World Egg Day
-
కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మండపేట(కోనసీమ జిల్లా): గుప్పెడంత ఉండే గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు కలిగిన సూపర్ ఫుడ్‌గా గుడ్డును పేర్కొంటారు నిపుణులు. భారత పౌష్టికాహార సంస్థ గుర్తించిన 650 ఆహార పదార్థాల్లో గుడ్డు మొదటిది కావడం గమనార్హం. శరీరానికి ఆరోగ్యాన్ని అందించే గుడ్డు లక్షలాది మందికి ఉపాధి చూపుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన రంగాల్లో ఒకటిగా నిలిచింది. చదవండి: రైతు ట్రెండీ ఐడియా.. పంట పొల్లాల్లో హీరోయిన్ల ఫొటోలు పెట్టి..! రెండున్నర దశాబ్దాల క్రితం లండన్ కేంద్రంగా అంతర్జాతీయ గుడ్లు సమాఖ్య (ఐఈసీ) ఆవిర్భవించింది. ఆరోగ్య పరిక్షణలో గుడ్డు ప్రాధాన్యతను వివరించడమే లక్ష్యంగా ఏటా అక్టోబర్ రెండో శుక్రవారం ఐఈసీ ప్రపంచ గుడ్డు దినోత్సవం నిర్వహిస్తోంది. జాతీయ గుడ్లు సమ్వయ కమిటి (ఎన్ఈసీసీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వరల్డ్ ఎగ్ డే వేడుకలు నిర్వహిస్తుంటారు. పోషకాలివీ.. ♦50 గ్రాముల గుడ్డులో ఎనర్జీ 72 కేలరీలు ఉంటే, 6.3 గ్రాముల ప్రొటీన్లు, 4.8 గ్రాముల కొవ్వు, 28 గ్రాముల కాల్షియం, 0.9 గ్రాముల ఐరెన్, విటమిన్ ఏ 270 ఐయూ, విటమిన్ డి 41ఐయూ ఉంటాయి. శరీరానికి కావాల్సిన మరెన్నో పోషకాలు గుడ్డులో లభిస్తాయి ♦గుడ్డులో ఉండే విటమిన్ ఏ ఆరోగ్యకరమైన కణాల వృద్ధికి, చర్మం, కళ్లు వాటి కణజాలకు ఎంతో అవసరం ♦గుడ్డులో ఉండే విటమిన్ బి–12 ఎర్ర రక్తకణాల తయారీకి, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ♦కొలిన్ శరీరంలోని నాడీ, కండరాల వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ♦ఫోలిక్ ఆసిడ్ ఎర్ర రక్తకణాల తయారీకి, గర్భవతుల్లో పిండం పెరుగుదలకు, ఐరెన్ శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడుతుంది. కండరాల నిర్మాణం, అవయవాలు, చర్మం, ఇతర కణజాలాల నిర్మాణానికి, హార్మోనులు, ఎంజైములు, యాంటీబాడీల తయారీకి గుడ్డు ఎంతో మేలు చేస్తుంది ♦గుడ్డులోని సెలీనియం ఆరోగ్యకరమైన రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది ♦ఆరోగ్యకరమైన ఎముకలు, పళ్ల నిర్మాణానికి అవసరమైన కాల్షియాన్ని అందిస్తుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వైరస్‌ను తట్టుకునేందుకు, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రధాన పౌష్టికాహారంగా కోడిగుడ్డుకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. వేల మందికి ఉపాధి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, అనపర్తి, ద్వారపూడి, బలభద్రపురం, పెద్దాపురం, రావులపాలెం, రంగంపేట, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో పరిశ్రమ విస్తరించింది. 200 పౌల్ట్రీలు ఉండగా గుడ్లు పెట్టేవి, పిల్లలు తదితర దశల్లో దాదాపు 2.20 కోట్ల కోళ్లు ఉన్నాయి. గుడ్లు పెట్టే కోళ్లు దాదాపు 1.3 కోట్లు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక గుడ్ల ఉత్పత్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరుగుతుండటం గమనార్హం. ఇక్కడి ఉత్పత్తిలో 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సొం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. కోళ్లకు మేత వేయడం, నీళ్లు పెట్టడం, మందులు అందజేయడం, గుడ్ల రవాణా, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు కోడిగుడ్డులో పోషకాలు పుష్కలం శరీరానికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడంలో గుడ్డు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండడం వల్ల ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు, కండర నిర్మాణానికి మేలు చేస్తుంది. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
ఏడాదికి ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?
గుడ్డు అంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోషణలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే. గుడ్డు అనేక విటమిన్లు, మినరల్స్‌తో నిండిన సూపర్ ఫుడ్డు. గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్–ఇ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్లు, 78 కాలరీల శక్తి ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని కీలకమైన విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు దీనిద్వారా లభిస్తాయి. తెల్ల సొనలో అల్బుమిన్ పుష్కలంగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. తెల్ల సొన వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా, మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, చాలా సహాయపడుతుంది. (ఎండలో ఎంతసేపుంటే సరిపడా విటమిన్ ‘డి’ అందుతుంది?) ఒక సర్వే ప్రకారం, 80 శాతం భారతీయుల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఉన్నది. మనిషి బరువును బట్టి, కిలో బరువుకు, రోజుకు ఒక గ్రాము ప్రోటీన్‌ను ఆహారంలో తీసుకోవాలి. మరొక సర్వే ప్రకారం, 70–90 శాతం భారతీయులలో విటమిన్ డి లోపం ఉంది. ఆహార ఉత్పత్తులు ఎంత పెరిగినా, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మాత్రం తగిన మోతాదులో అందరికీ లభించటం లేదు. (బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?) ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 180 గుడ్లు తినాలని జాతీయ పోషణ సంస్థ సూచించినది. కాని, మన దేశంలో సగటు వినియోగం 70 గుడ్లు మాత్రమే ఉన్నది. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు ఉంది. మన వద్ద అది 70 కంటే మించడం లేదు. గుడ్ల వినియోగంలో, ప్రపంచంలో మన ర్యాంకు 114. ఇది చాలా తక్కువ. దీన్ని గుర్తించిన మన ప్రభుత్వాలు కూడా, విద్యార్థులకు, గర్భిణి స్త్రీలకు, మధ్యాహ్న భోజనం లాంటి పథకాల్లో గుడ్లను అందించి, పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి. అంతర్జాతీయ ఎగ్ కమిషన్ ధ్యేయం గుడ్డు వినియోగంతోనే పోషకాల లోపాలను భర్తీచేసి, మెరుగైన ఆరోగ్యాన్ని సాధించటం. – సురేష్ చిట్టూరి, చైర్మన్, అంతర్జాతీయ ఎగ్ కమిషన్ -
2.5 లక్షల గుడ్లు పంచేశారు!
సాక్షి, థానే : 'వరల్డ్ ఎగ్ డే'ను పురస్కరించుకుని ముంబై, థానేలలో విద్యార్థులకు కోడిగుడ్లను పంపిణీ చేశారు. థానేతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల గుడ్లను పిల్లలకు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లా అధికార యంత్రాంగం ఉడికించిన గుడ్లను అంగన్వాడీలు, బాల్వాడీలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలలో పంచారు. అంతేకాక గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును తీసుకోవడం ద్వారా మంచి ప్రోటీన్ అందుతుందని చెప్పారు. థానే జిల్లా ముఖ్యఅధికారి వివేక్ భిమన్వార్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 1,230 అంగన్వాడీలు, బాల్వాడీలు, ఫ్రీస్కూల్స్ ఉన్నాయని, సుమారు 1.3 లక్షల మంది బాలలు ఈ కేంద్రాల్లో చదువుకుంటున్నారని, వారందరకీ గుడ్లను పంచామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా యానిమల్ హస్బెండరీ అధికారి డాక్టర్ ప్రశాంత్ కాంబ్లే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వారంతా రోజూ క్రమం తప్పకుండా గుడ్డు తింటే సరిపడా పోషకాహారం అందుతుందన్నారు. -
గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో రాష్ట్రం
పరిశ్రమ అభివృద్ధి వల్లే చౌకగా గుడ్లు, మాంసం లభ్యం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఘనంగా ప్రపంచ గుడ్డు దినోత్సవం అనపర్తి(బిక్కవోలు) : రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే గుడ్ల ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. దీన్ని మొదటి స్థానంలోకి తెచ్చేందుకు వివిధ రాయితీలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా అనపర్తి ఏరియా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వేడుకలు బిక్కవోలు మండలం బలభద్రపురం ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అనపర్తి జీబీఆర్ కాలేజీ నుంచి సుమారు వెయ్యి మందితో 2కే రన్‌ను ఎమ్మెల్యే ఎన్.రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. రన్లో నెక్ రైతులతో పాటు విద్యార్థులు పాల్గొని గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం బలభద్రపురం ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో చినరాజప్ప మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే సామాన్యుడికి గుడ్డు, కోడి మాంసం అతి చౌకగా లభిస్తున్నాయన్నారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కోళ్ళ రైతులకు ఏడు శాతం సబ్సిడీతో ఏడాదికి రూ.50 కోట్ల వరకూ రుణాలు అందిస్తుందన్నారు. పౌల్ట్రీ రంగ పితామహుడు డాక్టర్ బి.వి.రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కల్తీకి ఆస్కారం లేని ఆహారం కోడిగుడ్డు అన్నారు. గుడ్డులో పోషకాలను గుర్తించిన ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు చొప్పున అందిస్తుందన్నారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మన్మోçßæన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ 11.02 శాతం అభివృద్ధి సాధించి రూ.10 వేల కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నామన్నారు. జిల్లా నెక్ చైర్మన్ పడాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోడిగుడ్డు పూర్తిగా శాఖాహారమని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చన్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, శ్రీనివాసా హేచరీస్ జేఎండీ కె.సోమిరెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం ‘కోడిగుడ్డుతో పలు రకాల వంటకాలు’ పుస్తకాన్ని మంత్రి సుజాత, గుడ్డు శాఖాహారం వాల్‌పోస్టర్‌ను మంత్రి చినరాజప్ప ఆవిష్కరించారు. కేర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ బి.సరళా రాజ్యలక్ష్మి, కేపీఆర్ సంస్థల చైర్మన్ కొవ్వూరి పాపారెడ్డిలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, తేతలి ఉపేంద్రరెడ్డి, అనపర్తి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, బిక్కవోలు, అనపర్తి ఎంపీపీలు బేరా వేణమ్మ, ఉమామహేశ్వరి, నెక్ ఆడ్వయిజర్ కె.బాలాస్వామి, శ్రీనివాసా హేచరీస్ వైస్ చైర్మన్ సురేష్‌రాయ్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ముకుంద రెడ్డికి 'బిగ్గెస్ట్ లేయర్ ఫార్మర్ అవార్డు'
మండపేట : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పౌల్ట్రీలు నెలకొల్పి అత్యధికంగా కోళ్లను పెంచుతున్న శ్రీలక్ష్మీ ఎగ్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కర్రి వెంకట ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్) బిగ్గెస్ట్ లేయర్ ఫార్మర్ అవార్డుతో సత్కరించింది. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, సుదర్శన్ భగత్ చేతులమీదుగా ముకుందరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ముగ్గురిని ఎంపిక చేయగా అందులో జిల్లాకు చెందిన ముకుందరెడ్డి ఒకరు కావడం గమనార్హం. కేపీఆర్ గ్రూప్స్‌లో భాగంగా 1998లో 2 లక్షల కోళ్లతో తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో శ్రీలక్ష్మీ పౌల్ట్రీ కాంప్లెక్స్‌ను నెలకొల్పిన ముకుందరెడ్డి అంచెలంచెలుగా విస్తరించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 28 లక్షల లేయర్ కోళ్లను పెంచుతున్నారు. అత్యధికంగా లేయర్ కోళ్లను పెంచుతున్నందుకుగానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర వ్యవసాయ శాఖ సహకారం అందించాల్సిందిగా కేంద్ర మంత్రులను కోరినట్టు ముకుందరెడ్డి తెలిపారు. న్యూఢిల్లీ నుంచి 'సాక్షి'తో ఆయన ఫోన్లో మాట్లాడారు. స్థానికంగా గుడ్ల వినియోగం పెంచేందుకు కృషి చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు ముకుందరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా తెగుళ్ల బెడదతో పౌల్ట్రీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, చిన్న పౌల్ట్రీలు మూతపడుతున్న విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కోళ్ల మేతల కృత్రిమ కొరత సమస్యను పరిష్కరించాలని, మొక్కజొన్న, ఇతర ఉత్పత్తులను కోళ్ల రైతులకు రాయితీపై సరఫరా చేయాలని కోరామని తెలిపారు. ఈ మేరకు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్టు ముకుందరెడ్డి తెలిపారు. -
నేను వెరీ'గుడ్డు'...
అక్టోబర్ 14 వరల్డ్ ఎగ్ డే గుడ్డు చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే, పోషకాల్లో ఇది మిన్నగా ఉంటుంది. ధరలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. పిల్లలు రోజూ గుడ్డు తింటే వారి ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పెద్దలు తింటే పనుల వల్ల నీరసించకుండా ఉంటారు. వారానికి కనీసం నాలుగు గుడ్లు తింటున్నట్లయితే డయాబెటిస్ దరి చేరదని తాజా ఫలితాలు కూడా తేల్చాయి. గుడ్డులో కండరాల ఎదుగుదలకు దోహదపడే మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. కంటిచూపును కాపాడే విటమిన్-ఎ, రోగ నిరోధకతను పెంచే విటమిన్-బి, ఎముకలను పటిష్టంగా ఉంచే విటమిన్-డి, మేనివర్ఛస్సును కాపాడే విటమిన్-ఇ, రక్తం గడ్డకట్టేందుకు దోహదపడే విటమిన్-కె వంటి విటమిన్లతో పాటు సక్రమమైన శరీర పోషణకు అవసరమైన కీలక ఖనిజ లవణాలు, శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు ఉంటాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే మరే పదార్థంలోనూ ఇన్ని పోషకాలు ఉండవు. అందుకే గుడ్డు... పోషకాల విలువలో వెరీగుడ్డు. గుడ్డు గురించి విశేషాలు... గుడ్డులోని పోషక విలువల సంగతి చాలామందికి తెలిసినదే. గుడ్డు బలవర్ధకమైన ఆహారం అనే సంగతి కూడా తెలిసిందే. గుడ్డు గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు... ♦ విటమిన్-డి పుష్కలంగా లభించే పదార్థాల్లో గుడ్డులోని పచ్చసొనదే అగ్రస్థానం. ♦ గుడ్డులో కొవ్వులు 5 గ్రాములకు మించి ఉండవు. గుడ్డు వల్ల శరీరానికి చేరే కేలరీలు కూడా 78 మాత్రమే. ♦ గుడ్డులో మన శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్లన్నీ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తుల విలువలో తల్లిపాల తర్వాతి స్థానం గుడ్డుదే. ♦ గుడ్డు పెంకు రంగుకు, గుడ్డులోని పోషకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. గుడ్డును పెట్టే పెట్ట జాతిబట్టి పెంకు రంగు మారుతుంది. ♦ అరకానా జాతికి చెందిన కోడిపెట్టలు రంగు రంగుల గుడ్లు పెడతాయి. ఇవి పెట్టే గుడ్ల పెపైంకులు గులాబి, నీలం, ఆకుపచ్చ వంటి రకరకాల రంగుల్లో ఉంటాయి. ♦ గుడ్ల ఉత్పత్తిలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉంటే, మనది మూడో స్థానం. గుడ్డు రికార్డు గుడ్డు బరువు సాధారణంగా 50-70 గ్రాముల వరకు ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వద్ద మెల్లర ప్రాంతంలో 1896 సంవత్సరంలో స్టాఫోర్డ్ అనే ఆసామి పెరట్లో పెంచుకుంటున్న కోడిపెట్ట అత్యంత భారీ గుడ్డు పెట్టింది. ఏకంగా 12.2 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉన్న ఆ గుడ్డు బరువు 340 గ్రాములు. గిన్నెస్ బుక్‌లోకి ఎక్కిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇంగ్లాండ్‌లోనే 2010లో ఇప్స్విచ్ ప్రాంతంలో ఒక కోడిపెట్ట 8.3 అంగుళాల పొడవు, 3.5 అంగుళాల వెడల్పుతో గుడ్డు పెట్టింది.