129 ఏళ్ల తర్వాత కనిపించింది.. | WII redicovers extincted snake after 129 years | Sakshi
Sakshi News home page

129 ఏళ్ల తర్వాత కనిపించిన కీల్​బాక్

Published Mon, Jun 29 2020 4:51 PM | Last Updated on Mon, Jun 29 2020 7:46 PM

WII redicovers extincted snake after 129 years - Sakshi

డెహ్రాడూన్​: అంతరించిపోయిందనుకున్న ఓ పాము 129 ఏళ్ల తర్వాత కనిపించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియా సైంటిస్టులకు అసోంలో కనిపించి ఆశ్చర్యపర్చింది. 1891లో హెబియస్ పెల్లీ(అసోం కీల్​బాక్) పామును బ్రిటీష్ టీ ప్లాంటర్ శామ్యూల్​ ఎడ్వర్డ్ పీల్ కు కనిపించింది. ఈ జాతికి చెందిన రెండు మగ పాములను ఆయన సేకరించారు. (వాయుసేన‌కు 6 రఫెల్‌ యుద్ధ విమానాలు)

ఒకటి కోల్​కతాలోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, రెండోది లండన్​లోని నేచురల్​ హిస్టరీ మ్యూజియానికి తరలించారు. ఆ తర్వాత హెబియస్ పెల్లీ మళ్లీ మనిషి కంట పడలేదు. దాంతో అందరూ అంతరించిపోయిందని భావించారు. 2018 సెప్టెంబర్​లో శామ్యూల్​కి కనిపించిన ప్రాంతంలోనే వైల్డ్​ లైఫ్ ఇనిస్టిట్యూట్​ సైంటిస్టుల కంటికి మళ్లీ ఈ పాము కనిపించింది. వెటర్బేట్​ జువాలజీ అనే అంతర్జాతీయ జర్నల్​లో ఈ విషయాన్ని పోయిన శుక్రవారం ప్రచురించారు. (చైనా కుట్ర : అజిత్‌ దోవల్‌ ఆనాడే హెచ్చరించినా..)

‘అప్పట్లో బ్రిటిషర్లు మొదలుపెట్టిన ప్రాంతం నుంచే సాహసయాత్రను ప్రారంభించాం. అడవిలో నేలంతా చిత్తడిగా ఉంది. ఓ చోట యాధృచ్చికంగా నాకు ఈ పాము కనిపించింది. అసోంకి మాత్రమే సొంతమైన ఈ జాతి పామును 129 ఏళ్ల తర్వాత చూడటం ఇదే తొలిసారి. ఆ తర్వాత అదో ఆడపామని తెలుసుకున్నాను.’ అని సైంటిస్టుల బృందంలోని పాముల నిపుణులు అభిజిత్ పేర్కొన్నారు.

తమకు కనిపించిన పాము అసోం కీల్​బాకా? కాదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు లండన్ నేచురల్ మ్యూజియంలో ఉన్న పాము ఆనవాళ్లతో పోల్చి చూసుకుని నిర్ధారించుకున్నారు. 50 నుంచి 60 సెంటీమీటర్ల వరకూ పెరిగే అసోం కీల్​బాక్​ పాములు విషపూరితమైనవి కావు. ఈ పాము కనిపించిన ప్రాంతంలో మరింత పరిశోధనలు చేయడం ద్వారా ఇలాంటి వాటిని గుర్తిస్తామని దాస్​ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement