అనారోగ్యంతో పరీక్షకు..
గుడిహత్నూర్: మండలంలోని ధనోరా (బి) జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని ప్రతీక్ష పచ్చకామెర్లతో బాధపడుతోంది. శుక్రవారం ని ర్వహించిన మొదటి పరీక్షకు హాజరు కాగా, కా సేపటికే అస్వస్థతకు గురైంది. గుర్తించిన ఇన్వి జిలేటర్ వెంటనే సీఎస్ దేవిదాస్‌కు తెలిపారు. దేవిదాస్ ఎస్సై మహేందర్‌కు తెలుపగా అత డు మండలవైద్యాధికారి శ్యాంసుందర్‌కు సమా చారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న వైద్యాధికారి ప్రతీక్షకు ప్రథమ చికిత్స చేశారు. కాసేపటికి కోలుకున్న ఆమె తిరిగి పరీక్ష రాసింది. అనంతరం ఆమెను పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు రాయవచ్చని వైద్యుడు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment