youth voters
-
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
-
BJP: కాఫీ విత్ యూత్
సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్ యూత్’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ మోర్చా నేతలు కొత్త ఓటర్లను అడుగుతున్నారు. ముంబైలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో వీటిని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. యువ ఓటర్ల నాడి తెలుసుకుని, వారిని బీజేపీ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి... ముంబైలో ఇటీవల పలుచోట్ల దాదాపు 300 మంది యువ ఓటర్లతో బీజేపీ యువ మోర్చా నేతలు ‘కాఫీ పే చర్చ’ నిర్వహించారు. పదేళ్ల్లలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వారికి వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఈ చర్చలను విస్తరిస్తున్నారు. ప్రతి భేటీలో కనీసం 150 నుంచి 200 మంది యువ ఓటర్లుండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘కాఫీ పే చర్చ’లో బూత్ స్థాయి కార్యకర్త మొదలు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని దాకా పాల్గొంటారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలోని కనీసం 10 మంది కొత్త, యువ ఓటర్లను ఈ చర్చకు తీసుకొస్తున్నారు. రెస్టారెంట్లు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వినూత్నంగా దీన్ని నిర్వహిస్తున్నారు. మోదీ పేర్కొన్న ‘విజన్ 2047’ లక్ష్యంతో చర్చ సాగుతోంది. ‘రాబోయే ఐదేళ్లలో దేశంలో యువత పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏం చేస్తే యువతకు దగ్గరవుతుంది? అన్ని రంగాల్లోనూ ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరాలంటే ఏం చేయాలి? అవినీతి నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, పేదరికం లేని ఇళ్లు’ తదితర అంశాలపై రెండు నుంచి మూడు గంటల పాటు కార్యక్రమం జరుగుతోంది. యువ ఓటర్ల సలహాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. -
జిల్లాలో సగం కన్నా ఎక్కువ యూతే..
సాక్షి, సిరిసిల్ల: జిల్లా నిండా యువోత్సాహం కనిపిస్తోంది. మొత్తం ఓటర్లలో 51.54 శాతం 39 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారు. రాష్ట్రఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాను పరిశీలిస్తే.. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. జిల్లా జనాభాలో 73.20 శాతం ఓటర్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల నాటి వివరాలను పరిశీలిస్తే.. పార్లమెంట్ ఎన్నికల నాటికి చాలామార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా 27,896 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ‘యువ’ ఓటర్లే అధికం జిల్లా ఓటర్ల సంఖ్య 4,33,902 కాగా ఇందులో 18 – 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య 2,23,638 ఉంది. అంటే జిల్లా ఓటర్లలో 51.54 శాతంగా నమోదైంది. సగానికి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండడం విశేషం. ఎన్నికల సంఘం ఇటీవల కల్పించిన ఓటర్ల నమోదులో కొత్తగా 27,896 నమోదు ఓటర్లుగా తమ పేర్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఫాం–6 ద్వారా అనేకమంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడం విశేషం. మహిళా ఓటర్లు అధికం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో పురుషుల ఓటర్ల సంఖ్య 2,11,324 కాగా.. మహిళలు ఓటర్లు 2,22,572 మంది ఉన్నారు. పురుషుల కంటే 1,1248 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో గెలుపోటముల్లో మహిళల పాత్ర కీలకంగా మారనుంది. మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటానికి గల్ఫ్ వలసలు కారణాలుగా భావిస్తున్నారు. జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గాల వారీగా.. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం సిరిసిల్ల 1,11,926 1,15,994 3 2,27,923 వేములవాడ 99,398 1,06,578 3 2,05,979 -
‘ఫేటు’ మార్చే ఓటు..!
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైనదే.. గెలుపు ఓటములను శాసించేదే.. ఒక్క ఓటు చాలు.. అభ్యర్థుల తలరాతలను తారుమారు చేయడానికి.. ఆ ఒక్క ఓటు నీదే కావచ్చు..!.. అభ్యర్థి విజయాన్ని నీ ఓటే నిర్దేశించవచ్చు.. నీకు ఓటు హక్కు ఉంటేనే.. ఆ హక్కును వినియోగించుకుంటేనే.. నీ భావి పాలకులను నిర్దేశించే స్థితిలో ఉంటావు.. అసలు ఉంటే ఎంత.. లేకపోతే ఎంత.. అని నిర్లిప్తత వహిస్తే.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును నీకు నీవే కాలరాసుకున్నవాడివవుతావు.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించే నైతిక అర్హత కోల్పోతావు.. కానీ దురదృష్టవశాత్తు ఆ నిర్లక్ష్యమే మన ఘన ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తోంది. ఓటరుగా చేరడం, ఓటు హక్కు వినియోగించుకోవడంలో విద్యావంతులే అనాసక్తత ప్రదర్శిస్తుండటంతో సగం ఓట్లు కూడా పొందనివారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైపోతున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్నారు. జనాభాలో ఓటుహక్కు పొందే వయసు వచ్చినా వేలాదిమంది దానిపై ధ్యాస చూపడం లేదు. జనాభా, ఓటర్ల సంఖ్య మధ్య కనిపించే భారీ వ్యత్యాసమే దీనికి నిదర్శనం. తాజా గణాంకాల ప్రకారం.. ఓటు హక్కు వచ్చే 18–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 3,97,224 మంది ఇంకా ఓటర్లు చేరనేలేదంటే నిర్లిప్తత ఎంతగా పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి.. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని అందరూ శపథం పూనాలి. సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు కంకణబద్ధులు కావాలి.. అయితే దానికి ఎంతో సమయం లేదు.. మిగిలింది నాలుగు రోజులే.. ఈ నెల 15 వరకే కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అందుకే యువతా మేలుకో.. ఓటు ఉత్సాహం ఉరకలెయ్.. ఓటరు జాబితాలను ముంచెత్తు.. భావి నేతల ఎన్నికలో క్రియాశీల పాత్ర పోషించు..! -
మేము సైతం..
అమెదక్ అర్బన్: మెదక్ జిల్లాలో ఓటరు నమోదుకు మంచి స్పందన లభిస్తోంది. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని వారు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఒకవైపు గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి ఉండగా ఓటరు నమోదు ప్రక్రియ సైతం ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వపరంగా సంబంధిత దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకితీసుకువచ్చారు. ఇదిలా ఉండగా వివిధ రాజకీయ పార్టీలు సైతం ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించడానికి ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో పార్టీల నాయకులు, బాధ్యులు ఓటరు నమోదుకు సంబంధించిన ఫారాలను, మార్గదర్శకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావుడి, అది పూర్తి కాగానే గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో ఓటుహక్కుకోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 4వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 19,993 మంది నూతనంగా ఓటరు లిస్టులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వారిలో 18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారు. ఓటరు నమోదుపై జిల్లా యంత్రాంగం ఆయా కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం, ఓటు హక్కు విలువ తెలియజేయడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. దీంతో కళాశాలల్లోని యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం 3,97,999 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో 1,95,649, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,02,350 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన నూతన ఓటరు నమోదు ప్రక్రియతో 19,993 మంది ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఓటు హక్కుకు నూతనంగా నమోదు చేసుకున్నారు. వాటిలో మెదక్ నియోజకవర్గం నుంచి 10,757, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 9,236 మంది కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది. -
యువోత్సాహం
సాక్షి, వరంగల్ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే మునుపెన్నడూ లేనివిధంగా యువత పల్లె ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గిరిని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. విద్యావంతుల ఆసక్తి.. ముఖ్యంగా విద్యావంతులైన యువకులు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపులో యువకులు కీలక పాత్ర పోషించారు. దీంతో జీపీ ఎన్నికల బరిలో నిలిచి విజయాన్ని ముద్దాడుతామనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల కోసం రిజర్వేషన్లు ప్రకటించింది. కాగా అధికార పార్టీ తరఫున ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయడానికి యువత నుంచి తీవ్ర పోటీ నెలకొంది. వివిధ రాజకీయ పార్టీ నాయకులను కలిసి తమకే ఆయా పార్టీల నుంచి టికెట్లు వచ్చేలా సంప్రదింపులు చేస్తుంది. పల్లెలకు పరుగులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 4.5లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. 21 సంవత్సరాలు నిండిన వారు సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అర్హులు కావడంతో పైచదువుల నిమిత్తం పట్టణాల్లో ఉన్న యువత పల్లెలకు చేరుకుంటుంది. వివిధ ప్రైవేట్ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సైతం తమ వృత్తికి రాజీనామా చేసి పల్లె పోరులో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాము పుట్టిన ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే గొప్ప సంకల్పంతో స్వగ్రామానికి పరుగులు పెడుతున్నారు. మచ్చిక చేసుకునే పనిలో.. సర్పంచ్‌గా పోటీలో నిలిచే యువకులు ఇప్పటికే గ్రామ పెద్దలను, ప్రజలను కలుస్తున్నారు. గ్రామంలో ఎక్కడ నలుగురు గుమిగూడి ఉంటే అక్కడికి వెళ్లి వారితో మమేకమై మాటలు కలుపుతున్నారు. ఇలా అందరిని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరికొందరైతే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. మహిళా కోటలో యువతులు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 853 గ్రామాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 65, రూరల్ 199, జనగామ 150, మహబూబాబాద్ 230, జయశంకర్ భూపాలపల్లిలో 209గ్రామాలను మహిళలకు కేటాయించారు. తెలంగాణ పంచాయతీ రాజ్(ఎన్నికల నిర్వహణ) నియమావళి 2018 ప్రకారం ఒక వ్యక్తికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే 31–5–1995 కంటే ముందు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేసే వీలుంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న రాజకీయ నాయకులు తమ కూతుళ్లను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కూతురు విద్యావంతురాలు, గ్రామాన్ని అభిృవృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రుపొందిస్తుందని ప్రచారం చేసి సర్పంచ్ గిరిని దక్కించుకోవచ్చని ముందడుగు వేస్తున్నారు. -
గో... గోవా!
అనిల్‌కుమార్ భాషబోయిన, ఉమ్మడి పాలమూరులో ఓ యువనేత తన నియోజకవర్గంలోని పలు మండలాల యువతతో నిత్యం టచ్‌లో ఉంటాడు. ఇటీవల వారికి ఓ వాహనం ఇచ్చి గోవాకు వెళ్లి రమ్మని చేతి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చాడు. ఉమ్మడి మెదక్‌లో ఓ వివాదాస్పద నేత తన అనుచరులకు ఇదే పని అప్పగించారు. ఇప్పటికే పలువురు యువతకు వాహనాలిచ్చి గోవా ట్రిప్పులకు బండిపెట్టాడు. కరీంనగర్లో మరో నేత యువతను హైదరాబాద్‌కు పంపుతున్నాడు. సరదాగా పబ్‌కి వెళ్లి రావాలని ఎంట్రీ పాసులు కూడా ఇస్తున్నాడు. కొన్ని జిల్లాల్లో నేతలు మద్యం దుకాణాలు, బార్లతో ముందస్తు ఒప్పందం చేసుకుని. యువతకు మద్యం చీటీలు జారీ చేస్తున్నారు. ఈ చీటీ ఇస్తే తాగినంత మద్యం అందిస్తున్నారు. ‘శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు’ అంటారు పెద్దలు. అవినీతి కూడా ఎపుడూ ఒకేలా ఉండదు. నిత్యం తన రూపు మార్చుకుంటూ పోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటుకు వంద నోటు, క్వార్టర్ మద్యం ఇచ్చే రోజులకు కాలం చెల్లింది. ఓటర్ల రుచులు, అభిరుచులు మారుతున్నాయి. అందుకు తగినట్లుగానే రాజకీయ నాయకులు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 40 శాతం యువత ఉంది. తెలంగాణలో దాదాపుగా 119 నియోజకవర్గాల్లో యువ ఓటర్లు కోటికిపైగానే ఉంటారు. ఈ ఎన్నికలకు మరో 7 లక్షలకుపైగా కొత్త ఓటర్లు వచ్చి చేరారు. ఈ లెక్కలే ప్రామాణికంగా రాజకీయ నేతలు సరికొత్త ప్రలోభాలకు దిగుతున్నారు. యువతే లక్ష్యంగా.. ప్రతీ నియోజకవర్గంలోనూ యువతే కీలకం. వీరి ఎటువైపు మొగ్గితే వారిదే విజయం. అందుకే, తమ పార్టీ ఓటు బ్యాంకుకు వీరు తోడైతే.. ఇక విజయం నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారు. ఈ రోజుల్లో యువత చాలామంది డబ్బులు తీసుకునేందుకు సుముఖంగా లేరు. వారిని నేరుగా కొనలేమని గ్రహించిన రాజకీయ నాయకులు మరోరకంగా వారిని వశం చేసుకుంటున్నారు. అందుకే, యువతను ఆకర్షించడానికి గోవా టూర్లు, హైదరాబాద్ ట్రిప్పులు పెడుతున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లోని మిగిలిన ప్రజల్ని ప్రభావితం చేయగల సామర్థ్యమున్న యువతను ఈ యాత్రలకు పంపుతున్నారు. గెలిస్తే.. మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటామన్న సంకేతాలు ఇస్తున్నారు. ఈ ప్రచారం ఇప్పటికే బాగానే వర్కవుటవుతోంది. యాత్రలకువెళ్లి వచ్చినవారు వీరికి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిని చూపించి వీరి మిత్రులు కూడా ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పకుంటున్నారు రాజకీయ నేతలు. 40 దాటిన వారికి స్కీములు.. యువత విషయంలో ఎలాంటి జాగ్రత్తలైతే పాటిస్తున్నారో.. సరిగ్గా అదేసమయంలో 40 ఏళ్లు దాటినవారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకునేవారిలో 40 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు అధికం. అందుకే, వీరిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కొందరు మహిళలకు ఉచితంగా రూ.1000పైన కిరాణా సామాగ్రి ఇప్పిస్తున్నారు. ఆరునెలల పాటు కేబుల్ బిల్లు ఉచితంగా చెల్లిస్తున్నారు.పురుషులకు ఎంపిక చేసిన బార్ షాపుల ద్వారా ఉచితంగా మద్యం సరఫరా చేయిస్తున్నారు. నేరుగా కాకుండా అనుచరుల ద్వారా ముందుగానే ‘మద్యం చీటీలు’ పంపిణీ చేస్తున్నారు బహుమతుల వల ట్రిప్పులతో పాటు కాలేజీ కుర్రాళ్లకు క్రికెట్, ఇతర స్పోర్ట్స్ కిట్లు, స్మార్ట్ఫోన్లకు రీచార్జ్‌లు, ఫోన్‌పే, పేటీఎంలో రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చుల కింద ఇస్తున్నారు. కోటి విద్యలూ ఓటు కోసమే అన్నట్లుగా.. యువతకు చేరువ అయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. -
సినిమా చూపిస్తారు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చేలా మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్‌కు అనూహ్యమైన స్పందన రావడం, ఎన్నికల కమిషన్ ఈసారి పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టడంతో పాటు పోలింగ్‌కు అందరూ హాజరయ్యేలా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇక తాజాగా యువతే లక్ష్యంగా వారిని ఆకట్టుకునేలా వర్చువల్ రియాలిటీ షోల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా... యువతే లక్ష్యం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని.. పోలింగ్ పాల్గొనకుంటే ఏమవుతుందిలే అనే భావనతో పలువురు యువతీ, యువకులు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. గత కొన్నేళ్లలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇది నిజమేనని తెలుస్తోంది. ఈసారి అలా కాకుండా యువ ఓటర్లను వంద శాతం పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా వారికి వినూత్న తరహాలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక చొరవతో దేశంలోనే మొదటిసారిగా వర్చువల్ రియాలిటీ షోల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఫోన్‌ను వీఆర్ డివైజ్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను వీక్షించే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. ఈ డివైజ్లతో మండలానికి కేటాయించిన ట్రైనర్లు వచ్చి ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతారు. అందుకోసం వీఆర్ఎలు, కంప్యూటర్ ఆపరేటర్లకు మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆధ్వర్యాన వర్చువల్ రియాలిటీ షోపై శిక్షణ ఇచ్చారు. ఇలా చేస్తారు... మండలాల్లో కార్యక్రమాల నిర్వహణ, ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, వీఆర్ డివైజ్‌ల వాడకం, వర్చువల్ రియాలిటీ షోల నిర్వహణపై పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన కల్పించారు. కాగా, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లు, వీఆర్ డివైజ్‌లు అందజేస్తారు. అందులో యాప్ డౌన్లోడ్ చేసి ఊర్లలో ప్రధాన కూడళ్లు, కళాశాలలు, ఇతర రద్దీ ప్రాంతాలకు వెళ్లి ఆ డివైజ్‌లో ఫోన్ ఉంచి యువతీ, యువకులకు ఇస్తూ పోలింగ్‌కు సంబంధించి వీడియోను ప్లే చేస్తారు. తద్వారా వారు నిజమైన పోలింగ్ కేంద్రానికి వెళ్లిన అనుభూతిని పొందడం ద్వారా పోలింగ్‌కు వెళ్లాలనే ఆసక్తి కలుగులుందని అధికారుల భావన. యువ ఓటర్లు 5,90,897 మంది మహబూబ్‌నగర్ జిల్లాలో ఈసారి జరగనున్న సాధారణ ఎన్నికల్లో యువత ఓటు కీలకం కానుంది. ఓటర్ల జాబితాలో వారిదే అగ్రస్థానంగా ఉండటం, అందులో చదువుకున్న వారే ఉండడంతో ఎన్నికలు పారదర్శకతకు వేదిక కానున్నాయి. జిల్లాలో మొత్తం 10,04,481 మంది ఓటర్లు ఉండగా అందులో సగానికి పైగా 18 నుంచి 39 ఏళ్ల లోపు ఉన్నవారు 5,90,897 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు యువ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే, మంచీ చెడులను బేరీజు వేసుకొని పూర్తి అవగాహనతో యువత సమర్థులైన నాయకులకే పట్టం కట్టే అవకాశముంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో యువత ఓట్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానుందని భావిస్తున్నారు. పోలింగ్‌లో పాల్గొంటున్న అనుభూతి వినూత్న తరహాలో అవగాహన కల్పించేందుకు వినియోగించనున్న వర్చువల్ రియాలిటీ షోను ఓటర్లు వీక్షించే సమయంలో స్వయంగా పోలింగ్ బూత్‌లో పాల్గొంటున్న అనుభూతి కలుగుతుంది. క్యూలైన్ మొదలుకుని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, అధికారులెవరెవరు ఉంటారు, ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు వేయడమెలా, ఓటు వేసి బయటికి వచ్చే వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఈ షో ద్వారా వీక్షించే వారికి స్వయంగా పోలింగ్‌లో పాల్గొంటున్న అనుభూతి కలుగుతుంది. జిల్లాలో ఇప్పటికే స్వీప్ కార్యక్రమాలు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, మాక్‌పోలింగ్, కళాకారుల ద్వారా ప్రచారం నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించిన అధికార యంత్రాంగం యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని సరికొత్త విధానంలో వర్చువల్ రియాలిటీ షోల ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలకు ఉపక్రమించింది. అన్ని మండల కేంద్రాల్లోని కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు వంటి ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేస్తున్నారు. సరైన వ్యక్తికే నా ఓటుసరైన వ్యక్తికే నా ఓటు నేను ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశాను. ఓటు హక్కు రాగానే ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎలాంటి వారో తెలుసుకుని మంచి వ్యక్తికే నా ఓటు వేస్తాను. అభ్యర్థి పని తీరు బేరీజు వేసుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటా. నగదు పంపిణీ చేసే నాయకులను నా ఓటుతో వ్యతిరేకిస్తా. – పి.శిరీష, పల్లెమోని కాలనీ గ్రామపంచాయతీ అభివృద్ధి చేసే వారికే... అభివృద్ధి చేసే వారికే నేను నా ఓటు వేస్తా. మొదటి సారిగా నాకు ఈసారే ఓటు హక్కు లభించింది. నా ఓటును వృథా కానివ్వను. అభ్యర్థుల మంచీ చెడులు తెలుసుకుంటా. ఎవరు సమర్థులో గుర్తించాక మంచి వ్యక్తికే ఓటు వేస్తా. నేను డబ్బులు పంపిణీ చేసే వారికి ఓటు వేయను. – ఎం.శిల్ప, బండ్లగేరి, మహబూబ్‌నగర్ -
యువతకు గాలం
సాక్షి, భూపాలపల్లి: ఈ సారి ఎన్నికల్లో యువకులు కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లాలో కొత్త యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. దీంతో వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండు సెగ్మెంట్లలో కలిపి లక్షకు పైగా యువ ఓటర్లు ఉన్నారు. వీరు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకంగా మారనుండడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి వారిపై పడింది. వారు ఎటువైపు మొగ్గుచూపుతారోనని యువకుల నాడి పట్టుకునేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు తదితర హామీలను ప్రత్యేకంగా గుప్పిస్తున్నారు. 1,13,322 మంది యువ ఓటర్లు.. రెండు నియోజకవర్గాల్లో కలిపి 1,13,322 మంది యువ ఓటర్లు ఉన్నారు. వీరిలో 18–19 సంవత్సరాల వయసు ఉన్నవారు 9,923 మంది ఉంటే వీరిలో యువకులు 5,919, యువతులు 4,004 మంది ఉన్నారు. 20–29 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లు 1,03,399 మంది ఉండగా వీరిలో పురుషులు 57,104, స్త్రీలు 46,295 మంది ఉన్నారు. ములుగు నియోజకవర్గంతో పోలిస్తే భూపాలపల్లిలో ఎక్కువగా యువ ఓట్లు ఉన్నాయి. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారిని తీసుకుంటే ములుగులో 52,360 ఓటర్లు ఉండగా భూపాలపల్లి పరిధిలో 60,962 మంది ఉన్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు యువ ఓటర్లపై ఫోకస్ పెంచాయి. దాదాపు అందరూ విద్యావంతులే కావడంతో వారి ఓట్లు ఎలా పొందాలనే ఆలోచనలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాడానికి నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. ఆకర్షించే పనిలో పార్టీలు జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాక ఇప్పుడిప్పుడే పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. చేరికల్లో ముఖ్యంగా యువత ఎక్కువ సంఖ్యలో ఉండడంతో నాయకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెబుతున్నాయి. అధికారంలోకి రాగానే మెగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని అంటున్నాయి. మరో వైపు యువత ఎప్పుడూ కేసీఆర్ పక్షమే అని టీఆర్ఎస్ నాయకులు చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై యువత తీవ్ర వ్యతిరేకంగా ఉందని, వారు తమ పార్టీనే ఆదరిస్తారనే ధీమాలో ఉన్నారు. -
మధ్య వయస్కులే అధికం...
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: జిల్లా వ్యాప్తంగా వయస్సుల వారీగా ఓటర్ల లెక్క తేలింది. జాబితాలో కొత్తగా నమోదైన ఓటర్లు, యువ ఓటర్లు, మధ్య వయస్సు గల వారు, వృద్ధులు, 80 ఏళ్లకు పైబడిన వారు.. ఇలా అన్ని వయస్సుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. 18 నుంచి 29 ఏళ్ల వయస్సు గల వారిని యువ ఓటర్లుగా, 30 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారిని మధ్య వయస్కులుగా, 60 నుంచి 79 ఏళ్లు ఉన్న వారిని వృద్ధులుగా పరిగణించడంతోపాటు 80ఏళ్లకు పైబడిన వారిని కూడా ఓటరు జాబితాలో చేర్చి వయస్సుల వారీ జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని వయస్కుల ఓటర్లు కలిపి 3,77,562 మంది ఉండగా, ఇందులో మధ్య వయస్సు గల ఓటర్లు 2,17,198 మంది ఓటర్లుగా ఉన్నారు. జిల్లాలో 1,18,049 మంది ‘యువ’ ఓటర్లు ఉండగా, 38,790 వృద్ధ ఓటర్లు, 3,462 మంది 80ఏళ్లకు పైబడిన ఓటర్లు ఉన్నారు. 63 మంది ఇతరులు ఉన్నారు. ఈ విషయాలు ఈ నెలలో ఎన్నికల సంఘం ప్రకటించిన వర్గాల వారీ ఓటరు జాబితాలో స్పష్టంగా తేలింది. కాగా, జిల్లాలో మొత్తం 3,77,562 మంది ఓటర్లు ఉండగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,96,849 మంది, బోథ్‌లో 1,80,713 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, 30 ఏళ్ల నుంచి 80 ఏళ్లపైగా ఉన్న వయస్సుల వారీ ఓటరు జాబితాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఓటర్లు ఇలా.. జిల్లాలో మధ్య వయస్సున్న ఓటర్లు 2,17,198 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,07,278 మంది ఉండగా, 1,09,920 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొత్తం మధ్య వయస్సు గల ఓటర్లు 1,14,235 ఉండగా, ఇందులో 56,571 మంది పురుషులు ఉన్నారు. 57,664 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం మధ్య వయస్సు గల ఓటర్లు 1,02,963 మంది ఉండగా, ఇందులో పురుషులు 50,707 మంది, మహిళా ఓటర్లు 52,256 మంది ఉన్నారు. యువత తాజాగా విడుదలైన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 1,18,049 మంది యువ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 61,298 మంది ఉండగా, మహిళలు 56,751 మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా యువత ఓటర్లను గమనిస్తే.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొత్తం 60,523 మంది యువ ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 31,280 మంది, మహిళలు 29,243 మంది ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం యువ ఓటర్లు 57,526 మంది ఉండగా, ఇందులో పురుషులు 30,018 మంది, మహిళలు 27,508 మంది యువ ఓటర్లుగా ఉన్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో 10,185 మంది యువత ఈ యేడాది జాబితాలో కొత్తగా చేరారు. ఇందులో 5,669 మంది పురుషులు ఉండగా, 4,516 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరు డిసెంబర్లో జరుగనున్న పోలింగ్‌లో కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వృద్ధులు జిల్లాలో 38,790 మంది వృద్ధులు ఓటర్లుగా ఉన్నారని ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో ఉంది. వృద్ధ పురుషులు 17,661 మంది ఉండగా, వృద్ధ మహిళలు 21,129 మంది ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొత్తం 20,571 మంది వృద్ధ ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 9,787 మంది, మహిళలు 10,784 మంది ఉన్నారు. అలాగే బోథ్‌లో మొత్తం వృద్ధ ఓటర్లు 18,219 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 7,874 మంది ఉండగా, మహిళలు 10,345 మంది ఉన్నారు. ఇవీ కాకుండా జిల్లాలో 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 3,462 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో పురుషులు 1,158 మంది ఉండగా, 2,304 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. -
యువ ఓటర్లే కీలకం
జిల్లాలోని అభ్యర్థుల భవితవ్యం యువకుల చేతిలో కేంద్రీకృతమైంది. మొత్తం ఓటర్లలో సగానిపైగా యువ ఓటర్లే ఉన్నారు. మరో ఆసక్తికర విషయమేమంటే ఇందులో యువతుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అభ్యర్థులు యువమంత్రాన్ని జపిస్తున్నారు. వారిని ఆకర్షించడానికి ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్నారు. వారితో మాట్లాడేందుకు యువ నాయకులను రంగంలోకి దించుతున్నారు. తమ ప్రచారాల్లోనూ యువకులను ఎక్కువగా కలుస్తూ ఆదరించాలని కోరతున్నారు. యువత మరి ఎటువైపు మొగ్గు చూపుతారో.. వేచి చూడాలి.. సాక్షి మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో యువ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 39 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు జిల్లాలో 2,21,713 మంది ఉన్నారు. ఈ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిది గెలుపు ఖాయమని విశ్లేషిస్తున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 3,92,606 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,21,713 మంది యువకులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు తీర్పుపై రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఉన్నారు. వారి మద్దతు కూడగట్టేందుకు అన్ని రాజకీయపార్టీలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు యువ ఓటర్లను ఆకర్శించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులు తమ ప్రచారంలో యువ ఓటర్లు తమ వెంట ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పాటు వారినే ఎక్కువగా కలుస్తున్నారు. అలాగే యువజన సంఘాలు, మహిళా సంఘాలను దగ్గర చేసుకుని యువతరంను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ పార్టీలోని యువనేతలను రంగంలోకి దించుతున్నారు. ఇదిలా ఉంటే యువ ఓటర్లలో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆకర్షణకు ప్రత్యేకంగా.. మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లో యువ ఓటర్లదే పైచేయి. 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 2,21,713 మంది ఉన్నారు. ఇందులో మెదక్ నియోకజవర్గంలో 1,03,610 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 5163, 20 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 43,644, 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 54,803 మంది ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం యువ ఓటర్లు 1,18,103 మంది ఉన్నారు. వీరిలో 18–19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 5775, 20 నుంచి 25 ఏళ్ల ఓటర్లు 50,697 మంది, 30 నుంచి 39 ఏళ్లు ఉన్న ఓటర్లు 61,631 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో యువ ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లోని రాజకీయపార్టీలు యువ ఓటర్లను ఆకర్శించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారుల ప్రచారం విజయవంతం మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో 10,938 మంది యువ ఓటర్లు మొదటి సారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఓటు సవరణ చేపట్టారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జిల్లా యంత్రాంగం 18 నుంచి 19 ఏళ్ల ఓటర్ల పేర్లను ఓటరు జాబితాలో చేర్పించేందుకు ఎక్కువగా కృషి చేసింది. కళాశాలల్లో ప్రచారం చేయడంతోపాటు రాజకీయ పార్టీలకు కొత్త ఓటర్లను చేర్పించాల్సిందిగా సూచించింది. జిల్లాలో కొత్త ఓటర్లుగా 10,938 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో పురుషులు 6,311 మంది ఉండగా మహిళలు 4,627 మంది ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో కొత్త ఓటర్లు 5,163 మంది ఉండగా నర్సాపూర్ నియోజకవర్గంలో 5,777 మంది ఉన్నారు. -
‘యు’వోటర్
సాక్షి, వరంగల్ రూరల్: త్వరలో జరిగే శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని వరంగల్ రూరల్ జిల్లాలో ఓటర్ల లెక్కను తేల్చారు. తాజాగా అధికార యంత్రాంగం వయస్సుల వారిగా ఓటర్ల వివరాలను విభజించారు. 18–19 సంవత్సరాల వారికి తొలిసారి ఓటు వేసే అవకాశం దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల తుదిజాబితా విడుదల కావడంతో కీలక ఘట్టం ముగిసింది. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్దేశించే స్థాయిలో జిల్లాలో యువ ఓటర్లు నమోదు కావడంతో ప్రధాన పార్టీలన్ని వారిని ప్రసన్నం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో యువ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకం కానున్నారని అంచనా వేస్తున్న అన్ని రాజకీయ పక్షాలు ఈ మేరకు కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఇందుకోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా 41 రోజుల సమయం ఉన్నా క్షేత్ర స్థాయిలో యువ ఓటర్లకు కావాల్సినవి అన్ని సర్దుబాటు చేసేందుకు ఇప్పటి నుంచే గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారికి ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ యువతతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ యువ ఓటర్లకు గాలం వేస్తున్నారు. నూతన ఓటర్లు... జిల్లాలో 3,99,433 మొత్తం ఓటర్లలో సుమారు 30 శాతం వరకు యువ ఓటర్లు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపువారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అర్థమవుతుంది. నర్సంపేట నియోజకవర్గంలో కొత్త ఓటర్లు 5,776 మంది నమోదు చేసుకున్నారు. అలాగే పరకాల నియోజకవర్గ పరిధిలో 4,503 మందితో కలిపి మొత్తం 10,279 కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు ఇందులో ఎక్కువ శాతం తొలిసారిగా ఓటు హక్కును నమోదు చేసుకున్నావారే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా ఓటు హక్కును పొందినవారు తమ తొలి ఓటు ఎవరికి వేస్తారోననే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ నెలకొంది. నవంబర్ 9 వరకు ఓటు నమోదు, సవరణలు, ఓటు బదిలీ చేసుకునే అవకాశం ఉండడంతో మరికొన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది. కీలకంగా మారనున్న యువత ప్రస్తుతం ప్రకటించిన ఓటరు ముసాయిదా ప్రకా రం 18–19 సంవత్సరంలోపు వారు 10,279 మం ది ఓటర్లు ఉన్నారు. అలాగే 20–29 సంవత్సరంలోపు 93,829 మంది ఓటర్లు ఉన్నారు. 30 సంవత్సరాలలోపు వారు 1,04,108 ఓటర్లు ఉన్నారు. దీంతో దాదాపు మొత్తం ఓట్లలో సుమారు 30 శా తం యువతే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సారి వీరు ఎటువైపు మొగ్గుచూపుతారో అని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగిన ఓట్లు తమ ను ముంచుతాయో... తేల్చుతాయోనని పార్టీలు భయపడుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ యువత ఎప్పుడూ కేసీఆర్ పక్షమే అని చెబుతుం టే కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై యువతకు తీవ్ర వ్యతిరేతతో ఉందని అందుచేత కొత్త ఓటర్లు తప్పకుండా తమకే ఓటేస్తారనే ధీమాలో ఉన్నారు. నిరుద్యోగ భృతితో గాలం.. కొత్త ఓటర్లను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు యువత ప్రాధాన్యాంశాలను పార్టీలు మేనిఫేస్టోలో చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫేస్టోలు యువ ఓటర్లను ఏ మాత్రం ఆకర్షిస్తాయో చూడాలి. ప్రధాన పార్టీలు అన్నీ రెండూ నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెబుతున్నాయి. అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతున్నాయి. రెండు పార్టీలు ఒకే విధంగా చెబుతున్నప్పటికీ యువత మాత్రం ఎటువైపు ఉంటుందో అనే విషయంపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. సాంకేతిక యుగంలో అందరికి టెక్నాలాజీ అందుబాటులోకి రావడంతో వారు తమ అభిమాన పార్టీ నాయకుల పేర్లతో వాట్సప్, ఫేస్బుక్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రస్తుత రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
పోటెత్తిన యువత
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు సవరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రధానంగా ఓటు హక్కులేని యువత దాదాపు 85 శాతం వరకు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఓటు నమోదుపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక శ్రద్ధతో పదిరోజులుగా చేసిన విస్తృత ప్రచార కార్యక్రమాలతో యువతరం పోటెత్తింది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఓటు నమోదు కార్యక్రమాలు, జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా సర్వేలతోపాటు ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాల ఏర్పాటుతో ప్రజలు, యువత ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఓటరు నమోదుకు పది రోజుల్లో 65 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కరీంనగర్‌సిటీ: వచ్చిన దరఖాస్తులను మంగళవారం అర్ధరాత్రి వరకు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించే పనిలో నిమగ్నమయ్యారు. పది రోజులుగా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ఎన్నికల కసరత్తులో భాగంగా ఓటరు నమోదు, సవరణలపైనే దృష్టి సారించారు. ఎన్నికల సంఘం ఈనెల 10న ప్రకటించిన ముసాయిదా జాబితా అనంతరం సెప్టెంబర్ 25 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. జిల్లాలో 45 వేలకు పైగా యువత ఓటు హక్కు పొందాల్సి ఉండగా ఆ స్థాయిలో ఓటరుగా నమోదైనట్లు తెలుస్తోంది. తొలగింపులు, మార్పులు, చేర్పులు, గల్లంతైన ఓటర్ల నేపథ్యంలో సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటు నమోదు చేసుకోవడానికి ఉన్న చివరి అవకాశం ఇది. ఇందుకోసం ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంది. 65 వేల మందిలో కేవలం మ్యాన్‌వల్‌గానే దరఖాస్తులు రాగా ఆన్‌లైన్‌లోనూ మరిన్ని దరఖాస్తులు వచ్చాయి. పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. చాలా మంది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును నమోదు చేసుకోవడానికి తాపత్రయ పడ్డారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాలు కొన్ని రోజులుగా ఓటరు నమోదు, సవరణలకు వచ్చిన వారితో కిక్కిరిసిపోయాయి. 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందేందుకు అర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ప్రధానంగా కరీంనగర్ పట్టణం ఓటర్ల జాబితాలో చాలా వరకు ఓట్లు గల్లంతైనట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవముందని గ్రహించిన యంత్రాంగం మరోసారి ఇంటింటి సర్వే చేపట్టింది. కరీంనగర్ పట్టణం ఓట్ల గల్లంతు, తొలగింపు, ఓటర్ల నమోదు శాతంలో చాలా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో కరీంనగర్ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సహకారం తీసుకున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫోన్ల ద్వారా ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలియజేశారు. అందుకు వివిధ శాఖల నుంచి సిబ్బంది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేశారు. కరీంనగరంలోని పది ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేసి 50 డివిజన్లలో రెండు డివిజన్లకు ఒక జిల్లా అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించి ఆయా శాఖల పరిధిలోని సిబ్బందితో ఇంటింటి సర్వే చేపడుతూ అర్హులైన ఓటర్లను నమోదుతో పాటు సవరణలు చేపట్టారు. 250 మంది బీఎల్వోలు, 100 మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించారు. జిల్లాలో సోమవారం నాటికి ఓటరు నమోదుకు గాను 57,040 దరఖాస్తులు వచ్చాయి. తొలగింపు, ఆక్షేపణలకు సంబంధించి (ఫారం–7) 10,125, వివరాలను సరిదిద్దేందుకు (ఫారం–8) 4,314, ఒక పోలింగ్ నుంచి మరోపోలింగ్ కేంద్రానికి మార్పునకు (ఫారం–8ఏ) 3,640 దరఖాస్తులు వచ్చాయి. గల్లంతైన పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే డబుల్ ఓటర్ల తొలగింపునకు తెలంగాణలో ఎన్నికల సంఘం మొట్టమొదటిసారిగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. అందులో భాగంగా రెండు, మూడు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నవారు ఒకే ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉండేలా నోటీసులు అందించి చర్యలు తీసుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓట్లున్న వారికి గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రస్తుతం నూతన టెక్నాలజీని వినియోగించి ఈఆర్వోనెట్ వీటై జీరో పేరిట సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా జాబితాలో రెండు చోట్ల ఓటు హక్కును కలిగిన వారిని గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 12 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ఏదో ప్రాంతంలో జాబితా నుంచి తొలగించనున్నారు. ఇంకా మరణించిన వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల నుంచి మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని తొలగిస్తున్నారు. ఈనెల 25 వరకే ఓటరు నమోదుకు ఉన్న గడువును పొడిగించాలన్న వివిధ పార్టీలు, వర్గాల నుంచి వచ్చిన విన్నపాన్ని ఎన్నికల సంఘం స్వీకరించలేదు. అయితే.. ఇంకా ఓటు నమోదు చేసుకునే యువత 10 శాతం మిగిలిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక ఓటరు నమోదు, సవరణల ప్రక్రియలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా వెలువరించనున్నారు. -
యువహో..
సాక్షి, మెదక్: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ముసాయిదా జాబితా లెక్కల ప్రకారం జిల్లాలో 10వేల మంది ఓటర్లు పెరిగారు.అక్టోబర్ 8వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించే నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం 4,390 దరఖాస్తులు చేసుకున్నారు. ఈనెల 25వ తేదీ ఓటరు నమోదుకు చివరి అవకాశం. నమోదు చేసుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అధికార యంత్రంగం ఇది వరకే ఓటరు నమోదు కోసం అన్ని గ్రామాల్లో ప్రచారం ప్రారంభించింది. జనవరి1, 2018 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీ, యువకులు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కళాశాలల్లో ‘చునావ్ పాఠశాల’ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి ఓటు నమోదు ఆవశ్యకత గురించి కళాశాలల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలు 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్పించేందుకు ప్రత్యేక చొరువ చూపుతున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయపార్టీల కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ అర్హులైన వా వివరాలను సేకరిస్తూ ఓటరు జాబితాలో పేరు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ప్రకటించిన ఓటరు జాబితాలో జిల్లాలో మొత్తం 3,60,828 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ప్రకటించిన ఓటరు ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 3,71,373కు చేరుకుంది. ఓటరు జాబితా సవరణల కారణంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 10,545 మంది ఓటర్లుగా పెరిగారు. ప్రస్తుతం ఇంకా ఓటర్ల సవరణ కొనసాగుతోంది. ఈనెల 25 వరకు సవరణలు చేయనున్నారు. ముసాయిదా జాబితా ప్రకటనకు ముందు మెదక్ నియోజకవర్గంలో 1,78,364 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో 1,82,464కు పెరిగింది. నర్సాపూర్ నియోజవర్గంలో గత ఓటరు జాబితాలో 1,82,464 ఉండగా ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1,88, 909 కు పెరిగింది. తుది ఓటరు జాబితా ప్రకటించే నాటికి మరో 5 నుంచి 8వేల వరకు ఓటర్లు పెరగొచ్చని అధికారుల అంచనా. ఓటరుగా నమోదుకు ఆసక్తి ఓటరుగా తమ పేరు నమోదుచేసుకునేందకు జిల్లాలో అర్హులు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కొత్త ఓటరుగా నమోదు కోసం ఫామ్ 6 ద్వారా 4,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి 3,044, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1,346 దరఖాస్తులు అందాయి. ఓటరు జాబితాలో నుంచి పేరు తొలగింపు కోసం ఫామ్ 7 ద్వారా మొత్తం 2,025 దరఖాస్తులు వచ్చాయి. మెదక్ నియోజకవర్గంలో 1,152, నర్సాపూర్‌లో 8,73 దరఖాస్తులు అందాయి. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా తదితర సవరణల కోసం ఫామ్ 8 ద్వారా అధికారులకు 1,811 దరఖాస్తులు అందాయి. ఇందులో మెదక్ నియోజకవర్గంలో 779, నర్సాపూర్‌లో 1032 దరఖాస్తులు ఉన్నాయి. ఓటు బదిలీ కోసం ఫామ్ 8ఏ ద్వారా 285 దరఖాస్తులు వచ్చాయి. మెదక్ నుంచి 152, నర్సాపూర్ నుంచి 133 అందాయి. కొత్త ఓటర్లు నమోదు కోసం 4,390 దరఖాస్తులు రాగా ఇందులో 2వేల దరఖాస్తులు 18 ఏళ్లు నిండిన వారివిగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. మెదక్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్, బూత్‌లెవల్ ఆఫీసర్లతో మాట్లాడారు. యువతీయువకులు ముందుకు రావాలి జిల్లాలోని 18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. జనవరి 1, 2018 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ లేదా బూత్‌లెవల్ అధికారికి దరఖాస్తు ఇవ్వటం ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన వారు ఫామ్ 6 పూర్తి అందజేయాలన్నారు. ఫామ్ 6తో పాటు రెండు ఫొటోలు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు జతచేయాలని సూచించారు. ఫామ్ 6 ఇచ్చిన వెంటనే వీఆర్వో దరఖాస్తుదారుల స్థానికత, సాధారణ నివాసాన్ని ధ్రవీకరించుకుని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు అందజేస్తారన్నారు. ఈనెల 25వ తేదీ వరకు సమయం ఉన్నట్లు తెలిపారు. బీఎల్ఓలతో ఓటరు జాబితా సవరణ గురించి మాట్లాడుతున్న కలెక్టర్ ధర్మారెడ్డి -
యువోత్సాహం
నల్లజర్ల రూరల్, న్యూస్‌లైన్ : పరిషత్ పోరు తొలి విడతలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు నియోగించుకున్నారు. ముఖ్యంగా తొలిసారిగా ఓటు హక్కు లభించిన వారు ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. తమ తల్లిదండ్రులు, మిత్రులతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన తర్వాత వేలిపై వేసిన సిరాను చూసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి ఓటేసినందుకు చాలా ఆనందంగా ఉందని నల్లజర్లకు చెందిన హారిక చెప్పింది. ఇప్పటివరకు ఓటు విలువ గురించి తరగతి గదుల్లో, అవగాహన సదస్సుల్లో తెలుసుకున్నాను. ఇప్పుడు నేరుగా ఓటేయడం ఎంతో ఆనందంగా ఉందని కావ్యమాధురి అనే విద్యార్థిని తెలిపింది. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం మధురానుభూతిని కలిగించిందని పావని చెప్పింది. మండే ఎండ.. అసౌకర్యాల నడుమ.. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ స్థానిక పాలకుల ఎంపికలో తమ ప్రాధాన్యాన్ని గుర్తుంచుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేశారు. దూబచర్లలో మహిళలు మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగన్నాథపురంలో పోలింగ్ ఏజెంట్లుగా బైండోవర్ కేసులున్న వారిని నియమించడంతో కొద్దిసేపు వివాదం చోటు చేసుకుంది. పోతవరం, చాదరాశిగుంటలో కూడా కనీస సౌకర్యాలు కరువయ్యాయి దీంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు.