Chiranjeevi Shares Blood Donation Pics On World Blood Donor Day: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇండస్ట్రీకి పెద్ద కొడుకులా వ్యవహరిస్తుంటారు. అంతేకాకుండా మంచి సినిమాలను ఆద్యంతం ప్రొత్సహిస్తూ చిత్రబృందాలను ప్రశంసిస్తుంటారు. అంతేకాకుండా 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' పేరిట ఎంతోమందికి రక్తదానం చేశారు చిరంజీవి. కాగా మంగళవారం (జూన్ 14) వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా ఓ ట్వీట్ చేశారు చిరంజీవి.
ఆయన ఇప్పటివరకు రక్తదానం చేసిన ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. వీటిలో ఆయన సతీమణి సురేఖ కూడా ఉన్నారు. 'రక్తదానం అనేది ఇతరుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడే సులభమైన మార్గం. ప్రపంచంలో అత్యధిక జనాబా కలిగిన రెండో దేశం మనది. ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక రక్తదాతలు ఉన్న దేశాలలో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో ఉందాం.' అని ట్వీట్ చేశారు.
చదవండి: 'మేజర్' సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్: చిరంజీవి
కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా
Blood donation is the simplest way of helping save other’s lives. We are the 2nd most populated country in the world.This #WorldBloodDonorsDay let’s also aim to be among the countries with Highest No of Blood Donors! #DonateBloodSaveLives pic.twitter.com/56lZiG6Vrk
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2022
Comments
Please login to add a commentAdd a comment