waragal district
-
తాగి డ్రైవింగ్ చేస్తే ఇలా ఉంటుంది
-
రేవంత్ వ్యాఖ్యల దుమారం.. పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు!
సాక్షి, వరంగల్: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కొత్త ప్లాన్స్‌తో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ములుగు జిల్లాలోని మేడారం నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభమైంది. కాగా, పాదయాత్రలో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. అయితే, రేవంత్ రెడ్డి.. ప్రగతిభవన్‌ను పేల్చేయాలనే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రపై టెన్షన్ నెలకొంది. మరోవైపు.. రేవంత్ రెడ్డి మూడోరోజు పాదయాత్ర నేడు మహబూబాబాద్‌లో జిల్లా కొనసాగనుంది. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరణతో యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ శ్రేణులు తొర్రురు బస్టాండ్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాత్రి పెద్దవంగర వద్ద రేవంత్ బస చేయనున్నారు. -
వరంగల్‌లో మెడికల్ సీట్ల మాఫియా
-
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
Warangal: నా పెళ్లి ఆపండి సార్..!
డోర్నకల్(వరంగల్) : ‘మైనార్టీ తీరకుండానే నాకు వివాహం చేయాలని చూస్తున్నారు.. నాకు చదువుకోవాలని ఉంది. ఈ వివాహాన్ని ఎలాగైనా అడ్డుకోండి సార్’ అంటూ ఓ బాలిక స్వయంగా చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా, బాలికను సన్మానించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన బాలిక (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేందుకు సిద్ధం కావడంతో ఆ బాలిక.. చైల్డ్‌లైన్ నంబర్ 1098కు సమాచార మిచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు మంగళవారం గ్రామానికి చేరుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనార్టీ తీరాకే వివాహం చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. అనంతరం బాలికను సన్మానించారు. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది లక్ష్యమని బాలిక తెలిపింది. కాగా, గ్రామంలో మరో బాల్య వివాహాన్ని కూడా అధికారులు అడ్డుకున్నారు. చదవండి: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ -
వరంగల్‌లో ఘనంగా దసరా వేడుకలు
-
‘నేను ఏ తప్పు చేయలేదు, చేయను’
సాక్షి, వరంగల్ : తాను ఏ తప్పు చేయలేదని, ఇకపై చేయనని.. ఎదైనా చిన్న తప్పు చేస్తే సవరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తనకు మంచి బాధ్యత ఇచ్చారని. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవ్వరూ ఇంత మంచి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. టీడీపీ ఆవిర్భావంలో ఎన్టీఆర్ తనను కన్వీనర్‌ని చేసి, 1983 ఎన్నికల్లో బీఫామ్‌లు ఇచ్చి పంపారని వెల్లడించారు. రాజకీయల్లో కలిసి రావాలని పేర్కొన్నారు. పార్టీ కోసం టీం వర్క్‌గా పని చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి పాటుపడతానని, బాబ్లీ ఉద్యమంలో తన పాత్ర కీలకమైనది చెప్పారు. దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, కానీ కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఎంజీఎం, కేఎంసీ, గ్రామాల్లో స్మశాన వాటికలు ఇలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఉద్యమాల జిల్లాలో యువతకు ఉద్యోగాల కల్పన చాలా అవసరమన్నారు. ఉద్యమ సమయంలో తనను టీడీపీ నుంచి బయటకు రమ్మని చెప్పింది మీడియా మిత్రులేనని గుర్తుచేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, స్పెషల్ రైల్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఏర్పాటుకు కేసీఆర్‌తో మాట్లాడి త్వరగా పూర్తి చేస్తానన్నారు. -
విభిన్న రాజకీయం
సాక్షి, వరంగల్ రూరల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాలు ఏర్పడిన నాటి నుంచి విభిన్నమైన రాజకీయ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. 1952 నుంచి 2009 వరకు పలుమార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 1952లో శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్ యతిరాజారావు ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి, డోర్నకల్ నుంచి ధరంసోత్ రెడ్యానాయక్, నర్సంపేట నుంచి మద్దికాయల ఓంకార్, వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీరంతా ఐదుసార్లు విజయం సాధించారు. డోర్నకల్ నుంచి నూకల రామచంద్రారెడ్డి, రామసహాయం సురేందర్ రెడ్డి నాలుగుసార్లు విజయకేతనం ఎగురవేశారు. చేర్యాల నుంచి నిమ్మ రాజిరెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాలకుర్తి 2009 నియోజకవర్గాల పునర్విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దుచేశారు. అదే స్థానంలో పాలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు చేశారు. పాలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, టీఆర్ఎస్ ఒకసారి గెలుపొందారు. రాష్ట్రంలో ఏడు సార్లు గెలుపొందిన అతికొద్ది మంది నేతల్లో ఒకరైన ఎన్ యతిరాజారావు చెన్నూరు నుంచి గెలుపొందారు. మహబూబాబాద్ మహబూబాబాద్‌కు మొత్తం 12 మార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ ఆరు సార్లు, టీడీపీ రెండుమార్లు, సీపీఐ రెండు మార్లు, టీఆర్ఎస్ ఒకసారి గెలుపొందారు. 1972 నుంచి 1989 వరకు ఐదు సార్లు జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మాలోత్ కవిత ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. డోర్నకల్ 1957 సంవత్సరంలో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి నుంచి 14 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ గెలిచాయి. ఒకసారి టీడీపీ గెలిచింది. 1972లో నూకల రామచంద్రారెడ్డి, ఆయన అకాల మరణం తరువాత 1974లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా గెలవడం విశేషం. నూకల మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఆయన తరువాత రామసహాయం సురేందర్ రెడ్డి మరో నాలుగు మార్లు, తదనంతరం రెడ్యానాయక్ ఐదు మార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల సమయంలో పోటీ పడిన రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ఇద్దరూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. జనగామ జనగామ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో 2014లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్ఎస్) చేతిలో ఓటమిపాలయ్యారు. జనగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా ఎనిమిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. పరకాల పరకాలలో ఇప్పటివరకు 14 మార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) కలిసి ఆరుసార్లు విజయం సాధించాయి. భారతీయ జనసంఘ్, బీజేపీలు కలిసి మూడు సార్లు గెలిచాయి. టీడీపీ, టీఆర్ఎస్ రెండు సార్లు, సీపీఐ ఒక్క సారి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 2014లో టీడీపీ నుంచి గెలుపొందిన చల్లా ధర్మారెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. 2004 సంవత్సరంలో టీఆర్ఎస్ పక్షాన గెలుపొందిన శారారాణి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌కు విరుద్ధంగా జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చినందుకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అన ర్హురాలిని చేస్తూ స్పీకర్ సురేష్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ములుగు ములుగుకు 15 మార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు విజయం సాధించాయి. టీడీపీ నాలుగు సార్లు, టీఆర్ఎస్ ఒక సారి, పీడీఎఫ్ రెండు సార్లు గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంట్ గెలుపొందారు. 2014, 1994లో రెండుసార్లు మంత్రిగా చందూలాల్ పనిచేశారు. ఇక్కడ నుంచి మూడు మార్లు గెలిచిన జగన్నాయక్ కూడా మంత్రి పదవి చేపట్టారు. వర్ధన్నపేట వర్ధన్నపేటలో నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1994, 1999 ,2004 వరుసగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఇప్పటివరకు మూడు మార్లు టీడీపీ, మూడు మార్లు కాంగ్రెస్, బీజేపీ రెండు మార్లు, పీడీఎఫ్ రెండు మార్లు, ఎస్టీపీఎస్ ఒక సారి, టీఆర్ఎస్ ఒకసారి గెలుపొందారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కొంత కాలం ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. నర్సంపేట నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 మార్లు ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు మద్దికాయల ఓంకార్ గెలుపొందారు. మూడు మార్లు సీపీఎం నుంచి రెండుసార్లు ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదు. ఇప్పటివరకు నర్సంపేట నుంచి మహిళ ఎమ్మెల్యేగా 1957లో కనరత్నమ్మ మాత్రమే గెలుపొందింది. రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి మూడు మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల పునర్విభజన తరువాత హన్మకొండ రద్దయి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 2009లో ఏర్పడినప్పటి నుంచి మూడు మార్లు వరుసగా దాస్యం వినయ్‌భాస్కర్ గెలుపొందారు. హన్మకొండ నియోజకవర్గం 1952 నుంచి 2004 వరకు పది మార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐ మూడు మార్లు, టీడీపీ మూడు మార్లు, బీజేపీ ఒకసారి, టీఆర్ఎస్ ఒక సారి, పీడీఫ్ రెండు సార్లు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్ రిజర్వుడ్ స్థానమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇప్పటి వరకు 15 సార్లు జరిగాయి. ఐదుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ గెలుపొందాయి. తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి చెరో మూడుసార్లు గెలుపొందారు. గతంలో ఇదే నియోజకవర్గ ప్రాతినిథ్యం వహించిన కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి క్యాబినెట్లో రాజయ్య ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాల పునర్విభజన తరువాత వరంగల్‌కు బదులు వరంగల్ తూర్పు నియోజకవర్గంగా 2009లో ఏర్పడింది. ఇప్పటి వరకు 14 మార్లు ఎన్నికలు జరగగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మూడుమార్లు ఎమ్మెల్యేగా బస్వరాజు సారయ్య గెలుపొంది ఒక్కసారి మంత్రిగా పని చేశారు. టీడీపీ మూడు సార్లు, ఇండిపెండెంట్లు రెండు మార్లు, ఒకసారి టీఆర్ఎస్ గెలుపొందాయి. భూపాలపల్లి నియోజకవర్గాల పునర్విభజన తరువాత శాయంపేట రద్దయింది. దాని స్థానంలో భూపాలపల్లి నియోజకవర్గం 2009లో ఏర్పడింది. భూపాలపల్లిలో 2014లో మధుసూదనాచారి, 2009లో గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. 2014లో గెలుపొందిన మధుసూదనాచారి తొలి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2009లో గెలుపొందిన వెంకటరమణ రెడ్డి ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. శాయంపేట నియోజకవర్గంలో ఏడు మార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిస్తే, టీడీపీ, బీజేపీ, జనతా పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి. -
ప్రధాన సూత్రధారి సేఫ్
‘ఎస్సారెస్పీ’ బాగోతంలో మరో కోణం హసన్‌పర్తి: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్న మెడికల్ బిల్లుల బాగోతంలో మరో కోణం వెలుగు చూసింది. బిల్లుల స్వాహా వ్యవహారంలో సదరు ఉద్యోగులపై కేసు నమోదు కాగా.. ఇందులో ప్రధాన çసూత్రధారినే తప్పించినట్లు తెలుస్తోంది. ఎస్సారెస్పీ ఉద్యోగులు కొందరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోకున్నా.. చేయించుకున్నట్లు తప్పుడు మెడికల్ బిల్లులను సృష్టించి సర్కారు నిధులను అప్పనంగా డ్రా చేసుకున్న ఘటన గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2008 నుంచి ఈ తతంగం సాగగా.. 2016లో వెలుగుచూసింది. ఈ మేరకు శాఖా పరమైన విచారణ ప్రారంభం కాగా.. ప్రాథమికంగా 26 మంది ఉద్యోగులను దోషులుగా తేల్చారు. వారిని వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు ప్రమోషన్లు, అలవెన్సులు రాకుండా నిలిపివేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2017లో విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది. అప్పటి నుంచి విచారణ కొనసాగగా.. నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ అవినీతి బాగోతాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కారు.. సదరు ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్సారెస్పీ ఉన్నతాధికారిని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సదరు ఉన్నతాధికారి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. అయితే.. ఈ బాగోతానికి అసలు సూత్రధారిని పక్కకు తప్పించినట్లు తెలిసింది. పెద్దోళ్ల పేర్లు బయటకు వస్తాయనే.. మెడికల్ బిల్లుల వ్యవహారంలో విజిలెన్స్ విచారణలో ప్రాథమికంగా 26 బిల్లులు ఫోర్జరీ చేసినట్లు తేలింది. మరో వంద బిల్లులు కూడా ఫోర్జరీవేనని విజిలెన్స్ అధికారులు నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. రెండేళ్ల పాటు జరిగిన విచారణ అనంతరం సుమారు 26 బిల్లులకు సంబంధించి రూ.50 లక్షల మేరకు డబ్బులు స్వాహా అయినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే విజిలెన్స్ విచారణ సందర్భంగా సదరు ఉద్యోగులు.. ఈ బాగోతానికి ప్రధాన సూత్రధారి.. దళారీగా వ్యవహరించిన ఓ వ్యాపారి పేరును వెల్లడించలేదు. దీంతో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అధికారులు అతడి పేరును చేర్చలేదని సమాచారం. ఈ దళారిని విచారణ పరిధిలోకి తీసుకొస్తే పెద్ద తలల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక్కో ఫోర్జరీ బిల్లుపై 25 శాతం కమీషన్‌గా తీసుకుని సదరు దళారీ ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు తెలుస్తోంది. సుమారు 120 మంది ఉద్యోగులకు బిల్లులు ఇప్పించినప్పటికీ.. 26 మంది మాత్రమే పట్టుబడ్డారని చింతగట్టు క్యాంప్‌లో చర్చించుకుంటున్నారు. దొంగ బిల్లులతో పాటు నిజంగా చికిత్స పొందిన వారికి సైతం మెడికల్ బిల్లులను ఇప్పించే బాధ్యత కూడా తన భుజాలపై వేసుకుంటాడనే పేరు దళారీగా వ్యహరించిన వ్యాపారికి ఉంది. మొత్తానికి దొంగ మెడికల్ బిల్లుల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన దళారీ వివరాలను పక్కకు తప్పించేందుకు పోలీసులపై ఒత్తిళ్లు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఆస్పత్రి హస్తం కూడా.. ఫోర్జరీ బిల్లుల కేసులో హన్మకొండలోని ఓ ప్రధాన ఆస్పత్రి సిబ్బంది హస్తం ఉన్నట్లు.. అక్రమార్కులకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఎటువంటి చికిత్స చేయకున్నా చికిత్స జరిగినట్లు బిల్లులు సృష్టించారని.. ఉద్యోగులు సమర్పించిన ఫోర్జరీ బిల్లులు, ఆస్పత్రి వివరాలు సరిచూడగా ఈ విషయం తేటతెల్లమైందని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. పరారీలో నిందితులు.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీని వాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో 18 మంది ఎస్సపారెస్పీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. అయితే.. నిందితులు పరారీలో ఉన్నారు. 20 రోజుల çనుంచి వారు హైదరాబాద్‌లో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఎస్సారెస్పీ మెడికల్ స్కాం లో అందిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందని.. ఎస్సారెస్పీ–1 ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు కేయూసీ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్‌బాబు తెలిపారు. -
టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం
వరంగల్ అర్బన్ జిల్లా : ఖాజీపేట మండలం ఐడీబీఎల్‌లోని జై చిరంజీవ టైర్ల పరిశ్రమంలో అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్ డోర్ బ్లాస్టవ్వడంతో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హన్మకొండ లోని మాక్స్ కేర్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వారే. వీరిలో పప్పు రాజ్ బార్ అనే ఆపరేటర్ ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలాన్ని ఖాజీపేట ఏసీపీ సత్యనారాయణ, సీఐ ధర్మసాగర్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం
కొత్త మండలాలపై ప్రతిపాదనలు పంపండి జిల్లా అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష ప్రస్తావనకురాని హన్మకొండ, వరంగల్ రూరల్ జిల్లాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దసరా నుంచే కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదాలోని అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొనని... ప్రజల్లో డిమాండ్ ఉన్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల అభిప్రాయం మేరకు కొత్త మండలాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మన జిల్లాలో టేకుమట్ల(చిట్యాల), చిన్నగూడూరు(మరిపెడ) మండలాల ఏర్పాటు కోసం కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్ల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లపై జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో నివేదిక పంపే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలను... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదాలో పేర్కొంది. అందులో హన్మకొండ జిల్లా ఏర్పాటుపై వరంగల్ నగరంలోని పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం హన్మకొండ జిల్లాకు బదులుగా వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై అధికారికంగా ప్రకటించకున్నా... వరంగల్ రూరల్ జిల్లా ప్రతిపాదనపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరానికి దగ్గరగా ఉండే మండలాలను వేరు చేస్తూ, దూరంగా ఉన్న మండలాలను కలపడంపై విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో భాగమైన కొన్ని ప్రాంతాలను గ్రామీణ జిల్లాలో చేర్చుతున్నారనే ప్రతిపాదనలపైనా ఇదే అభిప్రాయం ఉంది. గ్రేటర్ వరంగల్‌లోని గీసుగొండ, ఐనవోలు, సంగెం ప్రాంతాలను ఏ జిల్లాలో చేర్చుతారనే అంశంపై సందేహాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాత్రం హన్మకొండ, వరంగల్ రూరల్ జిల్లాల ప్రతిపాదనలపై ఎలాంటి చర్చా జరగలేదు. దీంతో జిల్లా పునర్విభజన అంశం చివరి దశలో ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తి కలిగిస్తోంది. -
మూగ బాలికపై అత్యాచారం
వరంగల్: వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం గంగారంలో దారుణం జరింగింది. ఓ కామాంధుడైన యవకుడు మూగ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వేయి స్తంభాలకు కార్తీక కాంతులు
-
నాయకుల్లేని దేశం
* టీడీపీ పరిస్థితి దయనీయం * నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు కరువు * ఎస్సీ సెగ్మెంట్లకు ఇతరుల నేతృత్వం * ‘తెలంగాణ’తో పూర్తిగా దెబ్బతిన్న సైకిల్ * ఎన్నికలపై నేతల్లో సన్నగిల్లుతున్న ఆశలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ఉద్యమ ప్రభావం, విశ్వసనీయత లేని విధానాలు, కీలక నేతల వలసలతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది. మాజీ మంత్రులు, ఎంపీ స్థాయి నేతలు పార్టీకి దూరమవుతున్న కొద్దీ అసెంబ్లీ సెగ్మెం ట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడంలేదు. ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలేస్తుండడంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సైతం దొరకడం లేదు. గతంలో టీడీపీలో నియోజకవర్గ ఇనాచార్జ్ కోసం ఐదారుగురు పోటీ పడేవారు. ఇప్పుడు కోరికోరి అడిగినా.. ఆ పార్టీలోకి ఎవరూ రాని పరిస్థితి ఉంది. పోటీ చేసేందుకు ఆసక్తి చూపే నాయకులు లేకపోవడం... కొత్తవారు వచ్చే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేరు. దశాబ్దం క్రితం వరకు జిల్లాలో తిరుగులేని పార్టీగా ఉన్న టీడీపీకి ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలోనే నాయకత్వం లేకపోవడంతో మండలాలు, గ్రామాల్లోనూ ఆ పార్టీ జెండా మోసేవారు కరువవుతున్నారు. 2009 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ దారుణ పరాజయాలను చవిచూసిన టీడీపీ... వచ్చే ఎన్నికలను ఆఖరి పోరాటంగా భావిస్తోంది. వరుస పరాజయాలకు తోడు మళ్లీ గెలిచే పరిస్థితులు లేకపోవడంతో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే దూరమయ్యేందుకు ఆ పార్టీ నేతలు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిరోగమనం... తీవ్రమైన ప్రజావ్యతిరేకతతో తొమ్మిదేళ్లుగా అధికారం కోల్పోయిన టీడీపీ... ప్రజా సమస్యలపై పోరాడకుండా చేతులెత్తేయడంతో పార్టీ బలం క్రమంగా తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణపై టీడీపీ అస్పష్ట వైఖరి ఆ పార్టీని జిల్లాలో బాగా దెబ్బతీసినట్లు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో పర్వాలేదనిపించేలా ఫలితాలు వచ్చినా... తర్వాత పరిణామాలతో క్రమంగా పార్టీ మొత్తం ఖాళీ అవుతోంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్న టీడీపీ జిల్లాలో ములుగు, డోర్నకల్, నర్సంపేట, పాలకుర్తి స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత తెలంగాణపై అస్పష్ట వైఖరి కారణంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువ మంది సైతం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీకి జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో ఏళ్లకేళ్లుగా ఇన్‌చార్జ్‌లు లేకపోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. పేదల అనుకూల పార్టీగా టీడీపీ జిల్లా నాయకులు చెప్పుకునే మాటలు.. చేతలకు పొంతనలేదనడానికి ఈ నియోజకవర్గాలకు ఆయా కేటగిరీల నేతలను ఇన్‌చార్జ్‌లుగా నియమించకపోవడమే నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) నియోజకవర్గం... టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పోటీ వాతావరణం ఉండేది. కానీ.. ఆ పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం ఎవరూ ఇన్చార్జ్గా లేరు. ఎస్సీ నియోజకవర్గానికి అదే సామాజికవర్గం నేతను ఇన్చార్జ్గా నియమించకపోగా, కట్ట మనోజ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం టీడీపీ శ్రేణులకే మింగుడుపడడంలేదు. వర్ధన్నపేట (ఎస్సీ) నియోజకవర్గం... గతంలో టీడీపీకి ఇది బలమైన సెగ్మెంట్. 2009 ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమి తరఫున టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీ పరిస్థితి మారిపోరుుంది. ఆ పార్టీ ఎస్సీ వర్గానికి చెందిన ఏ నేతకూ ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించలేదు. ఈ వర్గం కాని ఈగ మల్లేశంకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ నేతలను ఇక్కడ ఇన్చార్జ్గా నియమించకపోవడంతో టీడీపీ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వడ్ సెగ్మెంట్... ఇక్కడ టీడీపీకి నాయకులే లేరు. గత ఎన్నికల్లో మహా కూటమి తరఫున టీఆర్ఎస్ పోటీ చేసింది. ఆ తర్వాత నుంచి ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లను నియమించలేదు. పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో ఇక్కడ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.