‘రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే’
ఆదిలాబాద్: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నా రు. అదిలాబాద్– కరీంనగర్–నిజామాబాద్– మెద క్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో అన్యాయాన్ని బీజేపీ ప్రశ్నించిందని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు గుర్తించి పట్టం కట్టారన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, ఓటర్లలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో నాయకులు జ్యోతి రెడ్డి, నగేష్, జోగు రవి, రఘుపతి, లాలామున్నా, ప్రవీణ్, కృష్ణ యాద వ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment