World blood donor day
-
రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..
చంద్రమండలంలో అడుగుపెట్టే మేధా శక్తి ఉన్న మనిషి సృష్టించలేనిది.. అరచేతిలోనే ప్రపంచాన్ని అందిపుచ్చుకునే సాంకేతికత ఉన్నా కూడా తయారు చేయలేని పదార్థం. ఎన్ని కొంగొత్త ఆవిష్కరణలు చేసినా.. కృత్రిమంగా తయారు చేయడానికి వీలుపడనిది...'రక్తం'. నిరంతరం వ్యాధులతో పోరాడే వారికి..రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు అత్యవసరమైనది.. 'రక్తమే'. ఈ నేపథ్యంలోనే రక్తదానాన్ని ప్రోత్సహించడం కీలకమన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్ 14న నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రక్తదానంపై ఉన్న అపోహలు, సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్ గురించి సవివరంగా తెలుసుకుందాం.ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. జూన్ 14నే ఎందుకంటే.. నోబెల్ గ్రహిత శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ పుట్టినరోజున జరుపుకుంటున్నాం. ఆయన ఏబీఓ బ్లడ్ గ్రూప్ కనుగొన్నందువల్లే రక్తమార్పిడి గురించి ప్రపంచానికి తెలిసింది. అందువల్లే కార్ల్ ల్యాండ్‌స్టైనర్ గౌరవార్థం ఇలా ఆయన జయంతి రోజున రక్తదాతల దినోత్సవం పేరుతో రక్త దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.ఈ రోజున మనమిచ్చే రక్తంతో ఎన్ని ప్రాణాలు నిలబడతాయో శిబిరాలు నిర్వహించి మరీ తెలియజేస్తారు అధికారులు. అయితే చాలామందిలో రక్తదానం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. మనం గనుక ఇప్పుడు దానం చేస్తే ఏమైనా.. అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. ఒక్కసారి రక్తదానం చేశాక మళ్లీ తొందరగా కోలుకుంటామా అనే భయం కూడా ఉంటుంది చాలమందిలో. అయితే వైద్యులు అవన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు. పైగా రక్తదానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు..రక్తదానం చేసిన 48 గంటల్లోనే ఒక వ్యక్తి రక్త పరిమాణం సాధారణ స్థితికి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. వృద్ధులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రక్తదానం చేయవచ్చని చెబుతున్నారుమందులు వాడుతున్నావారు కూడా రక్తదానం చెయ్యొచని చెబుతున్నారు. రక్తదానం కేంద్రంలో వారే వాడే మందులు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్ని సమయాల్లో కొన్ని రోజుల పాటు ఆయా మందులను నిరోధించమని చెప్పి..తర్వాత దాత నుంచి రక్తాన్ని తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు.అలాగే రక్తదానం చేసే ప్రక్రియ సాధారణంగా 15 నిమిషాలకు మించి సమయం పట్టదు. జీవితాలను నిలబట్టే మహత్తర కార్యం ఇది అని చెబుతున్నారు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడతాం అనుకుంటారు. ఇది కూడా అపోహ అని తేల్చి చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే రక్తదాన కేంద్రాలు అంటువ్యాధులను నివారించడానికి కఠినమైన భద్రతా ప్రోటాకాల్లను పాటిస్తాయి. పైగా దానం చేసిన రక్తాన్ని ఉపయోగించే ముందు అంటువ్యాధుల కోసం క్షణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది నొప్పి లేకుండా దాతనుంచి సునాయాసంగా చిన్న పాటి సుదితో రక్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానం చేసే వ్యక్తి, వయసు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా ఏడాదికి చాలాసార్లు రక్తదానం చెయ్యొచ్చని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి 2 నెలలు లేదా 56 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్..భారతదేశంలోని ఆస్పత్రుల్లో దాదాపు 14.6 మిలియన్ల యూనిట్ల రక్తం డిమాండ్ ఉన్నట్లు అంచనా వేశాయి. అయితే ఈ డిమాండ్ తగ్గట్టు కేవలం 96% మాత్రమే రక్తం అందుబాటులో ఉందని, దాదాపు ఒక మిలియన్ యూనిట్ వరకు చాలా సెంటర్లలో కొరత ఉందని పేర్కొంది నివేదిక. అందువల్లే స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రజల్లో చైత్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు వంటివి ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రక్తం కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 2017లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 మిలియన్ల యూనిట్ల రక్తం కొరతను ఉందని, ఏకంగా 119 దేశాల్లో బ్లడ్ సెంటర్లలో రక్తం అందుబాటుల్లో లేదని వెల్లడించాయి నివేదికలు.దీన్ని పరిష్కరించేందుకు స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలి. రక్త నిర్వహణ పద్ధతులను మెరుగుపరచాలి, రక్తమార్పిడి వ్యవస్థలను బలోపేతం చేయాలి. రక్త మార్పిడి ఎలాంటప్పుడంటే..ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు తక్షణమే రక్తం అవసరం. సురక్షితమైన రక్తం అందుబాటుల్లో ఉండే ప్రాణాలను రక్షించగలుగుతాం. వైద్య విధానాలు: శస్త్ర చికిత్సలు, కేన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడి, ప్రసవం తదితర వాటికి రక్తమార్పిడి అవసరం అవుతుంది. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హిమోఫిలియా వంటి పరిస్థితుల్లో బాధపడుఉన్న రోగులకు వారి ఆరోగ్యాన్ని నిర్వహించడానికి క్రమం తప్పకుండా రక్తమార్పిడి అవసరం. రక్తహీనత: ఐరన్ లోపం లేదా ఇతర కారణాల వచ్చే రక్తహీనత, ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిలను పునరుద్ధరించడానికి రక్తమార్పిడి అవసరంబ్లడ్ డిజార్డర్స్: లుకేమియా, లింఫోమా, రక్త సంబంధిత రుగ్మతల చికిత్స కోసం రక్తమార్పిడి కీలకం. ప్రసూతి మరణలను నివారించడానికి, గర్భధారణ, ప్రసవ సమయంలో సురక్షితమై రక్త మార్పిడి చాలా కీలకం.తదితర వాటిలో సురక్షితమైన రక్తం అవసరమవుతుంది. అందువల్ల ఈ దినోత్సవం రోజున ప్రజలు స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేస్తే సురక్షితమైన రక్తం కొరతను నివారించగలుగుతాం. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం. అంతేగాదు రక్తం ఇవ్వడం అంటే ప్రాణం ఇచ్చినట్లే అని అందరూ గ్రహించాలి. ఈ మహాత్తర నిస్వార్థ కార్యక్రమంలో మనమందరం పాలుపంచుకుని ఈ సమస్యను నివారిద్దాం.(చదవండి: రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!) -
రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!
ఏదైనా ప్రమాదం జరిగింది, లేకుంటే ఏదో అత్యవసర సర్జరీ జరిగింది.. ట్రీట్మెంట్ కోసం రక్తం కావాలి. అప్పటికప్పుడు ఎవరైనా దాత దొరికితేనో, బ్లడ్ బ్యాంకుల్లో స్టాక్ ఉంటేనో సరి. లేకుంటే ఎంతో విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలోనే రక్తదానంపై అవగాహన కల్పించడం, రక్తదానంపై ఉన్న అపోహలు, వదంతులకు చెక్ పెట్టడం లక్ష్యంగాఏటా జూన్ 14న ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..జూన్ 14నే ఎందుకు?ఒకప్పుడు ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించడమనే చికిత్సే లేదు. ఒకవేళ అలా చేసినా.. బాధితులు బతికేవారు కాదు. దానికి కారణం మన రక్తం వేర్వేరుగా ఉండటమేనని ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ లాండ్స్టీనర్ 1990వ దశకంలో గుర్తించారు. రక్తాన్ని ఏ, బీ, ఓ గ్రూపులుగా వర్గీకరించారు. ఆయన పుట్టినరోజు అయిన జూన్ 14వ తేదీని ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’కోసం ఎంపిక చేశారు.రక్తదానంపై అవగాహన పెంచేందుకు.. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రమాదాల బాధితులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు వదులుతున్నారు. ఈ క్రమంలో రక్తదానంపై అవగాహన పెంచేందుకు ప్రఖ్యాత సంస్థలు నడుం బిగించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్సీఎస్), అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ (ఐఎఫ్బీడీఓ), అంతర్జాతీయ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ (ఐఎస్బీటీ) సంస్థలు కలసి తొలిసారిగా 2004 జూన్ 14వ తేదీ నుంచి ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టాయి. దీనికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తవుతుండటంతో.. ‘20 ఏళ్ల రక్తదానం. దాతలకు కృతజ్ఞతలు’అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.పేదరికానికి ‘రక్తం’ లింకు..ప్రమాదాల్లో గాయపడ్డవారు, సర్జరీలు చేయించుకునేవారికే కాదు తలసేమియా, హీమోఫీలియా, ఎనీమియా వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా తరచూ రక్తం ఎక్కించడం అవసరం. ముఖ్యంగా నిరుపేద దేశాల్లో చిన్నపిల్లలు వివిధ వ్యాధులకు లోనవడం, పోషకాహార లోపం వంటివాటితో.. రక్తం ఎక్కించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటోంది.– ప్రపంచవ్యాప్తంగా చూస్తే ధనిక దేశాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రమాదాలు, సర్జరీలు, వయసు మీదపడటం వల్ల వచ్చిన సమస్యల బాధితులకు రక్తం ఎక్కువగా ఎక్కిస్తున్నారు.– పేద దేశాల్లో రక్త హీనత, వివిధ వ్యాధులు, పోషకాహార లోపం వంటి వాటితో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు రక్తం ఎక్కువగా అవసరం పడుతోంది. దానం చేస్తే.. మనకూ ఆరోగ్యం! రక్తదానం చేయడం వల్ల అవతలివారి ప్రాణాలను కాపాడటమేకాదు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లమూ అవుతామని వైద్య నిపుణులు చెప్తున్నారు. రక్తదానం వల్ల మన శరీరంలో ఐరన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయని.. కొత్త రక్తం ఉత్పత్తి, రక్త ప్రసరణ తీరు మెరుగుపడతాయని అంటున్నారు. ఇది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును అరికడుతుందని, బరువు తగ్గేందుకూ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. మొత్తంగా రక్తదాత శారీరక, మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు. రక్తంలో ఏభాగాన్ని ఎన్నిసార్లు దానం చేయొచ్చు?పూర్తిస్థాయి రక్తమైతే.. 90 రోజులకోసారి ప్లాస్మా ఒకటే అయితే.. 28 రోజులకోసారి ప్లేట్ లెట్లు మాత్రమే అయితే.. 14 రోజులకోసారి ఎర్ర రక్తకణాలు మాత్రమే అయితే 112 రోజులకోసారి భారతదేశంలో రక్తదానం పరిస్థితి ఇదీ.. ఏటా అవసరమైన రక్తం 5 కోట్ల యూనిట్లు ఎవరెవరు రక్తదానం చేయొచ్చు?– పురుషులు 3 నెలలకు ఒకసారి.. మహిళలు 4 నెలలకు ఒకసారి – వయస్సు పరిమితి18 – 65 ఏళ్ల మధ్య – కనీసం ఉండాల్సిన బరువు 45 కిలోలు – దగ్గు, జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు ఏవీ ఉండకూడదు. – ఏవైనా వ్యాక్సిన్లు వేసుకున్నవారు కనీసం 15 రోజులనుంచి నెలరోజుల్లోపు రక్తదానం చేయవద్దు. – రక్తదానం చేసినవారు రెండు రోజుల పాటు నీళ్లు, పళ్లరసాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తీవ్ర శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం..– రక్తదాతల నుంచి అందుతున్నది 2.5 కోట్ల యూనిట్లు – దాత నుంచి సేకరించే రక్తం350 మిల్లీలీటర్లు – ఇందుకుపట్టే సమయం15 నిమిషాలు– ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి 2 సెకన్లలో ఒకరికి రక్తం అవసరం పడుతోంది. – ఏటా ప్రపంచవ్యాప్తంగా రక్తదానాలు 11.85 కోట్లు– అందులో ధనిక దేశాల నుంచి వస్తున్నవే 40%– పేద దేశాల్లో రక్తం ఎక్కిస్తున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలే 54%– ధనిక దేశాల్లో రక్తం ఎక్కిస్తున్నవారిలో 60 ఏళ్లు పైబడిన వారు76% -
రక్తదానం జీవన దానమే!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, దీనిపై అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రక్తదానం అంటే జీవన దానమే అని స్పష్టం చేశారు. కృత్రిమ శ్వాస పరిజ్ఞానం (సీపీఆర్) పట్ల ప్రజల్లో విస్తృత అవగావన కల్పించాలన్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సొసై టీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె 50సార్లకుపైగా రక్తదానం చేసిన దాతలు, అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను టీసీఎస్, ఎస్బీఐ స్టాఫ్ కళాశాల, ఉస్మానియావర్సిటీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ, నిజామాబాద్ యూనిట్లు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను పొందడాన్ని అభినందిస్తూ ఇందుకు కృషి చేసిన స్థానిక ప్రతినిధులు డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్, బుస్సా అంజన్నకు సైతం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 139 సార్లు రక్తదానం చేసిన అంజయ్య, 50 సార్లు రక్తదానం చేసిన అతడి భార్య పి.మనోరమతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు కుర్రె సిద్ధార్్థ, శ్రీలేఖ, మరో పీజీ వైద్య విద్యార్థిని ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ తెలంగాణ చైర్మన్ అజయ్‌మిశ్రా, వైస్ చైర్మన్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలి రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో ఎన్ఐఆర్డీ, పీఆర్ సీనియర్ అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటివనరుల మ్యాపింగ్‌తోపాటు వాటి నిర్వహణ, పునరుజ్జీవనానికి ప్రాధాన్యతతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కష్టసాధ్యంగా మారుతున్నందున ప్రపంచస్థాయిలో ప్రత్యేకంగా ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశలో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. -
ప్రాణం నిలిపే రక్తపు బొట్టు
రక్తపు బొట్టు... ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ రక్తం సమయానికి అందకపోతే... ప్రాణాన్ని నిలపగలిగే డాక్టర్ కూడా అచేతనం కావాల్సిందే. శిబి చక్రవర్తిలా దేహాన్ని కోసి ఇవ్వాల్సిన పనిలేదు. కొంత రక్తాన్ని పంచి మరొక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రక్తదానానికి మగవాళ్లతోపాటు మహిళలూ ముందుకొస్తున్నారు. మహిళలు రక్తదానం చేయరాదనే అపోహను తుడిచేస్తున్నారు. రక్తదానం చేస్తూ... సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్న ఓ మెడికో... ఓ సోషల్ యాక్టివిస్ట్‌ల పరిచయం ఇది. నాన్న మాట... యాభై సార్లు రక్తదానం చేయాలనే సంకల్పం కూడా మా నాన్న చెప్పిన మాటే. రక్తదానం చేయగలిగింది ఇరవై నుంచి అరవై ఏళ్ల మధ్యలోనే. అరవై తర్వాత రక్తదానం చేయడానికి ఆరోగ్యరీత్యా నిబంధనలు ఒప్పుకోవు. వీటికి తోడు ఆడవాళ్లకు ప్రసవాలు, పిల్లల పెంపకంలో మరో పదేళ్లు గడిచిపోతాయి. 35 నుంచి విధిగా రక్తదానం చేస్తూ యాభై సార్లు రక్తం ఇవ్వాలనే నియమాన్ని పెట్టుకోవాలనేవారు. ఆ లక్ష్యంతోనే యాభై రక్తదానాలు పూర్తి చేశాను. ఆ తర్వాత మా అమ్మకోసం మా తమ్ముడితోపాటు నేనూ రక్తం ఇచ్చాను కానీ దానిని ఈ లెక్కలో చెప్పుకోను. అమ్మరుణం ఏమిచ్చినా తీరేది కాదు. – గొట్టిపాటి నిర్మలమ్మ, రక్తదాత మా పుట్టిల్లు నెల్లూరు నగరం (ఆంధ్రప్రదేశ్). మా చిన్నాన్న జయరామనాయుడు డాక్టర్. ‘రక్తం అంది ఉంటే ప్రాణాన్ని కాపాడగలిగేవాళ్లం’ అని అనేకసార్లు ఆవేదన చెందేవారు. ఇంట్లో అందరినీ రక్తదానం పట్ల చైతన్యవంతం చేశారాయన. దాంతో మా నాన్న నెల్లూరులో రెడ్‌క్రాస్, బ్లడ్‌బ్యాంకు స్థాపించారు. ఇంట్లో అందరం రక్తదానం చేశాం. అలా నేను తొలిసారి బ్లడ్ డొనేట్ చేసినప్పటికి నా వయసు 20. మామగారి ప్రోత్సాహం పెళ్లికి ముందు నెల్లూరులో మొదలైన రక్తదాన ఉద్యమాన్ని పెళ్లయి అత్తగారింటికి నెల్లూరు జిల్లా, కావలి పట్టణానికి వెళ్లిన తర్వాత కూడా కొనసాగించాను. నలభై ఏళ్ల కిందట కావలి రక్తదాతల్లో మహిళలు దాదాపు పదిహేను మంది ఉండేవారు. రెడ్‌క్రాస్ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి. అనేక క్యాంపులు కూడా నిర్వహించేవాళ్లం. కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చేవాళ్లు. కానీ అలా ముందుకొచ్చిన అమ్మాయిల్లో బ్లడ్ తగినంత ఉంటే కదా! వందమంది ఆడపిల్లలు వస్తే రక్తదానం చేయగలిగిన ఎలిజిబులిటీ ఉన్న వాళ్లు ఆరేడుకు మించేవాళ్లు కాదు. అండర్ వెయిట్, హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోవడం ఎక్కువగా కనిపించేది. అరుదైన గ్రూపుల వాళ్ల నుంచి కూడా బ్లడ్ క్యాంపుల్లో సేకరించేవాళ్లం కాదు. వాళ్లకు పరీక్షలు చేసి లిస్ట్ తయారు చేసుకుని ఎమర్జెన్సీ కండిషన్లో పిలుస్తామని చెప్పేవాళ్లం. అప్పట్లో బ్యాంకుల్లేవు నా వయసు 63. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అందుకు రక్తదానమే కారణం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్‌కు సౌకర్యాలు బాగున్నాయి. కానీ మొదట్లో బ్యాంకులు ఉండేవి కాదు. మా మామగారు మాజీ ఎమ్మెల్యే సుబ్బానాయుడు ప్రోత్సాహంతో మా బంధువులు ముందుకొచ్చి కావలి హాస్పిటల్లో రక్తదానం కోసం ఒక గది కట్టించారు. యాక్సిడెంట్ కేస్ రాగానే హాస్పిటల్ నుంచి మాకు ఫోన్ వచ్చేది. అప్పటికప్పుడు మా డోనర్స్‌లో పేషెంట్ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ అయ్యే డోనర్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు వెళ్లి రక్తం ఇచ్చేవాళ్లం. బ్లడ్ డోనర్స్ అంతా ఆరోగ్యంగా, అంటువ్యాధుల పట్ల విచక్షణతో ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలన్నీ చేయించుకుని రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఏడాదికి మూడు–నాలుగుసార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి దగ్గరకు యూఎస్‌కి వెళ్లినప్పుడు అక్కడ కూడా ఓ సారి బ్లడ్ డొనేట్ చేశాను. అది అత్యవసర స్థితి కాదు, కేవలం యూఎస్‌లోనూ రక్తమిచ్చాననే సరదా కోసం చేసిన పని. మొత్తానికి అరవై ఏళ్లు నిండేలోపు యాభైసార్లు రక్తం ఇచ్చి మా నాన్న మాటను నెగ్గించాను. ఈ క్రమంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన మహిళగా గుర్తింపు వచ్చింది. గవర్నర్ అభినందించారు అప్పటి గవర్నర్ రంగరాజన్, ఆయన సతీమణి హరిప్రియా రంగరాజన్ దంపతులు 2000వ సంవత్సరంలో కావలికి వచ్చారు. ఆమె రెడ్‌క్రాస్‌లో చురుకైన సభ్యురాలు కూడా. రాజ్‌భవన్‌లో జరిగిన రెడ్‌క్రాస్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. నన్ను కావలిలో చూసి ‘ఈ పురస్కారం అందుకుంటున్న నిర్మలవి నువ్వేనా’ అని ఆత్మీయంగా పలకరించారు. మహిళలకు మార్గదర్శి అంటూ గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఉన్నాయి కానీ జ్ఞాపికలుగా దాచుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. నా జీవితం అంతా ఎదురీతలోనే గడిచింది. ఆ ఎదురీతల్లో ఇవేవీ ప్రాధాన్యతాంశాలుగా కనిపించలేదప్పట్లో. మొత్తానికి మా చిన్నాన్న, నాన్న, మామగారు అందరూ బ్లడ్ డొనేషన్ పట్ల చైతన్యవంతంగా ఉండడంతో నాకు ఇంతకాలం ఈ సర్వీస్‌లో కొనసాగడం సాధ్యమైంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే కార్యక్రమం కావడంతో ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పేవాళ్లు కాదు’’ అని తన రక్తదాన ప్రస్థానాన్ని వివరించారు సోషల్ యాక్టివిస్ట్ నిర్మలమ్మ. రక్తదానం చేద్దాం! – శృతి కోట, రక్తదాత, వైద్యవిద్యార్థిని నేను పద్దెనిమిదేళ్ల వయసు నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. నా హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకుంటూ మూడు – నాలుగు నెలలకోసారి ఇచ్చేటట్లు చూసుకుంటున్నాను. ఈ మధ్య హెపటైటిస్ వ్యాక్సిన్ కారణంగా కొంత విరామం వచ్చింది. మా నాన్న సంపత్‌కుమార్ బ్లడ్ డోనర్ కావడంతో నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. రక్తదానానికి మహిళలు, మగవాళ్లు అనే తేడా పాటించక్కర్లేదు. అయితే భారతీయ మహిళల్లో రక్తహీనత ఎక్కువ మందిలో ఉంటోంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ రక్తదానం చేయవచ్చు. హిమోగ్లోబిన్ పన్నెండు శాతానికి తగ్గకూడదు. డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలతోపాటు లాస్ట్ పీరియడ్‌లో రక్తస్రావం స్థాయులను దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు రక్తదానం చేయకూడదు. మెనోపాజ్ దశలో ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఇవ్వవచ్చు. ఇక మహిళలు, మగవాళ్లు అందరూ రక్తదానం చేయడానికి ముందు చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. ఎయిడ్స్, హెపటైటిస్, మలేరియా, సమీప గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్లకు గురవడం, వ్యాక్సిన్లు వేయించుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉండడం వంటి కండిషన్స్‌కు స్క్రీనింగ్ జరిగిన తర్వాత మాత్రమే రక్తాన్ని సేకరిస్తారు. రక్తం ఇవ్వాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ తమ దేహ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్లడ్ డోనార్స్ మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి. రక్తదానం చేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తూ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ‘రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి’ అనేదే మెడికోగా నా సందేశం. ప్రమాదంలో గాయపడిన తొలి గంటను గోల్డెన్ అవర్ అంటాం. ఆ గంటలో వైద్య చికిత్స జరగడం ఎంత అవసరమో వైద్యానికి రక్తం అందుబాటులో ఉండడమూ అంతే అవసరం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అత్యధిక రక్తదాతలు ఉన్న దేశాల్లో ఒకటిగా ఉందాం: చిరంజీవి
Chiranjeevi Shares Blood Donation Pics On World Blood Donor Day: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇండస్ట్రీకి పెద్ద కొడుకులా వ్యవహరిస్తుంటారు. అంతేకాకుండా మంచి సినిమాలను ఆద్యంతం ప్రొత్సహిస్తూ చిత్రబృందాలను ప్రశంసిస్తుంటారు. అంతేకాకుండా 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' పేరిట ఎంతోమందికి రక్తదానం చేశారు చిరంజీవి. కాగా మంగళవారం (జూన్ 14) వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా ఓ ట్వీట్ చేశారు చిరంజీవి. ఆయన ఇప్పటివరకు రక్తదానం చేసిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. వీటిలో ఆయన సతీమణి సురేఖ కూడా ఉన్నారు. 'రక్తదానం అనేది ఇతరుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడే సులభమైన మార్గం. ప్రపంచంలో అత్యధిక జనాబా కలిగిన రెండో దేశం మనది. ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక రక్తదాతలు ఉన్న దేశాలలో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో ఉందాం.' అని ట్వీట్ చేశారు. చదవండి: 'మేజర్' సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్: చిరంజీవి కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా Blood donation is the simplest way of helping save other’s lives. We are the 2nd most populated country in the world.This #WorldBloodDonorsDay let’s also aim to be among the countries with Highest No of Blood Donors! #DonateBloodSaveLives pic.twitter.com/56lZiG6Vrk — Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2022 -
ప్రతి రోజు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నారు..అయినా!
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం అతిప్రధానమైనది. దేశ వ్యాప్తంగా ఉన్న 135 కోట్ల మందిలో అత్యవసర పరిస్థితుల్లో ఏటా ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరపడుతుందని నిపుణుల అంచనా. అయితే రక్తదాతల నుంచి లభిస్తుంది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ప్రతి రోజు దాదాపు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నారు. గత దశాబ్దకాలంగా రక్తదానం పైన అవగాహనా కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి స్పందన మాత్రం రక్త అవసరాలను తీర్చడానికి అనుగుణంగా లేవన్నది వాస్తవ సత్యం. నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -సాక్షి, హైదరాబాద్ రక్త నిల్వలు నిండుకున్నాయి... ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అవసరపడుతుంది. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా తలసేమియా బాధితులు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు. రక్తదానం పై అపోహల వల్ల అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావట్లేదని సర్వేలు పేర్కొంటున్నాయి. 18 సంవత్సరాలు నిండి 12.5 హిమోగ్లోబిన్ స్థాయితో 45 నుంచి 50 కిలోల బరువున్న ప్రతి ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తదానానికి అర్హుడు. ఇలా ఒక్కో వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు నిండే వరకు రక్తదానం చేయవచ్చని అరోగ్య నిపుణులు నిర్ధారించారు. చదవండి: హైదరాబాద్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయవచ్చు. 15 రోజలకు ఒక సారి ప్లాస్మా దానానికి ఆస్కారం ఉంది. ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు. మొత్తంగా 85 శాతం పాజిటివ్ గ్రూప్, 15 శాతం నెగెటివ్ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా నెగెటివ్ గ్రూప్ వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి 20 వేల మందిలో ఒకరు బాంబే బ్లడ్ గ్రూప్‌తో పుడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు రక్తదాతల కోసం అవగాహనా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నప్పటికీ అవసరమైన స్థాయిలో రక్త నిధులను సమకూర్చలేకపోతున్నామని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. షుగర్, హెచ్ఐవీ, హెపటైటీస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు స్వచ్చంథంగా రక్తదానానికి ముందుకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తరచు రక్తదానం చేసేవారికి గుండెపోటు, క్యాన్సర్ వంటి జబ్బులు దరిచేరవని మెడికల్ సర్వేలు నిర్థారిస్తున్నాయి. 258 సార్లు రక్తదానం చేశా... గత 22 సంవత్సరాల్లో 258 సార్లు రక్తదానం చేసి ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పాను. అంతేకాకుండా వ్యక్తిగతంగా, సోషల్‌మీడియా వేదిక ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న 20 వేల మందికి సకాలంలో రక్తాన్ని అందించగలిగాను. సరైన సమయానికి రక్తం అందక ఒక వ్యక్తి చనిపోయారన్న వార్త తెలుసుకుని రక్తదానం చేయడం ప్రారంభించాను. రక్తదానంపై యువకుల ఆలోచనా విధానం మారాలి. యువకులు అధికంగా ఉన్న మన దేశంలో రక్తం అందక బాధితులు చనిపోవడం శోచనీయం. –డా.సంపత్ కుమార్, సామాజిక వేత్త, బంజారాహిల్స్. 12 వేల మందికి రక్తాన్ని అందించా. ఇప్పటి వరకు 116 సార్లు రక్తదానం చేశాను. పది సంవత్సరాల క్రితం నేను ప్రారంభించిన రెడ్ డ్రాప్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో 12 వేల మందికి రక్తాన్ని అందించగలిగాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 58 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాను. రక్తదానం కోసం కృషి చేస్తున్న వారికి ఏటా సంస్థ ఆధ్వర్యంలో అవార్డులను ఇస్తున్నాము. –రెహమాన్, హైదరాబాద్. -
రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా విలువైన ప్రాణాలను కాపాడేందుకు నిస్వార్థంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాతలు ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది మంది జీవితాలను రక్షిస్తున్నారని కొనియాడారు. రక్తదానం ఉదాత్తమైన, మానవీయమైన, అమూల్యమైన చర్య అన్నారు. రక్తదాతల ఉదారమైన సేవకు గుర్తింపుగా ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. -
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే: బంగారంలాంటి బ్లడ్ డోనర్
అనుబంధాల గురించి చెప్పే సందర్భంలో ‘నీటి కంటే రక్తం చిక్కనిది’ అంటారు. రక్తం చిక్కనిది మాత్రమే కాదు... ఎన్నో జీవితాలను చక్క బెట్టేది. జీవితానికి రక్షణగా నిలిచేది. ‘అన్నదానం మాత్రమే కాదు రక్తదానం కూడా మహాదానం’ అనే ఎరుకను ప్రజల్లో తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నిస్తోంది ఆశా సూర్యనారాయణ్... ‘ప్రౌడ్ టు బీ బ్లడ్ డోనర్’ ‘మీ రక్తంతో పాటు ఒకరికి జీవితాన్ని కూడా ఇస్తున్నారు’ ‘రక్తదాతలు జీవితరక్షకులు’... మొదలైన నినాదాలు గట్టిగా వినిపించని కాలం అది. 24 సంవత్సరాల వయసులో తొలిసారిగా రక్తదానం చేసింది బెంగళూరుకు చెందిన ఆశా సూర్యనారాయణ్. ఒకరోజు దినపత్రిక చదువుతున్నప్పుడు రక్తదానానికి సంబంధించి సిటీ హాస్పిటల్ వారి ప్రకటన కనిపించింది. తనది వారు అడిగిన బ్లడ్‌గ్రూపే. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి రక్తదానం చేసింది. నిజానికి తనకు అప్పుడు రక్తదానం ఎలా చేయాలి, దాని విలువ ఏమిటి... మొదలైన విషయాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆమె వయసు 55 సంవత్సరాలు. ఆరోజు ప్రారంభమైన రక్తదానం ఇప్పటికీ ఆగలేదు. ఒకసారి బెంగళూరులో క్యాన్సర్ పేషెంట్‌కు రక్తదానం చేసింది. మరుసటి రోజు ఆ హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు... ఆశను చూసి ఒక వృద్ధురాలు వేగంగా నడిచివచ్చింది. దగ్గరికి రాగానే తన కాళ్ల మీద పడింది. ‘అయ్యో! మీరు పెద్దవాళ్లు’ అంటూ ఆమెను లేపింది ఆశ. ‘మీరు ఎవరో తెలుసుకోవచ్చా?’ అని అడిగేలోపే... ‘మీరు రక్తదానం చేసి నా బిడ్డను బతికించారు’ అంటూ కట్టలకొద్ది డబ్బును ఇవ్వబోయింది. ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించిన ఆశ ‘ఒక్క రూపాయి కూడా అవసరం లేదు తల్లీ. ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తాను’ అని ఆ వృద్ధురాలికి ధైర్యం చెప్పింది. నిజానికి ఈ సంఘటన రక్తదానం పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చి వేసింది. నిబద్ధతను మరింతగా పెంచింది. ‘నేను చేయడమే కాదు చేయించాలి కూడా’ అనుకొని రక్తదానం గురించి మహిళలతో మాట్లాడినప్పుడు వారు విముఖంగా ఉన్నారు. ‘రక్తదానం వల్ల మహిళలు బలహీనమవుతారు’... మొదలైన అపోహలే దీనికి కారణం. అందుకే అలాంటి అపోహలను తొలిగించే ప్రచారాన్ని చేపట్టింది. ఇది మంచి ఫలితం ఇచ్చింది. చాలామంది మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. రక్తదానం చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులు భయపడుతుంటారు. ఆశ కుటుంబలో కూడా మొదట్లో అలాంటి భయాలు ఉన్నా, తరువాత మాత్రం ఆమెకు పూర్తిగా అండగా నిలిచారు. కోవిడ్ కోరలు చాచిన భయానక కాలంలో బ్లడ్ డొనేషన్స్ భారీగా తగ్గిపోయాయి. రెగ్యులర్‌గా రక్తదానం చేసేవాళ్లు కూడా ‘రిస్కు ఎందుకు’ అంటూ ఇళ్లు కదలడం లేదు. ఆ సమయంలో తాను చొరవ తీసుకుంది. ‘రక్తదానం చేయడానికి అభ్యంతరం లేదు. కానీ బ్లడ్‌బ్యాంకుకు మాత్రం వచ్చేది లేదు’ అన్నారు చాలామంది. అలాంటి వారికి ధైర్యం చెప్పి బ్లడ్‌బ్యాంకులకు తీసుకెళ్లేది ఆశ. ఆశను అభిమానంగా ‘గోల్డెన్ బ్లడ్ డోనర్’ అని పిలుచుకుంటారు అభిమానులు. రక్తదానంతో మొదలైన ఆమె సమాజసేవ అక్కడితో ఆగిపోలేదు. మరెన్నో మంచిపనులకు అది బలమైన పునాదిగా మారింది. కోవిడ్ సమయంలో దిక్కుమొక్కులేని వారికి అన్నదానం, అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడం, వాక్సినేషన్ డ్రైవ్..ఆమె చేసిన మంచి పనుల్లో కొన్ని మాత్రమే. -
రక్తదాతలూ ఈ విషయం గుర్తుంచుకోండి..!
రక్తదానం చేయాలనుకునేవారు తాము డొనేట్ చేస్తున్న బ్లడ్‌బ్యాంకులో... రక్తాన్ని కాంపోనెంట్స్‌ను విడదేసే సౌకర్యం ఉందా, లేదా అని ముందుగా వాకబు చేయాలి. అలా విడదీసే సౌకర్యం ఉంటేనే రక్తదానం చేయాలి. లేదంటే ఎక్కువ మందికి ఉపయోగపడాల్సిన రక్తం... కేవలం ఒకరికే ఉపయోగపడుతుంది. రక్తంలో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా... వంటి అనేక కాంపోనెంట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇవన్నీ కలగలసి ఉన్న రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. గతంలో పేషెంట్స్‌కు ఏ కాంపొనెంట్ అవసరం ఉన్నా మొత్తం హోల్ బ్లడ్ ఎక్కించేవారు. కానీ ఇప్పుడు బ్లడ్‌లోని కాంపొనెంట్స్‌ను విడదీసి... అవసరమున్న దాన్ని మాత్రమే ఎక్కించే వీలుంది. అంటే... ఒక వ్యక్తికి హోల్‌బ్లడ్ ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. అలా కాకుండా ఏ కాంపొనెంట్ అవసరమో, అదే ఎక్కిస్తే ఒక హోల్ బ్లడ్‌ను అనేక మందికి సర్దుబాటు చేయవచ్చు. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఓ వ్యక్తికి ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీతన (అనీమియా)తో బాధపడుతున్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగీ సోకి ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి ప్లేట్లెట్లు మాత్రమే అవసరం. రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో రక్తదానం చేస్తే అప్పుడు, వాటిని విడదీసి రకరకాల అవసరాలు ఉన్న అనేకమంది రోగులకు ఎక్కించవచ్చు. అలా ఒకరి రక్తం ఒకే వ్యక్తి కంటే ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు రక్తాన్ని కంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకులోనే రక్తదానం చేయడం వల్ల ఏకకాలంలో అనేక మందికి రక్తదానం చేసిన ప్రయోజనం ఉంటుంది. -
భార్య సురేఖతో కలిసి రక్తదానం చేసిన చిరంజీవి
అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు. సమయానికి రక్తం అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు. కానీ ప్రస్తుతం కరోనా కాలంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతూ రక్తదానానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం World Blood Donor Day సందర్భంగా భార్య సురేఖతో కలిసి మెగాస్టార్ చిరంజీవి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 'రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులను అభినందిస్తున్నాను. చిన్న పనితో ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడుతుండటం, ఏ సంబంధం లేని వారికి రక్తం ఇచ్చి వారితో ఓ రక్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అనేది గొప్ప అదృష్టం' అని చిరు ట్వీట్ చేశారు. గతంలో కరోనా మొదటి వేవ్‌లోనూ చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It's a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives pic.twitter.com/ufTgxlDPEG — Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021 చదవండి : ఆట సందీప్‌కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి -
World Blood Donor Day: కరోనాలోనూ బాధితులకు ఊపిరిపోస్తున్న దాతలు
సాక్షి, వేములవాడ(కరీంనగర్): కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రక్తదాతలు తమ కర్తవ్యాన్ని విస్మరించట్లేదు. ప్రాణాపాయస్థితిలో రక్తం కోసం కొట్టుమిట్టాడుతున్న వారికి ‘మేమున్నాం’ అంటూ రక్తదానం చేసి ఆపద్భాంధవులుగా నిలుస్తున్నారు. రక్తం పంచి ఆయుష్షు పెంచుతున్నారు. రక్తదాతలు తమ దయాగుణంతో ప్రతీ రోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ చిరంజీవులుగా ఉండేలా సహాయపడుతున్నారు. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. జూన్ 14న.. ‘రక్తదానం చేయండి.. ప్రపంచంలోని అందరి గుండెలు ఆగకుండా పరిగెత్తేలా చేయండి’ అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ రక్తదాతల దినో త్సవం నిర్వహిస్తున్నారు. అయితే 2005 మే లోనే అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ర క్తాన్ని ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్, నెగెటివ్ గ్రూపుల ను కార్ల్ లాండ్ స్టీవర్ గుర్తించారు. ఆ యన జన్మదినం జూన్ 14న ఉండడంతో అదే రోజున ప్రపంచ రక్తదాతల దినో త్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 1,200 మందితో.. రక్తం లేక ఎవరూ తనువు చాలించకూడదనే సేవాభావంతో రామగుండం యువ మిత్ర సేవా సమితి సంస్థ ఏర్పాటు చేశా. యువతకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, శిబిరాలు నిర్వహిస్తున్న. 1200 మందితో రక్తదానం చేయించా. నేను కూడా 18 సార్లు చేశా. ఐదు రోజుల క్రితం రక్తదానం చేసిన తర్వాత కోవిడ్ టీకా తీసుకున్నా. జీవితంలో రక్తదానం చేయడం ఒక మంచి అలవాటుగా మార్చుకున్నా. – ఈదునూరి శంకర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత, గోదావరిఖని 12 సార్లు శిబిరాలు .. స్వగ్రామం అల్గునూర్. అల్లుఅర్జున్ అభిమాన సంఘం జిల్లా అ«ధ్యక్షుడిగా కొనసాగుతున్న. అత్యవసర సమయంలో రక్తదానం చేసి అనారోగ్యానికి గురైన వ్యక్తి ప్రాణాలు నిలబెడితే అతడి బంధువుల కళ్లలో కనిపించే కృతజ్ఞత భావం మరోసారి దానం చేసేందుకు ప్రోత్సహిస్తుంది. ఇప్పటికీ 22 సార్లు రక్తదానం చేసిన. అల్లు అర్జున్ అభిమానులసాయంతో 12 సార్లు శిబిరాలు నిర్వహించి 600 యూనిట్ల రక్తాన్ని వివిధ కేంద్రాలకు అందజేశా. – తమ్మనవేని అంజియాదవ్, అల్గునూర్, కరీంనగర్ అపోహలు వీడండి రక్తదానం చేయడంలో అపోహలు వీడాలి. ప్రతీ వ్యక్తిలో కనీసం ఐదున్నర లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసిన తర్వాత రెండు రోజుల్లో ఆ వ్యక్తికి తిరిగి రక్తం సమకూరుతుంది. కరోనా నెగిటివ్ వచ్చిన వారు నాలుగు వారాల తర్వాత రక్తదానం చెయవచ్చు. అలాగే కోవిడ్ టీకా తీసుకున్న కూడా నాలుగు వారాల వరకు రక్తదానం చేయకూడదు. అందుకే రక్తదానం చేసిన తర్వాతే కోవిడ్ టీకా తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, గోదావరిఖని 30 ఏళ్లు.. 56 సార్లు.. మాది వేములవాడ మండలం నూకలమర్రి. బీ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. 1990 నుంచి ఇప్పటి వరకు 56 సార్లు రక్తం ఇచ్చినా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉన్నా స్వయంగా వెళ్లి రక్తదానం చేస్తా. అత్యవసర సమయంలో బాధితులకు రక్తదానం చేయడం ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది. – సోమినేని బాలు, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు, సిరిసిల్ల ఇప్పటి వరకు 48 సార్లు.. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఉంటా. అభిమాన నటుడు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. రక్తం అవసరమనే సమాచారం ఎవరిచ్చినా వెంటనే స్పందిస్తా. 1996 నుంచి ఇప్పటి వరకు 48 సార్లు రక్తదానం చేశా. రక్తదానం చేసేందుకు పలువురిని ప్రోత్సహిస్తున్నా. – మిడిదొడ్డి నవీన్‌కుమార్, జ్యోతినగర్, కరీంనగర్ 2013 నుంచి.. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు బూర్గుపల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు ఆపదలో ఉన్నవారికి బ్లడ్ డొనేట్ చేయాలని 2013లో నిర్ణయానికి వచ్చారు. బోయినపల్లికి చెందిన మొగులోజి శ్రీకాంత్, యాద ఆదిత్య, దుబ్బాక మహేశ్, బోయిని రవి, సంబ కిశోర్ చౌదరి శ్రీధర్, బూర్గుపల్లికి చెందిన పెరుక మహేశ్, శ్రీపతి సాగర్, రామంచ అశోక్, పెంచాల మహేశ్, రాజేంద్రప్రసాద్, తడగొండకు చెందిన ఎర్ర గిరిధర్ తదితరులు పలుసార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా> నిలుస్తున్నారు. ఇందులో పెరుక మహేశ్ 22సార్లు రక్తదానం చేశాడు. చదవండి: తల్లులకు టీకా.. చకచకా -
రక్తం లేకుంటే దేవుడు కూడా కాపాడలేడు
సాక్షి, హైదరాబాద్: ఆకలైన వారికి ఆ పూటకు అన్నం లేకపోయినా కొన్ని రోజులు జీవిస్తారు. కానీ రక్తం అవసరమైన వారికి ఆ సమయంలో ఇవ్వకపోతే మాత్రం విలువైన నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అన్ని దానాలకంటే అన్నదానం గొప్పదని గతంలో చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని వివిధ గ్రూపులను కనుగొన్న నోబెల్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త ల్యాండ్‌స్టైనర్ జయంతి సందర్భంగా ఏటా జూన్ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ ముఖ్యోద్దేశం 'స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నవారికి మనసారా కృతజ్ఞతలు తెలపడం'. అంతేకాదు.. రక్తదానానికి ప్రజలను పోత్సహించడం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అవసరమొచ్చినా సురక్షితంగా సకాలంలో రక్తాన్ని అందించవచ్చు. రక్తం అవసరం, దాని గొప్పతనం అది అవసరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. అవసరమైనప్పుడు రక్తసంబంధీకులు సైతం రక్తం ఇవ్వడానికి ముందుకు రాని ఈ రోజుల్లో మేమున్నామంటూ కులం, మతం, ప్రాంత భేదాలు చూడకుండా రక్తదానం చేస్తున్న వారిని రక్తదాతా సుఖీభవ అని ఆశీర్వదిస్తున్నారు. కృత్రిమంగా సృష్టించలేని రక్తం అందుబాటులో లేకపోతే దేవుడు కూడా ప్రాణాలు కాపాడలేడు. ఒకసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలు నిలబడతాయి. అందుకే రక్తదాతలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు అని బాధితులు చెప్పుకుంటారు. రక్తదానానికి అర్హత... ♦ దాత బరువు 45 కిలోలు ఉండాలి. ♦ వయస్సు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. ♦ దాత నాడి నిమిషానికి 60 నుంచి 100సార్లు కొట్టుకోవాలి. ♦ రక్తంలో హెచ్‌బీ శాతం 12.5 గ్రాములకు పైగా ఉండాలి. తీసుకునేది 300 మిల్లీ లీటర్లు ప్రతి మనిషిలో 5 లీటర్ల రక్తం ప్రవహిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం సమయంంలో ప్రతి వ్యక్తి నుంచి కేవలం 300 మిల్లీ లీటర్ల రక్తం మాత్రమే తీసుకుంటారు. ఆ రక్తం మళ్లీ కొన్ని గంటల్లోనే శరీరంలో తయారవుతుంది. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే రక్తం సేకరిస్తారు. సేకరించిన రక్తాన్ని అవసరం మేరకు రోగులకు ఎక్కిస్తారు. -
బ్లడ్ లెస్ బ్యాంకులు!
- ఒకరు ఇస్తేనే మరొకరికి రక్తం ఇస్తామంటూ బ్లడ్‌బ్యాంకుల కండీషన్ - ముందుకు రాని దాతలు.. ఇబ్బందుల్లో రోగులు - నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సాక్షి, సిటీబ్యూరో: రక్తానికి రక్తం! ఇదేదో ఫ్యాక్షన్ సినిమాలో వినిపించే డైలాగ్ అనుకోకండి. అత్యవసర పరిస్థితుల్లో తమకు రక్తం కావాలంటూ బ్లడ్‌బ్యాంకులకు వచ్చేవారికి ఇప్పుడు ఎదురవుతున్న సమస్య ఇది. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులను ‘రక్తహీనత’ జబ్బుపట్టి పీడిస్తోంది. ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో అసరాలు తీర్చలేని పరిస్థితి నెల కొంది. బాధితుని బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేనే అవసరమైన గ్రూప్ రక్తం (రక్తానికి రక్తం!) ఇస్తామంటూ బ్లడ్‌బ్యాంకు ఇన్చార్జిలు మెలిక పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా..ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసీమియా బాధితులకు సకాలంలో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు చేరుకున్న బాధితులకు రక్తం దొరకని దుస్థితి. ఒక వేళ ఉన్నా ఒక యూనిట్‌కు మించి ఇవ్వడం లేదు. ఉస్మాయాలో ప్రతి నెలా 500 నుంచి 600 యూనిట్ల రక్తం అవసరం. రోజుకు 40 మంది వస్తే కేవలం పది మందికే సమకూర్చగలుగుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ఉస్మానియాకు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా..నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. బ్లడ్ బ్యాంకులపై సరైన నియంత్రణ లేక పోవ డం వల్ల ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుం చి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ‘మిషన్ టెన్ మిలియన్’ చార్మినార్: తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వారు ‘మిషన్ టెన్ మిలియన్’ నినాదంతో ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. జూలై 2వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తలసేమియాతో బాధపడే చిన్నారులకు ఈ సొసైటీ ద్వారా అవసరమైనప్పుడల్లా రక్తాని ఉచితంగా అందిస్తున్నారు. చిన్నారుల జీవితాలను కాపాడడానికి ప్రత్యేకంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. పాతబస్తీ పురానీహవేలీలో ఉన్న ఈ సొసైటీ సభ్యులు డాక్టర్ రమణా దండమూడి, మనోజ్ రూపాని, డాక్టర్ సుమన్ జైన్, అలీంబేగ్, కె. రత్నావళి, డాక్టర్ జె. రాజేశ్వర్, రమా ఉప్పల తదితరులు తలసేమియా బాధితులకు విశేషసేవలందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రక్త దానం చేయాలనుకునేవారు, రక్తం అవసరమైన తలసేమియా బాధిత చిన్నారులు సొసైటీ సంయుక్త కార్యదర్శి అలీం బేగ్ (9246534913)ను సంప్రదించవచ్చు.