ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలి
ఆదిలాబాద్ పట్టణం వార్డునంబర్ 23 తాటిగూడలో గల ఓల్డ్ ప్రగతి స్కూల్ సమీపంలో గల నాలాను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. అధికారికంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా దారుల్‌ఉలుమ్ మదర్సా పనులను రాత్రికిరాత్రి ప్రారంభించారు. ఆ పనులు నిలిపివేసి స్థలాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి.
– హిందూవాహిని నాయకులు, ఆదిలాబాద్
2024 డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. అర్హత లేని ఒకరిని మరాఠీ మీడియం ఎస్జీటీగా నియమించారు. అలాగే మరో అభ్యర్థిని స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో కుచులాపూర్ ప్రాథమిక పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చి పక్షం తర్వాత విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మరాఠీ మీడియంలో ఒకరు ఎస్జీటీకి ఎంపిక కాగా ఆ అభ్యర్థి సర్టిఫికెట్లపై మరొకరు ఫిర్యాదు చేయడంతో ఆ పోస్టింగ్‌ను అబయాన్స్‌లో పెట్టారు. వీటిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి.
– శ్రీకాంత్, టీఎస్‌యూటీఎఫ్, జిల్లా అధ్యక్షుడు
మేమంతా దళితబస్తీ కింద గత ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్నాం. మా భూముల్లో బోరుబావులు వేసేందుకు అధికారులు మంజూరు చేశారు. ఎస్సీ కార్పొరేషన్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే కూడా నిర్వహించారు. ఏడాది దాటినా ఇంకా బోరుబావులు మాత్రం తవ్వడం లేదు. వాటిని వేసి విద్యుత్ సౌకర్యం కల్పించినట్లయితే రెండో పంట కూడా సాగు చేసుకునేందుకు అవకాశముంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకుని మాకు మేలు చేయాలని కోరుతున్నాం.
– దళితబస్తీ లబ్ధిదారులు, పిప్పల్‌కోఠి, భీంపూర్
ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలి
ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలి
Comments
Please login to add a commentAdd a comment