Weather pollution
-
విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..!
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాపంగా ఎన్నో విధానాలను అసుసరిస్తున్నారు. ప్రధానంగా వాతావరణ కాలుష్యం నిత్యం వినియోగిస్తున్న వాహనాల నుంచి వెలువడే పొగద్వారే ఏర్పడుతుంది. దాంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈవీలు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో కూడా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, ఆటోలను విక్రయిస్తున్నాయి. అయితే, పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఈవీలు కాస్త అధిక కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఎమిషన్ అనలటిక్స్ అనే సంస్థ రెండు రకాల కార్లలోని బ్రేకింగ్, టైర్ల నుంచి విడుదలయ్యే రేణువులపై అద్యయనం చేసి ఆసక్తికర విషయాలను తెలిపింది. సాధారణ కార్ల ఇంజిన్ కంటే ఈవీల్లోని బ్యాటరీలు ఎక్కువ బరువుగా ఉంటాయి. దీంతో బ్రేక్ వేసినప్పుడు టైర్లపై అధిక ఒత్తిడి ఏర్పడి హానికారక రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తున్నాయని తెలిపింది. ఇది పెట్రోల్, డీజిల్ కార్లలో విడుదలయ్యే వాటి కంటే అధికమని వెల్లడించింది. ఇదీ చదవండి..ఫేమ్-2 పథకం పొడిగింపుపై కేంద్రం వ్యాఖ్యలు సింథిటిక్ రబ్బర్, ముడి చమురుతో టైర్లను తయారు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో పేర్కొంది. పర్యావరణ హితం కోసం చాలా దేశాల్లో ఈవీలకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తున్నారు. క్రమంగా వీటి వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తయారీదారులు ఈవీల బ్రేకింగ్ వ్యవస్థ, టైర్ల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని ‘ఎమిషన్ అనలటిక్స్’ సంస్థ సూచించింది. గతంలో ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. -
ఈగోతో ‘హర్ట్’ అయితే.. హార్ట్‌కు ముప్పు!
(బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మనసులో అహంకారం బుసలు కొడుతోందా?, ఇతరుల అభివృద్ధి కంటగింపుగా మారుతోందా?, ఇతరులతో మాట్లాడటమంటే చిరాకా?.. అయితే మిగిలిన సామాజిక సమస్యల మాటెలా ఉన్నా ఇలాంటి లక్షణాలున్న వారికి చాలా తొందరగానే గుండెజబ్బులు వచ్చేయడం ఖాయమంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డి యోవాస్క్యులర్ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.ఎన్.మంజునాథ్. ఇలాంటి టైప్–ఏ లక్షణాలున్న వ్యక్తులు తాము ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుపోవడమే కాక, తమ చుట్టూ ఉన్న వారి ఆరోగ్యం పాడయ్యేందుకూ కారణమవుతారని ఆయన శనివారం బెంగళూరులో జరిగిన 107వ సైన్స్ కాంగ్రెస్ ఉత్సవాల్లో పేర్కొన్నారు. గుండెజబ్బులతోపాటు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సమస్యలు ఇటీవల భారత్‌లోనూ పెరుగుతున్నందుకు పలు కారణాలున్నాయని, ఒంటరితనం పెరిగిపోతుండటం, వాతావరణ కాలుష్యం, ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులూ చెప్పుకోదగ్గ కారణాలేనని ఆయన తెలిపారు. ‘‘ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రులను గుండెజబ్బుల చికిత్స కోసమని ఆసుపత్రులకు తీసుకువచ్చేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల ను తీసుకు వస్తుండటం బాధాకరం’’ అన్నారు. పోటీ ప్రపంచంలో సాధారణ జీవితం గడపడమె లా అనేది మరచిపోతున్నామన్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 – 15 ఏళ్ల ముందే హృగ్రోద సమస్యలొస్తున్నాయన్న పరిశోధనలను ఆయన ఉదహరించారు. ఇవీ కారణాలే.. ఈ కాలంలో పిన్న వయస్కు లకీ గుండెజబ్బులు వచ్చేం దుకు వాయు కాలుష్యం, ఏ పనీ చేయకుండా కూర్చుండటమూ కారణాలవుతున్నాయని మంజునాథ్ తెలిపారు. టీవీ సీరియళ్ల పేరిట, ఆఫీసు పనుల కోసమని రోజుకు మూడు నాలుగు గంటలపాటు కూర్చొని ఉండటం రోజుకు ఐదు సిగరెట్లు తాగడానికి సమానమైన దుష్ఫలితాలు ఇస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయన్నారు. ఉప్పు తక్కువగా తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడికి గురికాకపోవడం, వ్యాయామం గుండెజబ్బుల నుంచి రక్షణనిస్తాయని చెప్పారు. 2030 నాటికి - గుండెజబ్బుల విషయంలో కుటుంబ చరిత్ర కూడా ముఖ్యమే. కుటుంబంలో ఎవరైనా యాభై ఏళ్ల కంటే తక్కువ వయసులో గుండెజబ్బుతో మరణించి ఉంటే మిగతా వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. - శరీరం బరువుకు, అధిక కొలెస్ట్రాల్‌కు మధ్య సంబంధం లేదు. బక్క పలుచగా ఉన్న వారూ అధిక కొలెస్ట్రాల్ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. - గత 40 ఏళ్లలో భారతీయులకు గుండెజబ్బులు రావడం నాలుగు రెట్లు పెరిగింది. - 2030 నాటికి దేశంలో సంభవించే మరణాల్లో అత్యధికం గుండెజబ్బుల కారణంగానే ఉంటాయి. - 2030 నాటికి గుండెజబ్బులతో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తారని అంచనా. - రోజుకు కనీసం 45 నిమిషాల నడక ఆయుష్షును 8 నుంచి పదేళ్లు ఎక్కువ చేస్తుంది. -
అందుకే వస్తోంది.. ఆస్తమా..
సాక్షి, హైదరాబాద్ : ఒకప్పుడు బయటి వాతావరణ కాలుష్యం ఆస్తమాకు కారణమని అంతా భావించేవారు. ఇప్పుడీ ముప్పు నేరుగా ఇంట్లోనే తిష్టవేసుక్కూర్చుంది. ఇండోర్ పొల్యూషన్ (దుప్పట్లు, తలదిండ్లు, పర్ఫ్యూమ్లు, మస్కిటోకాయిల్స్, అగరొత్తులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే వాయువులు, దుమ్ముధూళి) ఆస్తమాకు ఎక్కువ కారణమవుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సర్వేలో తేలింది. ఇంటా, బయటా కాలుష్య సమస్య వల్ల పట్టణాల్లో 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం మంది ఆస్తమాతో బాధపడుతుండగా, బాధితుల్లో 10–12 శాతం మంది చిన్నపిల్లలే ఉన్నట్లు సర్వే తేల్చింది. శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఛాతీ వైద్యనిపుణుడు డాక్టర్ విజయ్‌కుమార్ ఆస్తమాకు కారణమవుతున్న అంశాలను వివరించారు. ఇంటా బయటా తంటానే.. ►గ్రేటర్లో 15 ఏళ్ల క్రితం ఉన్న 11 లక్షల వాహనాలు, 2019 నాటికి 55 లక్షలకు చేరాయి. వీటిలో పదిహేనేళ్ల సర్వీసు దాటినవి 10 లక్షలు. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. ►40 వేల వరకు ఉన్న పరిశ్రమలు వదిలే పొగ, వ్యర్థాల వల్ల క్యూబిక్ మీటర్ గాలిలో 130–150 మైక్రోగ్రాముల వరకు వివిధ కాలుష్య స్థాయిలు నమోదవుతున్నాయి. ►సల్పర్డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్‌మోనాక్సైడ్‌తో కూడిన గాలిని పీల్చడం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. ►ఇంట్లో వాడే మస్కిటోకాయిల్స్, పర్ఫ్యూమ్స్, పరుపు, తలదిండ్లలో పేరుకుపోయిన దుమ్ము ఆస్తమా కలిగిస్తున్నాయి. ► పోతపాలు, జంక్‌ఫుడ్, అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాసనాళాలను దెబ్బతీస్తున్నాయి. వ యసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతున్నాయని తేలింది. ►ప్రసవం తర్వాత చాలామంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు పడుతున్నారు. సాధారణ జ్వరానికీ ఖరీదైన యాంటిబయాటిక్స్ వాడుతున్నారు. ఇది పిల్లల్లో ఆస్తమాకు కారణమవుతోంది. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువుపై ప్రభావం చూపుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం – డాక్టర్ పి.సుదర్శన్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఆస్తమాకు బయట ఉండే వాహన, పారిశ్రామిక కాలుష్యం, ధూమపానం వంటి వాటి కంటే ఇండోర్ పొల్యూషన్ (మస్కిటో కాయిల్స్, పర్ఫ్యూమ్స్, అగరొత్తులు, పెట్స్, దుప్పట్లు, దిండ్లు) ఎక్కువ ప్రమాదకరం. ఆస్తమా వల్ల శ్వాసనాళాలు మూసుకుపోయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు, కిడ్నీల పనితీరు మందగిస్తుంది. ఇన్హేలర్తో ఉపశమనం – డాక్టర్ విజయ్‌కుమార్, ఫల్మనాలజిస్ట్, అపోలో ఆస్పత్రి ఇంట్లో ఇన్హేలర్ ఉండాలి. టాబ్లెట్స్, ఇంజక్షన్లు, నెబ్లైజర్తో పోలిస్తే ఇన్హేలర్తోనే ప్రయోజనం ఎక్కువ. వైద్య పరీక్షలతో పని లేకుండా క్లినికల్‌గానూ ఆస్తమాను నిర్ధారించవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే చాలు. ఆస్తమా లక్షణాలివీ.. తరచూ దగ్గడం.. ఆయాసం.. కడుపు ఉబ్బరంగా ఉండటం. వీటికి దూరంగా ఉండాలి.. ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్స్, పారిశ్రామిక, వాహన కాలుష్యం.. -
స్మాగ్ ఫ్రీ .. రింగ్ గిఫ్ట్..
వాతావరణ కాలుష్యం.. ఈ పేరు చెబితేనే ప్రపంచంలోని అనేక దేశాలు వణికిపోతాయి. దీని వల్ల కలిగే అనర్థాలకు అంతే లేదు. మొన్నీమధ్య కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని చైనా రాజధాని బీజింగ్‌లో ప్రజలను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సంఘటన చూసి డచ్‌కు చెందిన డాన్ రూసర్ గార్డె కాలుష్యానికి విరుగుడుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూరిఫయర్ కనుగొన్నాడు. ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కణాలను తన వైపు ఆకర్షించి స్యచ్ఛమైన గాలిలా మార్చే స్మాగ్ ఫ్రీ టవర్‌కు రూసర్ రూపకల్పన చేశాడు. అంతే కాకుండా కాలుష్య కణాలను ఆ టవర్ కంప్రెస్ చేసి డైమండ్ రూపంలో ఉన్న రాళ్లను ఉత ్పత్తి చేస్తుంది. చూడడానికి అందంగా ఉండే ఈ రాళ్ల రూపంలో ఉన్న వస్తువు ఆభరణంగా వాడడానికి పనికొస్తుంది. ఇది ఇయాన్ టెక్నాలజీతో పనిచేస్తుందని గార్డె తెలిపాడు. ఈ టవర్ చుట్టు పక్కల పరిసరాలను 75 శాతం వరకు క్లీన్‌గా ఉంచగ లుగుతుందని గార్డె తెలిపాడు. ఈ టవర్‌ను తొలిసారిగా సెప్టెంబర్‌లో బీజింగ్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్మాగ్ ఫ్రీ టవర్ వాతావరణ కాలుష్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పాడు. హాలండ్‌లో నిర్వహించిన ముందస్తు పరీక్షల్లో స్మాగ్ ఫ్రీ టవర్ మంచి ఫలితాలను ఇచ్చింది. బీజింగ్‌లో అమర్చిన తర్వాత ప్రపంచంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని వాడనున్నారు. -
ఇక పెళ్లిళ్లపై నిఘా నేత్రం
దేశ రాజధాని నగరంలో ప్రాణాంతకంగా పరిణమించిన కాలుష్యాన్ని నివారించేందుకు ఇటీవల 'సరి-బేసి' కార్ల విధానాన్ని తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు అట్టహాసంగా జరుపుకొనే పెళ్లిళ్లపై కన్నేసింది. ఢమాల్, ఢమాల్ అనే టపాసుల పేలుళ్లను, ఢమ ఢమ డప్పు శబ్దాలను, కర్ణభేరి పగిలిపోయేలా వినిపించే మైక్ శబ్దాలను నియంత్రించాలని, అలాగే ఆహార పదార్థాల వృధాను అరికట్టాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. దీనికోసం శబ్దాలను కొలిచే యంత్రాలను సొంత డబ్బులతో కొనుగోలు చేసి అన్ని కళ్యాణ మండపాలలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. పశ్చిమబెంగాల్లో లాగా టపాసులు కాల్చడాన్ని 90 శాతం నియంత్రించాలని, కేవలం లాంఛనంగా కాల్చేందుకే అనుమతించాలని నిశ్చయించింది. పెళ్లిళ్ల సీజన్లో టపాసుల కారణంగా వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. కమిటీ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసేందుకు, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రతి పెళ్లి మండపం వద్ద ఇద్దరు, ముగ్గురు పౌర అధికారులతో నిఘాను ఏర్పాటు చేయాలని పీసీబీ నిర్ణయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయాలను అమలు చేసేందుకు వీలుగా ప్రతి జిల్లా స్థాయిలో నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కమిటీ తీర్మానించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనల మేరకే కాలుష్య నియంత్రణ మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ఢిల్లీ వాసులకు పీడకలే. కంటి మీదకు కునుకు రాదు. టపాసుల పేలుళ్లతో పాటు వాయిద్యాల మోత, హోరెత్తే సంగీతంతో తల వాచిపోతుంది. సీజన్లో రోజుకు దాదాపు 20 వేల చొప్పున పెళ్లిళ్లు జరుగుతాయి. దక్షిణ ఢిల్లీలోని ఛాతర్పూర్, మెహరౌలి, ఎన్‌హెచ్ వన్ వెంటనున్న అలీపూర్ ఎన్‌హెచ్ 24 వెంటనున్న వైశాలి, కౌశాంబి ప్రాంతాలు పెళ్లిళ్లకు పేరెన్నికగన్న ప్రాంతాలు. -
గాలికి కులమేదీ!
జీవన కాలమ్ మనం రాష్ట్రపతులకీ, మంత్రులకీ, నాయకులకీ ఈ వాతావరణాన్ని పొదుపుగా కలుషితం చేసే మినహాయింపులను ఇస్తున్నాం. స్వీడన్లో మహారాజు కొడుకు రైలు కోసం అవతలి ప్లాట్ఫారం మీద నిలబడడం నేను చూశాను. జనవరి ఒకటో తేదీ నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. గాలిలో ప్రపంచంలోకల్లా భయంకరమైన కాలుష్యం ఉన్న కారణాన - ఆ కాలుష్యా నికి కారణమైన వాహనాలను నియంత్రించే చర్య. ఆనాటి నుంచీ బేసి సంఖ్యలో, సరి సంఖ్యలో వాహనాలు రోజు విడిచి రోజు నడుస్తాయి. ఈ ప్రయోగానికి మద్దతుదారులు ఎవరు? చిన్న పిల్లలు. ఇది చాలా మంచి ప్రయత్నం. విజయవంతం కావడం శుభసూచకం. ఇందులో మళ్లీ చిన్న తిరకాసు ఉంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీం కోర్టు జడ్జీలు, స్త్రీలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహ నాలు, ఖైదీలను తీసుకెళ్లే వాహనాలు -ఇలా బోలెడు మంది వీరి వీరి కారణాలకు - వాతావరణాన్ని కాలు ష్యం చేయవచ్చు. అంటే పొదుపుగా కలుషితం చేయడా నికి కల్పించిన రాయితీలు. ఇస్తున్నది రాజకీయ నాయ కులు కనుక - ముందు ముందు వెనుకబడిన వారికీ, వెనుకబడినవారిలో ముందు పడుతున్నవారికీ, వెనుకప డాలనుకుంటున్నవారికీ, మంత్రుల భార్యలకు, చెంచా లకు, నాయకుల ఇంటి సిబ్బందికీ- ఇలా మినహాయిం పులు కొనసాగవచ్చు. ఢిల్లీ శాసనసభలోనే తమకు ఈ మినహాయింపు ఇచ్చి తీరాలని చాలా మంది కుర్చీలతో కొట్టుకునే ఆవేశాలకు గురికావచ్చు. ఇంకా ముందు ముందు శుభ్రమైన ఆక్సిజన్ని నల్లబజారులో ధరకి కొనుక్కునే రోజులు రావచ్చు. డబ్బుకొద్దీ గాలి! మనం రాష్ట్రపతులకీ, మంత్రులకీ, నాయకులకీ ఈ వాతావరణాన్ని పొదుపుగా కలుషితం చేసే మినహా యింపులను ఇస్తున్నాం. జపాన్‌లో - ప్రపంచంలోకల్లా ఎక్కువ కార్లను తయారు చేసే దేశంలో ఒక కంపెనీ మేనేజింగ్ డెరైక్టరు సైకిలు మీద ఆఫీసుకు వెళ్లడం నేను చూశాను. ఇలాంటి ప్రయత్నాలకు అప్పుడే వేళ మించిపో తోంది. మనం పరిశ్రుభమైన నీటిని డబ్బిచ్చి కొనుక్కో వడం ప్రారంభించి చాలా యేళ్లయింది. మన చిన్నత నంలో - ముఖం తెలీని మనిషి ఇంటి తలుపు తట్టితే చల్లని మంచినీరు ఇచ్చేవారని చదువుకున్నాం. ఇంకాస్త ముందు తరంలో చదువుకుంటున్నానని ఏ కుర్రాడ యినా వీధిలోకి వస్తే- అతని చదువు పూర్తయ్యే వరకూ వారంలో ఒక రోజు తిండి పెట్టేవారు. నా దగ్గర ఓ వీడియో ఉంది. అందులో 70 ఏళ్ల తర్వాత పుట్టిన వ్యక్తి, ఎందుకు పుట్టానా? అని వాపోవడం ఉంది. ఈ మాన వుడికి రోజూ స్నానం చేయడమంటే ఏమిటో తెలీదు. శరీరాన్ని తుడుచుకోవడమే తెలుసు (సింథటిక్ బాత్). తమ పూర్వీకులు హాయిగా స్నానాలు చేసేవారని విడ్డూ రంగా చెప్పుకుంటాడట. సుష్టుగా భోజనం తెలీదు. ఆర్గానిక్ ఆహారం తింటున్నాడు కనుక. ఇప్పటి వాతావరణ కాలుష్యం కారణంగా ధృవాల లో 5 శాతం ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ భూమి మీద మూడువంతులు పైగా నీరు ఉంది. అందులో కనీసం సగం ధృవాలలో, మంచు పర్వతాలలో గడ్డకట్టి ఉంది. పర్యావరణాన్ని సమతులంగా ఉంచే ప్రకృతి ఏర్పాట్లలో సహజమైన ఏర్పాటు అది. అక్కడి మంచు - 5 డిగ్రీల వేడికారణంగా భయంకరమైన వేగంతో కరిగిపోతోంది. మానవుడు తట్టుకోలేనంత నీరు మీద పడితే ఏమవు తుంది? మొన్న చెన్నై అతి చిన్న నమూనా. ఇది కేవలం నీటికి సంబంధించిన ఉదాహరణ. నేను ఐక్యరాజ్యసమతి ఆధ్వర్యంలో ఈ భూమిని పరిరక్షించే సపోర్ట్ సిస్టమ్స్ సంస్థ (EOLSS - Encyclpa edia of Life supporting systems) సంపాదకవర్గంలో ఒకడిని. అబుదాబి కేంద్రంగా ఉన్న ఈ సంస్థ 21 విజ్ఞాన సర్వస్వాలను ప్రచురిస్తోంది. అవన్నీ అపూర్వ విజ్ఞాన భాండాగారాలు. ఆ సంపాదకవర్గంలో ఉన్న ప్రొఫెసర్ గంటి ప్రసాదరావుగారు అబూదాబి నుంచి నాకొక ప్రసంగాన్ని పంపారు. 1992 జూన్ 14న రియో డిజని రోలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ నిర్వ హణ సదస్సులో ఓ 12 ఏళ్ల పిల్ల కేవలం ఐదు నిమి షాలు మాట్లాడింది. తమ భవిష్యత్తుని కలుషితం చేసే హక్కు మీకెవరిచ్చారని సదస్సులో ఉన్న ప్రపంచ దేశాల ప్రతినిధుల్ని ఆమె నిలదీసింది. కేవలం ఐదు నిమిషాలు. ఆ పిల్ల మాటలు వింటూంటే నాకు గిర్రున కళ్ల నీళ్లు తిరిగాయి. (https://www.youtube.com/watch?v=SjXIbV0XY90) ఈ కాలమ్ పేరు ‘ప్రపంచాన్ని 5 నిమిషాలు నోరుమూయించిన అమ్మాయి’. నేను స్వచ్ఛ భారత్ రాయబారిని. ఇది నా స్థాయిలో నేను చేయగల కృషి. మన తాతల కాలంలో ఈ అనర్థాలు లేవు. కారణం- వారు పాటించిన జీవన విధానం. ప్రకృతిని దేవతగా వారు భావించారు కనుక. చివరగా - ‘గాలికి కులమేదీ’ అన్నారు సినారె. నిజం. గాలికి కులం లేదు. కానీ ఈనాటి గాలిలో కావాల్సినంత ‘కిలుం’ ఉంది. గొల్లపూడి మారుతీరావు -
ఉండవల్లి నోట్లో ‘మట్టి’!
ఇసుక లారీల స్వైరవిహారంతో గ్రామంలో వాతావరణ కాలుష్యం రోడ్లపై నుంచి వస్తున్న దుమ్ము ధూళితో పంటలకు తీవ్ర నష్టం ఇళ్లల్లోకి వ్యాపించడంతో ప్రజలు అనారోగ్యంపాలు దెబ్బతింటున్న రోడ్లు..ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం..స్థానిక పంచాయతీకి పంగనామం తాడేపల్లి రూరల్ : పచ్చని పంట పొలాలు ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఉండవల్లి గ్రామం నోట పాలకులు ‘మట్టి’ కొడుతున్న వైనం నిత్యకృత్యంగా మారింది. కృష్ణానది ఇసుక రీచ్ నుంచి నిరంతరం గ్రామంలో తిరుగుతున్న లారీలే అందుకు కారణం. ప్రభుత్వం ఆదాయం కోసం ఉండవల్లిలో ఇసుక రీచ్‌కు అనుమతులు మంజూరు చేసింది తప్ప, ఇసుక లోడులతో తిరుగుతున్న లారీల వల్ల తలెత్తే పరిణామాలను మాత్రం ఆలోచించలేదు. రీచ్ నుంచి రోజూ వందల లారీలు అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎడాపెడా ఇసుక పంపిణీ చేస్తున్నాయి. ఈ వందలాది లారీలు గ్రామంలోని పంట పొలాల మధ్య నుంచి, నివాస గృహాల మధ్యగా, కొండవీటి వాగు వంతెన మీదుగా ప్రయాణిస్తూ వాతావరణ కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి.లారీల నుంచి వచ్చే పొగతోపాటు దుమ్ము ధూళి అటు పొలాలు, ఇటు నివాస గృహాల్లోకి వ్యాపిస్తోంది. ఫలితంగా దిగుబడికి సిద్ధంగా ఉన్న పొలాలకు నష్టం వాటిల్లి అన్నదాతలకు కన్నీరు మిగులుతోంది. మరో పక్క చేతికి వచ్చిన పంటలు సైతం దుమ్ము ధూళి వల్ల నాణ్యత తగ్గి రైతులకు ఆశించిన ధర లేక, నష్టాన్ని అందిస్తోంది. దీంతోపాటు పొలాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులు లారీల జోరుకు ప్రాణాలు అరచేత పెట్టుకుని, రోడ్లెక్కాల్సి వస్తోంది. కొందరు లారీ డ్రైవర్లు తక్కువ సమయంలో ఎక్కువ ట్రిప్పులు వేయాలనే లక్ష్యంతో ఇరుకుగా, ట్రాఫిక్‌తో ఉన్న రోడ్లపై కూడా అతి వేగంగా వెళ్లడంతో ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు నానా యాతనలు పడుతున్నారు. ఉండవల్లి సెంటర్ నుంచి ఇసుక రీచ్ వరకు కేవలం సింగిల్ రోడ్డు నిర్మించడంతో రహదారిపై గుంటలు ఏర్పడడం, కొండవీటి వాగు, గుంటూరు చానల్‌పై నిర్మిం చిన వంతెనలు కంపించి పోవడం ఇక్కడ నిత్యకృత్యం. ఇసుక క్వారీ నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తూ కూడా స్థానిక పంచాయతీ కార్యాలయానికి చెందాల్సిన అధికారిక వాటాను మాత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా పంచాయతీకి ఆదాయం తగ్గి గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇది పంచాయతీ నోట్లో మట్టి కొట్టడమేనని సాక్షా త్తూ గ్రామస్తులు అంటున్నారు. అనారోగ్యంపాలు.. ఇదిలా ఉంటే నిరంతరం తిరుగుతున్న లారీల తాకిడితో కొందరు ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు విస్తారంగా ఆవహిస్తున్న దుమ్ము ధూళి వల్ల ఆరోగ్యాలు పాడై, ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల పాలవుతున్నారు. మొత్తంగా ఉండవల్లిలో కొనసాగుతున్న ఇసుక రీచ్ అటు ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయం తెచ్చిపెడుతూ, ఇటు గ్రామస్తులకు, రైతులకు, రోడ్లపై సంచరించే ప్రయాణికుల నోట్లో మట్టి కొడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు తక్షణమే స్పందించి లారీల స్వైర విహారం వల్ల తలెత్తుతున్న ఇబ్బందికర పరిస్థితులను నివారించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రయాణ పద్ధతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
అయోడిన్ కిట్టు..వాడితే ఒట్టు
* రెండేళ్లుగా నిలిచిన అయోడిన్ కిట్ల పంపిణీ * గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో అయోడిన్ లోపం * గుర్తించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం * అవగాహన ర్యాలీలతో సరి ఒంగోలు సెంట్రల్ : అయోడిన్..శరీరానికి అత్యావశ్యకమైన పోషకం. ప్రతి మనిషికి రోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. ప్రకృతి ద్వారా లభించాల్సిన ఈ పోషకం వాతా వరణ కాలుష్యంతో శరీరానికి అందడం లేదు. అయోడిన్ ఉన్న ఉప్పును ఆహారంలో తీసుకుంటే.. ఆ లోపాన్ని భర్తీచేయొచ్చు. కానీ అవగాహన లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పును వాడటం లేదు. ఫలితంగా జిల్లాలోని అధిక శాతం మంది పిల్లల్లో అయోడిన్ లోపం ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఆ పిల్లలు గాయిటర్ అనే గొంతు సంబంధిత వ్యాధికి గురవుతున్నారు. మరికొందరు బుద్ధిమాంద్యులుగా మారుతున్నారు. ప్రచారమే తప్ప..పరీక్షలేవీ.. అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడండి. ఆరోగ్యానికి అయోడిన్ మంచిదంటూ ప్రకటనలు, ర్యాలీలతో ఊదరగొట్టే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు..అయోడిన్ లోపాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైద్య సిబ్బందికి పదే ళ్ల క్రితం నుంచి వైద్యాధికారులు అయోడిన్ పరీక్ష కిట్లు పంపిణీ చేస్తున్నా సిబ్బంది వాటిని వినియోగించడం లేదు. దీంతో ఎలాగూ వాటిని వాడటం లేదని భావించిన అధికారులు రెండేళ్ల నుంచి సరఫరా నిలిపేశారు. చేయాల్సిందిదీ... పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనంలో..ఇళ్లలో వినియోగించే ఉప్పులోని అయోడిన్ శాతాన్ని పరీక్షించి పిల్లల తల్లిదండ్రులకు ఆహార పరంగా సలహాలు ఇవ్వాలి. జిల్లాలో 920 పంచాయతీలుండగా అదే సంఖ్యలో ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్‌సీల్లో అయోడిన్ పరీక్ష కిట్లు ఉంటాయి. గ్రామ స్థాయిలో ఆరోగ్యసేవలందించే ఏఎన్ఎంలకు వీటిని అంది స్తారు. వీరికి ఆశ కార్యకర్తలు కూడా సహకరిస్తారు. డ్వాక్రా సంఘాలను కూడా భాగస్వాములను చేశారు. ప్రతి ఇంట్లో వాడుతున్న ఉప్పు శాతాన్ని గుర్తించడానికి ద్రావకంతో కూడిన కిట్లు అందిస్తున్నారు. ఆ ద్రావకాన్ని ఉప్పులో వేస్తే మారే రంగు ఆధారంగా అయోడిన్ శాతాన్ని గుర్తిస్తారు. ఆ మోతాదులో ఎంత అయోడిన్ అవసరమో ప్రజలకు వైద్య సిబ్బంది సూచించాలి. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు గళ్ల ఉప్పును వాడుతున్నారు. దీని వలన శరీరానికి కావాల్సిన అయోడిన్ లభించడంలేదు. ఈ విషయాలన్నింటిపై అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అయితే అయోడిన్ కిట్లను సిబ్బంది ఏ రోజూ వాడిన దాఖలాలు లేవు. దశాబ్ద కాలం పాటు సరఫరా చేసిన కిట్లు ఉప కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్నా యి. ఫలితంగా కిట్ల సరఫరాను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అయోడిన్ లోపం తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కిట్ల సరఫరా నిలిచింది వాస్తవమే.. కే చంద్రయ్య, డీఎంహెచ్‌వో అయోడిన్ లోపం తెలుసుకునేందుకు గతంలో కిట్లు సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం వాటిని ఇవ్వడం లేదు. అయోడిన్ లోపంపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు మంగళవారం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్, డైరక్టరేట్ హెల్త్ ఇన్చార్జ్ డాక్టర్ గీతా ప్రసాదిని పాల్గొంటారు.