Women college
-
కదం తొక్కిన ఆశవర్కర్లు
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు సోమవారం ఇక్కడి కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా వేలసంఖ్యలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు తరలిరావడంతో ఉమెన్స్ కళాశాల చౌరస్తా జనసంద్రాన్ని తలపించింది. ఎక్కడికక్కడే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాదర్‌ఘాట్ నుంచి కోఠి బ్యాంక్‌స్ట్రీట్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వేలాదిమంది చౌరస్తాలో బైఠాయించడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఆశాలు, ఏఎన్‌ఎంలతోపాటు వైద్యశాఖలో పనిచేస్తున్న వివి ధ కేడర్ల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. -
పీజీ చేరికల్లో ఆమెదే హవా
ఉస్మానియా యూనివర్సిటీ: ఫలానా ఫలితాల్లో అమ్మాయిలే టాప్ అనేది అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు చదువుకునేవారిలోనూ వారిదే పైచేయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులోనూ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువట. పీజీలో 65 శాతం మంది అమ్మాయిలే అడ్మిషన్లు తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని అధికారులే వెల్లడిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పురుషుల సంఖ్యను దాటిపోయింది. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్‌డీలో కూడా దూసుకుపోతున్నారు. డిగ్రీ, పీజీలతో పాటు ఇంజనీరింగ్, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, దూరవిద్య కేంద్రం కోర్సుల్లో పురుషులకు సమానంగా అమ్మాయిలు చదువుతున్నారని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.కిషన్ తెలిపారు. ఓయూ పరిధిలో మొత్తం 728 కాలేజీల్లో మహిళలకు ప్రత్యేకంగా 110 కాలేజీలున్నాయి. మిగతా కాలేజీలన్ని కో–ఎడ్యుకేషన్లే. ఒక్క కోఠి మహిళా కాలేజీలోనే 4,500 మంది అమ్మాయిలు చదువుతున్నట్లు అధికారులు వివరించారు. క్యాంపస్‌లో పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్‌తో పాటు మరో ఐదు హాస్టళ్లు, మహిళా కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు రెండు హాస్టల్స్‌ను ఏర్పాటు చేశారు. మహిళా వర్సిటీ అవసరం ►ప్రతి ఏటా ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరుగుతోంది. కానీ వారికి ప్రత్యేకమైన వర్సిటీ ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం పద్మావతి మహిళా వర్సిటీ ఏపీకి వెళ్లగా కోఠి మహిళా కాలేజీలో వర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ఇంత వరకు దాని ఊసే లేదు. పెరుగుతున్న మహిళల సంఖ్యకు అనుగుణంగా వివిధ కోర్సుల్లో సీట్లు పెరగనందున వందలాది మంది విద్యార్థినులు ఇంటికి పరిమితమవుతున్నారు. ►ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరగడానికి కారణాలు.. ►నేటి తరం తల్లిదండ్రుల ఆలోచనలో మార్పుతో పాటు భద్రత పెరగడం, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదల, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడం. ►ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా ఉపకార వేతనాలు, హాస్టల్ వసతి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాల పెరుగుదల. చదువుతో ఉద్యోగంతో పాటు జీవన విధానంలో మార్పు వస్తుందని మహిళలు భావించడం. ►తల్లిదండ్రులు అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా సమానంగా చదివిస్తున్నారు. వీరిలో ఆర్థిక స్తోమత బాగా ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్, ఇంజనీరు తదితర వృత్తి విద్యా కోర్సులను చదివిస్తుండగా.. మధ్య తరగతి, సామాన్య కుటుంబాల వారు పిల్లలను డిగ్రీ, పీజీ కోర్సులను చదివిస్తున్నారు. ►గతంలో పురుషులు మాత్రమే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు పొందేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఆస్థాయి ఉద్యోగాలు అందుకుని రాణిస్తున్నారు. -
ఇంజినీరింగ్ కళాశాలలో దుండగుల అరాచకం
తూర్పుగోదావరి, రాజానగరం: తూర్పు గానుగూడెంలోని ఓ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థినుల హాస్టల్లోకి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి, అరాచకం సృష్టించారు. దీనిపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాల ప్రహరీపై ఇనుప ముళ్ల కంచె వేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వాచ్మన్లను తొలగించి, కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఇందుకు కళాశాల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. తమ డిమాండ్ల అమలుకు రెండు రోజుల వ్యవధి ఇచ్చారు. లేకుంటే తిరిగి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. విద్యార్థినులుండే హాస్టల్లోకి గుర్తు తెలియని ఇద్దరు యువకులు ప్రవేశించి, విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో ఒక విద్యార్థిని బయటకు వచ్చి కేకలు వేయడం, ఇతర గదుల్లో ఉన్న విద్యార్థినులంతా బయటకురావడంతో దుండగులు పరారయ్యారు. అయితే ఈ సంఘటనలో వాచ్‌మన్ తమను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు అక్కడకు చేరుకుని, సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యార్థినులు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేయగా, చివరకు కళాశాల యాజమాన్యం తరఫున ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల హాస్టల్లోకి ఆదివారం రాత్రి ఒక దొంగ ప్రవేశించి, బెదిరించాడని, ఇతర విద్యార్థినులు రావడంతో పారిపోయాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థినుల డిమాండ్ మేరకు ప్రహరీపై ఇనుప కంచె వేయడానికి, సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేయడానికి, కొత్త వాచ్మన్లను నియమించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
స్టాన్లీ కళాశాల 6వ వార్షికోత్సవం