు ఆదిశగా ప్రయత్నాలు సాగించిన దాఖలాలు లేవు. దీంతో ఈఏడాదీ వేసవిలో పట్టణప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పనలవిగా మారాయి. మూడేళ్లుగా నిర్మాణంలో మూడు రక్షిత మంచి నీటి పథకాలు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న ప్రజల దాహర్తిని తీర్చేందుకు పట్టణంలోని వ్యాసనారాయణమెట్ట, ఫూల్భాగ్కాలనీ, మయూరి జంక్షన్ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాల నిర్మాణాలు చేపట్టాలని మూడేళ్ల క్రితమే నిర్ణయించారు. ఇందులో భాగంగా వ్యాసనారాయణమెట్ట, పూల్బాగ్కాలనీతో పాటు మయూరి జంక్షన్ వద్ద నిర్మించతలపెట్టిన నీటి పథకాలకు సుమారు రూ450కోట్లు నిధులు మంజూరు చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా వాటి నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతూనే ఉంది. రూ.96 లక్షల వ్యయంతో వ్యాసనారాయణమెట్ట ప్రాంతం 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచి నీటి పథకం మార్చి నాటికి పూర్తివు తుందని అధికారులు చెబుతున్నారు. అయితే మయూరి జంక్షన్ తదితర ప్రాంతాల్లో నిర్మించాల్సిన రక్షిత మంచి నీటి పథకాలు మాత్రం విశాఖలో గల పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నాయి. అయితే ముందుగా పనులు చేపట్టిన సదరు కాంట్రా క్టర్లు ట్యాంక్ నిర్మాణం మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారు. దీంతో ఆ రెండు పథకాల నిర్మాణ ప్రగతి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా మారింది. కలగా మిగిలిపోతున్న ప్రతి రోజూ నీటి సరఫరా... పట్టణ ప్రాంతాలో నివసిస్తున్న ప్రజలు ప్రతి రోజు తాగు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకంటామని వచ్చే పాలకులు, అధికారులు ప్రకటనలు చేస్తున్నా అవి కార్యరూపం దాల్చటం లేదు. పట్టణంలో వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే సాధారణ రోజుల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంటుంది.ఈ మూడు రక్షిత మంచి నీటి పథకాల నుంచి 16 ఎంఎల్డి నీరు పట్టణానికి వస్తుంటుంది. ఇది కూడా నెల్లిమర్ల, రామతీర్ధం, ముషిడిపల్లి రక్షిత మంచి నీటి పథకాల వద్ద నుంచి ఆశించిన స్థాయిలో నీరు పంపింగ్ జరిగినపుడే సాధ్యపడుతుందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే వేసవి కాలంలో పట్టణానికి నీటిని అందించే మూడురక్షిత మంచి నీటి పథకాల వద్ద ఊటబావుల్లో నీటి మట్టాలు తగ్గిపోయే పరిస్థితిలు ఏటా చవి చూస్తున్నారు. దీంతో ఆ సమయంలో అధికారులు మూడు రోజులకు ఒక మారు నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా వేళపాళలేకుండా మండుటెండలో మిట్టమధ్యాహ్నం సమయాల్లో, అర్ధరాత్రి అంతా పడుకునే సమయాల్లో నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ప్రజలు మండిపడుతూనే ఉన్నారు. ఇదే విషయమై మున్సిపల్ డీఈ మత్స్యరాజును సాక్షి వివరణ కోరగా..పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వ్యాసనారాయణమెట్ట రక్షిత మంచినీటి పథకం పనులు మార్చి నెలలోగా పూర్తవుతాయన్నారు. మిగిలిన పథకాలకు సంబంధించిన పనులును పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారని తమకు సంబంధం లేదన్నారు. వేసవిలో పట్టణ ప్రజల తాగు నీటిని తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించచామనని చెప్పారు. -
తెలుగు వారి పెళ్లి
పవిత్రంగా మండే అగ్నిహోత్రం... ఆ వెలుతురులో కొత్త జీవితానికి పునాదులు వేసుకునే ఆనందంలో నవ వధూవరులు... నలుదిక్కులా శ్రావ్యంగా వినిపించే వేదమంత్రాలు... దానికి అనుగుణంగా మోగే మంగళవాయిద్యాల చప్పళ్లు... మనస్పూర్తిగా దీవించే పెద్ద మనుషులు... వెరసి తెలుగు ఇంటిలో పెళ్లి తంతు. దేవతలకైనా సాధ్యమయ్యేనా అనేలా జరిగే ఈ హిందూ వివాహ క్రతువుపై ప్రపంచమే మనసు పడింది. అందుకే ఎంతో మంది విదేశీయులు ఈ తరహాలో వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. పెళ్లిలో చదివే మంత్రాలు, చేసే వాగ్దానాలు, కట్టుకునే నగలు, ఆడుకునే ఆటలు అన్నింటికీ ఓ అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో చూస్తే... విజయనగరం మున్సిపాలిటీ దిష్టి తగలకుండా బాసికలు వధూవరుల నుదుటిపై శోభించే ఆభరణమే బాసిక. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. నరుని దృష్టికి నల్లరాయైనా పగులుతుందనేది శాస్త్రం. అందుకే దృషి దోష నివారణకు బాసికాన్ని కడతారు. మన శరీరంలో ఉన్న మొత్తం నాడుల్లో ముఖ్యమైన మేడు నాడులు ఇడ, పింగళ, సుషుమ్న, వీటి అధిదేవతలుగా త్రిమూర్తులను చెప్తారు. ఆ మూడు నాడులు కలిసే చోటు లలాట మధ్య స్థానం. రెండు కనుబొమ్మల మధ్య స్థానం ఆజ్ఞాచక్రం. అలాంటి సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు. బ్రహ్మరంద్రాన్ని తెరిచే జీలకర్ర, బెల్లం జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. తలపై ఉండే బ్రహ్మరంధ్రం వీటిని ఉంచడం వల్ల తెరుచుకుంటుంది. వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచిన చేతల ద్వారా వారి శక్తి ఈ మిశ్రమం ద్వారా బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి, ఆ కిందుగా ఉన్న సహస్రార చక్రం ద్వారా మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రం ద్వారా వెలువడి ఆకర్షణ కలుగుతుంది. అలాగే మధ్యలోఉంచే తెరకు కూడా అర్థం ఉంది. వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. కన్యాదానం.... దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ పెళ్లిలో మాత్రం కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారు. దానమేదైనా ‘తుభ్యమహ సంప్రదదే న మమః’ అని పలికి దానమిస్తారు. అంటే దానమిచ్చిన వస్తువుపై ఇంక నాకు ఏ అధికారం లేదు అని అర్థం. కానీ కన్యాదానం చేసినపుడు న మమ అనరు. ఎందుకంటే తల్లిదండ్రులకు కూతురుతో ఉన్న బంధం పెళ్లితో ముగిసిపోదు ఇంకా పెరుగుతుంది. బ్రహ్మముడి.. వధువ చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం ఆశీస్సులను, బ్రాహ్మణాశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయటమే. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు. ఉంగరాలు తీయటం.... చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది. పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది. మంగళ సూత్రం బతుకు సూత్రం సూత్రం అంటే దారం. మంగళప్రదమైంది కనుగ మంగళసూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొల గిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు. మనకు మూడుతో విడదీయరాని సంబంధం ఉంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలా మూడుకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా మూడు ఉన్నాయి. అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం. అప్పుడు చదివే మం త్రం ‘మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతమ్’ అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో ‘నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శతవసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా జీవితం , నా జీవనగమనం, దీనిపైనే ఆధారపడి ఉంది’ అని అర్థం. తలంబ్రాలు... దూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు. ఇది వివాహంలోని ముఖ్య ఘట్టం. పాణిగ్రహణం... కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని సమంత్రకంగా పట్టుకోవటం. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి, పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయి పైకి ఉండేలా చేయి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం. -
పెంపు సరే...? దక్కేదెంత...?
విజయనగరం మున్సిపాలిటీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా లో వేతనదారులకు కనీస వేతనాలు దక్కడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపమో...దిగువ స్థాయి సిబ్బంది నిర్లక్ష్య వైఖరో... కూలీల్లో అవగాహన లేకో.. తెలియదు కానీ రోజంతా కాయకష్టం చేస్తున్నా వేతనదారులకు కనీస సరైన వేతనం లభించడంలేదు. వలసలను నిరోధించి, ఉన్న ఊళ్లో పనికల్పించాలని అమలు చేస్తున్న ఈ పథకం లక్ష్యం నెరవేరడంలేదు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఉపాధి పనుల వేతనదారులకు సగటున రూ.102 వేతనం మాత్రమే అందుతోంది. వేతనానికి తగ్గ పనులు కల్పించడంలో అధికారులు విఫలమవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పథకంలో పని చేస్తున్న వేతనదారులకు ఇప్పటి వరకు అందిస్తున్న సగటు వేతనాన్ని రూ.149నుంచి రూ.169 వరకు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇది వేతనదారులకు పెద్దగా ఆనందం కలిగించలేదు. తాము చేసిన పనికి కిట్టుబాటు కూలి రానప్పుడు వేతనం ఎంతపెంచితే ఏం లాభమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలులోపాలను సరిచేస్తేనే ప్రయోజనం ఉంటుందని వారు కోరుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.... జిల్లాలో ఐదు లక్షల 31వేల మందికి జాబ్‌కార్డులు జారీ చేయగా.. అందులో వేసవి కాలంలోగరిష్టంగా మూడు లక్షల వరకు వేతనదారులు పనులకు హాజరువుతుంటారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం, కాసిన్ని వ్యవసాయ పనులు అందుబాటులో ఉండడంతో 25వేల మంది వరకు వేతనదారులు పనులకు వస్తున్నారు. పనులకు వస్తున్న వేతనదారులకు సగటున రూ.102 నుంచి రూ.103 వరకు వేతనం లభిస్తోంది. ఇందులో గరిష్టంగా ఇప్పటి వరకు అమలైన రూ.149 వేతనం 10 శాతం మంది వేతనదారులకు అందుతుండగా.. రూ.60 నుంచి రూ.70 వేతనం తీసుకునే వేతనదారులు 40 శాతం వరకు ఉంటారు. అంతేకాకుండా రూ.30 నుంచి రూ.40 వేతనం అందుకునే వేతనదారులు 15 శాతం వరకు ఉంటారని అంచనా. ఈ లెక్కల మేరకు ప్రభుత్వం నిర్దేశిస్తున్న వేతనం అతి తక్కువ మందికే దక్కుతోంది. ఇందుకు అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. వేతనానికి సరిపడా పని కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా నిర్దిష్ట పని గంటల విషయంలో అధికారుల నుంచి స్పష్టతలేకపోవడం మరో లోపం. దీంతో వేతనదారులు పనులకు వెళుతున్నా నిర్దేశించిన మొత్తాన్ని అందుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని పలు గ్రామాలకు చెందిన వేతనదారులు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. అరకొర వేతనంతో బతుకులు వెళ్లదీయవలసిన దుస్థితి నెలకొంది. దీంతో చాలా మంది వేతనదారులు వలసబాటపడుతున్నారు. క్యూబిక్ మీటర్ చొప్పున అధికారులు చెల్లించే రేట్లు ఇలా... జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ రకాల పనులకు అధికారులు ఇస్తున్న వేతనం క్యూబిక్ మీటర్ చొప్పున ఇలా ఉన్నాయి. కాల్వల్లో పూడికల తొలగింపునకు మెత్తటి నేలలో రూ.59, గట్టి నేలలో రూ.68 చెల్లిస్తున్నారు. భూ అభివృద్ధి పనులకు క్యూబిక్ మీటర్ మెత్తటి నేలలో అయితే రూ.116, గట్టి నేలలో అ యితే రూ.126, చెరువు పనులకు దూరాన్ని బట్టి క్యూబిక్ మీటర్‌కు రూ. 106, రూ.126,రూ.145 చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా మొక్కలు పెంపకం లో భాగంగా అధికారులు నిర్దేశించిన మేరకు ఒక గుంత తవ్వేందుకు మె త్తటి నేలలో అయితే రూ.104, గట్టి నేలలో అయితే రూ.109 చెల్లిస్తున్నారు.