Women politicians
-
మహిళా నేతలు మరకలు
-
ధిక్కరించిన ధీరవనితలు!
పార్లమెంట్‌కు ఎన్నికవడమంటే మాటలా.. అంగబలం, అర్థబలం కనీస అర్హత. లేదంటే పెద్దనాయకుల ఆశీర్వాదం, అండ అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎన్నికల రణంలోకి అడుగుపెట్టిన ఈ సామాన్య మహిళలకు అడుగడుగునా వేధింపులు, దాడులు, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే తమను అవేవీ అడ్డుకోలేవని రుజువు చేస్తూ ఆకాశమంత విజయాల్ని అందుకున్న నారీమణులకు భారత చట్టసభ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీరి విజయం సాధించిన వైనం గొప్పది. చారిత్రకమైంది. బ్యాంకు ఉద్యోగి కావాలనుకుని.. చంద్రాణి ముర్ము (ఒడిశా, బీజేడీ) ఈనెల 16వ తేదీన 26వ బర్త్‌డే జరుపుకోనున్న ఒడిశాకు చెందిన చంద్రాణి ముర్ము 17వ లోక్‌సభలో పిన్నవయస్కురాలైన సభ్యురాలు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతోన్న చంద్రాణికి అనూహ్యంగా కియోంజా లోక్‌సభ టికెట్ వచ్చింది. విజయం అంత తేలికగా వరించలేదామెను. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫొటోలు ఆమెను మానసిక వేదనకు గురి చేశాయి. ‘నేనొక సాధారణ మహిళను. నన్ను నిజంగా జనం ఆమోదిస్తారా అని చాలా సంకోచించాను. కానీ, ప్రజలకు నచ్చిన గుణమేదో నన్ను మున్ముందుకు సాగేలా చేసింది’అంటూ ఎన్నికల్లోకి అడుగుపెట్టిన క్షణాలను గుర్తుచేసుకున్నారు చంద్రాణి. ఈమె తాత హరిహర్ సోరెన్ గతంలో కాంగ్రెస్ ఎంపీ. మార్క్సిస్టుల కోటలో పాగా వేశారు రమ్యా హరిదాస్ (కేరళ, కాంగ్రెస్) విద్య, ఆరోగ్యంలాంటి ఎన్నో రంగాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటోన్న కేరళ నుంచి 17వ లోక్‌సభకు ఎన్నికైన ఏకైక సభ్యురాలు రమ్యా హరిదాస్(32). సంగీతంలో డిగ్రీ చేసిన రమ్య సామాజిక స్పృహ,జానపద గానంతో ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. ఐదు దశాబ్దాల తరువాత మార్క్సిస్టుల కంచుకోటలో పాగా వేశారు. రెండుసార్లు ఎంపీ అయిన పీకే బిజూని 1.58 లక్షల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఈమె తల్లిదండ్రులు నిరుపేదలు. ఈమెలోని ప్రతిభను గుర్తించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మిగతా వారిని కాదని టికెట్ ఇచ్చారు. దీంతో స్థానిక నేతల నుంచి సహాయనిరాకరణ ఎదురైంది. కమ్యూనిస్టులు బురదచల్లే యత్నం చేశారు. రాళ్లతో దాడి చేయించారు. అయినా, తట్టుకుని నిలబడి గెలుపు సాధించారు. జానపద గీతంతో జనం మనసు గెలిచారు ప్రమీలా బిసోయీ (ఒడిశా, బీజేడీ) 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరిమళించిన మరో మహిళా కుసుమం ప్రమీలా బిసోయీ! ఐసీడీఎస్ హెల్పర్‌గా ఉన్న ప్రమీలకు ఎంపీ టికెట్ ఇస్తామంటూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆహ్వానించినా చార్జీలకు డబ్బుల్లేక తిరస్కరించారు. ఇది తెలిసిన సీఎం స్వయంగా కారు పంపి ప్రమీలను భువనేశ్వర్‌కు రప్పించారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రమీల ‘రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు’అన్నారు. భారీ ఉపన్యాసాలకు బదులు తనకు తెలిసిన విద్య జానపదగీతాలను ఆలపించి ప్రజల మనసులను గెలిచారు. నిరుపేదల వలసలను నివారించేందుకు తమ ప్రాంతంలో చిన్న పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానంటున్నారీమె. నా విజయం అందరికీ స్ఫూర్తి నుస్రత్ జహా (పశ్చిమబెంగాల్, టీఎంసీ) పశ్చిమబెంగాల్ ఉత్తర పరగణా జిల్లాలోని బాసిర్ హాట్ నుంచి టీఎంసీ తరఫున పోటీకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు నటి నుస్రత్ జహా. పేద పిల్లల షెల్టర్ హోంల కోసం ఎన్జీవోతో కలిసి పనిచేశారు. ‘నేను సొంత ఇల్లు కొనుక్కోవడానికి ముందు పిల్లల కోసం షెల్టర్ హోం కట్టిస్తా’అని ప్రకటించారు నుస్రత్. పాశ్చాత్య దుస్తుల్లో పార్లమెంట్ ఎదుట ఆమె నిలబడి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను రాజకీయ విరోధులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినా ఆమె జంకలేదు. ‘నేను ఎవరిని అనేది ధరించిన దుస్తులను బట్టి తెలియదు. నాపైన వచ్చిన తప్పుడు ప్రచారాలను పక్కన పెట్టి నేను విజయం సాధించాను. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచాను’అంటున్నారు నుస్రత్. హరియాణా నుంచి ఏకైక మహిళ సునితా దుగ్గల్ (హరియాణా, బీజేపీ) పురుషాధిపత్యానికి మారుపేరుగా నిలిచే ఖాప్ పంచాయితీ పునాదులున్న హరియాణా నుంచి ఒక మహిళ చట్టసభలకు ఎన్నికవడం నిజంగా విశేషమే. హరియాణా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన ఏకైక మహిళ సునితా దుగ్గల్. ఎంపీగా ఎన్నికవడానికి ఆమె ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి రావడం వల్ల సునితా దుగ్గల్ వాటిని ఎదుర్కోగలిగారు. మాజీ రెవెన్యూ అధికారి అయిన సునితా 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దేశంలోనే స్త్రీ, పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంతో హరియాణాలో లింగ నిష్పత్తి చాలా వరకు మెరుగైందని తెలిపారు దుగ్గల్. -
అసెంబ్లీ బరిలో ఆమె..!
నిర్మల్: రాష్ట్రంలో జనాభాపరంగా అధిక స్త్రీ, పురుష నిష్పత్తి కలిగిన జిల్లాగా నిర్మల్‌కు పేరుంది. ప్రతీ వేయిమంది పురుషులకు 1046మంది మహిళలున్నారు ఇక్కడ. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7,09,418 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 3,46,721మంది ఉండగా, స్త్రీల సంఖ్య 3,62,697. ఈ లెక్కన పురుషులతో పోల్చితే 15,976 స్త్రీలు అధికంగా ఉన్నారు. ఇలా స్త్రీ శక్తి ఎక్కువగా ఉన్న జిల్లాలో రాజకీయంగా మాత్రం మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఖానాపూర్ మినహాయిస్తే ముథోల్ నియోజకవర్గంలో ఒక్కసారి పోటీ చేయగా, నిర్మల్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా పోటీ చేయలేదు. ఖానాపూర్‌లో ప్రస్తుతం నాలుగోసారి మహిళ అభ్యర్థి పోటీ పడుతుండగా, నిర్మల్‌లో మాత్రం తొలిసారిగా మహిళలు బరిలో నిలిచారు. ఓట్లలోనూ అధిక్యమే... జిల్లాలో జనాభా పరంగా అధికంగా ఉన్న మహిళలు ఓటరు జాబితాలోనూ సత్తాచాటారు. జిల్లా లో మొత్తం 6,09,362మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 2,95,855 మంది మాత్రమే. మహిళ ఓటర్లు ఏకంగా 3,13,436మంది ఉన్నా రు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అత్యధికం గా నిర్మల్ నియోజకవర్గంలో 1,10,900మంది ఉన్నారు. ముథోల్‌లో 1,08,982 ఉండగా అత్యల్పంగా ఖానాపూర్‌లో 93,554మంది మహిళ ఓట ర్లు ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళఓటర్లే అధికంగా ఉన్నారు. తారుమారు చేయగల శక్తి... మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుఓటములను ఖరారు చేసే శక్తి మహిళల చేతిలోనే ఉంది. ఏ పార్టీ గెలువాలన్న, ఏ అభ్యర్థి నిలువాల న్న మహిళల మద్దతు తప్పనిసరి. ఎన్నికల్లో అభ్యర్థుల జాతకాలను తారుమారు చేయగల శక్తి మí ßæళలకు ఉంది. 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 1,51,977మంది అక్షరాస్యులున్నారు. జనాభా పరంగా అధికంగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో మాత్రం 47.14శాతంతో వెనుకంజలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే మహిళ సంఖ్య అధికంగా ఉంది. ఇందులో బీడీ కార్మికులు వ్యవసాయ కార్మికులు, ఉపాధి పనులు చేసేవారు, స్వయం ఉపాధి పొందే మహిళలే ఎక్కువ ఉన్నారు. నేతల తలరాతను ఈ వర్గాలే మారుస్తున్నాయి. ఈ క్రమం లోనే నాయకులు మహిళ సంఘాలపైన ఆధారపడుతున్నారు. తొలిసారి బరిలోకి... నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో తొలిసారిగా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో మహిళలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 1952లో నిర్మల్ ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 66ఏళ్లలో 15 ఎన్నికలు జరిగాయి. ఇన్నేళ్లలో ఒకసారి కూడా ఇక్కడ మహిళలు పోటీలో నిలువలేదు. ఈ సారి మాత్రం నిర్మల్‌లో మహిళ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి ప్రముఖ వైద్యురాలు, ది వంగత డిప్యూటీ స్పీకర్ అయిండ్ల భీంరెడ్డి కుమారై సువర్ణారెడ్డి అభ్యర్థిగా నిలిచారు. బహుజన లెఫ్ట్ఫంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థిగా అలివేలు మంగ బరిలో ఉన్నారు. ఇక ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు డా క్టర్ పడకంటి రమాదేవి రెండోసారి పోటీ పడుతున్నారు. గత 2014 ఎన్నికల్లో ఆమె రెండోస్థానంలో నిలిచారు. ఈ సారి గెలుపుకోసం శ్రమిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా సురేఖరాథోడ్ తొలిసారిగా పోటీలో నిలిచారు. ఖానాపూర్‌లో నాలుగోసారి... ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎస్టీ నియోజకవర్గమైన ఖానాపూర్‌లో మహిళల ప్రాతినిధ్యం చెప్పుకోతగ్గట్లుగా ఉంది. ఈ ఎన్నికలను కలుపుకోని నాలుగోసారి మహిళ అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. 2008లో అప్పటి ఖానాపూర్ ఎమ్మెల్యే గోవింద్‌నాయక్ తెలంగాణ ఉద్యమంలో భాగం గా తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సతీమణి రాథోడ్ సుమన్‌బాయి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మేస్రం నాగోరావుపై గెలుపొంది, నియోజకవ ర్గం నుంచి తొలి మహిళ ఎమ్మెల్యేగా చరిత్రకెక్కా రు. అనంతరం 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమె కాంగ్రెస్ అభ్యర్థి హరినాయక్‌పై గెలుపొందారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అజ్మీరా రేఖానాయక్ బరిలో నిలిచారు. టీడీపీ నుంచి రితీష్ రాథోడ్ పోటీ చేశారు. ఇందులో రేఖానాయక్ 38,511 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఖానాపూర్ నుంచి తమ అభ్యర్థిగా రేఖానాయకే అవకాశం ఇచ్చారు. అలాగే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహుల్లోనూ మహిళలు ఉన్నారు. మహిళల ఓట్లను నమ్ముకుని... జిల్లాలో తొలిసారిగా అధిక సంఖ్యలో మహిళ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా దాదాపు తమ మహిళల ఓట్లను నమ్ముకునే ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఒక్కసారి మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ ప్రచారంలో అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే మహిళల సమస్యలపైన పోరాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మహిళలు, యువకులు, విద్యావంతులు సహకరిస్తే తమ గెలుపు సాధ్యమేనన్న ధీమాతో మహిళ అభ్యర్థులు ఉన్నారు. ఈనేపథ్యంలో జనాభాలో, ఓటరు జాబితాలో అధిపత్యం చాటుతున్న మహిళల తీర్పు ఎలా ఉంటుందోనని పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. -
నారీ.. సారీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) టికెట్ల కేటాయింపులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళలకు మొండిచేయి చూపింది. కనీసం ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకుండా నిరాశ మిగిల్చింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికారి పార్టీ ఒక మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించగా.. ఈసారి ఆ అభ్యర్థిత్వానికి కూడా కత్తెర పెట్టింది. రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆమెపై టీడీపీ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ విజయం సాధించారు. అనంతరం రాజకీయ సమీకరణలతో ప్రకాశ్‌గౌడ్‌ను టీఆర్ఎస్ అక్కున చేర్చుకుంది. తాజా ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్టును ఖరారు చేసింది. దీంతో స్వర్ణలత ఆశలపై నీళ్లుజల్లినట్లయింది. టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ, సిట్టింగ్ శాసనసభ్యుడు కావడంతో ప్రకాశ్‌ను అదృష్టం వరించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఇందులో ఇప్పటివరకు వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి మినహా మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. వస్తే.. గిస్తే.. మహిళా కోటాలో ఎవరికైనా టికెట్టు ఇవ్వాలని గులాబీ అధినాయకత్వం భావిస్తే కేవలం పెండింగ్ సీట్లలోనే ఇవ్వాల్సివుంటుంది. వికారాబాద్, మేడ్చల్ నియోజకవర్గాల్లో అతివలెవరూ టికెట్టును ఆశించడం లేదు. కేవలం మల్కాజిగిరిలో మాత్రం అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి బరిలో దిగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి ఈ సారి టికెట్టు ఇవ్వకపోవడంతో ఆయన స్థానంలో విజయశాంతిని సర్దుబాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ స్థానం నుంచి పోటీకి గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్థానికుడు కావడం.. గ్రేటర్ అధ్యక్ష హోదాలో టికెట్టు ఖరారు చేయాలని మైనంపల్లి కోరుతుండడంతో అధిష్టానం ఈ సీటుపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. మహేశ్వరం సీటు కోసం పట్టుబట్టిన తీగల అనితారెడ్డి తన మామ, సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి టికెట్టు ఖరారు కావడంతో మిన్నకుండిపోయారు. కాంగ్రెస్‌లో చెల్లెమ్మనే దిక్కు! మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రమే కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. మహిళా కోటాలో కూడా ఆమెకే టికెట్టు ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2009 వరకు చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆమె.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కుమారుడు కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్టు కోసం సిట్టింగ్(మహేశ్వరం) స్థానాన్ని త్యజించారు. ఈ సారి మాత్రం మహేశ్వరం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే మహిళ కూడా సబిత ఒక్కరే అయ్యే ఛాన్స్ ఉంది. రాజేంద్రనగర్ సీటుపై గంపెడాశ పెట్టుకున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి.. తన పేరును పరిశీలించాలని, స్థానికేతరులకు టికెట్టు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. కమలంలో సుమతి! భారతీయ జనతా పార్టీలోనూ కేవలం ఒకరిద్దరు ఆశావహులు మాత్రమే ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉప్పరిగూడ మాజీ సర్పంచ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి సుమతీ అర్జున్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. మహిళా కోటాలో తమకు సీటు కేటాయించాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. ఇదే పార్టీ తరఫున మహేశ్వరం నుంచి రాధ ధీరజ్‌రెడ్డి కూడా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అమృతాసాగర్ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీచేయడానికి పావులు కదుపుతున్నారు. కాగా, పార్టీకి ఒకరిద్దరు తప్ప ఆశావహులు కూడా లేకపోవడంతో మహిళల ప్రాతినిథ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకుండా పోయింది. -
వాళ్లది ఆరాటం.. నాది పోరాటం
పురుషుడిలో దమ్ము, ధైర్యం లేనప్పుడల్లా చేసేదొక్కటే. స్త్రీని కించపరచడం. స్త్రీ సామర్థ్యాన్ని శంకించడం. స్త్రీని అణచివేయడం. ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉన్న మగాడు ఇలాంటివేమీ చెయ్యడు. అవి లేనివాళ్లకు ఉండేది ఒక్కటే.. రాజకీయ ఆరాటం! అవన్నీ ఉన్న మహిళది ప్రజలకోసం పోరాటం. మహిళలు చొరవగా, ధైర్యంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే కచ్చితంగా పురుషులకంటే బాగా రాణించగలుగుతారు. మహిళలకు రాజకీయాల్లో సక్సెస్ ఆలస్యంగా రావచ్చు. కానీ ఒక్కసారి సక్సెస్ వచ్చాక ప్రజలే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. మహిళలకు పవర్ ఇవ్వాలి అంటారంతా! మగవాళ్లు ఇస్తే స్త్రీలు పుచ్చుకోవడం ఏంటి? అలా అయితే మహిళలు సెకండ్ సిటిజన్స్ అన్నట్టే కదా! జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నారు. అంటే సగ భాగం. కానీ, అన్నిచోట్లా దాదాపు నిర్ణయాధికారాలు మగవాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అవి మన చేతుల్లోకి ఎలా రావాలి?! మనం అవకాశాల కోసం పోరాడుతూనే ఉన్నాం. పోరాడాలి. అయితే, ఒకరిస్తే మనం తీసుకోవడం ఏంటి అనో, సెకండ్ సిటిజన్స్ అనో భీష్మించుకుని ఉంటే ఆ నిర్ణయాధికారం మన చేతుల్లోకి ఎప్పటికీ రాదు. అధికారం తీసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే.. మనకు నిర్ణయాధికారం వచ్చేవరకు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అనేది అమలయితే సెకండ్ సిటిజన్ అనే సమస్యే ఉండదు. రాజకీయాలు ఎంతో తలనొప్పి వ్యవహారం అంటారు. ‘అబ్బ.. ఈ రాజకీయాలు వద్దు’ అని ఇన్నేళ్లలోనూ మీరు అనుకున్న సందర్భాలు ఉన్నాయా? రాజకీయాలు నిజంగానే చాలా తలనొప్పి వ్యవహారం. కానీ, అందరూ తలనొప్పి తలనొప్పి అనుకుంటూ ఉంటే ఈ రాజకీయాలు ఎప్పటికీ ప్రక్షాళన కావు. ఆడవాళ్లు రాజకీయాల్లో ఎదుగుతున్నారు, చురుగ్గా ఉన్నారు అంటే మగవాళ్లు తట్టుకోలేరు. నేరుగా ఎదుర్కోలే ఆమె క్యారెక్టర్ని చెడుగా చిత్రించడం, నిందలు వేయడం, ఎలా కిందకు లాగేయాలా అని మిగతా అందరూ గ్రూప్‌గా చేరి తొక్కేయడానికి ప్రయత్నించడం చేస్తుంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. నా విషయమే చూడండి.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నన్ను గొప్ప లీడర్‌గా చూశారు. కానీ, వైసీపీలోకి వచ్చాక అప్పుడు గొప్పగా పొగిడిన వాళ్లే ఇప్పుడు ఎన్ని నిందలు వేస్తున్నారో, అణచివేయాలను కుంటున్నారో మీరే చూస్తున్నారుగా. ఒక మహిళగా నేను ఎదుర్కొన్న పీక్ సమస్య ఏంటంటే.. కాల్‌మనీ మాఫియాలో చిక్కుకుని మహిళల జీవితాలు నాశనమైపోతున్నాయని ఒక మహిళగా బాధపడి వారికి న్యాయం చేయాలని అసెంబ్లీలో పోరాటం చేస్తే, నా మీద లేనిపోని నిందలు వేశారు. ఏడాది పాటు రూల్స్‌కి విరుద్ధంగా సస్పెండ్ చేశారు. అప్పుడనిపించింది.. ‘ఛ.. ఏంటీ రాజకీయాలు..’ అని! నాకు ఎవరూ సపోర్ట్ లేరనే ఇలా చేశారు. అదే నాది కనుక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయితే ఇలా చేసేవారా?! అసెంబ్లీ రికార్డ్స్ మార్ఫింగ్ చేసి మరీ ఇంత నీచానికి ఒడిగట్టారు. ధైర్యంగా ఎదుర్కొనే నా విషయంలోనే ఇలా జరిగితే మిగతా మహిళల పరిస్థితి ఏంటి? సస్పెండ్ చేసినా నేను వెనకడుగు వేయలేదు. హైకోర్టు దాకా ఈ సమస్యను తీసుకెళ్లాను. మగవారికి చదువు నేర్పించవచ్చు కానీ, వారికి మహిళలను గౌరవించే సంస్కారాన్ని ఎలా నేర్పించాలి? అది కుటుంబం నుంచే జరగాలి. ఇంట్లో కొడుకు, కూతురు ఉంటే పెంపకంలో ఇద్దరినీ సమానంగా చూడాలి. చదువు ఒక్కటే నేర్పిస్తే సరిపోదు. సమాజం పట్ల ఎలా బాధ్యతగా ఉండాలో కూడా చెప్పాలి. ఇంట్లో ఏ ఒక్కరినీ తక్కువ చేయకూడదు. భార్య అయినా, భర్త అయినా ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం ఉంటే అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఆ పెంపకంలో నుంచి వచ్చినవాళ్లకే సంస్కారం ఉంటుంది. రాజకీయం అబద్ధమా? అబద్ధం రాజకీయమా? ఈ రోజు రాజకీయాలు చూస్తుంటే అబద్ధం రాజకీయం అని చెప్పలేం. కానీ, రాజకీయాలలో అబద్ధాలు చెప్పే నాయకులే ఎక్కువ కనిపిస్తున్నారు. అలాంటి వారిని ప్రజలు నమ్మడం వల్ల రాష్ట్రం ఎన్ని అష్టకష్టాలు పడుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పేవారిని నమ్మకుండా నిజాయితీగా, విలువలతో కూడిన నేతలను నమ్మిన రోజే రాజకీయాలకు ఒక గౌరవం గుర్తింపు వస్తుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అన్ని ఆభరణాలలో రాజకీయం ఎలాంటి ఆభరణం? రాజయం అలంకారప్రాయమైన ఆభరణం కాదు. రాజకీయం అరుదైన బాధ్యత. ప్రజలలో మంచి పనులు చేసి, ప్రజల మన్ననలు పొందే అద్భుతమైన అవకాశం. ఒక వ్యక్తి ఎక్కువ మందికి సహాయం, న్యాయం చేసే అవకాశం ఒక్క రాజకీయం వల్లే వస్తుంది. ఆభరణంతో పోల్చితే కనుక పదిమందికి సాయం చేసే కీర్తికిరీటం రాజకీయం. పవర్ వస్తుంది.. పోతుంది. ఎంపవర్మెంట్ ఎప్పటికీ ఉంటుంది. మన అక్కచెల్లెళ్లను ఎలా ఎంపవర్ చేయాలి? సహజంగానే ఎక్కడైనా మహిళ గట్టిగా ప్రశ్నించి, నిలదీస్తే ఆమె క్యారెక్టర్ మీద దాడి చేస్తారు. నోరెక్కువ అని ప్రచారం చేస్తారు. ఇవన్నీ తట్టుకొని, ఫ్యామిలీ సపోర్ట్‌తో ఫైట్ చేయగలిగితే.. మనం ఎంచుకున్న లక్ష్యం (ముఖ్యంగా పేద ప్రజలకు సాయం) చేరుకుంటాం. పురుషులతో పోలిస్తే మహిళలకు రాజకీయాల్లో ప్రతిబంధకాలు చాలా ఎక్కువ. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ మొత్తం రాజకీయ వ్యవస్థ పురుషాధిపత్యమైపోయింది. ఇలాంటి వ్యవస్థలో మహిళలు రాణించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. రాజకీయాల్లో నిత్యం ప్రజల మధ్యలోకి వెళ్లాలి. కష్టమొచ్చినా, సంతోషమైనా, చావైనా, పుట్టుకైనా, ధర్నాలు, ఆందోళనలు ఇవన్నీ మహిళలకు రకరకాల ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక మహిళలు తమను తాము కాపాడుకోవడం రాజకీయాల్లో పెద్ద సవాల్. ఇక్కడ మహిళలను చాలామంది చులకన భావంతో చూస్తారు. ఆ అవమానాలను భరించి ధైర్యంగా నిలబడాలి. ఏ సమయమైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమై ఉండాలి. ఇవన్నీ మహిళలకు ఇబ్బందికరమైన అంశాలే. కానీ, ఈ కష్టాలన్నీ అధిగమించి మహిళలు ఇప్పుడు రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్నారు. రాజకీయాల్లో ఉన్న పురుషులకు కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు అందరూ సహకరిస్తారు. కానీ, మహిళలకు కుటుంబంలో, స్నేహితులలో సహకరించే వాళ్లే తక్కువ ఉంటారు. కనుక రాజకీయాలు మహిళలకంటే కూడా పురుషులకు అనుకూలంగా ఉంటాయి. కానీ మహిళలు ధైర్యంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే కచ్చితంగా పురుషులకంటే బాగా రాణించగలుగుతారు. మహిళలకు రాజకీయాల్లో సక్సెస్ ఆలస్యంగా రావచ్చు. కానీ ఒక్కసారి సక్సెస్ చూశాక మహిళలు ఉన్నత శిఖరాలకు చాలా వేగంగా చేరుకోగలుగుతారు. పురుషులతో పోల్చితే రాజకీయాల్లో మహిళలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? చిన్నవిగా అనిపించే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి.. బయలాజికల్‌గా అన్ని రోజులూ తిరగలేం. మగవారికి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, ఇవ్వకుంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. మహిళా నేతకి ఫాలోవర్‌గా ఉంటే తమ వెనుక వచ్చే పురుష నేతలు ఎగతాళి చేస్తారని చాలా మంది సపోర్ట్ చేయరు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
మహిళానేతలు ‘వెండి’కొండలు!
న్యూఢిల్లీ: మహిళా రాజకీయవేత్తలు వెండిపై మనసుపడుతున్నారు! ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళామణులు ప్రకటించిన ఆస్తుల చిట్టానే ఇందుకు నిదర్శనం. కాంగ్రె స్, బీజేపీల అగ్రనేతలు సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్ వంటి ప్రముఖులు సహా ఇతర అభ్యర్థులెవరి వద్ద చూసినా వెండి ధగధగలే. సోనియా వద్ద 88 కిలోల వెండి ఉంది. దీని మొత్తం విలువ రూ. 39.16 లక్షలు. ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద తన వద్ద కిలోన్నర వెండి ఉన్నట్లు ప్రకటించారు. రాజస్థాన్ బరిలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు చంద్రేష్ కుమారికి 30కిలోల వెండి సామగ్రి ఉంది. ఇక సుష్మా స్వరాజ్ దగ్గర వెండి నిల్వలు ఐదున్నర కిలోలకు పెరిగాయి. గత ఎన్నికల్లో(2009) ఆమె తన వద్ద కేవలం 400గ్రాముల వెండి ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కూతురు సుప్రియ కూడా తన వద్ద రూ. 4.3లక్షల విలువైన వెండి ఉన్నట్లు అఫిడవిట్ సమర్పించారు. దేశవ్యాప్తంగా పోటీలో ఉన్న చాలా మంది పురుష అభ్యర్థులు కూడా తమ భార్యల పేరు మీద భారీగా వెండి ఉన్నట్లు ప్రకటించడం విశేషం. కారణమేంటా అని కొందరు విశ్లేషకులు ఈ విషయంపై దృష్టి సారిస్తే ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం వెండి రేటు రూ. 43 వేలుగా ఉంది. గత ఐదేళ్లలోనే ధర రెట్టింపైంది. పైగా బంగారం కంటే వేగంగా పైపైకి దూసుకుపోతోంది. ఆభరణాల మెరుపులకు తోడు పెట్టుబడి కూడా కలిసొస్తుండటంతో నేతలంతా ఎక్కువగా వెండినే పోగేసుకుంటున్నారు!