Wildlife Institute of India
-
129 ఏళ్ల తర్వాత కనిపించింది..
డెహ్రాడూన్: అంతరించిపోయిందనుకున్న ఓ పాము 129 ఏళ్ల తర్వాత కనిపించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్టులకు అసోంలో కనిపించి ఆశ్చర్యపర్చింది. 1891లో హెబియస్ పెల్లీ(అసోం కీల్బాక్) పామును బ్రిటీష్ టీ ప్లాంటర్ శామ్యూల్ ఎడ్వర్డ్ పీల్ కు కనిపించింది. ఈ జాతికి చెందిన రెండు మగ పాములను ఆయన సేకరించారు. (వాయుసేనకు 6 రఫెల్ యుద్ధ విమానాలు) ఒకటి కోల్‌కతాలోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, రెండోది లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియానికి తరలించారు. ఆ తర్వాత హెబియస్ పెల్లీ మళ్లీ మనిషి కంట పడలేదు. దాంతో అందరూ అంతరించిపోయిందని భావించారు. 2018 సెప్టెంబర్‌లో శామ్యూల్‌కి కనిపించిన ప్రాంతంలోనే వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టుల కంటికి మళ్లీ ఈ పాము కనిపించింది. వెటర్బేట్ జువాలజీ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఈ విషయాన్ని పోయిన శుక్రవారం ప్రచురించారు. (చైనా కుట్ర : అజిత్ దోవల్ ఆనాడే హెచ్చరించినా..) ‘అప్పట్లో బ్రిటిషర్లు మొదలుపెట్టిన ప్రాంతం నుంచే సాహసయాత్రను ప్రారంభించాం. అడవిలో నేలంతా చిత్తడిగా ఉంది. ఓ చోట యాధృచ్చికంగా నాకు ఈ పాము కనిపించింది. అసోంకి మాత్రమే సొంతమైన ఈ జాతి పామును 129 ఏళ్ల తర్వాత చూడటం ఇదే తొలిసారి. ఆ తర్వాత అదో ఆడపామని తెలుసుకున్నాను.’ అని సైంటిస్టుల బృందంలోని పాముల నిపుణులు అభిజిత్ పేర్కొన్నారు. తమకు కనిపించిన పాము అసోం కీల్బాకా? కాదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు లండన్ నేచురల్ మ్యూజియంలో ఉన్న పాము ఆనవాళ్లతో పోల్చి చూసుకుని నిర్ధారించుకున్నారు. 50 నుంచి 60 సెంటీమీటర్ల వరకూ పెరిగే అసోం కీల్బాక్ పాములు విషపూరితమైనవి కావు. ఈ పాము కనిపించిన ప్రాంతంలో మరింత పరిశోధనలు చేయడం ద్వారా ఇలాంటి వాటిని గుర్తిస్తామని దాస్ పేర్కొన్నారు. -
టైగర్ జిందా హై..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో విడుదల చేశారు. పులులకు ప్రపంచంలోనే అత్యంత భద్రమైన నివాస స్థలంగా భారత్‌లోని అడవులు మారాయని ఆయన తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవమైన సోమవారమే మోదీ ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా–2018’ నివేదికను విడుదల చేస్తూ భారత్‌లో పులుల సంఖ్యను పెంచే ప్రక్రియలో పాలుపంచుకున్న వారందరినీ తాను ప్రశంసిస్తున్నానన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం 2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య 2014కు 2,226కు, 2018కి 2,967కు పెరిగింది. పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు. మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్‌లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు. 2006 నాటి లెక్కలను 2018 లెక్కలతో పోల్చుతూ మోదీ ఈ విషయం చెప్పారు. అదే 2014 లెక్కలను 2018 గణాంకాలతో పోలిస్తే పులుల సంఖ్య నాలుగేళ్లలో 33 శాతం పెరిగింది. దాదాపు మూడు వేల పులులను కలిగిన ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే పులులకు అత్యంత భద్రమైన, పెద్ద నివాస స్థలంగా మారిందని మోదీ పేర్కొన్నారు. కాగా, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, ఎం–స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను సులభంగా లెక్కించగలిగామని డబ్ల్యూఐఐలో పనిచేసే శాస్త్రవేత్త వైవీ.ఝాలా చెప్పారు. సమాచారాన్ని సేకరించడం సులభమైందిగానీ, దానిని విశ్లేషించడం కష్టంగా మారిందని ఆయన తెలిపారు. ‘ఎక్ థా టైగర్’ నుంచి... సల్మాన్ ఖాన్ నటించిన రెండు బాలీవుడ్ చిత్రాల పేర్లను మోదీ ప్రస్తావిస్తూ, పులుల సంఖ్య పెరుగుదలపై చమత్కారంగా మాట్లాడారు. భారత్‌లో పులుల సంరక్షణ ప్రక్రియ ‘ఎక్ థా టైగర్’ (గతంలో ఓ పులి ఉండేది)తో మొదలై, ఇప్పుడు ‘టైగర్ జిందా హై’ (పులి బతికే ఉంది) వరకు చేరుకుందని మోదీ వివరించారు. అయితే ఇది ఇక్కడితో ఆగకూడదనీ, పులుల సంరక్షణను మరింత వేగవంతం, విస్తృతం చేయాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్యన ఆరోగ్యకరమైన సమతుల్యం తీసుకురావడం సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంతోపాటు అడవుల విస్తీర్ణాన్ని కూడా పెంచగలిగిందని మోదీ తెలిపారు. 2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం జంతువుల కోసం కూడా మరిన్ని ఆవాసాలను ఏర్పాటు చేస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లో అధికం దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది. అలాగే మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి. 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు ఉన్నాయి. తెలంగాణలో గత నాలుగేళ్లలో పులుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరిగింది. తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది. ఇవే కాకుండా, మరో ఆరు పులి పిల్లలు కూడా ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది. -
వన్యప్రాణుల గణన పూర్తి
జన్నారం(ఖానాపూర్) : మంచిర్యాల జిల్లాలో జనవరి 22 నుంచి ప్రారంభంనుంచి ప్రారంభమైన వన్యప్రాణుల గణన పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే గణనలో శాఖహార, మాంసహార జంతువులను లెక్కిస్తారు. రెండు విడుతల్లో జిల్లా వ్యాప్తంగా 1లక్ష76 వేల 100 చదరపు కిలోమీటర్లతో పాటు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని 892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123.12 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాలోని అటవీ ప్రాం తంలో వన్యప్రాణుల గణన జరిగింది. మంచి ర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, చె న్నూరు, బెల్లంపల్లి అటవీడివిజన్‌లలో 195 బీట్లలో 400 మంది అటవిశాఖ సిబ్బందితో పాటు వందమంది వరకు కళాశాల విద్యార్థులు, హైదరాబాద్‌లోని ఫారెస్ట్ కళాశాల సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు విడుతలుగా గణన జనవరి 22 నుంచి 24 వరకు మాంసహార జం తువులను 27 నుంచి 29 వరకు శాఖహార జం తువులను లెక్కించారు. ఒక్కో బీట్‌కు ఒక బృం దం చొప్పున నియమించారు.బీట్ పరిధిలో బీట్ అధికారితో పాటు బేస్‌క్యాంపు సిబ్బంది, స్టూడెంట్ను అధికారులకు జత పరిచారు. ఎలా లెక్కించారంటే... జిల్లాలో ఎకలాజికల్ యాప్ ద్వారా వన్యప్రాణుల వివరాలను సేకరించి, క్షేత్రస్థాయి నుంచి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రతిరోజు ఉద యం అడవిలో తిరుగుతూ అడుగుల ద్వారా, అ ధికారులు ఏర్పాటు చేసుకున్న 2 కి.మీ ట్రాన్సెక్ట్ పాయింట్ ద్వారా వన్యప్రాణుల గణన చేపట్టారు. ఈ పాయింట్ పరిధిలో సంచరించే జం తువుల వివరాలను సేకరించి యాప్‌లో అడిగిన విధంగా ఆన్లైన్లో నమోదు చేశారు. వన్యప్రాణుల మల విసర్జన, వెంట్రుకలు, అరుపులు, కాలిముద్రల ఆధారంగా జంతువుల గణన ని ర్వహించారు. నీటిగుంతల వద్ద కాలిముద్రలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అచ్చులను సేకరించి ఆరబెట్టిన అనంతరం వాటి జాతి ఆడ, మగ, వాటి ఎత్తు, బరువు, వయస్సు నిర్దారిస్తారు. జిల్లాలో రెండు చోట్ల పులి అడుగులు జిల్లాలో గణన సందర్భంగా రెండు చోట్ల పులి అడుగులను, ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధి లోని ఖానాపూర్ డివిజన్లోని కోర్ ఏరియా ప్రాంతంలో ఒకచోట పులి అడుగు కనిపించినట్లు, చెన్నూరు డివిజన్ నీల్వాయి ప్రాంతంలో మరో పులి అడుగుతో పాటు అరుపులు కూడ వినిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆసిఫాబాద్ డివిజన్లో రెండు పులులున్నట్లు అధికారులు అడుగుల ద్వారా గుర్తించారు. జిల్లాలో సుమారుగా 20 వరకు చిరుతలున్నట్లు గుర్తించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. జన్నారం డివిజన్లో కానరాని పులి అడుగులు ఇందన్పల్లి, తాళ్లపేట్ రేంజ్, జన్నారం అటవీరేంజ్‌లలో ఆరుచోట్ల చిరుతపులి అడుగులు, ఆనవాలు కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎలుగుబంట్లు, రేసుకుక్కలు, తోడేళ్ల స ంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు. శాఖహార జం తువులు అడవి దున్నలు, నీలుగాయి, చుక్కల దుప్పులు, సాంబర్, మెకాలు, గడ్డి జింకలు, కొండగొర్రెలు, అడవి పిల్లులు, కుందేళ్లు తదితర వాటిని అధిక సంఖ్యలో చూసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జంతువుల సంఖ్య మాత్రం చెప్పలేకపోతున్నారు. లెక్క ఎప్పుడు తేలుతుంది? అధికారులు చేసిన గణనలో లెక్క ఎప్పుడు తే లుతుందనేది స్పష్టంగా చెప్పడం లేదు. యాప్‌ద్వారా ఆన్లైన్లో నమోదైన వన్యప్రాణుల వివరాలు డివిజన్ వారిగా డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపుతారు. ప్రస్తుతం డివిజన్లోని వివిధ బీట్ల వారిగా వివరాలను సేకరిస్తున్నారు. ఫిబ్రవరి రెండోవారంలో ఇన్స్టిట్యూట్కు పంపిస్తే అక్కడ ఏప్రాంతంలో ఏ జం తువులు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తిస్తారు. పూర్తి వివరాలు మార్చి చివరివారం లేదా ఏప్రిల్‌లో వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. వణ్యప్రాణుల గణన విజయవంతంగా పూర్తి చేశాం. అటవీ అధికారులతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు పాల్గొన్నారు. ప్రత్యేక మోబైల్‌యాప్ లో నమోదు చేయడం వల్ల ఇప్పుడు పూర్తి సంఖ్య చెప్పలేకపోతున్నాం. ప్రస్తుతం డివిజన్ల వారిగా వివరాలను సేకరించి డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపిస్తాం. – రామలింగం, జిల్లా అటవీసంరక్షణ అధికారి -
చిరుతల సంఖ్య తేలింది
చిరుతపులుల జనసంఖ్యపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. స్వాతంత్ర్యానంతరం వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా చేపట్టిన చిరుత పులుల జనగణనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం భారత్‌లో 12 వేల నుంచి 14 వేల చిరుతపులులు ఉన్నాయని, పులుల సంఖ్య (7,910)తో పోల్చిచూస్తే ఈ సంఖ్య మెరుగైనదని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్, చిరుతపులుల జనగణన ముఖ్యఅధికారి యదువేంద్రదేవ్ ఝా చెప్పారు. డెహ్రాడైన్లో జరిగిన వార్షిక పరిశోధనా సదస్సులో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చిరుతల సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడక్కడా నైట్‌విజన్ కెమెరాలను ఏర్పాటుచేసి ఫోటోలు తీశామని, ఇతర ప్రాంతాల్లోనూ వివిధ మార్గాల ద్వారా ఫొటోలను సేకరించామని, అన్నింటిని క్రోడీకరించిన పిదప దేశంలో చిరుత పులుల రమారమి జనాభాను అంచనావేయగలిగామని ఝా చెప్పారు. పులుల జనగణనను కూడా ఇవే పద్దతుల ద్వారా సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా, ఈశాన్య భారతంలో ఇంకా సర్వే చేపట్టలేదని, ఆ వివరాలను కూడా కూడితే చిరుతపులుల జనసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 343 చిరుతపులులు ఉండగా మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 1,817, కర్ణాటకలో 1,129, మహారాష్ట్రలో 905, ఛత్తీస్‌గఢ్ లో 846, తమిళనాడులో 815, ఉత్తరాఖండ్ లో 703, హిమాలయ ప్రాంతంలో 300 నుంచి 400 చిరుతపులులు జీవిస్తున్నాయి.