weight 100 grams
-
మనసు గెలిచింది- ఆ వంద గ్రాములు లెక్కే అంటారా?
నవ్వుతూ మాట్లాడకూడదు. నచ్చిన డ్రెస్ అసలే వేసుకోకూడదు. హవ్వ.. అబ్బాయిల్లా ఆ ఆటలు ఏంటి? ఏమ్మా నువ్వైనా నీ బిడ్డకు చెప్పవచ్చు కదా! అసలే తండ్రి లేని పిల్ల... ఇలాంటివి మీకు అవసరమా? సూదుల్లా గుచ్చే ఇరుగు పొరుగు మాటలు లెక్కచేయలేదు– ఆ తల్లీ.. కూతురు తల్లి ఎంతటి ధైర్యశాలో కూతురికి తెలుసు. 32వ ఏటనే భర్తను కోల్పోయినా ఇద్దరు కూతుళ్లను గొప్పగా పెంచింది. ఆడపిల్లలు బలహీనులని భావించక మగాళ్ల గోదాలో రెజ్లర్లుగా దించింది. క్యాన్సర్ బారిన పడ్డా కూతుళ్ల కోసం యముడితో పోరాడి బయటపడింది. అవును... ఆ తల్లిని చూసి పోరాడటం నేర్చుకుంది ఆ కూతురు... వినేశ్ ఫొగట్ డాటరాఫ్ సరళాదేవి.‘పట్టు’ పడితే పతకం మెడలో వాలాల్సిందే. అన్యాయం చేసిన వాళ్ల తాట తీయాల్సిందే. న్యాయపోరాటంలో మొండిగా ముందుకు దూకాల్సిందే. నాన్న లేడని అమ్మను వంకర చూపులు చూసే వాళ్ల తోడేలుతనం ఆమె దృష్టిని దాటి పోలేదు. ఆడవాళ్లకు అదెంత వేదనో స్వయంగా చూసింది. అందుకే తోటి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యామని చెబితే వారికి మద్దతుగా నిలిచింది. కెరీర్‌ను పణంగా పెట్టి రాజధానిలో ఉద్యమానికి ఊపిరిగా మారింది.పాలకుల ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జీవితకాల శ్రమతో సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును కూడా తృణ్రపాయంగా విడిచిపెట్టింది. ఇంత బరితెగింపా అంటూ అజ్ఞానంతో అనరాని మాటలు అనే వాళ్లను చిరునవ్వుతో మరింత చికాకు పెట్టింది. మద్దతుగా నిలిచిన వారికి కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఖేల్ ఖతమే అన్న వాళ్ల చెంప చెళ్లుమనిపించేలా అన్ని సవాళ్లను దాటుకుని మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అంతేనా.. ఇప్పటి వరకు భారత మహిళా రెజ్లర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించింది. స్వర్ణ పతకపోరుకు అర్హత సాధించింది. ఊహించని విధంగా వందగ్రాములు.. కేవలం వందగ్రాముల అదనపు బరువు కారణంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పతకం సాధించకపోతేనేమి.. అందరి హృదయాలలో అభిమానాన్ని సంపాదించింది. వీటన్నిటి ముందు ‘ఆ వంద గ్రాములు‘ లెక్కే అంటారా? (ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్.. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది)-సుష్మారెడ్డి యాళ్లచదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది? -
అన్నవరం ప్రసాదం.. ఇక వంద గ్రాములే!!
రేటు పెంచకుండా పరిమాణంపై వేటు పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తయారీ వ్యయం పెరుగుదలే కారణమంటున్న అధికారులు సత్యదేవుని ప్రసాదం తయారీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రేటు యథాతథంగా ఉంచి ప్రసాదం పరిమాణాన్ని తగ్గించాలని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. సత్యదేవునికి 2013- 14 ఆర్థిక సంవత్సరంలో రూ. 60 కోట్ల మేర ఆదాయం లభించింది. దేవస్థానం పాలక మండలి సమావేశం వివరాలను ఈఓ వేంకటేశ్వర్లు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దేవస్థానంలో వాడే వివిధ దినుసుల ధరలు పెరగడంతో ఏడాదికి రూ. 25 లక్షల మేరకు ఖర్చు పెరిగినట్టు ఆయన వెల్లడించారు. ప్రసాదం తయారీ వ్యయం పెరగడం వల్ల సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్ బరువు తగ్గిస్తున్నట్టు ఈఓ తెలిపారు. ప్రస్తుతం 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ రూ.పది కాగా అదే రేటుకు 100 గ్రాముల ప్రసాదం అందజేయాలని తీర్మానించారన్నారు. అదే విధంగా ప్రస్తుతం 150 గ్రాముల బంగీ ప్రసాదం ప్యాకెట్ ధర రూ. 15 అని, ఇకపై 100 గ్రాముల బంగీ ప్రసాదం రూ.15కు అందజేయాలని పాలకవర్గం తీర్మానించారన్నారు. ఈ తీర్మానాలను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపుతున్నామని, అక్కడ ఆమోదం పొందాక ఈ మార్పు అమలులోకి వస్తుందన్నారు. ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి ధర ఆరు నెలల క్రితం కిలో రూ.292 ఉండగా ప్రస్తుతం రూ.377 అయ్యిందన్నారు. గ్యాస్ బండ ప్రస్తుతం రూ.1,250 నుంచి రూ.1,325 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితంతో పోల్చిచూస్తే దీని ధర కూడా రూ. రెండు వందల వరకూ పెరిగినట్టు ఆయన తెలిపారు. గోధుమ ధర కిలో రూ. 24, చక్కెర కిలో రూ.29కి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ ధరలు కూడా భవిష్యత్తు లో పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రసాదం ప్యాకర్లకు గతంలో ఒక ప్యాకెట్‌కు 35 పైసలు ఇచ్చేవారమని, ప్రస్తుతం అది 50 పైసలకు పెంచుతూ దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదన పంపామన్నారు.